
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు దంచికొడుతున్నాయి. రికార్డు స్థాయిలో తొలిసారిగా నగరంలోని మంగేష్‌పూర్‌లో 52.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ కంటే ఎక్కువగా రాజధాని ప్రాంతంలో ఎండలు మండిపోతున్నాయి. భయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు.
అయితే ఉదయం నుంచి భగభగ మండిన సూర్యుడు ఒక్కసారిగా చల్లబడ్డాడు. రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమదైన అనంతరం తేలికపాటి వర్షాలుక ఉరిశాయి. పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో వేడి, ఉక్కపోతతో అల్లాడిన రాజధాని ప్రజలకు కాస్తా ఉపశమనం లభించింది. చల్లటి గాలలను ప్రజలు ఆస్వాదిస్తున్నారు.
ఢిల్లీ, ఖార్ఖోడా, ఝజ్జర్, సోహానా, పల్వాల్, నుహ్, ఔరంగాబాద్, హోడల్ (హర్యానా) జట్టారి, ఖైర్ (హర్యానా)తోపాటు పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉరుములు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. రాబోయే రెండు గంటలు అక్కడక్కడా చిరు జల్లులు, తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు ఢిల్లీని తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కనీస అవసరాలకు నీళ్లు దొరకడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి సంక్షోభం పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నీటిని వృధా చేస్తే రూ.2 వేలు జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment