![India is 90 cities record minimal air pollution amid COVID-19 - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/30/2903675-VIRUS-OUTBREAK-INDI.jpg.webp?itok=rIQCaYP0)
దేశం లాకౌట్‌లో ఉంది. వాహనాల రణగొణధ్వనులు లేవు పరిశ్రమలు తాత్కాలికంగా మూతబడ్డాయి రహదారులు నిర్మానుష్యంగా మారాయి దీంతో నీలాకాశం నిర్మలంగా ఉంది గాలి హాయిగా పీల్చుకునే పరిస్థితి వచ్చింది
న్యూఢిల్లీ: గుండెల నిండా స్వచ్ఛమైన గాలి పీల్చడానికి కూడా ఇన్నాళ్లు మనం నోచుకోలేదు. ప్రపంచంలోనే వాయు కాలుష్యం అ«ధికంగా ఉన్న నగరాల జాబితాలో భారత్ టాప్ పొజిషన్‌లో ఉంది. ఇప్పుడు కరోనా భయంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వాయు కాలుష్యం కాస్త తగ్గింది. దేశవ్యాప్తంగా 90 నగరాల్లో వాయు కాలుష్యం చాలా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (ఎస్‌ఏఎఫ్‌ఏఆర్) సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ అందించిన వివరాల ప్రకారంలో గాలిలో సూక్షా్మతి సూక్ష్మ ధూళి కణాలు, నైట్రోజన్ ఆక్సైడ్ భారీగా తగ్గినట్టుగా ఎస్‌ఏఎఫ్‌ఏఆర్ సంస్థకు చెందిన సైంటిస్టు గుఫ్రాన్ బీగ్ తెలిపారు.
► ఢిల్లీలో పీఎం 2.5 (గాలిలో సూక్షా్మతి సూక్ష్మ ధూళి కణాలు) 30 శాతం వరకు తగ్గితే, అహ్మదాబాద్ పుణేలలో 15 శాతం వరకు తగ్గాయి
► సర్వసాధారణంగా మార్చి నెలలో గాలిలో నాణ్యత సూచి మధ్యస్థంగా (100–200) ఉంటుంది. కానీ ఇప్పుడు సంతృప్తికరం (150–100), బాగుంది (ఏక్యూఐ 0–50) కేటగిరీలో ఉంటోంది. ప్రస్తుతం ఢిల్లీలో వీస్తున్న గాలి చాలా ఆరోగ్యకరమైనదిగా ఉందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా గుర్తించింది.
► దేశవ్యాప్తంగా 39 నగరాల్లో గాలి నాణ్యతా సూచి బాగుంది రేంజ్‌లో ఉంటే, 51 నగరాల్లో సంతృప్తికర స్థాయిలో ఉంది.
ప్రభుత్వానికి మేలు కొలుపు
పరిశ్రమలు మూత పడడం, వాహనాలు రోడ్డెక్కకపోవడంతో వాయు కాలుష్యం అదుపులోకి వచ్చిందని, ప్రభుత్వానికి ఇది మేలుకొలుపు వంటిదని çపలువురు పర్యావరణ వేత్తలు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment