మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ అయ్యప్పకాలనీలో గురువారం ఓ విషాదం చోటుచేసుకుంది.
షాద్నగర్: మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ అయ్యప్పకాలనీలో గురువారం ఓ విషాదం చోటుచేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులతో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త మరణించడంతో భార్య తీవ్ర మనస్తాపానికి గురైంది. భర్త మరణాన్ని తట్టుకోలేక తాను పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.