ముంబై: దేశీయంగా రెండో అతిపెద్ద రేటింగ్ ఏజెన్సీ ‘ఇక్రా రేటింగ్స్’ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 88 శాతం వృద్ధితో రూ.40.6 కోట్లకు చేరుకుంది. ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.103 కోట్లకు చేరింది. రేటింగ్ ఆదాయం 16 శాతం పెరిగింది. అనలైటిక్స్ విభాగంలో ఆదాయ వృద్ధి 4.4 శాతంగా ఉంది.
క్రెడిట్ మార్కెట్లో సందడి నెలకొందని, బాండ్ల ఇష్యూలు, బ్యాంక్ క్రెడిట్ విభాగాల్లో మంచి వృద్ధి కనిపించినట్టు ఇక్రా రేటింగ్స్ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లోబేస్ (క్షీణత) ఉండడం, ఈల్డ్ మోస్తరుగా ఉండడం బలమైన పనితీరుకు దోహదపడినట్టు వివరించింది. సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ అనలైటిక్స్ వ్యాపారం వృద్ధి సాధించిందని, ఈ విభాగంపై తాము ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు ఇక్రా రేటింగ్స్ ఎండీ రామ్‌నాథ్ కృష్ణన్ పేర్కొన్నారు. జూన్ త్రైమాసికంలో పరిశోధను విస్తరించామని, మౌలిక సదుపాయాలు, రోడ్లు, జాతీయ రహదారులు, స్టీల్, బ్యాంకింగ్ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment