
ఎ కేటగిరి ఆర్థికశక్తిగా తెలంగాణ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని ఎ కేటగిరి ఆర్థిక శక్తిగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా(ఇక్రా) సంస్థ గుర్తించింది. ఇక్రా గుర్తింపుతో తెలంగాణ పరపతి విధానానికి గుర్తింపు వస్తుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రూ.20 వేలకు పైగా ఎక్కువగా ఉండటం గమనార్హాం. దేశ తలసరి ఆదాయం 74, 380 రూపాయలుండగా, తెలంగాణ తలసరి 95,361 రూపాయలుగా ఉంది. పారిశ్రామిక రంగాలు పెట్టుబడులు పెట్టేందుకు ఇక్రా రేటింగ్ను పరిగణనలోకి తీసుకుంటాయని ప్రభుత్వ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.