గత కొన్నేళ్లుగా వాటర్ సెక్టార్ మీద కేంద్ర ప్రభుత్వ దృష్టి బాగా పెరిగింది. ఇందులో భాగంగానే నదుల అనుసంధానాలను వేగవంతం చేసింది. నదుల ప్రాజెక్టులను అనుసంధానం చేయడం వల్ల రూ. కోట్ల వ్యాపార అవకాశాలు లభిస్తాయని 'ఐసీఆర్ఏ' నివేదికలో పేర్కొంది. వచ్చే దశాబ్దంలో ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, నిర్మాణ (EPC) సంస్థలకు రూ. 2 లక్షల కోట్ల విలువైన వ్యాపార అవకాశాలు లభించవచ్చని అంచనా.
నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (NWDA) 16 ద్వీపకల్ప నదులను, 14 హిమాలయ నదుల అనుసంధానాలతో కూడిన మొత్తం 30 ఇంటర్ లింకింగ్ రివర్ ప్రాజెక్టులను అనుసంధానించనుంది. కేంద్రం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గానూ జల్ జీవన్ మిషన్‌కు భారీ నిధులను కేటాయించింది.
ప్రణాళికలో నాలుగు ప్రధాన లింక్‌లు ప్రారంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్టులు అనుసంధానానికి అనుమతులు లభిస్తాయని ఐసీఆర్ఏ కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెక్టార్ హెడ్ చింతన్ లఖానీ పేర్కొన్నారు. మంత్రిత్వ శాఖ బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుల ప్రస్తుత వాటా తక్కువగా ఉందని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: పాల ప్యాకెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా..
కెన్ - బెత్వా, కోసి - మెచి, పర్బతి - కలిసింద్ - చంబల్, గోదావరి - కావేరి మాత్రమే ప్రణాళికలో ఉన్న నాలుగు ప్రధాన లింక్‌లు. 2034 - 35 నాటికి మొత్తం రూ. 2.6 లక్షల కోట్లతో ఈ ప్రాధాన్యతా లింక్‌లు పూర్తవుతాయని ఐసీఆర్ఏ వెల్లడించింది. ఇందులో గోదావరి - కావేరి అనుసంధానం చాలా పెద్దది. కోసి - మెచి చాలా చిన్నది. ఇంటర్ లింకింగ్ రివర్ ప్రాజెక్టులు పూర్తయిన తరువాత వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు పెరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment