Business Opportunities
-
మహా బ్రాండ్ మేళా!
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ సంరంభానికి భక్తులు పోటెత్తనున్నారు. దీంతో ఈ భారీ కార్యక్రమంలో వ్యాపార అవకాశాలను వెతుక్కుంటున్నాయి కంపెనీలు. ఒకవైపు తమ ఉత్పత్తుల విక్రయాలపై దృష్టి పెడుతూనే మరోవైపు బ్రాండ్‌ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు భారీగా కూడా ఖర్చు పెడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు సాగే మహా కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది దీనికి హాజరవుతారని అంచనా. ఇందులో రూ. 2 లక్షల కోట్ల పైగా వ్యాపార అవకాశాలు ఉంటాయని స్వయంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. దీనితో ఆ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు బడా బ్రాండ్లు మహా కుంభ మేళాకు క్యూ కట్టాయి. కోట్ల సంఖ్యలో మేళాకి వచ్చే భక్తుల దృష్టిని ఆకర్షించేందుకు పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా డాబర్ ఆమ్లా, వాటికా బ్రాండ్లు మహిళల కోసం చేంజింగ్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. పిల్లల సంరక్షణ కోసం డాబర్ లాల్ తేల్ స్పెషల్ బేబీ కేర్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అటు ఆడియో కథల ప్లాట్‌ఫాంకు ఎఫ్ఎం ఈ కార్యక్రమం సందర్భంగా తమ ఓటీటీ యాప్ ‘భక్తి’ని ఆవిష్కరిస్తోంది. ఇందుకోసం టెంట్లు, కియోస్క్ లతో బ్రాండ్‌కి ప్రచారం చేస్తోంది. ఐటీసీ బ్రాండ్ బింగో! .. స్థానిక పాటలపై రీల్స్ చేస్తోంది. మదర్ డెయిరీ సంస్థ పాలు, పాల ఉత్పత్తుల విక్రయానికి 45 కియోస్క్ లు ఏర్పాటు చేస్తోంది. ఇక ఆతిథ్య రంగ సంస్థలు సైతం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే పనిలో ఉన్నాయి. ఒనొరా హాస్పిటాలిటీ సంస్థ దాదాపు 175 లగ్జరీ టెంట్లు ఏర్పాటు చేస్తోంది. ఐటీడీసీ కూడా యోగా, మెడిటేషన్, సాంస్కృతిక కార్యక్రమాల్లాంటి ఫీచర్లతో లగ్జరీ టెంట్ల ద్వారా పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉంది. మహా కుంభమేళాలో క్యాంపా తదితర ఉత్పత్తులను విస్తృతంగా అందుబాటులో ఉంచడంతో పాటు పలు సేవలు కూడా అందిస్తున్నట్లు రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ (ఆర్సీపీఎల్) తెలిపింది. భక్తులు, పర్యాటకులు సేదతీరేందుకు క్యాంపా ఆశ్రమ్, ఆరామ్ స్థల్ మొదలైనవి ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. హోర్డింగ్‌లకు రూ. పది లక్షలు ... కుంభమేళా సందర్భంగా కార్పొరేట్ కంపెనీలు దాదాపు రూ. 3,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా. కార్యక్రమం ఆసాంతం హోర్డింగ్‌లు లేదా ఫ్లెక్స్ బోర్డ్‌లు కొనసాగించాలంటే రూ. 10 లక్షలు, ఎల్ఈడీ స్క్రీన్లపై 10 సెకన్ల ప్రకటనకు రూ. 5 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 45 రోజుల పొడవునా ప్రచారం కోసం బ్రాండ్లు కనీసం రూ. 50 లక్షల నుండి రూ. 1 కోటి వరకు వ్యయం చేస్తుందని భావిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే ఈ కార్యక్రమంపై ఏకంగా రూ. 5,000 కోట్లు ఖర్చు పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలిరానుండటంతో బ్రాండింగ్‌కి ఇది భారీ అవకాశంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. → మహిళల కోసం డాబర్ ఆమ్లా, వాటికా చేంజింగ్ రూమ్స్ → డాబర్ దంత్ స్నాన్ జోన్స్, పిల్లల కోసం డాబర్ లాల్ తేల్ ప్రత్యేక సంరక్షణ గదులు → మదర్ డెయిరీ 45 కియోస్క్ లు → ‘భక్తి’ ఓటీటీ యాప్‌ను ప్రారంభిస్తున్న కుకు ఎఫ్ఎం → ఐటీడీసీ లగ్జరీ టెంట్లు→ మహా కుంభమేళా ప్రకటనల హక్కులను హైదరాబాద్‌కి చెందిన కంపెనీ శ్రేయాస్ మీడియా దక్కించుకుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారత్‌లో అపార వ్యాపారావకాశాలు: కెనాన్ ఇండియా ప్రెసిడెంట్
భారత్‌లో చిప్ ఫ్యాబ్రికేషన్కి సంబంధించి గణనీయంగా వ్యాపార అవకాశాలు ఉన్నట్లు జపాన్‌కి చెందిన ఇమేజింగ్ ఉత్పత్తుల దిగ్గజం కెనాన్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో తొషియాకి నొమురా తెలిపారు. తమ సెమీకండక్టర్ లిథోగ్రఫీ మెషిన్లను సరఫరా చేసేందుకు, దేశీయంగా సెమీకండక్టర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు.చిప్‌ల ఉత్పత్తికి పలు చిప్ తయారీ సంస్థలకు ఇప్పుడు భారత్ కొత్త గమ్యస్థానంగా మారుతోందని పేర్కొన్నారు. మరోవైపు 2024లో తమ వృద్ధి దాదాపు రెండంకెల స్థాయిలో ఉండగలదని, ఏటా ఇదే తీరును కొనసాగించగలమని ఆశిస్తున్నట్లు నొమురా వివరించారు.ప్రధాన వ్యాపారమైన ఇమేజింగ్, ప్రింటింగ్, సరై్వలెన్స్ ఉత్పత్తులతో పాటు కెనాన్ ఇండియా సంస్థ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలతో పాటు డయాగ్నోస్టిక్ మెడికల్ ఇమేజింగ్ సొల్యూషన్స్‌పై (సీటీ, ఎక్స్-రే, అ్రల్టాసౌండ్ మొదలైనవి) కూడా దృష్టి పెడుతోంది. హెల్త్‌కేర్ విభాగంలో తమ వ్యాపార వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని నొమురా తెలిపారు. అటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. ఐటీ, బీఎఫ్ఎస్ఐ, ఫార్మా తదితర పరిశ్రమలపైనా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. -
నదుల అనుసంధానం.. భారీగా వ్యాపారావకాశాలు: ఐసీఆర్ఏ
గత కొన్నేళ్లుగా వాటర్ సెక్టార్ మీద కేంద్ర ప్రభుత్వ దృష్టి బాగా పెరిగింది. ఇందులో భాగంగానే నదుల అనుసంధానాలను వేగవంతం చేసింది. నదుల ప్రాజెక్టులను అనుసంధానం చేయడం వల్ల రూ. కోట్ల వ్యాపార అవకాశాలు లభిస్తాయని 'ఐసీఆర్ఏ' నివేదికలో పేర్కొంది. వచ్చే దశాబ్దంలో ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ (EPC) సంస్థలకు రూ. 2 లక్షల కోట్ల విలువైన వ్యాపార అవకాశాలు లభించవచ్చని అంచనా.నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (NWDA) 16 ద్వీపకల్ప నదులను, 14 హిమాలయ నదుల అనుసంధానాలతో కూడిన మొత్తం 30 ఇంటర్ లింకింగ్ రివర్ ప్రాజెక్టులను అనుసంధానించనుంది. కేంద్రం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గానూ జల్ జీవన్ మిషన్‌కు భారీ నిధులను కేటాయించింది.ప్రణాళికలో నాలుగు ప్రధాన లింక్‌లు ప్రారంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్టులు అనుసంధానానికి అనుమతులు లభిస్తాయని ఐసీఆర్ఏ కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెక్టార్ హెడ్ చింతన్ లఖానీ పేర్కొన్నారు. మంత్రిత్వ శాఖ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుల ప్రస్తుత వాటా తక్కువగా ఉందని ఆయన వెల్లడించారు. ఇదీ చదవండి: పాల ప్యాకెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా..కెన్ - బెత్వా, కోసి - మెచి, పర్బతి - కలిసింద్ - చంబల్, గోదావరి - కావేరి మాత్రమే ప్రణాళికలో ఉన్న నాలుగు ప్రధాన లింక్‌లు. 2034 - 35 నాటికి మొత్తం రూ. 2.6 లక్షల కోట్లతో ఈ ప్రాధాన్యతా లింక్‌లు పూర్తవుతాయని ఐసీఆర్ఏ వెల్లడించింది. ఇందులో గోదావరి - కావేరి అనుసంధానం చాలా పెద్దది. కోసి - మెచి చాలా చిన్నది. ఇంటర్ లింకింగ్ రివర్ ప్రాజెక్టులు పూర్తయిన తరువాత వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు పెరుగుతాయి. -
దేశంలో ఆధ్యాత్మిక టూరిజం జోష్
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక పర్యాటకంపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో బడా రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక కేంద్రాలపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను అందించే దిశగా తిరుపతి, అయోధ్య, వారణాసి, అమృత్సర్, పూరి, అజ్మీర్ వంటి నగరాల్లో గణనీయంగా విస్తరిస్తున్నాయి. 14 కీలక నగరాల్లో పెరుగుతున్న ఆధ్యాత్మిక టూరిజంతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రిటైల్ చెయిన్స్ అనుసరిస్తున్న వ్యూహాలపై రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మదురై, గురువాయూర్, ద్వారకా, మథురా తదితర నగరాల్లో కూడా రిటైల్ బూమ్ కనిపిస్తున్నట్లు రిపోర్టు పేర్కొంది. పేరొందిన మాల్స్‌తో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా టూరిస్టులను ఆకర్షించేలా తమ బ్రాండ్లను ప్రదర్శించడంపై రిటైల్ సంస్థలు దృష్టి పెడుతున్నాయి. అయోధ్యలో మాన్యవర్, రిలయన్స్ ట్రెండ్స్, రేమండ్స్, మార్కెట్99, ప్యాంటలూన్స్, డామినోస్, పిజ్జా హట్, రిలయన్స్ స్మార్ట్ మొదలైనవి తమ రిటైల్ స్టోర్స్ ప్రారంభించినట్లు నివేదిక వివరించింది. వారణాసిలో జుడియో, షాపర్స్ స్టాప్, బర్గర్ కింగ్ తదితర సంస్థలు కూడా కార్యకలాపాలు విస్తరించినట్లు పేర్కొంది. టూరిజంను ప్రోత్సహించేందుకు, కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆధ్యాతి్మక పర్యాటకానికి ఊతం లభిస్తున్నట్లు సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. ఫ్యాషన్, ఫుడ్ అండ్ బెవరేజెస్, హైపర్మార్కెట్లు మొదలైన సంస్థలన్నీ కూడా భక్తుల అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను అందిస్తూ కార్యకలాపాలను విస్తరిస్తున్న ట్లు వివరించారు. ఆధ్యాతి్మక టూరిజం ట్రెండ్‌తో ఆయా ప్రాంతాల్లో ఆతిథ్య, రిటైల్ రంగాలకు కలిసి వస్తోందని సీబీఆర్ఈ ఇండియా ఎండీ రామ్ చంద్నానీ తెలిపారు. -
Web Summit Lisbon: కలలను వదులుకోవద్దు...
ప్రపంచంలోనే అతిపెద్దదైన టెక్ కాన్ఫరెన్స్ వెబ్ సమ్మిట్ ఇటీవల పోర్చుగల్ రాజధాని లిస్బన్లో జరిగింది. ఈ వెబ్ సమ్మిట్‌కు 153 దేశాల నుండి 70 వేల మందికి పైగా సభ్యులు హాజరయ్యారు. వారిలో 43 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో మహిళలు పాల్గొన్న ఈవెంట్‌గా ఈ సదస్సు వార్తల్లో నిలిచింది. గ్లోబల్ టెక్ ఇండస్ట్రీని రీ డిజైన్ చేయడానికి ఒక ఈవెంట్‌గా వెబ్ సమ్మిట్‌ను పేర్కొంటారు. ఇందులో 2,608 స్టార్టప్‌లు పాల్గొన్నాయి. వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి, వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కొత్త టెక్నాలజీని అందుకోవడానికి, సార్టప్‌లను ప్రదర్శించడానికి ఈ సమ్మిట్ వేదికగా నిలిచింది. ఇందులో స్టార్టప్ కంపెనీల సీఈఓలు, ఫౌండర్లు, క్రియేటివ్ బృందాలు, ఇన్వెస్టర్లు.. పాల్గొన్నారు. ఇందులో విశేషం ఏమంటే ప్రతి మూడవ స్టార్టప్... మహిళ సృష్టించినదే అయి ఉండటం. వెబ్సమ్మిట్ సీఈవో కేథరీన్ మహర్ ఈవెంట్ ప్రారంభంలో ‘స్టార్టప్స్‌ని మరింత శక్తిమంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అత్యంత ముఖ్యమైన ప్రదేశం’గా పేర్కొన్నారు. స్టార్టప్స్.. నైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది తమ స్టార్టప్‌ల ద్వారా వెబ్ సమ్మిట్‌కు అప్లై చేసుకున్నారు. వాటిలో ఎంపిక చేసిన స్టార్టప్‌లను సమ్మిట్ ఆహ్వానించింది. కమ్యూనిటీ, పరిశ్రమలు, పర్యావరణ వ్యవస్థలపై సానుకూల ప్రభావం చూపే విధంగా పనిచేసే స్టార్టప్‌ల విభాగంలో 250 కంటే ఎక్కువ ఉన్నాయి. వంద మెంటార్ అవర్స్ సెషన్స్ ద్వారా 800 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఎక్స్పర్ట్స్ నుండి నైపుణ్యాలను నేర్చుకుంటారు. స్టార్టప్‌లలో ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమలలో ఏఐ, మెషిన్ లెర్నింగ్, హెల్త్‌టెక్, వెల్నెస్, ఫిన్‌టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, సస్టైనబిలిటీ, క్లీన్టెక్ .. వంటివి ఉన్నాయి. కార్యాలయాలలో వేధింపులు ఈవెంట్‌కు హాజరైన వారిలో మొత్తం 43 శాతం మంది మహిళలు ఉంటే, అత్యధికంగా 38 శాతం కంటే ఎక్కువ మంది మహిళా స్పీకర్లు ఉండటం విశేషం. అన్ని ఎగ్జిబిట్ స్టార్టప్ ఫౌండర్లలో దాదాపు మూడింట ఒక వంతు మహిళలే ఉన్నారు. ఈ సందర్భంగా వెబ్ సమ్మిట్ తన వార్షిక స్టేట్ ఆఫ్ జెండర్ ఈక్విటీ ఇన్ టెక్ నివేదికనూ విడుదల చేసింది. దాదాపు సగం మంది మహిళలు కార్యాలయంలో జెండర్ వివక్షను ఎదుర్కోవడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. 53.6 శాతం మంది గడిచిన ఏడాదిలో తమ తమ ఆఫీసులలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్టు తెలిపారు. 63.1 శాతం మంది పెట్టుబడిదారులు కృత్రిమ మేధస్సు, యంత్రాలని నమ్మి తమ స్టారప్‌లలో వృద్ధిని సాధించినట్టు తెలియజేస్తే 43.2 శాతం మంది మాత్రం తమ కంపెనీలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచినట్టు పేర్కొన్నారు. అయినా, సీనియర్ మేనేజ్మెంట్ స్థానాల్లో మహిళల సంఖ్య గత ఏడాది కంటే 75 శాతం నుంచి 66.7 శాతానికి తగ్గినట్టు గుర్తించారు. ఈ సమ్మిట్... ప్రపంచంలో మహిళ స్థానం ఎలా ఉందో మరోసారి తెలియజేసింది. ప్రపంచానికి మహిళ పోర్చుగీస్ ఆర్థికమంత్రి ఆంటోనియా కోస్టా ఇ సిల్వా మాట్లాడుతూ ‘టెక్ ప్రపంచంలో ఎక్కువమంది మహిళలు అగ్రస్థానంలో ఉండాలి. వారి అవసరం ఈ ప్రపంచానికి ఎంతో ఉంది. మీ కలలను వదులుకోవద్దు. మహిళలకు అసాధారణమైన సామర్థ్యం ఉంది. సంక్షిష్టంగా ఉన్న ఈ ప్రపంచంలో మహిళల మల్టీ టాస్కింVŠ మైండ్ చాలా అవసరం’ అని పేర్కొన్నారు. ఆశలకు, స్నేహానికి, కొత్త ఆలోచనలను అభివృద్ధి చేయడానికి, మన కాలపు సమస్యలను సవాల్ చేయడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలను ఒక చోట చేర్చడానికి వెబ్ సమ్మిట్ గొప్ప వేదిక’ అన్నారు. ఇలాంటి అత్యున్నత వేదికలు ప్రపంచ మహిళ స్థానాన్ని, నైపుణ్యాలను, ఇబ్బందులను అందరి ముందుకు తీసుకువస్తూనే ఉంటాయి. మహిళలు తమ ఉన్నతి కోసం అన్నింటా పోరాటం చేయక తప్పదనే విషయాన్ని స్పష్టం చేస్తూనే ఉంటాయి. -
భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణం
వాషింగ్టన్: భారత్‌లో మరింత మెరుగైన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇదే మంచి తరుణమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత వ్యాపార రంగంలో పారదర్శకమైన, సానుకూలమైన పాత్ర పోషించేందుకు అనువైన వాతావరణాన్ని భారత్, అమెరికా సంయుక్తంగా సృష్టించాయని ఆయన ఉద్ఘాటించారు. అమెరికా పర్యటనలో భాగంగా శుక్రవారం వాషింగ్టన్‌లోని కెన్నడీ సెంటర్లో అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, భారతీయ సంతతి వ్యక్తులు, దాతలతో మోదీ భేటీ అయ్యారు. ‘ఇరు దేశాల భాగస్వామ్యం అనేది అనువుగా మార్చుకున్న సంబంధం కాదు. ఇది పరస్పర వాగ్దానాలు, నిబద్దతకు నిదర్శనం’ అని మోదీ నొక్కిచెప్పారు. ‘ వాషింగ్టన్లో భిన్న రంగాల దిగ్గజాలతో భేటీ అద్భుతంగా కొనసాగింది. ఇందులో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ సైతం పాల్గొనడం విశేషం. భారత ప్రగతిపథ ప్రస్థానంలో భాగమయ్యేందుకు, దేశ అవకాశాల గనిని ఒడిసిపట్టేందుకు అమెరికా పెట్టుబడిదారులకు ఇదే చక్కని సమయం’ అని మోదీ ట్వీట్‌చేశారు. భారత్‌లో 75,000 కోట్ల పెట్టుబడి: గూగుల్ ‘భారత్‌లో దాదాపు రూ.75,000 కోట్ల(10బిలియన్ డాలర్ల) పెట్టుబడి పెట్టబోతున్నాం. ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా సంబంధిత వివరాలు ఆయనతో పంచుకున్నాను’ అని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇండియా డిజిటైజేషన్ ఫండ్‌లో భాగంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్–సిటీ(గిఫ్ట్)లో తమ గ్లోబల్ ఫిన్‌టెక్ వ్యాపారకార్యకలాపాలను ప్రారంభిస్తామని గూగుల్ వెల్లడించింది. జీపేకు సపోర్ట్‌గా ప్రత్యేక కార్యకలాపాలను ‘గిఫ్ట్’లో మొదలుపెడతారని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు శనివారం పేర్కొన్నారు. ‘ఫిన్‌టెక్ రంగంలో భారత నాయకత్వాన్ని గూగుల్ గుర్తిస్తోంది. అందకే భారత్‌లో చిన్న, భారీ పరిశ్రమలకోసం సేవలు అందిస్తాం. దాంతోపాటే అమెరికాసహా ప్రపంచదేశాలకు ఇక్కడి నుంచే సేవలు కొనసాగుతాయి. ఈ ఏడాది చివరినాటికి ముఖ్యంగా మహిళల సారథ్యంలో మొదలయ్యే అంకుర సంస్థలకు మద్దతుగా నిలుస్తాం’ అని అధికార ప్రతినిధి చెప్పారు. అమెజాన్ మరో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అదనంగా 15 బిలియన్ డాలర్లు (రూ.1,23,000 కోట్లు) పెట్టుబడి పెట్టడం ద్వారా భారత్‌లో తన ఉనికిని మరింత పెంపొందించుకోవాలని అమెజాన్.కామ్ భావిస్తున్నట్లు అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం సందర్భంగా ఆయన ఈ విషయాలను తెలియజేశారు. ఈ అదనపు పెట్టుబడి 2030 నాటికి భారత్‌లోని వివిధ వ్యాపారాలలో సంస్థ మొత్తం పెట్టుబడిని 26 బిలియన్లకు (రూ.2,13,200 కోట్లకు) చేరుస్తుందని జస్సీ పేర్కొన్నారు. భారతీయ స్టార్టప్‌లను ప్రోత్సహించడం, ఉద్యోగాల కల్పన, ఎగుమతులను సులభతరం చేయడం, డిజిటల్ పరివర్తన, గ్లోబల్ మార్కెట్లో అభివృద్ధి చెందడానికి వ్యక్తులు వంటి అంశాలపై చర్చించారు. -
10 వేల మంది మహిళలకు గోల్డ్‌మ్యాన్ చేయూత
ముంబై: గోల్డ్‌మ్యాన్ శాక్స్ భారత్‌లో 10,000 మంది మహిళలకు వ్యాపారం, మేనేజ్మెంట్ విద్యకు కావాల్సిన నిధుల సహకారం అందించినట్టు ప్రకటించింది. వీరి ద్వారా 12,000 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించాయని, గడిచిన 18 నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.2,800 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలిపింది. గోల్డ్‌మ్యాన్ శాక్స్ 2008లో మొదటిసారి భారత్‌లో గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ఆరంభించింది. 18 నెలల క్రితం తిరిగి దీన్ని ప్రారంభించింది. ‘వుమెన్ఇనీషియేటివ్’ కింద 10,000 మంది మహిళలకు వ్యాపారం, యాజమాన్య విద్యకు కావాల్సిన నిధుల సహకారం అందించనున్నట్టు నాడు ప్రకటించింది. గోల్డ్ మ్యాన్ శాక్స్ కార్యక్రమంలో పాల్గొన్న 10వేల మంది మహిళలల్లో 2,400 మందిపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అధ్యయనం నిర్వహించగా, ఆ వివరాలను గోల్డ్‌మ్యాన్ శాక్స్ విడుదల చేసింది. గోల్డ్ మ్యాన్ శాక్స్ నిధుల మద్దతు పొందిన 10వేల మంది మహిళలు గత 18 నెలల్లో తమ సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేసుకున్నాయి. అలాగే, ఆదాయాన్ని నాలుగు రెట్లు పెంచుకున్నాయి. తమ ఉత్పాదకతను సగటున ఐదు రెట్లు వృద్ధి చేసుకున్నాయి. వీరిలో అధిక శాతం మహిళా వ్యాపారవేత్తలు నియామకాలు పెంచుకుంటామని, ఆదాయం పెరుగుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. భారత్‌లో మహిళా వ్యాపారవేత్తల ప్రాతినిధ్యం ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నట్టు గోల్డ్‌మ్యాన్ శాక్స్ ఇండియా చైర్మన్, సీఈవో సంజయ్ ఛటర్జీ పేర్కొన్నారు. నిధుల సాయం పొందేందుకు కూడా వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెబుతూ.. వారి అసలు సామర్థ్యాలు వెలుగులోకి తెచ్చేందుకు ఇంకా ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో కేవలం 20 శాతం వ్యాపారాలే మహిళల నిర్వహణలో ఉన్నాయని, మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో వారి వాటా కేవలం 3 శాతంగానే ఉన్నట్టు చెప్పారు. -
‘అంతిమం’గా... ఓ బిజినెస్ మోడల్
వారిది ఉన్నత కుటుంబం. వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రి పాలైన ఆ దంపతులిద్దరూ రెండు మూడు రోజుల్లో మరణిస్తారని వైద్యులు చెప్పేశారు. అనుకున్నట్టుగానే వృద్ధ దంపతులిద్దరూ ఒకేసారి మరణించారు. కడసారి చూసేందుకు ‘ఆ నలుగురు’ కాదు కదా.. ఏ ఒక్కరూ రాలేదు. అంత్యక్రియలను మీరే నిర్వహించండంటూ వారసుల నుంచి పురోహితుడి అకౌంట్‌కు క్షణాల్లో నగదు బదిలీ అయ్యింది. ఆ దంపతుల చివరి కోరిక మేరకు రాజమహేంద్రవరంలో గోదావరి గట్టున అంత్యక్రియలతోపాటు కర్మకాండలను సైతం ‘పురమాయింపు’ వ్యక్తులే జరిపించారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాల్ ద్వారా చూసి తరించిన వారసులు ఘన నివాళులే అర్పించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది ఇటీవల జరిగిన యథార్థ ఘటన. ఇలాంటి వారి కోసమే పురోహితుని నుంచి పాడె మోయడం.. దహన సంస్కారాల వరకు నిర్వహించే ‘ఆన్లైన్ అంతిమ సంస్కార’ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. అంత్యక్రియలనూ ఆన్లైన్ వ్యాపారంగా మార్చేసి కార్పొరేట్ మెట్లెక్కిస్తున్నాయి. సాక్షి, అమరావతి: నానాటికీ దిగజారుతున్న మానవ సంబంధాలు కొత్త వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నాయి. ఉన్నత చదువులు చదివిన పిల్లలు ఉద్యోగాలు నిమిత్తం దూర దేశాలకు వెళ్లిపోయి.. కనీసం తల్లిదండ్రుల చివరి చూపునకు కూడా రాలేనంత బిజీ అయిపోయారు. వారసులు అంత గొప్ప ప్రయోజకులయ్యారని మురిసిపోవాలో... లేక చివరి క్షణాల్లో పిల్లలు ఉన్నా అనాథగా మిగిలిపోయామని బాధపడాలో తెలియని దుస్థితి తలెత్తింది. ఈ మధ్యనే రాజమహేంద్రవరంలో జరిగిన ఘటన కళ్లు చెమ్మగిల్లేలా చేసింది. వృద్థాప్యంతో హాస్పిటల్లో చేరిన తల్లిదండ్రులకు సపర్యలు చేసే నిమిత్తం.. విదేశాల్లో స్థిరపడిన వారసులు ఆయాలను ఏర్పాటు చేశారు. వారిద్దరూ రెండు మూడు రోజుల్లోనే తుది శ్వాస విడుస్తారని తెలియడంతో.. ఆ దంపతుల కోరిక మేరకు గౌతమీ ఘాట్ వద్ద అంత్యక్రియలు జరిపించాలంటూ పురోహితుడి అకౌంట్‌కు వారిద్దరూ బతికుండగానే నగదు బదిలీ చేశారు. అంత్యక్రియల కార్యక్రమాన్ని వీడియో కాల్ ద్వారా చూపిస్తే తాము ఉన్న దేశం నుంచే నివాళి అర్పిస్తామన్నారు. ఆ పిల్లల వైఖరిని స్వయంగా చూసిన ఆ ముసలివాళ్ల మనసులు ఎంత తల్లడిల్లి పోయి ఉంటాయో. సరిగ్గా ఇలాంటి వారి కోసమే ఇప్పుడు అంత్యక్రియలు కూడా పెద్ద వ్యాపార వస్తువుగా మారిపోయాయి. పుట్టిన ప్రతి వాడూ గిట్టక మానడు కాబట్టి ఇది కూడా కార్పొరేట్ రూపు సంతరించుకుంటోంది. ఇందుకోసం అంతిమ సంస్కార్, గురూజీ, అంతేష్టి, లాస్ట్‌రైట్స్ వంటి పేర్లతో పలు సంస్థలు పుట్టుకొస్తున్నాయి. అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్‌లో ప్రత్యేక ఆకర్షణ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏటా అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తులను అక్కడ ప్రదర్శించడం ద్వారా మార్కెటింగ్ చేసుకుంటాయి. అలాంటి అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్‌లో ఏర్పాటు చేసిన ఒక స్టాల్ సందర్శకులను విస్తుపోయేలా చేసింది. ‘సుకాంత్ అంతిమ సంస్కార్’ పేరుతో అంత్యక్రియల కోసం ఏర్పాటైన ఒక కార్పొరేట్ కంపెనీ తాను అందించే సేవలను వివరిస్తూ పెట్టిన స్టాల్‌ను చాలామంది కన్నార్పకుండా చూశారు. ఇద్దరు కలిపి.. ‘ఆ నలుగురు’ ఏర్పాట్లు ముంబైకి చెందిన రవీంద్ర పాండురంగ్ సోనావాలే, సంజయ్ కైలాష్ రాముగుడ్ అనే ఇద్దరు కలిసి సుకాంత్ ఫ్యూనరల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేశారు. వివిధ మతాలు, కులాల వారి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. అంత్యక్రియలకు అవసరమైన పాడె.. దాన్ని మోసే మనుషుల నుంచి పురోహితులు, మంగలి, రామ్ నామ్ సత్యహై అనే నినాదాలిచ్చే వంటివన్నీ ఒక ప్యాకేజీ కింద అందిస్తున్నారు. ప్రారంభం ప్యాకేజీ ధర రూ.37,500గా నిర్ణయించారు. అస్థికలను పవిత్ర నదుల్లో కలిపేదాన్ని బట్టి ప్రత్యేక రుసుములు తీసుకుంటున్నారు. ఇప్పటికే 5 వేలకు పైగా అంత్యక్రియలను నిర్వహించిన ఈ సంస్థ రూ.50 లక్షలకు పైగా లాభాన్ని నమోదు చేసింది. రానున్న కాలంలో ఈ సంస్థ టర్నోవర్ రూ.2 వేల కోట్లకు చేరుకోనుందనే అంచనాలతో పలు సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ముందే గ్రహించిన శ్రీశ్రీ ‘స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్’ అన్నాడేమో. -
ధనవంతులూ వలసబాట
(ఎం. విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): పొట్ట చేతబట్టుకుని బతుకుదెరువు వెతుక్కుంటూ పేదలు వలస వెళ్లడం మనం ఎప్పుడూ చూసేదే. వ్యాపార అవకాశాలను, సౌకర్యాలను, పన్ను రాయితీలను వెతుక్కుంటూ కోటీశ్వరులు కూడా వలసబాట పట్టడం కూడా ఎప్పుడూ ఉన్నదే. సాధారణంగా పేదలు దేశంలోనే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వలస వెళ్తారు. ధనవంతులు అందుకు భిన్నంగా వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్న దేశాలకు వెళ్తారు. కానీ, పత్రికల్లో పేదల వలసలే పతాక శీర్షికలవుతాయి. పెద్దల వలసల గురించి వార్తలు పెద్దగా కనిపించవు. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లకు బెదిరి.. మన దేశంలో కోట్ల మంది పేదలు వలసబాట పట్టారు. కానీ, కోటీశ్వరులు మాత్రం కరోనా సమయంలో వలస బాటపట్టలేదు. ఉన్న దేశం నుంచి కదల్లేదు. కరోనా శాంతించిన వెంటనే అవకాశాలు వెతుక్కుంటూ రెట్టింపు సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా తమకు అనుకూలంగా ఉన్న దేశాలకు వలస వెళ్లడం ప్రారంభించారు. 2022లో 88వేల మంది హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (10 లక్షల డాలర్ల సంపద కలిగి ఉన్న వ్యక్తులు) తమ మాతృదేశాన్ని వదిలి మరో దేశానికి వలస వెళ్తారని ‘హెన్లీ గ్లోబల్ సిటిజన్ రిపోర్ట్’ అంచనా వేసింది. ధనవంతుల వలసలు పెరుగుతాయే తప్ప కనుచూపు మేరలో తగ్గే అవకాశంలేదని చెప్పింది. ధనవంతులంతా ఏ దేశం నుంచి ఏ దేశం వెళ్తున్నారనే విషయం ఆసక్తికరం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఎక్కువమందిని ఆకర్షిస్తోంది. ఆ దేశం అనుసరిస్తున్న టైలర్‌మేడ్ వలస విధానాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను, ధనవంతులను ఆకర్షించడానికి కారణంగా నిలుస్తున్నాయి. రెండోస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలో చౌకగా వైద్యం అందుబాటులో ఉండటం, వారసత్వ పన్ను లేకపోవడం, మంచి ఆర్థికవ్యవస్థ కావడం.. ధనవంతులను ఆకర్షిస్తున్న కారణాలని నిపుణులు చెబుతున్నారు. గత రెండు దశాబ్దాల్లో వివిధ దేశాల నుంచి 80 వేల మంది కోటీశ్వరులు ఆస్ట్రేలియాకు వలస వెళ్లారని నివేదిక పేర్కొంది. రష్యా, ఉక్రెయిన్ నుంచి అధికంగా.. ఇక రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ రెండు దేశాల నుంచి కోటీశ్వరులు పెద్ద సంఖ్యలో వలస వెళ్తున్నారు. ఉక్రెయిన్‌లోని కోటీశ్వరుల్లో 42 శాతం మంది వలస బాట పడతారని అంచనా వేస్తున్నారు. అలాగే, రష్యాలో 15 శాతం మంది కోటీశ్వరులు దేశం విడిచిపెట్టి వెళ్తారని అంచనా. మిగతా అన్ని దేశాలు రెండు శాతం, అంతకంటే తక్కువ మంది కోటీశ్వరులు వలస వెళ్లొచ్చని భావిస్తున్నారు. భారత్ నుంచి వలస వెళ్తారని అంచనా వేస్తున్న 8 వేల మంది, దేశంలోని మొత్తం కోటీశ్వరుల్లో 2 శాతం అని నివేదిక పేర్కొంది. ధనవంతులను ఆకర్షిస్తున్న యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రపంచంలోని అన్ని దేశాల ధనవంతులను ఆకర్షిస్తోంది. దీని కోసం.. ► వీసా నిబంధనలను సరళతరం చేసింది. ► 5.44 లక్షల యూఎస్ డాలర్ల విలువైన ఆస్తి కొనుగోలు చేసే వారికి 10 సంవత్సరాల గోల్డెన్ వీసా ఇస్తున్నారు. ► 2.72 లక్షల డాలర్లు యూఏసీ స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవారికీ గోల్డెన్ వీసాకు అర్హత ఉంటుంది. ► ప్రపంచంలో ఎక్కడైనా తమ స్టార్టప్ కంపెనీని 1.9 మిలియన్ డాలర్లకు విక్రయించిన వారికి కూడా గోల్డెన్ వీసా తీసుకోవడానికి అర్హత కల్పిస్తూ యూఏఈ నిబంధనలను సడలించింది. ► కంపెనీలు ఏర్పాటు చేసుకోవడానికే కాకుండా, ప్రతిభావంతులైన సిబ్బందిని ప్రపంచం నలుమూలల నుంచి తెచ్చుకోవడానికి కూడా యూఏఈ అవకాశం కల్పిస్తోంది. ► ఇక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలనే కాకుండా, శాస్త్రవేత్తలు, ప్రొఫెషనల్స్, వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభావంతులకు ఆహ్వానం పలుకుతోంది. -
దావోస్‌లో బ్రాండ్ ఏపీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, వ్యాపార అవకాశాలను ప్రపంచానికి విస్తృతంగా చాటిచెప్పేలా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే 52వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సదస్సును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోనుంది. గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు లాంటి నవరత్న పథకాలతో గడప వద్దకే పరిపాలన చేరువ చేయటాన్ని దావోస్ సదస్సు వేదికగా తెలియచేసేలా ఏపీ పెవిలియన్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 22వ తేదీ నుంచి 26 వరకు దావోస్‌లో జరిగే డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం హాజరు కానున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. దావోస్‌లో జరిగే పర్యటన వివరాలను గురువారం సచివాలయంలో ఆయన మీడియాకు తెలియచేశారు. జనవరిలో జరగాల్సినా.. డబ్ల్యూఈఎఫ్ ఆహ్వానం మేరకు సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్ర బృందం ఈ సమావేశాలకు హాజరవుతున్నట్లు మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఇప్పటివరకు డబ్ల్యూఈఎఫ్‌లో మెంబర్ అసోసియేట్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇకపై ప్రతిష్టాత్మక ఫోరం ప్లాట్‌ఫాం పార్టనర్‌గా చేరనుందని, దీనికి సంబంధించి డబ్ల్యూఈఎఫ్ ఫౌండర్ చైర్మన్ క్లాస్ ష్వాబ్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు. దీనిద్వారా డబ్ల్యూఈఎఫ్‌కు చెందిన సీఈవో స్థాయి చర్చలు, ప్రాజెక్టులు, వర్క్‌షాప్స్‌లో నేరుగా పాల్గొనే అవకాశం లభించనుంది. సాంకేతిక ఆవిష్కరణల పునాదులపై పారదర్శకత, అధికార వికేంద్రీకరణ దిశగా ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించేందుకు సీఎం జగన్ నిబద్ధతతో కృషిచేస్తున్నారని సమావేశాలకు ఆహ్వానించేందుకు వచ్చిన డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్జ్ బెండే ప్రశంసించారని గుర్తు చేశారు. ఈ సమావేశాలు జనవరిలోనే జరగాల్సినా కోవిడ్ థర్డ్‌వేవ్ కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడినట్లు తెలిపారు. ప్రభుత్వ విధానాలతో సారూప్యం కోవిడ్‌తో ప్రపంచవ్యాప్తంగా మారిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ‘కలసి పని చేయడం – నమ్మకాన్ని పునరుద్ధరించడం’ అనే లక్ష్యంతో దావోస్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు ఇవి దగ్గరగా ఉన్నట్లు మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను ప్రచారం చేసేలా సమావేశాల కోసం రూపొందించిన లోగోను మంత్రితో పాటు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్, ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం ఆవిష్కరించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చాటే విధంగా రూపొందించిన బుక్‌లెట్‌ను మంత్రి ఆవిష్కరించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ చెప్పింది చెప్పినట్లుగా అమలు చేసిన నవరత్నాలు, పర్యావరణం, సాంఘిక సంక్షేమం, సుపరిపాలన లాంటి 9 అంశాలకు బుక్‌లెట్‌లో ప్రాధాన్యమిచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. 10 రంగాలపై ఫోకస్ దావోస్ సమావేశాలకు వివిధ దేశాల నుంచి 2,200 మందికిపైగా ప్రతినిధులు హాజరు కానున్నట్లు మంత్రి తెలిపారు. ప్రధానంగా 18 రంగాలపై చర్చలు జరగనుండగా విద్య, వైద్యం, నైపుణ్యం, తయారీ రంగం, లాజిస్టిక్స్, ఆర్థికసేవలు, పునరుత్పాదక ఇంధనం, టెక్నాలజీ, వినియోగదారుల వస్తువులు, ఎఫ్ఎంసీసీ లాంటి పదిరంగాల్లో అవకాశాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. 13 అత్యున్నత ద్వైపాక్షిక సమావేశాలు, 35కుపైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరగనున్నట్లు వెల్లడించారు. సీఐఐ నేతృత్వంలో 23న వైద్యరంగం, 24న విద్య, నైపుణ్యరంగం, డీకార్బనైజ్డ్ ఎకానమీ దిశగా అడుగులులాంటి అంశాలపై రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది పెట్టుబడుల సమావేశం కాదని, కోవిడ్‌తో మారిన వాణిజ్య పరిణామాలపై చర్చించి వ్యాపార అవకాశాలు, సలహాలు ఇచ్చిపుచ్చుకునేందుకు డబ్ల్యూఈఎఫ్ చక్కటి వేదిక అని పేర్కొన్నారు. -
డేటాకు ‘మెటావర్స్’ దన్ను..
న్యూఢిల్లీ: డిజిటల్ వ్యవస్థ క్రమంగా మెటావర్స్ వైపు మళ్లుతున్న నేపథ్యంలో డేటా వినియోగం గణనీయంగా పెరగనుంది. 2032 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇది 20 రెట్లు వృద్ధి చెందనుంది. దేశీయంగా కూడా ఇదే ధోరణి కారణంగా.. టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్‌కు గణనీయంగా వ్యాపార అవకాశాలు లభించనున్నాయి. క్రెడిట్ సూసీ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. వర్చువల్ ప్రపంచంలో ఉన్న అనుభూతి కలిగించే మెటావర్స్ వల్ల యూజర్లు స్క్రీన్ చూడటంపై వెచ్చించే సమయం పెరగనుండటంతో.. డేటా వినియోగానికి గణనీయంగా ఊతం లభిస్తుందని పేర్కొంది. ‘ఇంటర్నెట్ వినియోగంలో 80 శాతం భాగం వీడియోలదే ఉంటోంది. ఇది వార్షికంగా 30 శాతం మేర వృద్ధి చెందుతోంది. మెటావర్స్‌ను ఒక మోస్తరుగా వినియోగించినా .. దీనివల్ల డేటా యూసేజీ, వచ్చే దశాబ్దకాలంలో ఏటా 37 శాతం చొప్పున వృద్ధి చెంది, ప్రస్తుత స్థాయి కన్నా 20 రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం‘ అని నివేదిక తెలిపింది. మెటావర్స్‌కి సంబంధించిన ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీల వినియోగం భారీగా పెరగనుందని వివరించింది. బ్రాడ్‌బ్యాండ్ లభ్యత కీలకం.. మెటావర్స్ పూర్తి సామర్థ్యాలను వినియోగించుకోవడానికి ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ లభ్యత కీలకమని క్రెడిట్ సూసీ తెలిపింది. ప్రజలు రోజూ అత్యధిక సమయం మొబైల్‌ను వినియోగించే టాప్ దేశాల్లో భారత్ కూడా ఉన్నప్పటికీ.. మిగతా దేశాలతో పోలిస్తే ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇక్కడ తక్కువగానే ఉందని వివరించింది. భారత్‌లో దీని విస్తృతి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది శాతానికి పెరగవచ్చని పేర్కొంది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఇది 6.8 శాతంగా ఉంది. ‘భారతీయ టెల్కోల ఆదాయాలపై మెటావర్స్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ .. మెటావర్స్ ప్రేరిత డేటా వినియోగం దన్నుతో ఈ దశాబ్దం ద్వితీయార్ధంలో భారతి ఎయిర్టెల్ (ఆదాయాల్లో బ్రాడ్‌బ్యాండ్ వాటా 17 శాతం), జియో గణనీయంగా ప్రయోజనం పొందగలవని భావిస్తున్నాం‘ అని క్రెడిట్ సూసీ తెలిపింది. 6జీతో మరింత ఊతం .. మెటావర్స్ వ్యవస్థకు 5జీ టెలికం సర్వీసులు తోడ్పడనున్నప్పటికీ దీన్ని మరిన్ని అవసరాల కోసం వినియోగంలోకి తెచ్చేందుకు 6జీ మరింత ఉపయోగకరంగా ఉంటుందని నివేదిక తెలిపింది. మిగతా విభాగాలతో పోలిస్తే ఎక్కువగా గేమింగ్ సెగ్మెంట్లో మెటావర్స్ వినియోగం ఉండవచ్చని పేర్కొంది. దేశీయంగా గేమింగ్ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉందని తెలిపింది. అందుబాటు ధరల్లోని స్మార్ట్ఫోన్లు, 4జీ డేటా సర్వీసుల కారణంగా అధిక స్థాయిలో గేమింగ్.. మొబైల్ ఫోన్ల ద్వారానే ఉంటోందని వివరించింది. ‘స్థిరమైన బ్రాడ్‌బ్యాండ్ లభ్యత తక్కువగా ఉన్నందు వల్ల ఆన్లైన్ వినియోగానికి భారత యూజర్లు.. మొబైల్ ఇంటర్నెట్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ గేమ్స్‌కు సంబంధించి మొబైల్ గేమింగ్ వాటా భవిష్యత్‌లో పెరిగే అవకాశాలు ఉన్నాయి‘ అని క్రెడిట్ సూసీ పేర్కొంది. -
రండి.. పెట్టుబడులు పెట్టండి!
న్యూఢిల్లీ: కరోనా రాకతో ఫార్మా, హెల్త్‌కేర్ కంపెనీల వ్యాపార అవకాశాలు భారీగా పెరిగాయి. ఏడాది కాలంలో వాటి ఆదాయాలు, లాభాలు గణనీయంగా వృద్ధి చెందడాన్ని గమనించొచ్చు. ఆరోగ్య సంరక్షణ పట్ల అవగాహన విస్తృతం కావడంతో భవిష్యత్తులోనూ ఈ కంపెనీలకు వ్యాపార అవకాశాలు పుష్కలమేనని మార్కెట్ పండితుల అంచనా. ఇన్వెస్టర్ల నుంచి నిధుల సమీకరణకు ఫార్మా, హెల్త్‌కేర్ కంపెనీలకు ఇంతకంటే అనుకూల సమయం ఎప్పుడుంటుంది? అందుకేనేమో చాలా కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో/ప్రజలకు తొలిసారిగా వాటాలను ఆఫర్ చేయడం) కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. కరోనా వైరస్‌తో లాభపడే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లలో ఆసక్తి ఇతోధికం అయినట్టు గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తుంది. ఇదే మద్దతుగా 2021లో సుమారు 12 ఫార్మా, హెల్త్ కేర్ కంపెనీలు నిధులను సమీకరించనున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల నుంచి కేవలం ఏడు కంపెనీలే ఐపీవోకు రాగా.. ఈ ఒక్క ఏడాది రికార్డు స్థాయి ఐపీవోల వర్షం కురవనుందని తెలుస్తోంది. కొన్ని ఇప్పటికే దరఖాస్తులు: ఐపీవోకు సంబంధించి ఎనిమిది కంపెనీలు ఇప్పటికే ‘డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్’ (డీఆర్‌హెచ్‌పీ)ను సెబీ వద్ద దాఖలు చేశాయి. ఈ జాబితాలో గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్, సుప్రియా లైఫ్ సైన్సెస్, క్రస్నా డయాగ్నొస్టిక్స్, కిమ్స్, తత్వ చింతన్ ఫార్మా, సిఘాచి ఇండస్ట్రీస్, విండ్లాస్ బయోటెక్ కంపెనీలు ఉన్నాయి. అలాగే, థర్డ్‌పార్టీ బీమా సేవలు అందించే ప్రముఖ కంపెనీ మెడిఅసిస్ట్ సైతం సెబీ వద్ద డీఆర్‌హెచ్‌పీ సమర్పించింది. డీఆర్హెచ్పీనే ఆఫర్ డాక్యుమెంట్గానూ పిలుస్తారు. ఐపీవోకు సంబంధించిన వివరాలతో మర్చంట్ బ్యాంకర్లు రూపొందించే ప్రాథమిక డాక్యుమెంట్ ఇది. అదే విధంగా మిగిలిన కంపెనీల ఐపీవో ప్రణాళికలు సైతం వివిధ దశల్లో ఉన్నాయి. ఇలా ఐపీవో ప్రక్రియను ఆరంభించిన కంపెనీల్లో ఎమ్క్యూర్ ఫార్మా, వెల్నెస్ ఫరెవర్, విజయా డయాగ్నోస్టిక్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఫార్మా, హెల్త్‌కేర్, వాటి అనుబంధ రంగాల్లోని పటిష్టమైన కంపెనీల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగినట్టు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్ అజయ్ సరఫ్ తెలిపారు. ఎమ్క్యూర్ నుంచి పెద్ద ఇష్యూ.. గ్లెన్‌మార్క్ ఫార్మా అనుబంధ కంపెనీ అయిన గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్ గత నెలలో ఐపీవోకు సెబీ వద్ద దరఖాస్తు దాఖలు చేయగా.. సుమారు రూ.2,000 కోట్ల మేర నిధులను సమీకరించే ప్రతిపాదనతో ఉంది. పుణేకు చెందిన ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ జనరిక్ డ్రగ్ తయారీలో ప్రముఖ కంపెనీ. ఈ సంస్థ ఐపీవో రూపంలో రూ.3,500–4,000 కోట్లను సమీకరించాలనుకుంటోంది. ఇందుకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లతో సంప్రదింపులు మొదలు పెట్టింది. సిరమ్ ఇనిస్టిట్యూట్ అధినేత అదర్ పూనవాలాకు చెందిన రిటైల్ ఫార్మసీ చైన్ కంపెనీ వెల్నెస్ ఫరెవర్ రూ.1,200 కోట్లను ఐపీవో ద్వారా సమీకరించే ప్రతిపాదనతో ఉంది. ‘‘కరోనా కారణంగా భారత హెల్త్‌కేర్ వ్యవస్థలో భారీ మార్పు చోటు చేసుకుంది. ఔషధాలు, టీకాలు, వ్యాధి నిర్దారణ పరీక్షలు, వైద్య ఉపకరణాలు, హాస్పిటల్స్ తదితర కంపెనీల వ్యాపార అవకాశాలు రానున్న కాలంలో ఎన్నో రెట్లు పెరగనున్నాయి. హెల్త్‌కేర్ రంగం మొత్తం మీద ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపిస్తున్నారు’’ అని డీఏఎమ్ క్యాపిటల్ ఎండీ, సీఈవో దర్మేష్ మెహతా చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచి కరోనా రెండో విడత మొదలు కాగా.. అప్పటి నుంచి నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 7 శాతం ర్యాలీ చేసింది. ఇదే కాలంలో నిఫ్టీ–50లో రాబడులు ఏమీ లేవు. 2020లో ఈ రంగం నుంచి ఐపీవోకు వచ్చిన ఏకైక కంపెనీగా గ్లాండ్ ఫార్మాను చెప్పుకోవాలి. ఈ సంస్థ ఐపీవో రూపంలో రూ.5,230 కోట్లను (2020 నవంబర్‌లో) సమీకరించింది. ఐపీవో ఇష్యూ ధర రూ.1,500 కాగా.. ఆరు నెలల్లోనే స్టాక్ నూరు శాతం రాబడులను ఇచ్చింది. పబ్లిక్ ఆఫర్ బాటలో.. కంపెనీ ఐపీవో ఇష్యూ అంచనా (రూ.కోట్లలో) ఎమ్క్యూర్ ఫార్మా 3,500 స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 3,000 గ్లెన్‌మార్క్ లైఫ్‌సైన్సెస్ 2,000 సుప్రియా లైఫ్‌సైన్సెస్ 1,200 క్రస్నా డయాగ్నొస్టిక్స్ 1,200 వెల్నెస్ ఫరెవర్ 1,200 మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ 840 కిమ్స్ హాస్పిటల్స్ 700 విండ్లాస్ బయోటెక్ 600 తత్వ చింతన్ ఫార్మా 450 -
భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి
న్యూఢిల్లీ: వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్న భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆసియాలోనే అతి పెద్ద ఎకానమీ అయిన భారత్‌లో పెట్టుబడులకు, వ్యాపారాల నిర్వహణకు అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇండియా గ్లోబల్ వీక్ 2020 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. ‘స్వేచ్ఛా వాణిజ్యానికి అత్యంత అనువైన ఎకానమీల్లో భారత్ ఒకటి. భారత్‌లోనూ కార్యకలాపాలు విస్తరించేలా అంతర్జాతీయ కంపెనీలకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నాం. ప్రస్తుతం భారత్‌లో ఉన్నటువంటి అవకాశాలు చాలా తక్కువ దేశాల్లో మాత్రమే ఉన్నాయి‘ అని మోదీ పేర్కొన్నారు. కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ నుంచి క్రమంగా బైటపడుతున్న నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నంత మాత్రాన ప్రపంచంతో సంబంధాలను తెంచుకున్నట్లు కాదని ప్రధాని స్పష్టం చేశారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తూ ప్రపంచ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. సంస్కరణల బాట.. పెట్టుబడులను ఆకర్షించే దిశగా స్పేస్, రక్షణ తదితర రంగాలన్నింటిలో ఇటీవల ప్రవేశపెట్టిన పలు సంస్కరణల గురించి ప్రధాని వివరించారు. ‘ఎకానమీలో ఉత్పాదకత, పోటీతత్వం మరింత పెరిగేలా పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు నెలకొనేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పలు రంగాల్లో వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో సంస్కరణలతో స్టోరేజీ, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు‘ అని ఆయన చెప్పారు. అలాగే పెద్ద పరిశ్రమలకు తోడుగా ఉండేలా చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) రంగంలోనూ సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు ప్రధాని వివరించారు. స్పేస్, రక్షణ రంగాలకు అవసరమయ్యే పరికరాల తయారీకి సంబంధించి కొన్ని విభాగాల్లో ప్రైవేట్ సంస్థలకు కూడా అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయంతో ఆయా రంగాల్లోనూ ఇన్వెస్ట్ చేయడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని మోదీ చెప్పారు. దేశీ ఫార్మా సత్తా చాటుతోంది.. కరోనా వైరస్ మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో భారతీయ ఫార్మా పరిశ్రమ కేవలం దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఎంతో విలువైన సంపద అన్న విషయం మరోసారి రుజువైందని ప్రధాని చెప్పారు. ‘ఔషధాల ధరలు దిగి వచ్చేలా చేయడంలో .. ముఖ్యంగా వర్ధమాన దేశాలకు తోడ్పడటంలో భారతీయ ఫార్మా కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలోని మూడింట రెండొంతుల మంది బాలల వ్యాక్సినేషన్‌కు భారత్‌లో తయారైన టీకాలనే ఉపయోగిస్తున్నారు. కరోనా వైరస్‌కి సంబంధించిన టీకా రూపకల్పన, తయారీలో కూడా దేశీ ఫార్మా సంస్థలు చురుగ్గా పాలుపంచుకుంటున్నాయి. టీకా కనుగొన్న తర్వాత దాన్ని అభివృద్ధి చేయడంలోనూ, వేగంగా తయారీని పెంచడంలో భారత్ కచ్చితంగా కీలకపాత్ర పోషించగలదని విశ్వసిస్తున్నా‘ అని మోదీ తెలిపారు. ప్రపంచ సంక్షేమానికి, అభివృద్ధికి భారత్ శాయశక్తులా కృషి చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. సంస్కరణలు చేపడుతూ, ఆచరణలోనూ చూపిస్తూ, రూపాంత రం చెందుతున్న భారత్ కొంగొత్త వ్యాపార అవకాశాలు కల్పిస్తోందని ప్రధాని చెప్పారు. -
వ్యాపార అవకాశాలకు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ చైనా ఒప్పందం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వ్యాపార అవకాశాల విస్తృతికి పరస్పర సహకారం లక్ష్యంగా భారత్ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), చైనా బ్యాంకింగ్ దిగ్గజం, మూలధనం పరిమాణం పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద బ్యాంక్– బ్యాంక్ ఆఫ్ చైనా (బీఓసీ) లు చేతులు కలిపాయి. ఈ మేరకు ఒక అవగహనా పత్రం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయంగా తమతమ మార్కెట్ల విస్తృతికి రెండు బ్యాంకులూ వేర్వేరుగానూ తమ కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఒప్పందం వల్ల రెండు బ్యాంకుల క్లయింట్లకూ నెట్వర్క్ విస్తృతమవుతుంది. విస్తృత స్థాయిలో సేవలనూ పొందవచ్చు. ప్రస్తుతం ఎస్బీఐకి షాంఘైలో బ్రాంచీ ఉండగా, ముంబైలో బీఓసీ తన బ్రాంచీని విస్తృతం చేస్తోంది. -
దక్షిణాఫ్రికా పర్యాటక రంగంలో వ్యాపార అవకాశాలు!
♦ 18 బిలియన్ డాలర్లకు ♦ భారత-దక్షిణాఫ్రికా ద్వైపాక్షిక వాణిజ్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దక్షిణాఫ్రికాలో పర్యాటక రంగంలో వ్యాపార, పెట్టుబడి అవకాశాలపై విస్తృత స్థాయిలో ప్రచారం, అవగాహన చేయాల్సిన అవసరం ఉందని దక్షిణాఫ్రికా హై కమిషనర్ ఫ్రాన్స్ కె మోర్లే అభిప్రాయపడ్డారు. ఎందుకంటే తమ దేశంలో వ్యాపారమంటే కేవలం రసాయన, మైనింగ్ రంగాలనే భావన ఉందని కానీ, వాస్తవానికి వ్యవసాయంతో పాటుగా పర్యాటక రంగంలోనూ పుష్కలమైన వ్యాపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. .2013లో ఇరు దేశాల వాణిజ్యం విలువ 12 బిలియన్ డాలర్లుగా ఉంటే 2015 నాటికది పురోగతి బాటలో 15 బిలియన్ డాలర్లుకు పెరిగిందని పేర్కొన్నారు. 2018 నాటికి 18 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారమిక్కడ రెండు రోజుల దక్షిణాఫ్రికా వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ 7వ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దక్షిణాఫ్రికా దేశానికి చెందిన సుమారు 23 కంపెనీలు, 60కి పైగా భారత కంపెనీలు పాల్గొన్నాయన్నాయని తెలిపారు. -
పేమెంట్ బ్యాంకులపై ఎస్బీఐ చీఫ్ ‘యూ-టర్న్’
- వ్యతిరే కించేందుకేమీ లేదని వ్యాఖ్య ముంబై: మొన్నటిదాకా పేమెంట్ బ్యాంకుల రాకకు ప్రతికూలంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య తాజాగా యూ-టర్న్ తీసుకున్నారు. ఈ తరహా బ్యాంకులను వ్యతిరే కించేందుకేమీ లేదని పేర్కొన్నారు. పేమెంటు బ్యాంకుల వల్ల పోటీ పెరిగినా.. మొత్తం బ్యాంకింగ్ రంగంలో వ్యాపార అవకాశాలు కూడా అదే విధంగా పెరుగుతాయని బ్యాంకర్ల సదస్సు ఎఫ్‌ఐబీఏసీలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. ఎస్బీఐకి రూ. 5,393 కోట్లు ప్రభుత్వం నుంచి పొందే రూ. 5,393 కోట్ల మూలధనానికి ప్రతిగా ఆ మేర విలువ చేసే ఈక్విటీ షేర్లను ఎస్బీఐ ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన జారీ చేయనుంది. మంగళవారం ఈ విషయాన్ని బీఎస్ఈకి తెలియజేసింది. మరోవైపు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తాము పొందే మూలధనానికి బదులుగా ప్రభుత్వానికి ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నట్లు వెల్లడించాయి. షేరు ఒక్కింటికి రూ. 41.37 రేటుతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దాదాపు రూ. 2,009 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుంది. -
పోలండ్‌లో వ్యవసాయాధారిత పరిశ్రమలకు అవకాశాలు
- పోలండ్ అంబాసిడర్ థోమస్ లుకాజుక్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పోలండ్‌లో ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. 2014 నాటికి పోలండ్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ 40 బిలియన్ డాలర్లకు చేరిందంటే ఇక్కడి వ్యాపార అవకాశాలను అర్థం చేసుకోవచ్చని పోలండ్ అంబాసిడర్ థోమస్ లుకాజుక్ తెలిపారు. ఫిక్కీ ఆధ్వర్యంలో ఇండియా-సెంట్రల్ యూరోప్ బిజినెస్ ఫోరం (ఐసీఈబీఎఫ్) 2వ ప్రదర్శన అక్టోబర్ 5-6 తేదీల్లో బెంగళూరులో జరగనుంది. దీనికి సంబంధించిన రోడ్ షో కార్యక్రమం సందర్భంగా సోమవారమిక్కడ థోమస్ మాట్లాడుతూ.. 2007-08లో సంభవించిన యూరోపియన్ ఆర్థిక సంక్షోభంలోనూ స్థిరమైన అభివృద్ధిని సాధించింది పోలండ్ దేశమొక్కటేనని గుర్తు చేశారు. ఆ ఏడాది 1.8 స్థూల జాతీయోత్పత్తిని సాధించిందని.. 2014 నాటికి 3.3కి చేరిందని పేర్కొన్నారు. ‘‘పెట్టుబడులు నిరుద్యోగాన్ని రూపుమాపుతాయనడానికి మా దేశం చక్కటి ఉదాహరణ. మా దేశంలో నిరుద్యోగం 5 శాతమే. ఇందుకు కారణం మా దేశంలోకి ఏటా 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులొస్తున్నాయి. అంటే ప్రత్యక్షంగా.. పరోక్షంగా 10-50 వేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తున్నాయని’’ ఆయన వివరించారు. ఇండియా- పోలండ్ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఎందుకంటే ఇండియా నుంచి పోలండ్‌కు దిగుమతులు 413 మిలియన్ డాలర్లుగా ఉంటే.. పోలండ్ నుంచి ఇండియాకు 1,282 మిలియన్ డాలర్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. పెట్టుబడులతో వచ్చే పరిశ్రమలను ప్రోత్సహించడానికి సత్వర అనుమతుసహా పన్ను రాయితీలూ కల్పిస్తున్నామన్నారు. ‘‘ఐసీఈబీఎఫ్ తొలి ప్రదర్శన ఢిల్లీలో జరిగిందని.. 3వ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహిస్తామని ఫిక్కీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కో-చైర్మన్ దేవేంద్ర సురానా చెప్పారు. బెంగళూరులో జరిగే సదస్సులో యూరప్ నుంచి 150కి పైగా కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. -
భారత్‌లో ఐటీకి అపార అవకాశాలు: సిస్కో
శాన్‌డీగో: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగ కంపెనీలకు భారత్‌లో అపార వ్యాపార అవకాశాలు ఉన్నాయని టెక్నాలజీ దిగ్గజం సిస్కో సీఈవో జాన్ ఛాంబర్స్ తెలిపారు. వర్ధమాన దేశాల్లో ఇన్వెస్ట్ చేయదల్చుకున్న కంపెనీలు ప్రధానంగా దృష్టి పెట్టొచ్చని ఆయన పేర్కొన్నారు. సిస్కో లైవ్ 2015 కార్యక్రమంలో కంపెనీ సీఈవో హోదాలో ఆఖరి కీలకోపన్యాసం చేసిన సందర్భంగా చాంబర్స్ ఈ విషయాలు చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమంతో లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందని వివరించారు. రాబోయే సీఈవో చక్ రాబిన్స్‌తో కలిసి త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్లు తెలిపారు. సిస్కో ఆదాయాల్లో భారత మార్కెట్ వాటా 2 శాతంగా ఉంది.భారత్‌లో హైదరాబాద్ సహా బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో సిస్కోకి 10,000 మంది ఉద్యోగులు ఉన్నారు. -
స్మార్ట్ సిటీలతో 40 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్మార్ట్ సిటీస్‌తో ఐటీ రంగానికి వచ్చే 5-10 ఏళ్లలో 30-40 బిలియన్ డాలర్ల మేర వ్యాపార అవకాశాలు లభించగలవని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తెలిపింది. స్మార్ట్ సిటీల అభివృద్ధి కోసం కేంద్రం రూ. 48,000 కోట్లు కేటాయించింది. ప్రతిపాదిత 100 స్మార్ట్ సిటీల్లో ఒక్కొక్క దానికి వార్షికంగా అయిదేళ్ల పాటు రూ. 100 కోట్ల మేర కేంద్ర నిధులు లభించనున్నాయి. స్మార్ట్ సిటీలకు లభించే నిధుల్లో కనీసం 10-15 శాతాన్ని ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీపై (ఐసీటీ) వెచ్చించిన పక్షంలో ఐటీ కంపెనీలకు కనీసం 30-40 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు లభించగలవని అంచనా వేస్తున్నట్లు నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. స్మార్ట్ సిటీల నిర్మాణంలో ఐసీటీ పాత్ర గురించి నాస్కామ్ రూపొందించిన నివేదికను మే 21న ఢిల్లీలో జరిగే స్మార్ట్ సిటీ ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్నట్లు ఆయన వివరించారు. -
మరిన్ని సంస్కరణలకు రెడీ...
- ఇన్వెస్టర్లకు భారత్‌లో అపార వ్యాపార అవకాశాలు - డబ్ల్యూఈఎఫ్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దావోస్: పెట్టుబడులకు అనువైన పరిస్థితులు కల్పించేలా ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు ప్రవేశపెట్టిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. రాబోయే రోజుల్లో మరెన్నో సంస్కరణలను ప్రవేశపెట్టబోతున్నామని ఆయన తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు దావోస్ చేరుకున్న సందర్భంగా జైట్లీ ఈ విషయాలు వివరించారు. ప్రస్తుతం చాలా మటుకు పోటీ దేశాల పరిస్థితి అంత బాగా లేని నేపథ్యంలో గత ఏడు, ఎనిమిది నెలలుగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అలాగే కొనసాగిస్తే మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించవచ్చని ఆయన చెప్పారు. భారత్‌లో వ్యాపారావకాశాల గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ఇదే సరైన అవకాశం అన్నారు. భారత విద్యుత్ రంగంలోని వివిధ విభాగాల్లో దాదాపు 250 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ిపీయూష్ గోయల్ చెప్పారు. భారత వృద్ధి గాథలో దేశీ, విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున భాగస్వాములు కాగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లతో కూడిన బృందానికి జైట్లీ సారథ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. జనవరి 23 దాకా దావోస్‌లోనే ఉండనున్న జైట్లీ.. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం తదితర అంశాలపై చర్చించేందుకు స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి ఎవ్లీన్ విడ్మర్-ష్లంఫ్తో కూడా భేటీ అవుతారు. అలాగే భారత్ ప్రధానంగా జరిగే రెండు సెషన్లలోనూ, బ్రిక్స్ కూటమి సభ్యదేశాలతో కలిసి మరో సమావేశంలోనూ జైట్లీ పాల్గొంటారు. అయిదో అతి పెద్ద బృందం.. డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ నుంచి దాదాపు 120 మంది నమోదు చేసుకున్నారు. ప్రస్తుత సమావేశాల్లో వివిధ దేశాల నుంచి వస్తున్న పెద్ద బృందాల్లో భారత్ అయిదో స్థానంలో ఉంది. భారత్ ప్రాధాన్యాన్ని చాటిచెప్పేలా దావోస్‌లోని కొన్ని బస్సులపైనా ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాలు కనువిందు చేస్తున్నాయి. మొత్తం 791 మంది సభ్యుల బృందంతో అమెరికా అగ్రస్థానంలోను, 283 మందితో బ్రిటన్ రెండో స్థానంలో, 280 మందితో ఆతిథ్య దేశం స్విట్జర్లాండ్ 3వ స్థానంలో, 126 మంది సభ్యుల బృందంతో జర్మనీ నాలుగో స్థానంలో ఉంది. విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి .. భారత్‌లో వ్యాపారావకాశాలపై విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారని సదస్సులో పాల్గొంటున్న దేశీ బ్యాంకర్లు పేర్కొన్నారు. ఈ డిమాండును అందిపుచ్చుకునేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) పద్దతిలో గతంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో పలు తప్పిదాలు జరిగాయని... ప్రస్తుత ప్రభుత్వం వీటిని మెరుగ్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోందని ఆమె తెలిపారు. ఇక భారత్‌పై ఇన్వెస్టర్లకు ఇప్పటిదాకా ఉన్న ప్రతికూల సెంటిమెంటు గణనీయంగా మారుతోందని ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ చెప్పారు. వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించేందుకు, ఆటంకాలు తొలగించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇది క్రమంగా పెట్టుబడుల రూపం దాల్చగలదన్నారు. అటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమదైన శైలిలో మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని విజయవంతం చేసే దిశగా పోటీపడుతున్నాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఆర్థిక వృద్ధికి సంస్కరణలే ఊతం.. ప్రపంచ ఎకానమీ వృద్ధికి వ్యవస్థాగతమైన సంస్కరణలే ఊతం ఇవ్వగలవని డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పాల్గొంటున్న నిపుణులు, వ్యాపార దిగ్గజాలు అభిప్రాయపడ్డారు. విధానకర్తలు తమను తాము మభ్యపెట్టుకోకుండా విధానపరమైన సంస్కరణలు చేపట్టాలని స్విస్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్ చైర్మన్ యాక్సెల్ ఎ వెబర్ చెప్పారు. ఈ విషయంలో రాజకీయ నాయకులు ఎంత సేపూ ద్రవ్య పరపతి విధానాలను సడలించడంపైనే ఆధారపడకూడదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డిప్యుటీ ఎండీ మిన్ ఝు సూచించారు.