పేమెంట్ బ్యాంకులపై ఎస్‌బీఐ చీఫ్ ‘యూ-టర్న్’
- వ్యతిరే కించేందుకేమీ లేదని వ్యాఖ్య
ముంబై: మొన్నటిదాకా పేమెంట్ బ్యాంకుల రాకకు ప్రతికూలంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య తాజాగా యూ-టర్న్ తీసుకున్నారు. ఈ తరహా బ్యాంకులను వ్యతిరే కించేందుకేమీ లేదని పేర్కొన్నారు. పేమెంటు బ్యాంకుల వల్ల పోటీ పెరిగినా.. మొత్తం బ్యాంకింగ్ రంగంలో వ్యాపార అవకాశాలు కూడా అదే విధంగా పెరుగుతాయని బ్యాంకర్ల సదస్సు ఎఫ్‌ఐబీఏసీలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.
ఎస్‌బీఐకి రూ. 5,393 కోట్లు
ప్రభుత్వం నుంచి పొందే రూ. 5,393 కోట్ల మూలధనానికి ప్రతిగా ఆ మేర విలువ చేసే ఈక్విటీ షేర్లను ఎస్‌బీఐ ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన జారీ చేయనుంది. మంగళవారం ఈ విషయాన్ని బీఎస్‌ఈకి తెలియజేసింది. మరోవైపు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తాము పొందే మూలధనానికి బదులుగా ప్రభుత్వానికి ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నట్లు వెల్లడించాయి. షేరు ఒక్కింటికి రూ. 41.37 రేటుతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దాదాపు రూ. 2,009 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుంది.