Bankers Conference
-
అవినీతికి కేరాఫ్ సీఆర్డీఏ
► అభివృద్ధి పేరుతో భూములు లాక్కునే యత్నం ► బ్యాంకర్ల సదస్సులో గళమెత్తిన రాజధాని రైతులు వెంకటపాలెం(తుళ్లూరు రూరల్): ‘‘మా భూముల సమస్యలపై అధికారులను ప్రశ్నించడమే మేము చేస్తున్న తప్పులా ఉంది...మా సమస్యలు పరిష్కరించండి అన్నందుకు మాపై కేసులు బనాయించి స్టేషన్ల చుట్టూ తిరిగేలా చేశారు.’’ అంటూ యర్రబాలెం, పెనుమాక గ్రామాల రైతులు సీఆర్డీఏ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలోని సీఆర్డీఏ యూనిట్ కార్యాలయంలో బుధవారం ఉదయం సీఆర్డీఏ అధికారులు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రాజధాని రైతులతో సమావేశం నిర్వహించారు. సీఆర్డీఏ భూవ్యవహారాల సంచాలకుడు బీఎల్ చెన్నకేశవులు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీఆర్డీఏ స్ట్రాటజీ డైరెక్టర్ శాస్త్రి రైతులకు ప్రపంచబ్యాంకు ద్వారా రుణం తీసుకుని ఏ విధంగా అమరావతి ప్రాంతం అభివృద్ధి చేయనున్నారో వివరించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ సీఆర్డీఏ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయని, రైతులు తమ సమస్యల పరిష్కారానికి కార్యాలయానికి వెళ్తే లంచాలు డిమాండ్ చేస్తున్నారని అరోపించారు. యర్రబాలెంకు చెందిన వి.కె.రెడ్డి అనే రైతు గతంలో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయొజనం లేకపోయిందని అన్నారు. వెలగపూడి, రాయపూడి రైతులు మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్‌లో తమ భూములు ఇవ్వలేదని జరీబు భూములను దుక్కులుగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారి వివరాలను తెలపాలని ఆరు నెలలుగా పెనుమాక సీఆర్డీఏ కార్యాలయంలో అధికారులను అడుగుతున్నా, ఇంకా సమాచారం రాలేదని చెబుతూ వచ్చారని, ఇప్పుడు ఇక్కడ వందల సంఖ్యలో ఇళ్లు పోతున్నాయని చెబుతున్నారని పెనుమాక గ్రామస్తులు ప్రశ్నించారు. సమస్యలను తమకు చెప్పవద్దని అధికారులు అనడంతో రైతులు నేరుగా ప్రపంచ బ్యాంకు బృందంతోనే చెప్పుకున్నారు. రాజధానిలో రాబోయే ప్రతి సంస్థలో రైతుల పిల్లలకు మొదటి అవకాశం కల్పించాలని కోరారు. ప్రతిదానికి తాము ప్రాధేయపడే పనిలేకుండా రైతులతో కమిటీలు నియమించాలని అధికారులకు సూచించారు. సమస్యలు చెప్పవద్దు....సలహాలు, సూచనలు ఇవ్వండి రాజధానికి భూములు త్యాగం చేసిన రైతుల సమస్యలను వినడానికి సీఆర్డీఏ అధికారులకు విసుగ్గా ఉందని భూములు ఇచ్చిన రైతులు అరోపిస్తున్నారు. సదస్సులు నిర్వహిస్తారు కాని తమ గోడు పట్టించుకోరంటున్న రైతుల అరోపణను బుధవారం సీఆర్డీఏ అదికారులు నిజం చేశారు. ప్రపంచ బ్యాంకు బృందంతో జరిగిన సమావేశంలో కొందరు రైతులు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించాలని అడగ్గానే అధికారులు మీ వ్యక్తిగత సమస్యలు ఇక్కడ ప్రస్తావించవద్దని, అభివృద్ధికి సహకరించి సలహాలు సూచనలు ఇవ్వాలని అనడంతో రైతులు కోపోద్రికులయ్యారు. -
వ్యవసాయంలో సమూల సంస్కరణలు
- రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం వెల్లడి - ఎవరికి పడితే వారికి రుణాలు ఇవ్వద్దు - సర్టిఫికెట్ ఆఫ్ కల్టివేషన్ ఆధారంగా రుణాలివ్వాలి సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగంలో సమూల సంస్కరణలు తీసుకు వస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో రూ. 1,66,806 కోట్లతో రూపొందించిన 2017–18 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎవరికి పడితే వారికి రుణాలు ఇవ్వద్దని, ఉద్పాదకత పెంచేవారికే రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. పొలాల్లో పనులకు అనుగుణంగా రుణాలను మంజూరు చేయాలని, సర్టిఫికేషన్ ఆఫ్ కల్టివేషన్ ఆధారంగా రుణాలు ఇవ్వాలని సూచించారు. రుణ అర్హత కార్డులతో వచ్చే రైతులకు రుణాలు ఇవ్వాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీలకు పంట రుణాలుగా రూ. 63,106 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. కౌలు రైతులకు రూ. 6,311 కోట్లు రుణాలు ఇవ్వాలని తెలిపారు. కౌలు రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని సూచించారు. కరువును ఎదుర్కొంటాం..: గతేడాది లోటు వర్షపాతమున్నా మంచి ఫలితాలు సాధించామన్నారు. వ్యవసాయ విధాన వ్యూహాలను మార్చి వేయాలన్న ధ్యేయంతో కొత్త పోకడలతో ముందుకు సాగుతున్నట్లు సీఎం తెలిపారు. రైతుకు రెట్టింపు ఆదాయం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. -
పేమెంట్ బ్యాంకులపై ఎస్బీఐ చీఫ్ ‘యూ-టర్న్’
- వ్యతిరే కించేందుకేమీ లేదని వ్యాఖ్య ముంబై: మొన్నటిదాకా పేమెంట్ బ్యాంకుల రాకకు ప్రతికూలంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య తాజాగా యూ-టర్న్ తీసుకున్నారు. ఈ తరహా బ్యాంకులను వ్యతిరే కించేందుకేమీ లేదని పేర్కొన్నారు. పేమెంటు బ్యాంకుల వల్ల పోటీ పెరిగినా.. మొత్తం బ్యాంకింగ్ రంగంలో వ్యాపార అవకాశాలు కూడా అదే విధంగా పెరుగుతాయని బ్యాంకర్ల సదస్సు ఎఫ్‌ఐబీఏసీలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. ఎస్బీఐకి రూ. 5,393 కోట్లు ప్రభుత్వం నుంచి పొందే రూ. 5,393 కోట్ల మూలధనానికి ప్రతిగా ఆ మేర విలువ చేసే ఈక్విటీ షేర్లను ఎస్బీఐ ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన జారీ చేయనుంది. మంగళవారం ఈ విషయాన్ని బీఎస్ఈకి తెలియజేసింది. మరోవైపు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తాము పొందే మూలధనానికి బదులుగా ప్రభుత్వానికి ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నట్లు వెల్లడించాయి. షేరు ఒక్కింటికి రూ. 41.37 రేటుతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దాదాపు రూ. 2,009 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుంది.