Payment banks
-
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
న్యూఢిల్లీ: దేశీయంగా పేమెంట్స్ బ్యాంకులకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోందని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీఈవో అనుబ్రత బిశ్వాస్ తెలిపారు. అందరికీ ఆర్థిక సేవలు అందించే (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) దిశగా అమలవుతున్న చర్యలు, ఆర్థిక.. డిజిటల్ వృద్ధి పుంజుకోవడం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు.డిజిటల్ బ్యాంకింగ్‌లో 10 కోట్ల మంది యూజర్ల స్థాయిలో అవకాశాలు ఉన్నాయని బిస్వాస్ వివరించారు. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, డిజిటల్ ఇన్‌క్లూజన్ మార్కెట్ పరిమాణం 50 కోట్ల యూజర్ల స్థాయిలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఇంత భారీ సంఖ్యలో జనాభా ఆర్థిక అవసరాల కోసం వివిధ విధానాల్లో పని చేసే భారీ బ్యాంకులు పెద్ద సంఖ్యలో కావాల్సి ఉంటుందని బిశ్వాస్ పేర్కొన్నారు.ప్రస్తుతం 70 కోట్ల పైచిలుకు స్మార్ట్ఫోన్లు ఉండగా దాదాపు ఆర్థికంగా చెల్లింపులు జరిపేవారు (యూపీఐ ద్వారా, నగదు లావాదేవీల రూపంలో) 40 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. డిజిటల్ యూజర్లు, డిజిటల్ ఫైనాన్షియల్ యూజర్ల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని భర్తీ చేయడంలో ఫిన్‌టెక్ సంస్థలు కీలక పాత్ర పోషించగలవని బిశ్వాస్ పేర్కొన్నారు.తమ సంస్థ విషయానికొస్తే దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు దాదాపు 5,00,000 బ్యాంకింగ్ పాయింట్స్ ఉన్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో అగ్రగామిగా ఉన్నామని, గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో కలిపి ప్రతి నెలా పది లక్షల బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఇవి చదవండి: నిరాశపర్చిన ఈ-టూవీలర్స్ విక్రయాలు.. -
మాస్టర్‌కార్డ్ కొత్త భద్రత ఫీచర్
న్యూఢిల్లీ: ఆన్లైన్ చెల్లింపు లావాదేవీలు సురక్షితంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా జరిగే దిశగా అంతర్జాతీయ పేమెంట్ సొల్యూషన్స్ దిగ్గజం మాస్టర్‌కార్డ్ తాజాగా కొత్త పేమెంట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ’ఐడెంటిటీ చెక్ ఎక్స్‌ప్రెస్’ పేరిట ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌తో చెల్లింపు ప్రక్రియ పూర్తి కావడంలో థర్డ్ పార్టీ వెబ్సైట్ అవసరం ఉండదని సంస్థ వెల్లడించింది. భారత్‌లో తొలిసారిగా నిర్వహించిన గ్లోబల్ మాస్టర్‌కార్డ్ సైబర్‌సెక్యూరిటీ సదస్సులో మాస్టర్‌కార్డ్ దీన్ని ఆవిష్కరించింది. సాధారణంగా 20 శాతం మొబైల్ ఈ–కామర్స్ లావాదేవీలు అవాంతరాల కారణంగా విఫలమవుతున్నాయని మాస్టర్‌కార్డ్ సైబర్ అండ్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ విభాగం ప్రెసిడెంట్ అజయ్ భల్లా తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజా ఫీచర్‌ను తెచ్చినట్లు వివరించారు. మొబైల్‌తో పాటు డెస్క్‌టాప్‌ల ద్వారా జరిపే చెల్లింపులకూ ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. -
బ్యాంకుల్లా పోస్టాఫీసులుః ప్రధానమంత్రి
న్యూఢిల్లీః దశాబ్దాల చరిత్ర కలిగిన పోస్టాఫీసులు.. త్వరలో రూపాంతరం చెందనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు పేమెంట్ బ్యాంకుల్లా మారనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. 70వ స్వాతంత్రదినోత్సవ సందర్భంలో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. ఈ విషయాన్ని తెలిపారు. దేశంలో వినూత్నంగా ఆరంభించనున్న పోస్టల్ పేమెంట్ బ్యాంకులు అందించే థర్డ్ పార్టీ సేవలు ప్రజా ప్రయోజనాలకు ఎంతగానో సహకరిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో అతిపెద్ద నెట్వర్క్ కలిగిన తపాలా శాఖపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, టెక్నాలజీ అభివృద్ధితో పోస్టాఫీసులు అసంబద్ధంగా మారాయని, అయితే ప్రభుత్వం వాటిని వినియోగంలోకి తెచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోస్ట్ మ్యాన్ లను ప్రేమించని వారుండరని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. -
పేమెంట్ బ్యాంకులపై ఎస్బీఐ చీఫ్ ‘యూ-టర్న్’
- వ్యతిరే కించేందుకేమీ లేదని వ్యాఖ్య ముంబై: మొన్నటిదాకా పేమెంట్ బ్యాంకుల రాకకు ప్రతికూలంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య తాజాగా యూ-టర్న్ తీసుకున్నారు. ఈ తరహా బ్యాంకులను వ్యతిరే కించేందుకేమీ లేదని పేర్కొన్నారు. పేమెంటు బ్యాంకుల వల్ల పోటీ పెరిగినా.. మొత్తం బ్యాంకింగ్ రంగంలో వ్యాపార అవకాశాలు కూడా అదే విధంగా పెరుగుతాయని బ్యాంకర్ల సదస్సు ఎఫ్‌ఐబీఏసీలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. ఎస్బీఐకి రూ. 5,393 కోట్లు ప్రభుత్వం నుంచి పొందే రూ. 5,393 కోట్ల మూలధనానికి ప్రతిగా ఆ మేర విలువ చేసే ఈక్విటీ షేర్లను ఎస్బీఐ ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన జారీ చేయనుంది. మంగళవారం ఈ విషయాన్ని బీఎస్ఈకి తెలియజేసింది. మరోవైపు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తాము పొందే మూలధనానికి బదులుగా ప్రభుత్వానికి ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నట్లు వెల్లడించాయి. షేరు ఒక్కింటికి రూ. 41.37 రేటుతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దాదాపు రూ. 2,009 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుంది. -
పేమెంట్ బ్యాంకులతో...మీకేంటి లాభం?
గ్రామీణులకూ అందనున్న డిజిటల్ బ్యాంకింగ్ జీరో బ్యాలెన్స్ ఖాతాలు నిర్వహించుకునే వెసులుబాటు నిర్వాహకులైన కార్పొరేట్ల నుంచి రాయితీలొచ్చే అవకాశం ప్రభుత్వ బ్యాంకుల కాసా డిపాజిట్లపై మాత్రం ఒత్తిడి!! పేమెంట్ బ్యాంకులు వచ్చేస్తున్నాయి. చెల్లింపు బ్యాంకులు ఆరంభం కాబోతున్నాయి. కార్పొరేట్లన్నీ బ్యాంకర్ల అవతారం ఎత్తబోతున్నాయి. ఇదీ తాజా ట్రెండ్. సరే! మరి మనకేంటి? బ్యాంకింగ్ కోసమైతే మనకిపుడు బ్యాంకులన్నీ అందుబాటులోనే ఉన్నాయిగా...? మరి ఈ కొత్త బ్యాంకులు రావటం వల్ల మనకు లాభమా? మున్ముందు ఒరిగేదేంటి? జరిగేదేంటి? సామాన్యుల్ని తొలుస్తున్న ఈ ప్రశ్నల విశ్లేషణే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రధాన కథనం.. - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం పేమెంట్ బ్యాంకులు మనకు ఇప్పటిదాకా పరిచయం లేవు. వివిధ రకాల చెల్లింపులకు ఉపయోగపడే ఈ తరహా 11 బ్యాంకులకు ఇటీవలే ఆర్బీఐ అనుమతి మంజూరు చేసింది. ఈ అనుమతులు పొందిన వాటిలో పోస్టాఫీసును మినహాయిస్తే మిగి లినవన్నీ భారీ కార్పొరేట్ సంస్థలే. నిజానికి 1990లలో ప్రైవేటు బ్యాంకులకు అనుమతి మం జూరు చేశాక ఇప్పటిదాకా బ్యాంకింగ్‌లో ప్రభుత్వ పరంగా కీలక సంస్కరణలైతే ఏమీ లేవు. కానీ ఇపుడు ఏకంగా 11 సంస్థలకు పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేయడానికి అనుమతివ్వటంతో పాటు త్వరలో చిన్నస్థాయి బ్యాంకులకు కూడా అనుమతి ఇవ్వనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ పేమెంట్ బ్యాంకులతో గ్రామీణులకూ బ్యాంకింగ్ కార్యకలాపాలు అందుబాటులోకి వస్తాయని కొందరు భావిస్తుండగా... అసలు దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థకే ముప్పు వస్తుందని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. రుణాలు తప్ప అన్నీ చేస్తాయి... పేరుకు ఇవి చెల్లింపుల బ్యాంకులే. కానీ రుణాలివ్వడం మినహా బ్యాంకులు చేసే అన్నిపనులూ చేస్తాయి. వీటిద్వారా అన్ని బిల్లులూ చెల్లించొచ్చు. ఇవి రూ.లక్ష లోపు విలువైన డిపాజిట్లు స్వీకరించటంతో పాటు డెబిట్/ఏటీఎం కార్డులు, చెక్బుక్లనూ జారీ చేస్తాయి. కాకపోతే ఈ డిపాజిట్లపై సేవింగ్ ఖాతాపై ఎంత వడ్డీ ఇస్తాయో అదే ఇవ్వాలి. చాలా బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై 4 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుండగా పేమెంట్ బ్యాంకులు దీన్ని పెంచే అవకాశం ఉంది. కరెంటు, టెలిఫోన్, మున్సిపాల్టీ, క్రెడిట్‌కార్డు వంటి ఇతర బిల్లులతో పాటు, బీమా, మ్యూచువల్ ఫండ్ పథకాల్లో నేరుగా ఇన్వెస్ట్ చేసుకునే సదుపాయాన్నీ ఇవి కల్పిస్తాయి. పూర్తిగా మొబైల్ టెక్నాలజీపై ఆధారపడి ఇవి పనిచేస్తాయి. ఇప్పటికే ‘మనీ’ పేరుతో ఎయిర్టెల్, ‘ఎం-పెసా’ పేరుతో వొడాఫోన్ మొబైల్ మనీ వ్యాలెట్ సర్వీసులు అందిస్తున్నాయి. కొత్త పేమెంట్ బ్యాంకులూ ఇలాంటివే. కాకపోతే వీటిద్వారా ఇప్పటిదాకా చెల్లింపులు మాత్రమే చేయగలిగేవాళ్లు. ఇప్పుడు ఈ రెండు సంస్థలకు పేమెంట్ బ్యాంక్ లెసైన్స్ రావడంతో ఏటీఎంలు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి కార్డుల జారీ, ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు నగదు బదిలీ వంటివి కూడా నిర్వహించే వెసులుబాటు కలుగుతుంది. ఈ పేమెంట్ బ్యాంకులు ఫారెక్స్, ట్రావెలర్స్, గిఫ్ట్ కార్డులను కూడా జారీ చేయొచ్చు. ముఖ్యంగా చిన్న వ్యాపారస్తుల చెల్లింపులకు ఇవి బాగా ఉపయోగపడతాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. బ్యాంకులూ ఇవే చేస్తున్నాయి కదా? ఇప్పుడు చాలా బ్యాంకులు ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా బిల్లు చెల్లింపుల దగ్గర నుంచి నగదు బదిలీ వరకు అన్ని సేవలనూ అందిస్తున్నపుడు ఈ కొత్త పేమెంట్ బ్యాంకుల వల్ల లాభం ఏంటన్నది చాలా మందిలో మెదిలే ప్రశ్న. ఇది వాస్తవమే అయినా... ఈ లావాదేవీలు సామాన్యులకు అందుబాటులో లేవని ఆర్బీఐ భావిస్తోంది. చాలా వాణిజ్య బ్యాంకుల్లో ఈ సేవలు పొందాలంటే మీ ఖాతాలో మూడు నెలల కనీస నిల్వ సగటున రూ. 25,000 వరకు ఉంచాల్సి ఉంటుంది. అదే ప్రభుత్వ బ్యాంకుల్లో ఈ మినిమమ్ బ్యాలెన్స్ రూ.5,000 నుంచి రూ. 10,000 వరకు ఉంది. దీన్ని మెయింటెన్ చేస్తున్న వారికి మా త్రమే బ్యాంకులు అన్ని రకాల సేవలను అందిస్తున్నాయి. అదే పేమెంట్ బ్యాం కులు విషయానికొస్తే మినిమమ్ బ్యాలెన్స్ అనేదే ఉండదు. చెల్లింపులకు అవసరమైన నగదును వేసుకొని ఇంటి దగ్గర నుంచి మీ మొబైల్ ఫోన్ నుంచే లావాదేవీలు జరుపుకోవచ్చు. ఫోన్ ద్వారానే అన్ని లావాదేవీలు జరుపుకునే వెసులుబాటు ఉండటంతో గ్రామీణులు ఈ పేమెంట్ బ్యాంక్‌లను ఆదరిస్తారని ఆర్బీఐ భావన. ఆఫ్రికాలో కెన్యా వంటి చిన్న దేశంలో వొడాఫోన్ ప్రవేశపెట్టిన ‘ఎం-పెసా’కు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చక్కటి ఆదరణ లభించడమే పేమెంట్ బ్యాంకులకు ప్రేరణగా కనిపిస్తోంది. వ్యతిరేకత ఇందుకే...! బ్యాంకులు నమోదు చేస్తున్న లాభాల్లో కీలక పాత్ర చౌక వడ్డీరేటున్న కాసా (కరెంట్, సేవింగ్స్) డిపాజిట్లదే. చాలామంది ఖాతాదారులు నెలవారీ చెల్లింపుల కోసం సేవింగ్స్ ఖాతాల్లో భారీ మొత్తాన్ని ఉంచుతారు. కానీ ఇప్పుడు పేమెంట్ బ్యాంక్‌లు వస్తే కాసా డిపాజిట్లపై ఒత్తిడి పెరుగుతుందని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. అలాగే చాలా బ్యాంకులు, నగదు బదిలీ, బిల్లు చెల్లింపులపై ఫీజుల రూపంలో ఆదాయం పొందుతున్నాయి. ఇప్పుడు పేమెంట్ బ్యాంకులు వస్తే పోటీ పెరిగి ఇటువంటి ఇతర ఆదాయాలకు గండి పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొత్త బ్యాంకులివీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా నువో, వొడాఫోన్ ఎం-పెసా, ఎయిర్టెల్ ఎం కామర్స్ చోళమండలం డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, టెక్ మహీంద్రా, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీ ఎల్), ఫినో పేటెక్ సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఇవీ ప్రయోజనాలు ►గరిష్టంగా లక్ష రూపాయల డిపాజిట్లు స్వీకరించొచ్చు. ఈ డిపాజిట్లపై సేవింగ్స్ ఖాతా వడ్డీరేటును అందిస్తాయి. ► సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటు 4 శాతం నుంచి పెరిగే అవకాశం ఉంది. ► మొబైల్ ఫోన్ ద్వారానే ఇతర ఖాతాలకు నగదు సులభంగా బదిలీ చేసుకోవచ్చు ►ఖాతాల్లో ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. ►ఆఫీసులకు వెళ్లకుండానే ఆటోమేటిక్‌గా అన్ని రకాల బిల్లులను చెల్లించుకోవచ్చు. ►క్రెడిట్ కార్డులు తప్ప ఏటీఎం, డెబిట్, ఫారెక్స్, ట్రావెల్ కార్డులను జారీ చేస్తాయి ►ఈ బ్యాంకులన్నీ కార్పొరేట్ల చేతిలోనే ఉన్నాయి కనక వాటి ఉత్పత్తులపై రాయితీలిచ్చే అవకాశం -
ప్రస్తుత బ్యాంకులకు పేమెంటు బ్యాంకులు పోటీరావు: క్రిసిల్
ముంబై : ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్యాంకులకు త్వరలో రానున్న పేమెంట్ బ్యాంకులు(పీబీ) పోటీ కాబోవని శుక్రవారం విడుదల చేసిన ఒక నివేదికలో రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అభిప్రాయపడింది. బ్యాంకింగ్ వ్యవస్థ అంతగా బలపడని తూర్పు, ఈశాన్య, మధ్య ప్రాంతాలపై పేమెంట్ బ్యాంకులు ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలిపింది. రానున్న పేమెంట్ బ్యాంకుల గురించి ప్రస్తుత బ్యాంకులు ఎటువంటి ఆందోళనా చెందనక్కర్లేదని క్రిసిల్ చీఫ్ విశ్లేషకులు పవన్ అగర్వాల్ పేర్కొన్నారు. పైగా పీబీలతో ప్రస్తుత బ్యాంకులు అవగాహన కుదుర్చుకుని, అన్‌బ్యాంకింగ్ ప్రాంతాల్లో ‘వ్యయ భారాలు లేని’ సేవల విస్తరణ దిశగా ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. 11 పేమెంట్ బ్యాంకులకు రెండు రోజుల క్రితం ఆర్బీఐ లెసైన్సులివ్వడం తెలిసిందే. -
రిలయన్స్, ఎయిర్టెల్ బ్యాంకులు!
11 పేమెంట్ బ్యాంకులకు ర్బీఐ సూత్రప్రాయ అనుమతులు - లిస్టులో వొడాఫోన్, ఆదిత్య బిర్లా నువో స్టల్ డిపార్ట్మెంట్ కూడా ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్, పోస్టల్ డిపార్ట్మెంట్ సహా 11 సంస్థలు పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) బుధవారం ‘సూత్రప్రాయంగా’ అనుమతులు ఇచ్చింది. సూత్రప్రాయ అనుమతులు 18 నెలల పాటు వర్తిస్తాయి. ఈలోగా పూర్తి స్థాయి అనుమతులు సాధించేందుకు అవసరమైన నిబంధనలను ఈ సంస్థలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పటిదాకా ఎటువంటి బ్యాంకింగ్ కార్యకలాపాలూ నిర్వహించకూడదు. తొలి విడత అనుభవాల ఆధారంగా భవిష్యత్‌లో మరిన్ని కొత్త లెసైన్సుల జారీ విషయంలో నిబంధనల్లో తగు మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత రౌండులో పర్మిట్లు పొందని వాటికి తర్వాతి విడతల్లో లెసైన్సులు దక్కవచ్చని పేర్కొంది. మొత్తం 41 సంస్థలు పేమెంట్ బ్యాంకు పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. మరిన్ని నిధులు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేందుకు, గ్రామీణ ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్ సేవలను విస్తరించేందుకు పేమెంట్ బ్యాంకులు తోడ్పడగలవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఎస్బీఐ లాంటి దిగ్గజాలతో పాటు పలు బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలకు మరింత విస్తరించడంపై దృష్టి పెడుతున్నాయని ఆయన చెప్పారు. అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు పోస్టల్ శాఖ అందివచ్చిన అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకోగలదని ఆశిస్తున్నట్లు కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. ఇది పోస్టల్ శాఖకు గర్వకారణమైన సందర్భం అని పేర్కొన్నారు. పర్మిట్ పొందినవి .. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా నువో, వొడాఫోన్ ఎం-పెసా, ఎయిర్టెల్ ఎం కామర్స్ సర్వీసెస్, చోళమండలం డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, టెక్ మహీంద్రా, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీ ఎల్), ఫినో పేటెక్ మొదలైన సంస్థలతో పాటు సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ప్రతిపాదిత బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. ఎస్బీఐతో కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్.. పేమెంట్ బ్యాంకును ఏర్పాటు చేయనుంది. ప్రతి పాదిత వెంచర్లో ఎస్బీఐకి 30% వాటాలు ఉంటాయి. మరోవైపు భారతీ ఎయిర్టెల్ తమ వెంచర్లో 19.9% వాటాను కొటక్ మహీంద్రా బ్యాంక్‌కు ఇవ్వనుంది. ఆదిత్య బిర్లా నువో.. ఐడియాతో కలిసి పేమెంట్ బ్యాంకు ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఐడియాకి 49% వాటాలు ఉంటాయి. పోస్టల్ శాఖకు దేశవ్యాప్తంగా 1,54,000 పైచిలుకు పోస్టాఫీసులు ఉన్నాయి. వీటిలో 1,30,000 పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. టెలినార్, ఐడీఎఫ్‌సీలతో కలిసి దిలీప్ సంఘ్వీ ఫ్యామిలీ అండ్ అసోసియేట్స్ (డీఎస్ఏ) పేమెంట్ బ్యాంకు ఏర్పాటు చేస్తోంది. సమగ్ర ఆర్థిక సేవలందిస్తాం.. సమగ్రమైన బ్యాంకింగ్, ఆర్థిక సేవలు అందించేందుకు తాజా లెసై న్సు ఉపయోగపడగలదని వొడాఫోన్ ఇం డియా ఎండీ సునీల్ సూద్ అన్నారు. మారుమూల ప్రాం తాల్లోనూ నగదు బదిలీ, చెల్లింపుల సేవలందిస్తూ.. ఇప్పటికే 90,000 పైచిలుకు ‘ఎం-పెసా’ ఏజెంట్లు ఉన్నారని వివరించారు. సాధ్యమైనంత త్వరగా బ్యాంకు ఏర్పా టు చేయాలని భావిస్తున్నట్లు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. అందరికీ ఆర్థిక సేవలు అం దుబాటులోకి తెచ్చే దిశగా ఇది మరో అడుగని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య పేర్కొన్నారు. కొత్త పేమెంట్ బ్యాంక్‌లో తమకు, మహీంద్రా ఫైనాన్స్‌కు సమాన వాటాలు ఉంటాయని టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీ తెలిపారు. కొత్త బ్యాంకులో రూ. 300 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నామని, మ రిన్ని నిధులను సమీకరిస్తామని పేటెక్ సీఈవో రిషి గుప్తా చెప్పారు. తీరుతెన్నులివీ.. చిన్న వ్యాపార సంస్థలు, వ్యక్తుల బ్యాంకింగ్ అవసరాలకు తోడ్పడే ఉద్దేశంతో పేమెంట్ బ్యాంకుల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇవి పూర్తి స్థాయి బ్యాంకుల్లాగా కాకుండా డిపాజిట్ల స్వీకరణ, రెమిటెన్స్ సేవలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నగదు బదిలీ సేవలు, బీమా..మ్యూచువల్ ఫండ్స్ విక్రయాలు మొదలైన కొన్ని సేవలు మాత్రమే అందిస్తాయి. రుణ వితరణ కార్యకలాపాలు చేపట్టడానికి అనుమతులు ఉండవు. ప్రాథమికంగా వ్యక్తుల నుంచి రూ. 1 లక్ష దాకా డిపాజిట్లను ఈ బ్యాంకులు సమీకరించవచ్చు. ఏటీఎం/డెబిట్ కార్డులు జారీ చేయొచ్చు కానీ క్రెడిట్ కార్డులకు మాత్రం అనుమతి లేదు. ఈ పేమెంట్ బ్యాంకులు సేకరించిన డిపాజిట్లలో 75 శాతం ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి చేయాలి. మిగిలిన 25 శాతం ఇతర వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయాలి. ప్రస్తుతం దేశీయంగా 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 20 ప్రైవేట్, 44 విదేశీ, 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. -
ధనికులపై ఎల్వీబీ దృష్టి
హెచ్ఎన్ఐ ఖాతాదారులకు వ్యక్తిగత అధికారి హైదరాబాద్‌లో హెచ్ఎన్ఐ లాంజ్ కొత్తగా మారో 100 శాఖలు, 200 ఏటీఎంల ఏర్పాటు వచ్చే ఏడాది వ్యాపారంలో 20 శాతం వృద్ధి అంచనా లక్ష్మీ విలాస్ బ్యాంక్ సీవోవో విద్యాసాగర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాత తరం లక్ష్మీ విలాస్ బ్యాంక్... కొత్త ప్రైవేటు బ్యాంకులకు దీటైన పోటీ ఇవ్వటానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. దీన్లో భాగంగా వేగంగా శాఖల్ని విస్తరించటం... కొత్త పథకాలను ప్రవేశపెట్టడంపై దృష్టిసారిస్తోంది. ముఖ్యంగా అధికాదాయ వర్గాల వారిని ఆకర్షించడానికి ప్రత్యేక ఆఫర్లతో పాటు వారికోసం ప్రత్యేక శాఖలను కూడా ఏర్పాటుచేసే ఆలోచనలో ఉంది. టేకోవర్ల ముప్పు నుంచి తప్పించుకోవడానికి సొంతంగా బలపడటంపై దృష్టి పెడుతున్నామంటున్న బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విద్యాసాగర్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ... వ్యాపార విస్తరణ ఈ ఏడాది వ్యాపారంలో 18 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. డిసెంబర్ నాటికి బ్యాంకు వ్యాపార పరిమాణం సుమారు రూ.34,000 కోట్లకు చేరింది. ఇది మార్చి నాటికి రూ.38,000 కోట్లకు చేరుతుంది. వచ్చే ఏడాది కనీసం 20 శాతం వృద్థి శాతాన్ని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం దక్షిణాది పాత తరం ప్రైవేటు బ్యాంకుగా ఉన్న ముద్రను చెరిపి కొత్తతరం ప్రైవేటు బ్యాంకుగా తీర్చిదిద్దే పనిలో ఉన్నాం. ఇందులో భాగంగా దేశవ్యాప్త విస్తరణపై దృష్టి సారించాం. గత రెండేళ్ళలో కొత్తగా 110 శాఖలను ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం శాఖల సంఖ్య 400కి చేరింది. వచ్చే 12 నెలల కాలంలో కొత్తగా మరో 100 శాఖలను ఏర్పాటు చేయడంతో పాటు ఏటీఎంల సంఖ్యను 800 నుంచి 1,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎలాంటి మార్పులంటే... అధికాదాయ వర్గాల వారిని ఆకర్షించడానికి ‘క్రౌన్’ పేరుతో కొత్త సేవలను ప్రారంభించాం. ఈ ఖాతాదారులకు ఏటీఎంల విత్‌డ్రాయల్స్, డెబిట్ కార్డులలతో పాటు, రూ.25 లక్షల ప్రమాద బీమా రక్షణ కల్పిస్తున్నాం. దేశవ్యాప్తంగా 40 శాఖల్లో ఈ ఖాతాదారులకు సేవలను అందించడం కోసం ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేశాం. బెంగళూరు శాఖలో క్రౌన్ లాంజ్‌ను ఏర్పాటు చేశాం. త్వరలోనే హైదరాబాద్ సహా 5 నగరాల్లో ఈ లాంజ్‌లను ఏర్పాటు చేస్తాం. వీటి తర్వాత హెచ్ఎన్ఐల కోసం ప్రత్యేకంగా క్రౌన్ శాఖనే ఏర్పాటు చేస్తాం. ఇవికాక సేవింగ్స్ ఖాతాలో రూ.లక్షపైన ఉన్న మొత్తానికి 5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాం. ప్రస్తుతం కరెంట్, సేవింగ్స్ (కాసా) డిపాజిట్లు 14 శాతంగా ఉన్నాయి. మార్చినాటికి ఇవి 18 శాతానికి చేరుతాయని అంచనా వేస్తున్నాం. బడ్జెట్ తరవాతే వడ్డీ రేట్లపై స్పష్టత... బడ్జెత్ తర్వాత కానీ వడ్డీరేట్ల తగ్గింపుపై స్పష్టత రాదు. ప్రస్తుత సంకేతాలను బట్టి చూస్తే వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత రుణాలకు వడ్డీరేట్ల తగ్గింపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తగ్గించే ఆలోచనలోనే ఉన్నాం. ప్రస్తుతం బేస్ రేట్ 11.25 శాతంగా ఉంది. నిధుల కొరత లేదు... ప్రస్తుతానికి నిధుల కొరత లేదు. ఈ మధ్యనే రూ.460 కోట్లు సేకరించాం. రుణాలకు డిమాండ్ బాగా పెరిగి వృద్ధి బాగుంటే అప్పుడు అదనపు నిధులు అవసరమవుతాయి. ఆ సమయంలో నిధులను ఏ మార్గంలో సేకరించాలన్న విషయాన్ని పరిశీలిస్తాం. ప్రస్తుతం బాసెల్ 3 నిబంధనల కింద సీఏఆర్ 12.47 శాతంగా ఉంది. పోటీని తట్టుకుంటేనే... పేమెంట్ బ్యాంకులు, కొత్త బ్యాంకులు రావడం వల్ల బ్యాంకింగ్ రంగంలో పోటీతత్వం పెరుగుతుంది. ఈ పోటీని తట్టుకుంటేనే నిలబడంగలం. అందుకే కొన్ని పెద్ద బ్యాంకులు వ్యూహాత్మకంగా చిన్న బ్యాంకులను టేకోవర్ చేస్తున్నాయి. ప్రస్తుతం టేకోవర్లపై మేం ఎవరితోనూ చర్చలు జరపడం లేదు. పుకార్లకు అడ్డుకట్ట పడాలంటే బ్యాలెన్స్‌షీట్‌ను పటిష్టం చేసుకోవాలి. ఇప్పుడు మా దృష్టంతా ఎన్పీఏలను తగ్గించుకొని బ్యాలెన్స్ షీట్ మెరుగుపర్చుకోవడంపైనే ఉంది. మార్చి నాటికి స్థూల ఎన్పీఏలను 3 శాతం కిందకు, నికర ఎన్పీఏలను 2 శాతం కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. డిసెంబర్ నాటికి స్థూల ఎన్పీఏలు 3.4 శాతం, నికర ఎన్పీఏలు 2.37 శాతంగా ఉన్నాయి.