స్మార్ట్ సిటీలతో 40 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్మార్ట్ సిటీస్‌తో ఐటీ రంగానికి వచ్చే 5-10 ఏళ్లలో 30-40 బిలియన్ డాలర్ల మేర వ్యాపార అవకాశాలు లభించగలవని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తెలిపింది. స్మార్ట్ సిటీల అభివృద్ధి కోసం కేంద్రం రూ. 48,000 కోట్లు కేటాయించింది. ప్రతిపాదిత 100 స్మార్ట్ సిటీల్లో ఒక్కొక్క దానికి వార్షికంగా అయిదేళ్ల పాటు రూ. 100 కోట్ల మేర కేంద్ర నిధులు లభించనున్నాయి.
స్మార్ట్ సిటీలకు లభించే నిధుల్లో కనీసం 10-15 శాతాన్ని ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీపై (ఐసీటీ) వెచ్చించిన పక్షంలో ఐటీ కంపెనీలకు కనీసం 30-40 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు లభించగలవని అంచనా వేస్తున్నట్లు నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. స్మార్ట్ సిటీల నిర్మాణంలో ఐసీటీ పాత్ర గురించి నాస్కామ్ రూపొందించిన నివేదికను మే 21న ఢిల్లీలో జరిగే స్మార్ట్ సిటీ ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్నట్లు ఆయన వివరించారు.