లిథోగ్రఫీ మెషిన్ల సరఫరా కోసం సెమీకండక్టర్ సంస్థలతో చర్చలు
కెనాన్ ఇండియా ప్రెసిడెంట్ తొషియాకి నొమురా
భారత్‌లో చిప్ ఫ్యాబ్రికేషన్‌కి సంబంధించి గణనీయంగా వ్యాపార అవకాశాలు ఉన్నట్లు జపాన్‌కి చెందిన ఇమేజింగ్ ఉత్పత్తుల దిగ్గజం కెనాన్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో తొషియాకి నొమురా తెలిపారు. తమ సెమీకండక్టర్ లిథోగ్రఫీ మెషిన్లను సరఫరా చేసేందుకు, దేశీయంగా సెమీకండక్టర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు.
చిప్‌ల ఉత్పత్తికి పలు చిప్ తయారీ సంస్థలకు ఇప్పుడు భారత్ కొత్త గమ్యస్థానంగా మారుతోందని పేర్కొన్నారు. మరోవైపు 2024లో తమ వృద్ధి దాదాపు రెండంకెల స్థాయిలో ఉండగలదని, ఏటా ఇదే తీరును కొనసాగించగలమని ఆశిస్తున్నట్లు నొమురా వివరించారు.
ప్రధాన వ్యాపారమైన ఇమేజింగ్, ప్రింటింగ్, సరై్వలెన్స్ ఉత్పత్తులతో పాటు కెనాన్ ఇండియా సంస్థ ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లేలతో పాటు డయాగ్నోస్టిక్ మెడికల్ ఇమేజింగ్ సొల్యూషన్స్‌పై (సీటీ, ఎక్స్-రే, అ్రల్టాసౌండ్ మొదలైనవి) కూడా దృష్టి పెడుతోంది. హెల్త్‌కేర్ విభాగంలో తమ వ్యాపార వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని నొమురా తెలిపారు. అటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ, ఫార్మా తదితర పరిశ్రమలపైనా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment