న్యూఢిల్లీ: ఫ్యాషన్ రిటైలర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వరకు ఆదాయ వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. నెట్‌వర్క్ విస్తరణ ఇందుకు కారణమని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక వెల్లడించింది. ‘ద్రవ్యోల్బణం ఎదురుగాలులు ఉన్నప్పటికీ ఫ్యాషన్ రిటైలర్ల నెట్‌వర్క్ విస్తరణ 2024–25లో రాబడి పెరుగుదలకు తోడ్పడుతుంది. సర్వేలో పాలుపంచుకున్న కంపెనీల నిర్వహణ లాభాల మార్జిన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–14 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉంది.
ఏప్రిల్–జూన్‌లో ఫ్యాషన్ రిటైలర్లు స్టోర్ నెట్‌వర్క్ విస్తరణ, కొత్త ఉత్పత్తుల శ్రేణిని ప్రవేశపెట్టడం ద్వారా 18 శాతం వృద్ధిని నమోదు చేశాయి. జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో ఈ రంగ కంపెనీలు మోస్తరు వృద్ధి నమోదు చేస్తాయి. పండుగ సీజన్‌లో ఆదాయ వృద్ధి పుంజుకునే అవకాశం ఉంది. దీని ఫలితంగా అంత క్రితంతో పోలిస్తే 2024–25లో ఆదాయం 14–15 శాతం పెరుగుతుందని అంచనా’ అని ఇక్రా తెలిపింది.
పరిమితంగానే డిస్కౌంట్లు..
‘చదరపు అడుగుకు సగటు అమ్మకాల్లో జూన్ త్రైమాసికంలో ప్రీమియం సెగ్మెంట్ 3 శాతం క్షీణించింది. అయినప్పటికీ వాల్యూ ఫ్యాషన్ విభాగాలు కొంత సానుకూల ప్రభావాన్ని చూపించాయి. ఈ విభాగం మహమ్మారి ముందస్తు స్థాయిని మొదటిసారి తాకింది. కొత్త స్టోర్స్ రాక, ప్రారంభించిన నూతన కేటగిరీల కోసం పెరిగిన ప్రకటనలు, ప్రమోషనల్ ఖర్చుల కారణంగా తగిన రాబడి కంటే తక్కువగా గతేడాదితో పోలిస్తే ఫ్యాషన్ రిటైలర్ల మార్జిన్లు స్థిరంగా ఉన్నాయి. 2023–24 రెండవ త్రైమాసికం నుండి డిస్కౌంట్లు పరిమితంగానే ఉన్నాయి. ఎందుకంటే కంపెనీలు తమ స్థూల మార్జిన్లను రక్షించుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా పండుగల సీజన్‌తో ప్రకటనలు, ప్రమోషన్లపై రిటైలర్లు దూకుడుగా ఖర్చు చేస్తూనే ఉన్నారు’ అని ఇక్రా నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment