జనవరి 12 నాటికి 16 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి 12వ తేదీ నాటికి (2024 ఏప్రిల్ 1 నుంచి) 16 శాతం పెరిగి రూ.16.90 లక్షల కోట్లకు ఎగశాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (సీబీడీటీ) గణాంకాల ప్రకారం మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో వ్యక్తిగత పన్ను వసూళ్లు రూ.8.74 లక్షల కోట్లు. కార్పొరేట్ వసూళ్లు రూ. 7.68 లక్షల కోట్లు. సెక్యూరిటీ లావాదేవీల పన్ను వసూళ్లు రూ.44,538 కోట్లు.
రిఫండ్స్ రూ.3.74 లక్షల కోట్లు
స్థూలంగా చూస్తే, జనవరి 12 నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 20.64 లక్షల కోట్లు. ఇందులో రిఫండ్స్ రూ.3.74 లక్షల కోట్లు. (వార్షికంగా 42.49 శాతం పెరుగుదల). వెరసి నికర వసూళ్లు రూ. 16.90 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
లక్ష్యం రూ.22.07 లక్షల కోట్లు
ప్రత్యక్ష పన్నుల ద్వారా మార్చితో ముగిసే ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.22.07 లక్షల కోట్లు వసూలు చేయాలన్నది వార్షిక బడ్జెట్ లక్ష్యం. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్ల వాటా రూ.10.20 లక్షల కోట్లు. వ్యక్తిగత ఆదాయ, ఇతర పన్నుల ద్వారా వసూళ్లు రూ.11.87 లక్షల కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment