Corporate Collection
-
ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.16.90 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి 12వ తేదీ నాటికి (2024 ఏప్రిల్ 1 నుంచి) 16 శాతం పెరిగి రూ.16.90 లక్షల కోట్లకు ఎగశాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (సీబీడీటీ) గణాంకాల ప్రకారం మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో వ్యక్తిగత పన్ను వసూళ్లు రూ.8.74 లక్షల కోట్లు. కార్పొరేట్ వసూళ్లు రూ. 7.68 లక్షల కోట్లు. సెక్యూరిటీ లావాదేవీల పన్ను వసూళ్లు రూ.44,538 కోట్లు. రిఫండ్స్ రూ.3.74 లక్షల కోట్లు స్థూలంగా చూస్తే, జనవరి 12 నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 20.64 లక్షల కోట్లు. ఇందులో రిఫండ్స్ రూ.3.74 లక్షల కోట్లు. (వార్షికంగా 42.49 శాతం పెరుగుదల). వెరసి నికర వసూళ్లు రూ. 16.90 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. లక్ష్యం రూ.22.07 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నుల ద్వారా మార్చితో ముగిసే ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.22.07 లక్షల కోట్లు వసూలు చేయాలన్నది వార్షిక బడ్జెట్ లక్ష్యం. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్ల వాటా రూ.10.20 లక్షల కోట్లు. వ్యక్తిగత ఆదాయ, ఇతర పన్నుల ద్వారా వసూళ్లు రూ.11.87 లక్షల కోట్లు. -
కార్పొరేట్ కలెక్షన్ను ఆవిష్కరించిన మోంటే కార్లో
హైదరాబాద్: ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ‘మోంటే కార్లో’ తాజాగా ‘కార్పొరేట్ కలెక్షన్’ను ఆవిష్కరించింది. ఇందులో వివిధ శ్రేణులకు చెందిన స్మార్ట్ ఆఫీస్వేర్ను అందుబాటులో ఉంచామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. స్త్రీ, పురుషులకు అనువైన రీతిలో, వారి ఫ్యాషన్లకు అనుగుణంగా ఈ నూతన వస్త్ర శ్రేణిని రూపొందించామని పేర్కొంది. పురుషుల కోసం షర్టులు, ట్రౌజర్లు.. మహిళలకు టాప్స్, టునిక్స్ వంటి వాటిని అందుబాటులో ఉంచామని తెలి పింది. తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన వస్త్ర శ్రేణి వినియోగదారులను మరింత ఆకట్టుకుంటుందని మోంటే కార్లో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సందీప్ జైన్ విశ్వాసం వ్యక్తంచేశారు.