Direct tax collections
-
రూ.12.11 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ 20 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు మెరుగ్గా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 15.41 శాతం అధికంగా రూ.12.11 లక్షల కోట్ల నికర పన్ను ఆదాయం వచ్చింది. ఇందులో రూ.5.10 లక్షల కోట్లు కార్పొరేట్ పన్ను రూపంలో రాగా, రూ.6.62 లక్షల కోట్లు నాన్ కార్పొరేట్ రూపంలో సమకూరింది. ఇక స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏప్రిల్ నుంచి నవంబర్ 10 వరకు రూ.15.02 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 21 శాతం పెరిగింది. ఈ కాలంలో రూ.2.92 లక్షల కోట్ల రిఫండ్లను ఆదాయపన్ను శాఖ పూర్తి చేసింది. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు అప్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు ఆగస్టు 11వ తేదీ వరకూ 22.48 శాతం పెరిగి (గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం వరకూ పోల్చి) 6.93 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో వ్యక్తిగత పన్ను వసూళ్లు రూ.4.47 లక్షల కోట్లు. కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.2.22 లక్షల కోట్లు. సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) వసూళ్లు రూ.21,599 కోట్లు. ఇతర పన్నులు (లెవీ అండ్ గిఫ్ట్ ట్యాక్స్ రూ.1,617 కోట్లు. స్థూలంగా చూస్తే.. ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 11 మధ్య రిఫండ్స్ రూ.1.20 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో పోలి్చతే రిఫండ్స్ 33.49 శాతం పెరిగాయి. వీటిని కూడా కలుపుకుంటే స్థూలంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 24 శాతం పెరిగి రూ.8.13 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.4.82 లక్షల కోట్లుకాగా, కార్పొరేట్ పన్ను రూ.3.08 లక్షల కోట్లు ఉన్నాయి. కొన్ని ముఖ్యాంశాలు... → ఏప్రిల్‌తో ప్రారంభమైన 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.22.07 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లను బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది. 2023 –24కన్నా ఈ మొత్తాలు 13 శాతం అధికం. → 2023–24లో ఆర్జించిన ఆదాయానికి సంబంధించిన దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌ల పెరుగుదల నేపథ్యంలో అధిక పన్ను వసూళ్లు జరిగాయి. తమ ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం లేని వ్యక్తులు, సంస్థలు ఐటీఆర్‌లను ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. ఈ గడువు నాటికి రికార్డు స్థాయిలో 7.28 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. -
2022–23లో ఐటీఆర్ ఫైలింగ్ @ 7.40 కోట్లు: కేంద్రం
ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చతుర్వేది లోక్‌సభలో ఒక కీలక ప్రకటన చేస్తూ, మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7.40 కోట్ల మంది ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేశారని, ఇందులో 5.16 కోట్ల మంది ‘జీ ట్యాక్స్ లయబిలిటీ’లో ఉన్నారని పేర్కొన్నారు. గడచిన ఐదేళ్లలో ఐటీఆర్‌లు ఫైల్ చేస్తున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందని తెలిపారు. 2018–19లో వీరి సంఖ్య 6.28 కోట్లయితే, 2019–20లో 6.47 కోట్లకు చేరిందన్నారు. 2020–21లో ఈ సంఖ్య 6.72 కోట్లకు చేరితే 2021–22లో ఇది 6.94 కోట్లకు పెరిగిందన్నారు. 2022–23లో 7.40 కోట్లకు రిటర్నులు ఫైల్ చేసిన వారి సంఖ్య పెరిగినట్లు వివరించారు. ‘జీరో ట్యాక్స్’ వ్యక్తుల సంఖ్య 2.90 కోట్ల నుంచి 5.16 కోట్లకు అప్ ఇక జీరో ట్యాక్స్ లయబిలిటీలో ఉన్న వారి సంఖ్య 2019–20లో 2.90 కోట్ల మంది ఉంటే, 2022–23లో ఈ సంఖ్య 5.16 కోట్లకు ఎగసినట్లు పేర్కొన్నారు. ‘ప్రత్యక్ష పన్ను వసూళ్లు– దాఖలైన ఆదాయపు పన్ను రిటర్న్‌ల సంఖ్యలో దామాషా పెరుగుదల ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. సంబంధిత మదింపు సంవత్సరానికి వర్తించే పన్ను రేటు, చట్టం ప్రకారం అనుమతించదగిన తగ్గింపులు/ మినహాయింపులు, ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలు ఆర్థిక వృద్ధి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది’’ అని మంత్రి పేర్కొన్నారు. కాగా, 2017–18లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.11.38 లక్షల కోట్లయితే, 2022–23లో ఈ పరిమాణం 16.63 లక్షల కోట్లకు ఎగసిందని ఆయన తెలిపారు. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.13.70 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు డిసెంబర్ 17వ తేదీ నాటికి గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 21 శాతం పెరిగి రూ.13,70,388 కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో కార్పొరేట్ పన్ను (సీఐటీ) వాటా రూ.6.95 లక్షల కోట్లు. వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ), సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) వాటా రూ.6.73 లక్షల కోట్లు. ఆదాయపు పన్ను శాఖ తెలిపిన సమాచారం ప్రకారం, 2023–24 బడ్జెట్ లక్ష్యాల్లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 75 శాతానికి చేరాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.16.63 లక్షల కోట్లు. 2023–24లో ఈ లక్ష్యాన్ని రూ.18.23 లక్షల కోట్లుగా బడ్జెట్ నిర్దేశించుకుంది. రిఫండ్స్ రూ.2.25 లక్షల కోట్లు.. కాగా, డిసెంబర్ 17 వరకూ రిఫండ్స్ విలువ రూ.2.25 లక్షల కోట్లు. వీటిని కూడా కలుపుకుంటే స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.15.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.7.90 లక్షల కోట్లు, ఎస్‌టీటీసహా వ్యక్తిగత పన్ను వసూళ్లు రూ.8.03 లక్షల కోట్లు. వేర్వేరుగా వసూళ్లను పరిశీలిస్తే... అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు రూ.6.25 లక్షల కోట్లు, టీడీఎస్ రూ.7.71 లక్షల కోట్లు, సెల్ప్–అసెస్మెంట్ ట్యాక్స్ రూ.1.49 లక్షల కోట్లు. రెగ్యులర్ అసెస్మెంట్ ట్యాక్స్ రూ. 36,651 కోట్లు. ఇతర హెడ్స్ కింద వసూళ్ల మ్తొతం రూ.14,455 కోట్లు. లక్ష్యాల సాధనపై భరోసా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం రూ.18.23 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుంది. పరోక్ష పన్నుల (వస్తు సేవల పన్ను, కస్టమ్స్, ఎక్సైజ్) వసూళ్ల లక్ష్యం రూ.15.38 లక్షల కోట్లు. వెరసి మొత్తం పన్ను వసూళ్ల లక్ష్యం రూ. 33.61 లక్షల కోట్లు. ఈ స్థాయి పన్ను వసూళ్ల లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేస్తోంది. తాజా గణాంకాల ప్రకారం, డిసెంబర్ 17 వరకూ ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు 21 శాతం పెరిగాయి. పరోక్ష పన్ను దాదాపు 5 శాతం అధికంగా నమోదయ్యాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్ల మొత్తం రూ.30.54 లక్షల కోట్లు. 2023–24లో దీనిని 10 శాతం (రూ.33.61 లక్షల కోట్లు) పెంచాలన్న లక్ష్యాన్ని బడ్జెట్ నిర్దేశించుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో ఓట్ ఆన్ అకౌంట్ లేదా మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. లోక్‌సభకు ఎన్నికల అనంతరం కొలువుదీరే నూతన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. -
కేంద్రానికి కాసుల వర్షం! భారీగా పెరిగిన పన్ను వసూళ్లు.. అడ్వాన్స్ ట్యాక్స్ అదుర్స్..
కార్పొరేట్ల నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు గణనీయంగా పెరగడంతో సెప్టెంబర్ నెల మధ్య నాటికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ( Direct Tax Collection) 23.51 శాతం పెరిగి రూ.8.65 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా వెల్లడించింది. (ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు బిగ్ బొనాంజా.. వరాలు కురిపించిన కేంద్ర ప్రభుత్వం) సెప్టెంబర్ 16 నాటికి నికరంగా రూ. 8,65,117 కోట్లు ప్రత్యక్ష పన్నుల రూపంలో వసూలయ్యాయి. ఇందులో కార్పొరేట్ ఆదాయ పన్ను (సీఐటీ) రూ. 4,16,217 కోట్లు. వ్యక్తిగత ఆదాయ పన్ను (పీఐటీ), సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) కలిపి రూ. 4,47,291 కోట్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 16 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23.51 శాతానికి పైగా పెరిగాయని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. (EPFO:వేతన జీవులకు షాక్.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ!) అడ్వాన్స్ ట్యాక్స్ అదుర్స్ ముందస్తు పన్ను వసూళ్లు సెప్టెంబర్ మధ్య వరకు రూ. 3.55 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వసూలు చేసిన రూ. 2.94 లక్షల కోట్లతో పోలిస్తే ఇవి 21 శాతం పెరిగాయి. సెప్టెంబర్ 16 నాటికి వసూలైన రూ. 3.55 లక్షల కోట్ల ముందస్తు పన్ను వసూళ్లలో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ రూ. 2.80 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్ను రూ. 74,858 కోట్లు ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 16 వరకు దాదాపు రూ.1.22 లక్షల కోట్ల రీఫండ్లను ట్యాక్స్ పేయర్స్‌కు ప్రభుత్వం జారీ చేసింది. (PM Vishwakarma Scheme: రూ.13,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే..) -
ప్రత్యక్ష పన్నుల స్థూల వసూళ్లలో 24 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను స్థూల వసూళ్లు ఫిబ్రవరి 10వ తేదీ నాటికి 24 శాతం పెరిగి (2021–22 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో పోల్చి) రూ.15.67 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్స్‌పోను నికర వసూళ్లు 18.40 శాతం పెరిగి రూ.12.98 లక్షల కోట్లుగా నమోదయినట్లు ఆర్థికశాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు లక్ష్యంలో (2023–24 బడ్జెట్లో సవరిత గణాంకాల ప్రకారం) 79 శాతానికి (ఫిబ్రవరి 10 నాటికి) చేరినట్లు గణాంకాలు తెలిపాయి. 2022–23 బడ్జెట్లో ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని రూ.14.20 లక్షల కోట్లుగా నిర్దేశించుకోగా, ఈ మొత్తాన్ని తాజాగా రూ.16.50 లక్షల కోట్లకు పెంచిన సంగతి తెలిసిందే. ఏప్రిల్–ఫిబ్రవరి 10 మధ్య స్థూల కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీ) వసూళ్లు 19.33 శాతం పెరగ్గా, వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ) వసూళ్లు 29.63 శాతం ఎగశాయి. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 26 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరం (ప్రస్తుత 2022–23) ఇంకా దాదాపు మూడు నెలలుపైగా మిగిలి ఉండగానే ప్రత్యక్ష పన్ను వసూళ్లు లక్ష్యంవైపునకు దూసుకుపోతున్నాయి. ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 17వ తేదీ నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు స్థూలంగా 26 శాతం వృద్ధితో రూ.13,63,649 కోట్లుగా నమోదయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. బడ్జెట్ లక్ష్యంలో ఇది దాదాపు 80 శాతం. అధికారిక సమాచారం ప్రకారం, స్థూల వసూళ్లలో రిఫండ్స్ విలువ రూ.2.28 లక్షల కోట్లు. ఇవి పోను నికరంగా వసూళ్లు రూ.11.35 లక్షల కోట్లుగా ఉన్నాయి. స్థూల వసూళ్లలో కార్పొరేట్ పన్ను (సీఐటీ) విలువ రూ.7.25 లక్షల కోట్లు. ఎస్టీటీ (సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ ట్యాక్స్)సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు (పీఐటీ) వసూళ్లు రూ.6.35 లక్షల కోట్లు. మొత్తం లక్ష్యం రూ.27.50 లక్షల కోట్లు.. 2022–23లో రూ.27.50 లక్షల కోట్ల ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు జరగాలన్నది లక్ష్యం. ఈ లక్ష్యంలో ప్రత్యక్ష పన్నుల వాటా రూ.14.20 లక్షల కోట్లయితే, పరోక్ష పన్ను వసూళ్ల వాటా రూ.13.30 లక్షల కోట్లు. అయితే లక్ష్యాలకు మించి పరోక్ష పన్ను వసూళ్లు రూ.17.50 లక్షల కోట్లు, పరోక్ష పన్ను (కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్టీ) వసూళ్లు రూ.14 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. అంటే వసూళ్లు రూ.31.50 లక్షల వరకూ వసూళ్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ అంచనాలకన్నా ఇది రూ.4 లక్షల కోట్ల అధికం. 2022–23లో రూ.16.61 లక్షల కోట్ల ద్రవ్యలోటు కట్టడికి (జీడీపీలో 6.4 శాతం వద్ద) దోహదపడే అంశం ఇది. 2022–23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు 10.54 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత్ స్థూల ప్రత్యక్ష పన్ను (వ్యక్తిగత, కార్పొరేట్) వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ 10వ తేదీ నాటికి రూ.10.54 లక్షల కోట్లుగా నమోదయినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ పరిమాణం 31 శాతం ఎగసినట్లు పేర్కొంది. ఇక ఇందులో రిఫండ్స్ విలువ రూ.1.83 లక్షల కోట్లు. వెరసి నికర వసూళ్లు రూ.8.71 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం బడ్టెట్ పన్ను వసూళ్ల లక్ష్యంలో ఇది 61.31 శాతం. స్థూల పన్నుల వసూళ్లలో కార్పొరేట్ పన్ను వసూళ్లు 22 శాతం పెరిగితే, వ్యక్తిగత పన్ను వసూళ్లు 40.64 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2021–22) ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.10 లక్షల కోట్లు. 2022–23లో ఈ వసూళ్ల లక్ష్యం రూ.14.20 లక్షల కోట్లు. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్ల అంచనా రూ.7.20 లక్షల కోట్లు కాగా, వ్యక్తిగత పన్ను వసూళ్ల అంచనా రూ.7 లక్షల కోట్లు. దేశంలో పలు రంగాలు మందగమనంలో ఉన్నప్పటికీ, ఎకానమీ పురోగతికి సంకేతమైన ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పురోగమిస్తుండడం శుభ సూచికమని నిపుణులు పేర్కొంటున్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా ఎనిమిది నెలలుగా రూ.1.40 లక్షల కోట్లు పైబడ్డాయి. ఇందులో రెండు నెలలు రూ.1.50 లక్షల కోట్లు దాటాయి. కట్టడిలో ద్రవ్యలోటు: బీఓఏ సెక్యూరిటీస్ కాగా చక్కటి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా 6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందన్న అంచనాలను బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఏ) సెక్యూరిటీస్ వెలువరించింది. 2022–23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు 24 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు స్థూలంగా సెప్టెంబర్ 8వ తేదీ నాటికి 24 శాతం పెరిగి రూ.8.98 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్స్ మినహాయింస్తే, నికర వసూళ్లు 16.25 శాతం ఎగసి రూ.7.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్–అక్టోబర్ 8 మధ్య రిఫండ్స్ గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 81 శాతం పెరిగి రూ.1.53 లక్షల కోట్లుగా నమోదయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. మొత్తం వసూళ్లలో వ్యక్తిగత ఆదాయపు పన్ను ( సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ పన్నుసహా) 32 శాతం పెరగ్గా, కార్పొరేట్ పన్ను ఆదాయాలు 17 శాతం ఎగశాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరం (2021–22) ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.10 లక్షల కోట్లు. 2022–23లో ఈ వసూళ్ల లక్ష్యం రూ.14.20 లక్షల కోట్లు. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్ల అంచనా రూ.7.20 లక్షలుకాగా, వ్యక్తిగత పన్ను వసూళ్ల అంచనా రూ.7 లక్షల కోట్లు. తాజా గణాంకాల ప్రకారం, నికర వసూళ్లు (రూ.7.45 లక్షల కోట్లు) బడ్జెట్ అంచనాల్లో దాదాపు 52 శాతం దాటడం గమనార్హం. దేశంలో పలు రంగాలు మందగమనంలో ఉన్నప్పటికీ, ఎకానమీ పురోగతికి సంకేతమైన ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పురోగమిస్తుండడం శుభ సూచికమని నిపుణులు పేర్కొంటున్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ప్రతినెలా దాదా పు రూ.1.45 లక్షల కోట్లుగా నమోదవుతున్నాయి. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు 30 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 17తో ముగిసిన కాలానికి స్థూలంగా 30 శాతం పురోగతితో రూ.8.36 లక్షల కోట్లకు చేరాయి. మహమ్మారి తర్వాత వేగంగా పుంజుకుంటున్న ఎకానమీ, ముందస్తు పన్ను చెల్లింపులు దీనికి కారణమని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే, విలువ రూ.6,42,2876 కోట్ల నుంచి రూ.8,36,225 కోట్లకు చేరినట్లు ప్రకటన వివరించింది. మొత్తం వసూళ్లలో కార్పొరేట్ రంగం వాటా రూ.4.36 లక్షల కోట్లుకాగా, వ్యక్తిగత పన్ను విభాగం వాటా రూ.3.98 లక్షల కోట్లు. ఒక్క అడ్వాన్స్ పన్ను విసూళ్లు 17 శాతం వృద్ధితో రూ.2.29 లక్షల కోట్ల నుంచి రూ.2.95 లక్షల కోట్లకు చేరాయి. రిఫండ్స్ రూ.1.36 లక్షల కోట్లు ఇక మొత్తం వసూళ్లలో రిఫండ్స్ విలువ రూ.1.36 లక్షల కోట్లు. దీనితో నికరంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23 శాతం వృద్ధితో రూ.7 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గడచిన ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.10 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ పరిమాణాన్ని రూ.14.20 లక్షల కోట్లుగా కేంద్ర బడ్జెట్ అంచనా వేస్తోంది. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్ల అంచనా రూ.7.20 లక్షలుకాగా, వ్యక్తిగత పన్ను వసూళ్ల అంచనా రూ.7 లక్షల కోట్లు. -
భారీగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు, ఎంతంటే?
న్యూఢిల్లీ: ఎకానమీ పురోగతికి అద్దం పడుతూ, ప్రత్యక్ష పన్ను వసూళ్లలో భారీ వృద్ధి నమోదయ్యింది. ఆదాయపు పన్ను శాఖ ఈ మేరకు విడుదల చేసిన గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం, ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) సెప్టెంబర్ 8వ తేదీ వరకూ గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే ప్రత్యక్ష పన్ను వసూళ్లలో స్ధూలంగా 35 శాతం పురోగతి నమోదయ్యింది. విలువలో రూ.6.48 లక్షల కోట్ల పరోక్ష పన్ను వసూళ్లు జరిగాయి. ఇక రిఫండ్స్ విషయానికి వస్తే, సమీక్షా కాలంలో ఈ పరిమాణం రూ.1.19 లక్షల కోట్లు. వెరసి నికర వసూళ్లు 30.17 శాతం వృ ద్ధితో రూ.5.29 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో పోల్చితే రిఫండ్స్ 65.29 శాతం అధికం. సమీక్షా కాలంలో విభాగాల వారీగా చూస్తే, కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీ) వసూళ్లలో స్థూలంగా 25.95 శాతం వృద్ధి నమోదయితే, వ్యక్తిగత పన్ను స్థూల వసూళ్లలో (ఎస్టీటీ సహా) 44.37 శాతం వృద్ధి చోటుచేసుకుంది. రిఫండ్స్ సర్దుబాటు చేస్తే ఈ వృద్ధి రేట్లు వరుసగా 32.73 శాతం, 28.32 శాతాలుగా ఉన్నాయి. గడచిన ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.10 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ పరిమాణాన్ని రూ.14.20 లక్షల కోట్లుగా కేంద్ర బడ్జెట్ అంచనా వేస్తోంది. -
41 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు జూన్ త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 41 శాతం పెరిగినట్లు లోక్‌సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదురి వెల్లడించారు. 2021-22 ఇదే కాలంతో పోల్చిచూస్తే, ఈ విలువ రూ.2,50,881 కోట్ల నుంచి రూ.3,54,570 కోట్లకు చేరినట్లు ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. ఇక ఇదే కాలంలో వస్తు సేవల పన్ను, కస్టమ్స్ సుంకాలుసహా పరోక్ష పన్ను వసూళ్లు 9.4 శాతం పెరిగి రూ.3,14,476 కోట్ల నుంచి రూ.3,44,056 కోట్లకు ఎగసినట్లు ఆయన వెల్లడించారు. కేంద్రంపై పెరిగిన వడ్డీ భారం కేంద్రంపై వడ్డీ చెల్లింపుల భారం పెరిగినట్లు చౌదురి మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2021–22లో (జీడీపీ విలువలో) ఈ పరిమాణం 3.1 శాతంగా ఉందని, విలువలో ఇది రూ.7.31 లక్షల కోట్లని ఆయన తెలిపారు. 2014-15లో వడ్డీ చెల్లింపుల విలువ 3.27 లక్షల కోట్లయితే, జీడీపీలో ఇది 2.6 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 2014-15లో ప్రభుత్వంపై చెల్లింపుల భారం రూ.62.44 లక్షల కోట్లయితే (జీడీపీలో 50.1 శాతం), 2021-22లో ఈ విలువ రూ.138.88 లక్షల కోట్లని (జీడీపీలో 58.7 శాతం) వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ భారం 155.33 లక్షల కోట్లకు (60.2 శాతం) చేరే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు... అదుర్స్
న్యూఢిల్లీ: ఆర్థిక రికవరీకి సంకేతంగా మూడేళ్ల (2017–18) తర్వాత ప్రత్యక్ష పన్ను వసూళ్లు (కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపు పన్ను) మొట్టమొదటిసారి బడ్జెట్ (2021–22) లక్ష్యాలను అధిగమించనున్నట్లు బడ్జెట్ పత్రాలు వెల్లడించాయి. 2021–22 తొలి బడ్జెట్ అంచనాలు రూ.11.08 లక్షల కోట్లయితే, దీనిని తాజాగా రూ.12.50 లక్షల కోట్లకు సవరించడం జరిగింది.ఇక 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.20 లక్షల కోట్లుగా నమోదవుతాయని (రూ.7.20 లక్షల కోట్లు కార్పొరేట్ల నుంచి రూ.7 లక్షల కోట్లు వ్యక్తిగత ఆదాయపు పన్ను) తాజా బడ్జెట్ అంచనావేసింది -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. సూపర్
న్యూఢిల్లీ: దేశంలో ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఈ పరిమాణం ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి (2021 ఏప్రిల్) నవంబర్ 23 నాటికి 2020–21 ఇదే కాలంతో పోల్చిచూస్తే, 68 శాతం పెరిగి రూ.6.92 లక్షల కోట్లకు ఎగశాయి. ఆర్థిక శాఖ సహాయమంతి పంకజ్ చతుర్వేది లోక్‌సభ లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. ఆయన తెలిపిన సమాచారాన్ని పరిశీలిస్తే.. ► 2021–22 నవంబర్ 23 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.6,92,834 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ మొత్తం 68 శాతం అధికమైతే, కోవిడ్ ముందస్తు కాలం 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే మాత్రం 27.29 శాతం అధికం. 2020–21 ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 23 మధ్య నికర వసూళ్లు రూ.4.12 లక్షల కోట్లయితే, 2019–20 మధ్య ఈ మొత్తం రూ.5.44 లక్షల కోట్లు. ► 2021 నవంబర్ 23వ తేదీ వరకూ చూస్తే, రిఫండ్స్ జరక్క ముందు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.8.15 లక్షల కోట్లు. 2021 ఇదే కాలంలో పోల్చితే స్థూల వసూళ్ల వృద్ధి 48.11 శాతం. ► ఇక పరోక్ష పన్నుల విషయానికి వస్తే వస్తు సేవల పన్నులో (జీఎస్టీ) గణనీయమై వృద్ధి ధోరణి కనబడుతోంది. 2020–21 జీఎస్టీ వసూళ్లు రూ.11.36 లక్షల కోట్లు. 2021–22 అక్టోబర్ వరకూ ఈ వసూళ్లు రూ.8.10 లక్షల కోట్లు. ► పన్ను ఎగవేతలను నిరోధించడానికి కేందం తీసుకుంటున్న చర్యలు ఫలితమిస్తున్నాయి. జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగడానికి ఇదీ ఒక కారణం. ► 2021–22 బడ్జెట్లో పన్నుల ఆదాయం రూ.22.2 లక్షల కోట్లుగా కేంద్రం అంచనాలు వేసింది. ఇందులో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.11 లక్షల కోట్లు. ఇందులో కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో రూ.5.47 లక్షల కోట్లుగా రావచ్చని అంచనా. 2020–21లో పన్నుల ఆదాయం రూ.20.2 లక్షల కోట్లు. -
రాజ్యసభ: ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబు
సాక్షి, ఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల ద్వారా 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 2 లక్షల 46 వేల 519 కోట్ల రూపాయలు వసూలైనట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2020-21లో ఇదే కాలంలో ప్రత్యక్ష పన్నుల రూపంలో వసూలైన మొత్తం 1 లక్ష 17 వేల 783 కోట్లు అని తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, పన్ను చెల్లింపుదారుల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ముందస్తు పన్ను చెల్లింపులు అత్యధికంగా ఉండటంతో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు గణనీయంగా పెరగడానికి కారణాలుగా మంత్రి విశ్లేషించారు. రెండో త్రైమాసికం ఇప్పుడే మొదలైనందున ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఏమేరకు వసూలు కాగలవో అంచనా వేయలేమని మంత్రి అన్నారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పరోక్ష పన్నుల (జీఎస్టీ-నాన్ జీఎస్టీ కలిపి) ద్వారా 3 లక్షల 11 వేల 398 కోట్ల రూపాయలు వసూలైనట్లు మంత్రి చెప్పారు. వివాద్-సే-విశ్వాస్ పథకం కింద ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన వివాదాలను గణనీయమైన సంఖ్యలో సామరస్యంగా పరిష్కరించుకోవాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి చెప్పారు. ఈ పథకం కింద స్వీకరించిన డిక్లరేషన్లు 28.73 శాతం పెండింగ్ టాక్స్ వివాదాలున్నట్లు తెలిపారు. ఈ విధంగా పరిష్కారానికి నోచుకునే వివాదాల ద్వారా ప్రభుత్వానికి కూడా అదనంగా పన్ను ఆదాయం సమకూరుతుందని అన్నారు. ఈ ఏడాది త్రైమాసికంలో గణనీయమైన మొత్తాల్లో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్ళు ఆర్థిక రంగం తిరిగి దారిన పడుతోందని చెప్పడానికి నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. పన్నుల వసూళ్ళు పెరిగితే దానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రజాహిత కార్యక్రమాలపై పెట్టే ఖర్చు కూడా పెరుగుతుంది తద్వారా జాతీయ స్థూల ఉత్పత్తిని అది ప్రభావితం చేస్తుందని మంత్రి తెలిపారు. ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జవాబు.. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా కంపెనీలు స్థానికంగానే సామాజిక కార్యకలాపాలను నిర్వహించే విధంగా నిబంధనలను మారుస్తూ కంపెనీల చట్టాన్ని సవరించినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ మంగళవారం రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పారు. సీఎస్ఆర్ ప్రాజెక్ట్‌ల అమలులో స్థానిక ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నది కేవలం మార్గదర్శకం మాత్రమే అని చెప్పారు. సవరించిన కంపెనీల చట్టంలో పొందుపరచిన నియమ నిబంధనల ప్రకారం కంపెనీలు సీఎస్ఐర్ కార్యకలాపాల కింద చేపట్టే ప్రాజెక్ట్‌ల విషయంలో జాతీయ ప్రాధాన్యతలు, స్థానిక ప్రాంత ప్రాధాన్యతల మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఈ చట్టం కింద సీఎస్ఐర్ కార్యకలాపాల్లో కంపెనీ బోర్డుదే తుది నిర్ణయం అవుతుంది. సీఎస్ఆర్ కార్యకలాపాల ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ వంటివి సీఎస్ఐర్ కమిటీ సిఫార్సుల మేరకు ఉంటుందని అన్నారు. ఫలానా కార్యకలాపాలకు ఇంత మొత్తం ఖర్చు చేయాలని ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోదని తెలిపారు. -
వేల కోట్లు వసూలైన ట్యాక్స్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్–22 మార్చి) జూన్ 15 వరకూ భారీగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చిచూస్తే 100.4 శాతం ఎగసి రూ.92,762 కోట్ల నుంచి రూ.1,85,871 కోట్లకు చేరాయి. సెకండ్ వేవ్ వల్ల ఎకానమీ తీవ్రంగా నష్టపోదన్న అంచనాలకు తాజా గణాంకాలు బలాన్నిస్తున్నాయి.ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) బుధవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. రిఫండ్స్ రూ.30,731 కోట్లు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.2.16 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే రూ.1.37 లక్షల కోట్ల నుంచి 57 శాతం పెరిగాయి. వీటిలో కార్పొరేట్ పన్నులు (సీఐటీ) రూ.96,923 కోట్లు. వ్యక్తిగత పన్నుల పరిమాణం రూ.1.19 లక్షల కోట్లు. రిఫండ్స్ అనంతరం నికర వసూళ్లు వరుసగా రూ.74,356 కోట్లు. రూ.1.11 లక్షల కోట్లుగా ఉన్నాయి. రిఫండ్స్ విలువ దాదాపు రూ.30,731 కోట్లు. కరోనా మొదటి వేవ్‌తో అతలాకుతలమైన 2020–21 ఆర్థిక సంవత్సరంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.45 లక్షల కోట్లు. చదవండి: వేల కోట్ల నష్టం: అదానీ గ్రూప్ సీఎఫ్ఓ స్పందన -
15 శాతం తగ్గిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు 15 శాతం మేర తగ్గడంతో ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్(సీబీడీటీ) తదుపరి చర్యలకు ఉపక్రమిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2018–2019) రూ.12 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రాబట్టాలని సీబీడీటీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ నెల 23 నాటికి రూ.10.21 లక్షలు (85 శాతం) మాత్రమే వసూళ్లయ్యాయి. దీంతో పన్ను రికవరీ ప్రక్రియను మరింత పెంచాలని ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్స్‌కు సీబీడీటీ లేఖలు రాసింది. పన్ను వసూళ్లకు సంబంధించి లక్ష్య సాధన కోసం సీబీడీటీ వివిధ చర్యలు తీసుకుంటోంది. రీఫండ్లు విడుదల చేయకపోవడం, ఆదాయపు పన్ను ఎగవేతదారుల కేసులు విచారణను ప్రారంభించడం తదితర చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి ఆదాయపు పన్ను ఎగవేత కేసులు గత రెండు–మూడేళ్లలో దాదాపు రెట్టింపయ్యాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక వ్యవస్థ పనితీరును బట్టే పన్ను వసూళ్లు ఉంటాయని, అయితే అర్థిక వ్యవస్థ పనితీరు అంచనాల కంటే బలహీనంగా ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. -
ప్రత్యక్ష పన్ను వసూళ్ల వృద్ధి రేటు 14 శాతం
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2018 ఏప్రిల్–డిసెంబర్ మధ్య (2017 ఇదే కాలంతో పోల్చి) స్థూలంగా 14.1 శాతం పెరిగాయి. విలువలో ఇది రూ.8.74 లక్షల కోట్లు. ఆర్థికశాఖ సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ముఖ్యాంశాలు చూస్తే... ∙2018 ఏప్రిల్–డిసెంబర్ మధ్య రిఫండ్స్ విలువ రూ.1.30 లక్షల కోట్లు. 2017 ఇదే కాలంతో పోల్చిచూస్తే, ఇది 17 శాతం అధికం. రిఫండ్స్ తరువాత, నికర వసూళ్లు 13.6 శాతం వృద్ధితో రూ.7.43 లక్షల కోట్లుగా ఉన్నాయి. ∙ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం రూ.11.50 లక్షల కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరగాలన్నది లక్ష్యం. ఇప్పటికి జరిగిన వసూళ్లు ఇందులో 64.7 శాతానికి సమానం. ∙ముందస్తు వసూళ్లు 14.5 శాతం వృద్ధితో రూ.3.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ∙కార్పొరేట్ పన్ను వసూళ్లు స్థూలంగా 14.8 శాతం పెరిగాయి. వ్యక్తిగత ఆదాయ వసూళ్లలో 17.2 శాతం వృద్ధి నమోదయ్యింది. రిఫండ్స్ తరువాత ఈ వృద్ధి రేట్లు వరుసగా 16 శాతం, 14.8 శాతంగా ఉన్నాయి. -
ఆ క్లబ్లో కొత్తగా కోటి మంది
సాక్షి, న్యూఢిల్లీ : ట్యాక్స్ రిటన్స్ దాఖలు చేసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు ముందుకొస్తున్నారు. 2017-18లో దాదాపు కోటి మంది కొత్తగా ఆదాయ పన్ను రిటన్స్‌ను దాఖలు చేశారు. ఫలితంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లలో మెరుగైన వృద్ధి నమోదైందని ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది 5.4 కోట్ల రిటన్స దాఖలవగా, 2017-18లో 6.8 కోట్ల ఆదాయ పన్ను రిటన్స్ దాఖలయ్యాయని పన్ను విభాగం అధికారులు తెలిపారు. గత నాలుగేళ్లుగా పన్ను పరిధిని విస్తరించేందుకు, నల్లధనానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల ఫలితంగా ఆదాయ పన్ను రిటన్స్‌ను దాఖలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు నూతనంగా అమలు చేస్తున్న జీఎస్టీతో పరోక్ష పన్ను వసూళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరగడంతో 2017-18 కేంద్ర బడ్జెట్ అంచనాలను రెవెన్యూ శాఖ అధిగమించింది. 2016-17లో వసూళ్ల కంటే 17.1 శాతం అధికంగా ప్రత్యక్ష పన్నులు రూ 9.9 కోట్ల మేర వసూలయ్యాయి. మరో నాలుగైదు రోజుల్లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ 10 లక్షల కోట్ల మైలురాయిని దాటతాయని భావిస్తున్నామని ఫైనాన్స్ సెక్రటరీ హస్ముక్ అథియా ధీమా వ్యక్తం చేశారు. -
బడ్జెట్‌కు బూస్ట్ : భారీగా పెరిగిన పన్ను వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీః ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు భారీగా పెరిగాయి. ఏప్రిల్ -డిసెంబర్ మధ్య కాలంలో ఈ వసూళ్లు 18.2 శాతం పెరుగుదలను నమోదు చేశాయి ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం డైరెక్ట్ టాక్స్ వసూల్లు రూ.6.56 లక్షల కోట్లకు చేరాయి. ప్రత్యక్ష పన్నుల్లో ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్‌తోపాటు కంపెనీలు చెల్లించే కార్పొరేట్ పన్నులు ఉంటాయి. 2017-18 ఏడాదికిగాను బడ్జెట్లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్ల అంచనాల్లో ఇది 67 శాతంగా ఉన్నదని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక స్థూల వసూళ్లు (రీఫండ్స్ చెల్లించక ముందు)లో 12.6 శాతం పెరిగి రూ.7.68 లక్షలకు చేరింది. ఇదే కాలంలో రూ.1.12 లక్షల కోట్లు రిఫండ్ రూపంలో తిరిగి చెల్లించారు. ఇక అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు 12. 7 శాతం పెరిగి రూ.3.18 లక్షల కోట్లకు చేరినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ పెరుగుదలలో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ వాటా 10.9 శాతం కాగా.. వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్ వాటా 21.6 శాతంగా ఉంది. -
14శాతం పెరిగిన డైరెక్ట్ టాక్స్ వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్-నవంబర్ లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 14.4 శాతం పెరిగి 4.8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శనివారం వెల్లడించింది. స్థూల వసూళ్లు 10.7 శాతం పెరిగి రూ. 5.82 లక్షల కోట్లు వసూలయ్యాయి. నవంబరు, 2017 నాటికి సీబీడీటీ గణాంకాల ప్రకారం వసూళ్లు 4.8 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. గత ఏడాది కంటే 14.4 శాతం పుంజుకున్నాయి. 2017-18 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు, ప్రత్యక్ష పన్నులు 49 శాతం (రూ 9.8 లక్షల కోట్లు) ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. 2017 ఏప్రిల్-నవంబర్‌లో స్థూల వసూళ్లు (రీఫండ్లు కోసం సర్దుబాటు చేసే ముందు) 10.7 శాతం పెరిగి 5.82 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. 2017 ఏప్రిల్-నవంబర్‌లో రూ.1.02 లక్షల కోట్ల జారీ చేసినట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. -
15శాతం పెరిగిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో డైరెక్ట్ టాక్స్ వసూళ్లు 15శాతంపెరిగాయని కేంద్రం ప్రకటించింది. ఏప్రిల్-అక్టోబర్ మధ్య ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ. 4.39 లక్షల కోట్లు సేకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఏడు నెలల్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 15.2 శాతం పెరిగింది. వ్యక్తిగత ఆదాయం పన్ను, కార్పొరేట్ పన్ను లుకూడా ఇందులో భాగం. 2017-18 ఆర్థిక సంవత్సారికి గాను రూ. 9.8 లక్షల కోట్ల బడ్జెట్ అంచనాలలో ఇది 44.8 శాతంగా నిలిచిందని ఆర్థికమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్, 2017 నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లను తాత్కాలికంగా చూస్తే రూ .4.39 లక్షల కోట్లు వసూలు చేశాయి. ఇది గత ఏడాది ఇదే కాలంలో నికర వసూళ్లు కంటే 15.2 శాతం ఎక్కువ. 2017 ఏప్రిల్-అక్టోబర్‌లో స్థూల వసూళ్లు ( రిఫండ్స్ సర్దుబాటుకు ముందు) 10.7 శాతం పెరిగి 5.28 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. గత ఏడు నెలలో రిఫండ్స్ చేసిన మొత్తం రూ. 89,507 కోట్లుగా నమోదయ్యాయి. -
ఇది నోట్ల రద్దు ఎఫెక్టేనా..?
సాక్షి,న్యూఢిల్లీ: నోట్ల రద్దు, జీఎస్టీతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్న విమర్శలు వెల్లువెత్తుతుంటే ప్రభుత్వం చెబుతున్నట్టు ప్రత్యక్ష పన్ను వసూళ్లు మాత్రం గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్-సెప్టెంబర్‌లో ప్రత్యక్ష పన్నులు గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 16 శాతం వృద్ధితో రూ 3.86 లక్షల కోట్లకు పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లలో పెరుగదల ఫలితంగా ప్రత్యక్ష పన్నులు ప్రోత్సాహకరంగా వసూలయ్యాయని అధికారులు చెప్పారు. సెప్టెంబర్ వరకూ అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు రూ 1.77 లక్షల కోట్లకు చేరాయి. కార్పొరేట్ ఆదాయ పన్ను ముందస్తు పన్నులో 8.1 శాతం వృద్ధి నమోదవగా, వ్యక్తిగత ఆదాయ పన్ను అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు 30.1 శాతం మేర పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్‌లో రూ 79,660 కోట్ల రిఫండ్లను చెల్లించారు. ఇక ఏప్రిల్-సెప్టెంబర్‌లో స్థూల ప్రత్యక్ష పన్నులు 10.3 శాతం పెరిగి రూ 4.66 లక్షల కోట్లు వసూలయ్యాయి. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు 9 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు సెప్టెంబర్‌తో ముగిసిన ఆరునెలల్లో 9 శాతం వృద్ధిచెంది రూ. 3.27 లక్షల కోట్లకు చేరాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు భారీగా పెరగడంతో ఈ వృద్ధి సాధ్యపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- సెప్టెంబర్ మధ్యకాలంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు బడ్జెట్లో నిర్దేశించిన లక్ష్యంలో 38 శాతం మేరకు జరిగినట్లు సీబీడీటీ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. కార్పొరేట్ పన్ను వసూళ్లు 9.54 శాతం పెరగ్గా, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 16.85 శాతం వృద్ధిచెందాయి. అయితే రిఫండ్స్ సర్దుబాటు చేసిన తర్వాత కార్పొరేట్ ఆదాయపు పన్ను వసూళ్లలో వృద్ధి 2.56 శాతంగా వుంది. ఈ రెండు విభాగాల్లోనూ ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో రూ. 86,491 కోట్ల రిఫండ్స్ జరిగాయి. అడ్వాన్సు పన్ను వసూళ్లు రూ. 1.58 లక్షల కోట్లు... సెప్టెంబర్‌తో ముగిసిన ఆరునెలల కాలంలో అడ్వాన్సు పన్ను వసూళ్లు 12.12 శాతం వృద్ధిచెంది రూ. 1.58 లక్షల కోట్లకు చేరాయి. కార్పొరేట్ అడ్వాన్సు టాక్సుల్లో వృద్ధి 8.14 శాతంకాగా, వ్యక్తిగత అడ్వాన్సు పన్ను వసూళ్లలో వృద్ధి 44.5 శాతం వుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 12.64 శాతం వృద్ధితో రూ. 8.47 లక్షల కోట్లకు చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పరోక్ష పన్నుల వసూళ్లు 26 శాతం అప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో పరోక్ష పన్నుల వసూళ్లు 25.9 శాతం వృద్ధితో రూ. 4.08 లక్షల కోట్లకు పెరిగాయి. ఎక్సయిజు వసూళ్లు 46 శాతం పెరగడంతో మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్ల వృద్ధి సాధ్యపడింది. 2016-17 బడ్జెట్లో నిర్దేశించుకున్న లక్ష్యంలో ఈ వసూళ్లు 52.5 శాతం మేర జరిగాయి. కేంద్ర ఎక్సయిజు వసూళ్లు రూ. 1.83 లక్షల కోట్లకు పెరిగాయి. నికర ఎక్సయిజు వసూళ్లు రూ. 1.16 లక్షల కోట్లుకాగా, నికర కస్టమ్స్ వసూళ్లు రూ. 1.08 కోట్లుగా నమోదయ్యాయి. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు 11.38 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) ఏప్రిల్- జనవరి మధ్య 5.78 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చుకుంటే (రూ.5.19 లక్షల కోట్లు) ఈ మొత్తం 11.39 శాతం అధికం. కాగా నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు మాత్రం 10 నెలల కాలంలో 6.21 శాతం వృద్ధితో రూ.4.74 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. స్థూల పన్ను వసూళ్లు భారీగా ఉన్నప్పటికీ, అధిక రిఫండ్స్ వల్ల నికర వసూళ్లు తగ్గిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు 24.14 శాతం వృద్ధితో రూ.13.6 లక్షల కోట్ల వసూళ్లు లక్ష్యం.