సాక్షి, న్యూఢిల్లీః ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు భారీగా పెరిగాయి. ఏప్రిల్ -డిసెంబర్ మధ్య కాలంలో ఈ వసూళ్లు 18.2 శాతం పెరుగుదలను నమోదు చేశాయి ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం డైరెక్ట్ టాక్స్ వసూల్లు రూ.6.56 లక్షల కోట్లకు చేరాయి.
ప్రత్యక్ష పన్నుల్లో ఇన్‌కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్‌తోపాటు కంపెనీలు చెల్లించే కార్పొరేట్ పన్నులు ఉంటాయి. 2017-18 ఏడాదికిగాను బడ్జెట్‌లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్ల అంచనాల్లో ఇది 67 శాతంగా ఉన్నదని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక స్థూల వసూళ్లు (రీఫండ్స్ చెల్లించక ముందు)లో 12.6 శాతం పెరిగి రూ.7.68 లక్షలకు చేరింది. ఇదే కాలంలో రూ.1.12 లక్షల కోట్లు రిఫండ్ రూపంలో తిరిగి చెల్లించారు. ఇక అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు 12. 7 శాతం పెరిగి రూ.3.18 లక్షల కోట్లకు చేరినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ పెరుగుదలలో కార్పొరేట్ ఇన్‌కమ్ ట్యాక్స్ వాటా 10.9 శాతం కాగా.. వ్యక్తిగత ఇన్‌కమ్ ట్యాక్స్ వాటా 21.6 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment