న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను స్థూల వసూళ్లు ఫిబ్రవరి 10వ తేదీ నాటికి 24 శాతం పెరిగి (2021–22 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో పోల్చి) రూ.15.67 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్స్‌పోను నికర వసూళ్లు 18.40 శాతం పెరిగి రూ.12.98 లక్షల కోట్లుగా నమోదయినట్లు ఆర్థికశాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు లక్ష్యంలో (2023–24 బడ్జెట్‌లో సవరిత గణాంకాల ప్రకారం) 79 శాతానికి (ఫిబ్రవరి 10 నాటికి) చేరినట్లు గణాంకాలు తెలిపాయి. 2022–23 బడ్జెట్‌లో ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని రూ.14.20 లక్షల కోట్లుగా నిర్దేశించుకోగా, ఈ మొత్తాన్ని తాజాగా రూ.16.50 లక్షల కోట్లకు పెంచిన సంగతి తెలిసిందే. ఏప్రిల్–ఫిబ్రవరి 10 మధ్య స్థూల కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీ) వసూళ్లు 19.33 శాతం పెరగ్గా, వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ) వసూళ్లు 29.63 శాతం ఎగశాయి.
Comments
Please login to add a commentAdd a comment