Statistics
-
పదేళ్లు.. ప్రకృతి నష్టం
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లలో ప్రకృతి వైపరీత్యం రాష్ట్రానికి పెద్ద నష్టమే చేసిందని గణాంకాలు చెబుతున్నాయి. వడగళ్లు, కరువు, భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్, అకాల వర్షాలు, వరదలు, అధిక వేడి, పిడుగుల్లాంటి ఘటనల కారణంగా భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 16వ ఆర్థిక సంఘానికి నివేదించిన లెక్కల ప్రకారం గత పదేళ్ల కాలంలో (2015–2024) ప్రకృతి వైపరీత్యాల కారణంగా వేల కోట్ల రూపాయల విలువైన నష్టం జరిగింది. ఒక్కో ఏడాది ఒక్కో రకమైన వైపరీత్యం కారణంగా ఇప్పటివరకు 371 మంది చనిపోయినట్టు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక, మూగజీవాలు అయితే లక్షకు పైగా మృత్యువాత పడ్డాయి. మొత్తం 80 వేల ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాదాపు 40 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. వీటన్నింటి విలువ రూ.1,500 కోట్ల వరకు ఉందని ప్రభుత్వ నివేదికలో పేర్కొన్న గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
వృద్ధికి సానుకూలతలే ఎక్కువ
ముంబై: దేశ జీడీపీ వృద్ధికి సంబంధించి వస్తున్న గణాంకాలు మిశ్రమంగా ఉన్నాయంటూ.. ప్రతికూలతల కంటే సానుకూలతలే ఎక్కువని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో అంతర్లీనంగా కార్యకలాపాలు మొత్తానికి బలంగానే కొనసాగుతున్నట్టు చెప్పారు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంపై ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్ మాట్లాడారు. ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించే, వెనక్కిలాగే 70 అధిక వేగంతో కూడిన సూచికలను ట్రాక్ చేసిన తర్వాతే ఆర్బీఐ అంచనాలకు వస్తుందని వివరించారు. 2024–25 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి 6.7 శాతంగా నమోదు కావడం గమనార్హం. 15 నెలల కనిష్ట స్థాయి ఇది. దీంతో వృద్ధిపై విశ్లేషకుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుండడం తెలిసిందే. కానీ, జీడీపీ 2024–25లో 7.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందంటూ ఆర్బీఐ గత అంచనాలను కొనసాగించడం గమనార్హం. ప్రతికూలతల విషయానికొస్తే.. పారిశ్రామికోత్పత్తి సూచీ డేటా (ఐఐపీ), పట్టణాల్లో డిమాండ్ మోస్తరు స్థాయికి చేరినట్టు ఎఫ్ఎంసీజీ విక్రయ గణాంకాల ఆధారంగా తెలుస్తోందని దాస్ అన్నారు. దీనికితోడు సబ్సిడీల చెల్లింపులు కూడా పెరగడం సెపె్టంబర్ త్రైమాసికం జీడీపీ (క్యూ2) గణాంకాలపై ప్రభావం చూపిస్తుందని చెప్పారు. బలంగా ఆటో అమ్మకాలు డిమాండ్ బలహీనంగా ఉండడంతో ఆటోమొబైల్ కంపెనీల ఇన్వెంటరీ స్థాయిలు పెరిగిపోవడం పట్ల చర్చ జరుగుతుండడం తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్ దాస్ ఇదే అంశంపై స్పందిస్తూ అక్టోబర్‌లో ఈ రంగం మంచి పనితీరు చూపించిందని, 30 శాతం వృద్ధి నమోదైనట్టు చెప్పారు. దీనికి అదనంగా వ్యవసాయం, సేవల రంగాలు సైతం మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు వెల్లడించారు. కనుక వృద్ధి మందగిస్తుందని ప్రకటించడానికి తాను తొందరపడబోనన్నారు. భారత్ సైక్లికల్ వృద్ధి మందగమనంలోకి అడుగుపెట్టినట్టు జపాన్ బ్రోకరేజీ సంస్థ నోమురా ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. ఆర్థిక వ్యవస్థకు పెద్దపులి లాంటి బలం ఉందంటూ, దీనికి ఆర్బీఐ చలాకీతనాన్ని అందిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. అధిక ద్రవ్యోల్బణం.. రేట్ల కోత అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం సెపె్టంబర్లో వచ్చిన 5.5 శాతం కంటే అధికంగా ఉంటుందని శక్తికాంతదాస్ సంకేతం ఇచ్చారు. ఈ నెల 12న గణాంకాలు వెల్లడి కానున్నాయి. రెండు నెలల పాటు అధిక స్థాయిలోనే కొనసాగొచ్చన్న ఆర్బీఐ అంచనాలను గుర్తు చేశారు. మానిటరీ పాలసీ విషయంలో ఆర్బీఐ తన విధానాన్ని మార్చుకోవడం (కఠినం నుంచి తటస్థానికి) తదుపరి సమావేశంలో రేట్ల కోతకు సంకేతంగా చూడొద్దని కోరారు. తదుపరి కార్యాచరణ విషయంలో ప్యానెల్‌పై ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. దిద్దుబాటు కోసమే చర్యలు.. నాలుగు ఎన్బీఎఫ్సీలపై నియంత్రణ, పర్యవేక్షణ చర్యల గురించి ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. దేశంలో 9,400 ఎన్బీఎఫ్సీలు ఉండగా, కేవలం కొన్నింటిపైనే చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఆయా సంస్థలతో నెలల తరబడి సంప్రదింపుల అనంతరమే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దీన్ని పర్యవేక్షించడం చాలా కష్టమని అంగీకరించారు. -
74 శాతం తగ్గిన ఆదాయ అసమానతలు
న్యూఢిల్లీ: పదేళ్ల వ్యవధిలో దేశీయంగా ఆదాయ అసమానత గణనీయంగా దిగి వచ్చింది. రూ. 5 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారికి సంబంధించి 2013–14, 2022–23 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో అసమానతలు ఏకంగా 74.2 శాతం మేర తగ్గాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లోని ఎకనమిక్ డిపార్ట్మెంట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2014–2024 అసెస్మెంట్ ఇయర్స్ గణాంకాలను అధ్యయనం చేసిన మీదట ఎస్బీఐ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం ఆదాయాన్ని మెరుగుపర్చుకుంటూ పై స్థాయికి చేరుకుంటున్న అల్పాదాయ వర్గాల వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2014 ఆర్థిక సంవత్సరంలో రూ. 3.5 లక్షల వరకు ఆదాయాలున్న వారిలో 31.8 శాతంగా ఉన్న అసమానత 2021 ఆర్థిక సంవత్సరం నాటికి 12.8 శాతానికి తగ్గింది. రూ. 5.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వర్గాల సంపాదన గత దశాబ్దకాలంలో (కోవిడ్ ప్రభావిత 2020 అసెస్మెంట్ ఇయర్ తప్ప) ప్రతి సంవత్సరం సానుకూల రేటుతో వృద్ధి చెందింది. -
ఏపీలో 98% మందికి బ్యాంకు ఖాతాలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో 18 ఏళ్లు నిండిన వారిలో 98 శాతం మందికి బ్యాంకు ఖాతాలున్నాయి. జాతీయ సగటును మించి ఏపీలో బ్యాంకు అకౌంట్లు ఉండటం విశేషం. జాతీయంగా సగటున 94.6 శాతం మందికే బ్యాంకు ఖాతాలున్నాయి. సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వే–2022–23 వివరాలను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల్లో 18 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళల్లో ఎంత మందికి వ్యక్తిగతంగా లేదా సంయుక్తంగా బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థల్లో ఖాతాలున్నాయో సర్వే వెల్లడించింది. అత్యధికంగా బ్యాంకు ఖాతాలున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండగా.. మొదటి స్థానంలో కర్ణాటక, ఆ తర్వాత హిమాచల్‌ప్రదేశ్ ఉన్నాయి. అత్యల్పంగా బ్యాంకు ఖాతాలు మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, గుజరాత్లో ఉన్నట్టు సర్వే పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో పురుషులతో సమానంగా మహిళలకు బ్యాంకు ఖాతాలున్నాయి. పట్టణ ప్రాంతాల్లోనూ కొద్దిపాటి తేడాతో ఇదే పరిస్థితి. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణాల్లో కలిపి పురుషులకు 98.1 శాతం బ్యాంకు ఖాతాలుండగా, మహిళలకు 97.9 శాతం ఉన్నాయి. ఇదే జాతీయ సగటున గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి పురుషులకు 96.2 శాతం ఉండగా, మహిళలకు 92.8 శాతం బ్యాంకు ఖాతాలున్నాయి. -
దేశ సగటును మించి రాష్ట్రంలో వేతన జీవులు
దేశ సగటు కన్నా మన రాష్ట్రంలోనే వేతన పురుషులు, మహిళల శాతం ఎక్కువగా ఉంది. ఈ విషయం కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘లేబర్ ఫోర్స్ సర్వే–2023–24’లో వెల్లడైంది. దేశంలో సగటు వేతన పురుషులు 24.9 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 25.4 శాతం ఉన్నారు. దేశంలో సగటు వేతన మహిళలు 15.9 శాతం కాగా, రాష్ట్రంలో 17.3 శాతం ఉన్నారు. ఢిల్లీలో అత్యధికంగా వేతన మహిళలు 70.2 శాతం ఉండగా, పురుషులు 53.0 శాతమే ఉండటం విశేషం. గోవాలో వేతన మహిళలు 61.3 శాతం ఉండగా, పురుషులు 51.7 శాతం ఉన్నారు. కేరళలో వేతన మహిళలు 41.2 శాతం ఉండగా, పురుషులు 31.3 శాతమే ఉన్నారు. దేశంలో అత్యల్పంగా బిహార్‌లో వేతన మహిళలు 4.8 శాతమే ఉన్నారు. ఛత్తీగఢ్‌లో 9.7 శాతం, జార్ఖండ్‌లో 7.3 శాతం, మధ్యప్రదేశ్‌లో 6.6 శాతం, ఒడిశాలో 8.8 శాతం, రాజస్థాన్‌లో 8.5 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 6.6 శాతమే వేతన మహిళలు ఉన్నట్లు సర్వే వెల్లడించింది. – సాక్షి, అమరావతి ఆధారం: లేబర్ ఫోర్స్ సర్వే–2023–24 -
ప్రాతిపదిక ఏడాది మార్పు..?
స్థూల దేశీయోత్పత్తిని కచ్చితంగా లెక్కించేందుకు ప్రాతిపదికగా ఉన్న 2011-12 ఏడాదిని 2022-23కు మార్చాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై అడ్వైజరీ కమిటీ ఆన్ నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్(ఏసీఎన్ఏఎస్)కు స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ(మోస్పి) త్వరలో సూచనలు జారీ చేసే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.దేశ ఆర్థిక వ్యవస్థను కచ్చితంగా లెక్కించేందుకు ప్రస్తుతం 2011-12 ఏడాదిని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. భారత్ వేగంగా వృద్ధి చెందుతోంది. 12-13 ఏళ్ల కిందటి ఏడాదిని ప్రామాణికంగా తీసుకుని వృద్ధిరేటును లెక్కించడం సరికాదని కొందరు భావిస్తున్నారు. దాంతోపాటు కొత్తగణనలో కొన్ని వస్తువులను తొలగించాలని సూచిస్తున్నారు. కొత్త బేస్ ఇయర్ ఆధారంగా లెక్కించే గణాంకాలు ఫిబ్రవరి 2026లో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: అన్నదానం కాదు.. ఐఫోన్ కోసం పరుగులుప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ జారీ చేసే సూచనల ఆధారంగా 2022-23 బేస్ ఇయర్లో యూనికార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ వార్షిక సర్వే, గృహ వినియోగ వ్యయ సర్వే(హెచ్సీఈఎస్) వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు. కొత్త గణనలో లాంతర్లు, వీసీఆర్‌లు, రికార్డర్లు వంటి వస్తువులను తొలగిస్తారు. స్మార్ట్ వాచ్‌లు, ఫోన్లు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు వంటి ఉత్పత్తులను తీసుకురానున్నారు. జీడీపీ లెక్కింపులో జీఎస్టీ కౌన్సిల్ డేటాను పరిగణనలోకి తీసుకోనున్నారు. అనధికారిక రంగాలకు సంబంధించిన కచ్చితమైన వివరాలు తెలియజేసేలా అత్యాధునిక క్యాలిక్యులేషన్స్ వాడబోతున్నట్లు తెలిపారు. జీఎస్టీఎన్ నమూనా ఫ్రేమ్ వర్క్ ఆధారంగా యాన్యువల్ సర్వే ఆఫ్ సర్వీస్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (ఏఎస్ఎస్ఎస్ఈ) నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి సర్వే జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
స్వరాష్ట్రంలో ‘సమృద్ధి’
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే వయసులో చిన్నదైన తెలంగాణ రాష్ట్రం నానాటికీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, దేశాభివృద్ధిలో రాష్ట్ర వాటా ఏటేటా పెరుగుతోందని కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే ఆర్థిక సలహా మండలి ఇటీవల ప్రధానమంత్రికి ఇచ్చిన రాష్ట్రాల ఆర్థికాభివృద్ధి నివేదిక మేరకు జాతీయోత్పత్తి (జీడీపీ)లో రాష్ట్ర వాటా 4.9 శాతంగా తేలింది. తెలంగాణ ఏర్పాటయ్యాక జీడీపీలో రాష్ట్రం వాటా 3.8 శాతం కాగా, పదేళ్లలోనే ఇది గణనీయంగా పెరిగింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో రాష్ట్ర వాటా 4.7 శాతానికి చేరగా, తాజా అంచనాల మేరకు 2023–24లో 4.9 శాతానికి చేరింది. 2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోయేనాటికి ఆంధ్రప్రదేశ్ వాటా 8.4 శాతంగా ఉండేదని అంచనా. ఇప్పుడు అది 9.7 శాతానికి పెరిగింది. అయితే అందులో 1.1 శాతం తెలంగాణ వాటానే పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి బాటలోనే పయనిస్తున్నా.. జీడీపీలో ఆ రాష్ట్ర వాటా పెరుగుదల స్వల్పంగానే ఉంది. రాష్ట్రం విడిపోయే నాటికి 4.6 శాతం ఉండగా, 2020–21 నాటికి 4.9 శాతానికి చేరింది. అయితే 2023–24 నాటికి 4.7 శాతానికి తగ్గింది. మొత్తంమీద రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి బాటలోనే ఉన్నాయని, రెండు రాష్ట్రాల జీడీపీ వాటా ఏటేటా పెరుగుతోందని ఆర్థిక సలహా మండలి నివేదికలోని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలే టాప్ ఇతర అన్ని రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఆర్థికాభివృద్ధి ఎక్కువగా కనిపిస్తోంది. 1991 సంవత్సరానికి ముందు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులు జీడీపీలో తమ భాగస్వామ్యాన్ని చెప్పుకోదగిన స్థాయిలో నమోదు చేయలేదని, ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో ఇప్పుడు సింహభాగం వాటా దక్షిణాది రాష్ట్రాలదేనని ఆర్థిక సలహా మండలి నివేదిక చెపుతోంది. ప్రస్తుత జీడీపీలో దాదాపు 30 శాతం ఈ రాష్ట్రాలదేనని వెల్లడించింది. తలసరి ఆదాయం కూడా జాతీయ సగటుతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో జాతీయ సగటుతో పోలిస్తే 193.6 శాతం అధికమని, కర్ణాటక 181, తమిళనాడు 171, కేరళ 152.5 శాతం జాతీయ సగటు కంటే ఎక్కువగా తలసరి ఆదాయం కలిగి ఉన్నాయని ఆ నివేదికలో వెల్లడయింది. -
నిజమాడితే నేరమా!
‘వాస్తవాలు మొండిఘటాలు. అవి ఓ పట్టాన లొంగవు. గణాంకాలు అలా కాదు... అవి ఎటువంచితే అటు వంగుతాయి’ అంటాడు విఖ్యాత రచయిత మార్క్ ట్వైన్. పాలకులు గణాంకాలను ఇష్టానుసారం మార్చితే... నిజాలకు మసిపూస్తే ప్రమాదం. అయితే ఏ దేశంలోనైనా జరిగేది అదే అంటారు నిరాశా వాదులు. ఆ మాటెలా వున్నా కేంద్ర ప్రభుత్వం ప్రణబ్ సేన్ ఆధ్వర్యంలోని గణాంకాల స్థాయీ సంఘాన్ని ఇటీవల రద్దు చేసిన తీరు వాంఛనీయం కాదు. ఎన్ని విమర్శలున్నా, లోపాలున్నా గణాంకాలు పాలనా నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తాయి. ప్రభుత్వాలు ప్రకటించే ఏ పథకానికైనా, రూపొందించే ఏ విధానానికైనా గణాంకాలే ప్రాతిపదిక. వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించే సర్వేల ప్రక్రియ ఎలావుండాలో, పరిశోధనకు వేటిని పరిణనలోకి తీసుకోవాలో, దాని నమూనా ఏ విధంగా ఉండాలో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖకు సిఫార్సులు చేయటం గణాంకాల కమిటీ ప్రాథమిక విధి. దీంతోపాటు వివిధ మంత్రిత్వ శాఖలు గణాంకాల మంత్రిత్వ శాఖకు సమర్పించే సర్వే నివేదికల తీరుతెన్నులెలా వున్నాయో నిశితంగా పరిశీలించి, సందేహాలు నివృత్తి చేసుకుని ఆ ఫలితాలను ప్రకటించటం కూడా కమిటీ పనే. దేశంలోనే తొలిసారి 2019లో కేంద్రం 14 మందితో ఈ కమిటీని నియమించినప్పుడు అందరూసంతోషించారు. నిరుడు ఆ కమిటీ పరిధిని విస్తరించారు కూడా. కానీ దాన్ని కాస్తా మొన్నీమధ్య రద్దు చేశారు. జాతీయ నమూనా సర్వేలకు సంబంధించి ఇటీవల స్టీరింగ్ కమిటీ ఏర్పాటైనందున గణాంకాల కమిటీని రద్దు చేస్తున్నామని కమిటీ సభ్యులకు చెప్పారు. అసలు అప్పటికే ఆ పనిలో ఓ కమిటీ నిమగ్నమై ఉండగా కొత్త కమిటీ ఎందుకు ఏర్పాటైనట్టు? దాన్ని చూపించి పాతది రద్దు చేస్తున్నామని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి? వీటికి జవాబిచ్చేవారు లేరు. ప్రభుత్వాలు తీసుకునే ప్రతి నిర్ణయానికీ, వేసే ప్రతి అడుగుకూ గణాంకాలు ప్రాణం. ఏటా బడ్జెట్ ముందు ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేనే తీసుకుంటే... దేశంలో ఆహారానికి జనం ఖర్చు చేస్తున్నదెంతో, అది పట్టణాల్లో ఎలావుందో గ్రామీణ ప్రాంతాల్లో ఎలా వుందో తెలుస్తుంది. నిరుద్యోగిత ఏ విధంగా వున్నదో, వ్యవసాయ రంగంపై ఆధారపడి పనిచేస్తున్నవారి సంఖ్య ఎంతో వెల్లడవుతుంది. జనం విద్యకు ఖర్చు చేస్తున్నదెంత... ఆరోగ్యానికి ఖర్చవుతున్నదెంత అనే వివరాలు కూడా తెలు స్తాయి. ఇక పేదరిక నిర్మూలన పథకాలు క్షేత్రస్థాయిలో ఏ మేరకు ప్రభావం చూపాయో, వాటిని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఎటువంటి చర్యలు అవసరమో నిర్ణయించుకోవటా నికి గణాంకాలు తోడ్పడతాయి. అయితే ఈ గణాంకాల విశ్వసనీయత తేలాలంటే ఒక గీటురాయి అవసరం. జనాభా గణాంకాలే ఆ గీటురాయి. విషాదమేమంటే మూడేళ్ల క్రితం ప్రారంభం కావా ల్సిన జన గణన ఇంతవరకూ మన దేశంలో మొదలుకాలేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ పదేళ్లకోసారి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఈ గణన కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో సాగలేదు. వాస్తవానికి జనగణన నోటిఫికేషన్ పద్ధతిగా 2019 మార్చిలో విడుదలైంది. దాని ప్రకారం 2020 ఏప్రిల్–సెప్టెంబర్లమధ్య తొలి దశలో ఇళ్లు, కట్టడాలు, కుటుంబాలు వగైరాలకు సంబంధించిన సర్వే పూర్తి కావాలి. 2021 ఫిబ్రవరిలో జనాభా గణన ఉండాలి. కానీ 2020 మార్చితో మొదలై ఆ ఏడాది నవంబర్ వరకూ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో జనాభా గణన సాధ్యపడలేదు. ఆ తర్వాతైనా వెనువెంటనే ప్రారంభించాలని కేంద్రం అనుకోలేదు. అమెరికా, చైనాలతో సహా ప్రపంచంలో ఎన్నో దేశాలు కరోనా తీవ్రత తగ్గగానే చకచకా రంగంలోకి దిగి జనాభా గణనను జయప్రదంగా పూర్తిచేశాయి. కేవలం ఘర్షణ వాతావరణం నెలకొన్న లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో మాత్రమే జన గణన జరగలేదు. మన దగ్గర ఎందుకు కాలేదో సంజా యిషీ ఇవ్వడానికి కూడా కేంద్రం సిద్ధపడలేదు.భిన్న మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా ఉండే సంస్థలూ, ఇతరత్రా స్వచ్ఛంద సంస్థలూ క్రమం తప్పకుండా సర్వేలు చేస్తున్నాయి. కానీ వాటిని దేంతో సరిపోల్చుకోవాలి? ఏ ప్రాతిపదికన వాటిని విశ్వసించాలి? తాజా జన గణన లేదు కాబట్టి 2011 నాటి జనాభా లెక్కలే వీటన్నిటికీ గీటురాయిగా వినియోగిస్తున్నారు. కానీ ఇందువల్ల వాస్తవ చిత్రం ఆవిష్కరణ కాదు. ఉదాహరణకు 2011 జనగణన ప్రాతిపదికగా మన జనాభా 120 కోట్లని తేలింది. తాజాగా అది 140 కోట్లకు చేరుకుందని చెబుతున్నారు. కానీ పాత లెక్కన పేదరికాన్నీ, ఇతర స్థితిగతులనూ గణిస్తున్నందువల్ల 12 కోట్లమంది నిరుపేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) సదుపాయం వర్తించటం లేదని అంటున్నారు. తమ రాష్ట్ర జనాభా పెరిగినందువల్ల అదనపు కోటా కావాలని ఏ ప్రభుత్వమైనా ఏ ప్రాతి పదికన అడగాలి? అందుకు కేంద్రం ఎలా అంగీకరించాలి? అప్పుడప్పుడు వెలువడే ప్రపంచసంస్థల సర్వేలు పేదరికాన్నీ, నిరుద్యోగితనూ, ఇతరత్రా అంశాలనూ చూపుతూ మన దేశం వెనక బడి వుందని చెబుతుంటే కేంద్రం నిష్టూరమాడుతోంది. అక్కడివరకూ ఎందుకు... మన సర్వేల రూపకల్పన, అవి వెల్లడించే ఫలితాలు దేశంలో పేదరికం పెరిగినట్టు, అభివృద్ధి జరగనట్టు అభి ప్రాయం కలగజేస్తున్నాయని ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యురాలు శామికా రవి ఆ మధ్య విమ ర్శించారు. ఈ విషయంలో ఆమెతో ప్రణబ్ సేన్‌కు వాగ్వాదం కూడా జరిగింది. బహుశా గణాంకాల కమిటీ రద్దు వెనకున్న అసలు కారణం అదేనా? ఇద్దరి వైఖరుల్లోనూ వ్యత్యాసానికి మూలం జన గణన జరపక పోవటంలో ఉంది. ఆ పనిచేయకుండా గణాంకాల కమిటీనే రద్దు పర్చటం ఉన్నదు న్నట్టు చూపుతున్నదని అలిగి అద్దాన్ని బద్దలుకొట్టడమే అవుతుంది. -
ఏటా జరిగే వివాహాలు 2.5 లక్షలు..
సాక్షి, హైదరాబాద్: వివాహ రిజిస్ట్రేషన్లు ఓ మోస్తరుగానే జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఏటా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.5 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయనే అంచనా ఉండగా, రిజిస్ట్రేషన్లు మాత్రం లక్షలోపే ఉంటున్నాయని లెక్కలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే వివాహాల రిజిస్ట్రేషన్ల సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. 2019–20 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఏటా సుమారు 90 వేలకు పైగా మాత్రమే వివాహ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఐదేళ్ల కాలంలో కూడా ఈ సంఖ్యలో మార్పు లేకపోవడం విశేషం. అయితే..2023–24లో మాత్రం ఈ రిజిస్ట్రేషన్లు స్వల్పంగా పెరిగాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తాజా నివేదికలో వెల్లడైంది. ఈ ఏడాదిలో అత్యధికంగా 1.09 లక్షల వివాహ రిజిస్ట్రేషన్లు జరిగాయని తేలింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే గ్రేటర్ పరిధిలోనే 40 శాతం వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 2023–24 సంవత్సర గణాంకాలను పరిశీలిస్తే మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా 15,733 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రంగారెడ్డిలో 13,502, హైదరాబాద్ జిల్లాలో 10,925 మంది తమ వివాహాలను రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాత కరీంనగర్లో 14,027, వరంగల్ జిల్లాలో 11,565 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ఐదు జిల్లాల్లోనే సగం రిజిస్ట్రేషన్లు జరగ్గా, మిగిలిన ఏడు రిజి్రస్టేషన్ జిల్లాల్లో కలిపి మరో సగం జరగడం గమనార్హం. ఏ డాక్యుమెంట్లు కావాలంటే...! వివాహ రిజిస్ట్రేషన్ల విషయంలో అలసత్వం వద్దని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు పెద్దగా సమయం పట్టదని, స్లాట్ బుక్ అయిన రోజునే పూర్తవుతుందంటున్నారు. అయితే డాక్యుమెంట్లు పూర్తిస్థాయిలో సమర్పించాల్సి ఉంటుందని చెబుతున్నారు. పెళ్లి పత్రిక, 2 పెళ్లి ఫొటోలు, వధూవరుల ఆధార్‌కార్డులు, వయసు ధ్రువీకరణ పత్రం, ముగ్గురు సాక్షులు, వారి ఆధార్ కార్డులు తప్పకుండా ఉండాలి. వివాహానికి చట్టబద్ధత కల్పించడంతోపాటు విదేశాలకు వెళ్లాలనుకునే దంపతులకు ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో ఇటీవలి కాలంలో వివాహాల రిజిస్ట్రేషన్లు పెరిగాయని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆధార్ కార్డులో చిరునామా మార్పు కావాలన్నా, కొత్త రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఈ సర్టిఫికెట్ అవసరం. అయితే, కల్యాణలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు కూడా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అవసరమవుతోంది. కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధి కోసం ఏడాదికి 2 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తుండగా, అందులో ఎక్కువగా స్థానిక సంస్థలు (గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు) ఇచ్చే వివాహ ధ్రువపత్రాలే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే, స్థానిక సంస్థల్లో ధ్రువపత్రాలు ఒకసారి, వివాహాల రిజిస్ట్రేషన్లు మరోసారి కాకుండా నేరుగా సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాల్లో వివాహ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఇతర అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. గతం కంటే అవగాహన పెరిగింది కానీ..అది సరిపోదని, ప్రజల్లో ఇంకా చైతన్యం రావాల్సి ఉంది. జరిగే ప్రతి వివాహం రిజి్రస్టేషన్ అయితేనే అన్ని విధాలుగా మంచిదని సూచిస్తున్నాయి. -
2019–24 మధ్య రాష్ట్రంలోకి రూ.7,371 కోట్ల విదేశీ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారితో రెండేళ్లు ప్రపంచం స్థంభించిపోయినప్పటికీ గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం గణనీయమైన సంఖ్యలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐల)ను సాధించింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి మధ్య కాలంలో రాష్ట్రంలోకి రూ.7,371.68 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) విడుదల చేసిన తాజా గణాంకాలు స్పష్టంచేశాయి. ఈ ఐదేళ్లలో వివిధ దేశాలకు చెందిన పలు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని విస్తరణ ప్రాజెక్టులు చేపట్టాయి. జపాన్‌కు చెందిన యకహోమా, టోరో, దైకిన్, యూరోప్‌కు చెందిన పెట్రోగ్యాస్, కొరియాకు చెందిన ఎల్జీ వంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టాయి. హిల్‌టాప్ సెజ్ (అడిదాస్), మాండలీజ్ చాక్లెట్స్ వంటి సంస్థలు భారీగా విస్తరణ ప్రాజెక్టులు చేపట్టాయి. వీటితోపాటు జర్మనీకి చెందిన పెప్పర్ మోషన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ పలమనేరు వద్ద రూ.4,640 కోట్లతో యూనిట్ పెట్టడానికి ముందుకొచి్చంది. వాస్తవ రూపందాల్చిన పెట్టుబడులు, కొత్త పెట్టుబడుల ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకుంటే గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలోకి రూ.35,000 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చినట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు.ముందంజలో విశాఖ, నెల్లూరు జిల్లాలువిదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో విశాఖ, నెల్లూరు జిల్లాలు ముందంజలో ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లో రాష్ట్రంలోకి రూ.64.49 కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు డీపీఐఐటీ పేర్కొంది. ఇందులో విశాఖ జిల్లాకు రూ.39.91 కోట్లు రాగా, నెల్లూరు జిల్లాకు 19.29 కోట్లు వచ్చాయని, మిగిలిన మొత్తం అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలకు వచ్చినట్లు ఆ నివేదిక పేర్కొంది. 2023 – 24 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద చూస్తే రాష్ట్రంలోకి రూ.764.68 కోట్ల విలువైన విదేశీ పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జపాన్, వియత్నాం, అబుదాబీ, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని అధికారులు తెలిపారు. -
మన జీవ వైవిధ్యం భేష్
సాక్షి, హైదరాబాద్: పెరిగిన జంతుజాలం, వృక్షజాలంతో రాష్ట్రంలో జీవ వైవిధ్యత అలరారుతోంది. అటవీ ప్రాంతాల్లో వివిధ రకాల జంతువుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 12 రక్షిత అటవీ ప్రాంతాలు (7 శాంక్చురీలు, 2 టైగర్ రిజర్వ్‌లు, 3 జాతీయ పార్కులు) ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 26,903 చ.కి.మీ పరిధిలో అటవీ ప్రాంతం విస్తరించి ఉండగా, 5,693 చ.కి.మీ.లో (21.16 శాతం) రక్షిత ప్రాంతాలున్నాయి. ప్రతీ రెండేళ్లకోసారి ఆయా రక్షిత ప్రాంతాలు, శాంక్చురీలు, టైగర్ రిజర్వ్‌లు, నేషనల్ పార్కుల్లో జంతు, వృక్ష జాతులపై అధ్యయనం నిర్వహిస్తున్నారు.అటవీ ప్రాంతాల పరిధిలో చిరుతలు, అడవి దున్నలు, అడవి కుక్కలు, నక్కలు, జింకలు, దుప్పులు తదితర రకాల వన్యప్రాణులు సందడి చేస్తున్నాయి. కెమెరాట్రాపుల్లో వీటి కదలికలు తాజాగా రికార్డ్ కావడం, వీటి సంఖ్య పెరిగిన ఆనవాళ్లు కనిపించడం పట్ల అటవీశాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నిరకాల అనుకూల పరిస్థితులు, మెరుగైన సౌకర్యాలతో క వ్వాల్ టైగర్ రిజర్వ్ వన్యప్రాణుల వైవిధ్య కేంద్రంగా నిలుస్తోంది. పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి పులుల సంచారం పెరిగినా, ఇక్కడ అనుకూల పరిస్థితులున్నా అవి ఇంకా స్థిరనివాసం ఏర్పరచుకోకపోవడం మాత్రం సవాల్‌గానే మారింది. మహారాష్ట్ర తడోబా నుంచి నేరుగా పులులు వచ్చేందుకు జాతీయ రహదారితోపాటు రైల్వేకారిడార్ ఉండడం, కొన్నిచోట్ల ఆక్రమణలతో కొంత అంతరాయం ఏర్పడుతోందని చెబుతున్నారు. టైగర్ కన్జర్వేషన్ సొసైటీ పరిశీలనలో... ఇటీవల హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ఆధ్వర్యంలో కవ్వాల్‌లోని ప్రధాన (కోర్), పొరు గు ప్రాంతాల నుంచి జంతువులు రాకపోకలు సాగించే (బఫర్) ఏరియాల్లో జంతువుల సంఖ్య పై అధ్యయనం నిర్వహించారు. కవ్వాల్‌లో పులుల అభయారణ్యం ఏ మేరకు సరిపోయేటట్టు ఉంది, ఏయే రకాల మాంసాహార, శాఖాహార జంతువులు ఉన్నాయనే దానిపై దృష్టి కేంద్రీకరించారు. బఫర్ ఏరియాలోని కాగజ్‌నగర్, చెన్నూరు, ఆదిలాబాద్ డివిజన్లలో అనేక పులి పాదముద్రలను గుర్తించారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీ నుంచి ప్రాణహిత, పెన్‌గంగ నదు లను దాటి తడోబా అంథారి టైగర్ రిజర్వ్ నుంచి పులుల సంచారం ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించా రు. కవ్వాల్ ప్రధాన అటవీ ప్రాంతంలో చిరుత లు, అడవికుక్కలు, ఎలుగుబంట్లు ఇతర జంతువు లు కనిపించాయి. తాళ్లపేట, ఇంథన్ పల్లిలో కృష్ణజింకలను అధికసంఖ్యలో గుర్తించారు. అడవి దున్న, అడవి పంది, నీల్గాయ్, సాంబారు, మచ్చలజింక, చౌసింగ వంటి శాఖాహార జంతువులను కూడా గుర్తించారు. నీల్గాయ్లు, అడవి పందుల జనాభా అటవీ ప్రాంతమంతా విస్తరించి ఉండగా, సాంబార్ జింకలు కొండ ప్రాంతాల్లో ఉన్న ట్టు గుర్తించారు. అయితే, ఈ అధ్యయనానికి సంబంధించి ఇంకా తుది నివేదిక రూపొందించలేదు. ఇది తయారయ్యాకే ఆయా రకాల జంతువుల సంఖ్యపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది. 2,254 చ.కి.మీ. సర్వే చేశాం అధ్యయనంలో భాగంగా ఆదిలాబాద్, కాగజ్‌నగర్, నిర్మల్, జన్నారం, చెన్నూ రు, మంచిర్యాలను కవర్ చేశాం. మొత్తం 2,254.35 చ.కి.మీ మేర కవర్ అయ్యింది. ఆదిలాబాద్, కాగజ్‌నగర్–చెన్నూరు సరిహద్దు లో పులుల ఉనికి గుర్తించాం. ఆదిలాబాద్, కాగజ్‌నగర్, జన్నారంలలో ఎలుగుబంట్లు, చిరుతలు, థోల్ తదితర జంతువులు కనిపించాయి. జన్నారంలో అడవి గొర్రెలు, సాంబార్ జింకలు, చెన్నూ రు, కాగజ్‌నగర్, ఆదిలాబాద్‌లో నీల్గాయ్లు పెద్దసంఖ్యలో కనిపించాయి. వర్షాకాలం తర్వాత ఆసిఫాబాద్‌లో మళ్లీ సర్వే చేయాలని భావిస్తున్నాం. –ఇమ్రాన్ సిద్ది్దఖీ, డైరెక్టర్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ -
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ స్క్రీనింగ్ టైమ్
స్మార్ట్‌ఫోన్‌తో గడిపే (స్క్రీనింగ్) సమయం క్రమంగా పెరుగుతోంది. ప్రపంచంలో వ్యక్తుల రోజు వారీ ఫోన్ సగటు వీక్షణ సమయం 3.50 గంటల నుంచి 4.37 గంటలకు పెరిగింది. భారత్‌లో 4.30 గంటలుగా నమోదైంది. అంటే ఒక వ్యక్తి ఏడాది పొడవునా దాదాపు 70 రోజులు ఫోన్లలోనే ఉంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ యూజర్లు రోజుకు 58 సార్లు ఫోన్లను ప్రతిసారీ తనిఖీ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ఫిలిప్పీన్స్ వాసులు అత్యధికంగా సమయం ఫోన్లతో గడుపుతుంటే.. జపాన్ పౌరులు మాత్రం గ్లోబల్ సగటు కంటే తక్కువగా ఫోన్లపై గడుపుతున్నారు. 12–27 ఏళ్లలోపు వయస్కులే స్మార్ట్ఫోన్లలో మునిగిపోతున్నట్టు అంతర్జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఒకప్పుడు వారాంతాల్లో ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుని ఎక్కువ సేపు ఫోన్ చూసేవారు. తాజా పరిణామాలతో సాధారణ రోజుల్లోనే స్మార్ట్ఫోన్ల స్క్రీనింగ్ సమయం పెరిగిపోయింది. ఇక్కడ ప్రతి నిముషానికి ఒకసారి ఫోన్ చూసుకోవడం అలవాటుగా మారిపోయింది. ఫిలిప్పీన్స్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్, ఘనా దేశాల్లో రోజు వారీ స్క్రీనింగ్ సమయం 5 గంటలు దాటిపోతోంది. నాలుగు దక్షిణ అమెరికా, 4 సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలు టాప్–10 అత్యధిక స్క్రీనింగ్ జాబితాలో నిలిచాయి. అగ్రరాజ్యంగా పిలిచే అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లో గడుపుతున్నారని.. వీరిలో దాదాపు 40 శాతం మంది అధిక స్క్రీనింగ్ అలవాటును తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ సమయం ఫోన్లో గడుపుతున్నట్టు తెలుస్తోంది. వారి రోజువారీ సగటు స్క్రీనింగ్ సమయం 2.47 గంటలుగా ఉంటే.. పురుషులకు 2.34 గంటలుగా గుర్తించారు. ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్ వినియోగంలో ఎక్కువ సమయం ఇంటర్నెట్కు కేటాయిస్తున్నారు. -
ఐదోవంతు సమయం స్మార్ట్‌ఫోన్‌కే సరి
సాక్షి, అమరావతి : స్మార్ట్‌ఫోన్‌తో గడిపే (స్క్రీనింగ్) సమయం క్రమంగా పెరుగుతోంది. ప్రపంచంలో వ్యక్తుల రోజు వారీ ఫోన్ సగటు వీక్షణ సమయం 3.50 గంటల నుంచి 4.37 గంటలకు పెరిగింది. భారత్‌లో 4.30 గంటలుగా నమోదైంది. అంటే ఒక వ్యక్తి ఏడాది పొడవునా దాదాపు 70 రోజులు ఫోన్లలోనే ఉంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ యూజర్లు రోజుకు 58 సార్లు ఫోన్లను ప్రతిసారీ తనిఖీ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ఫిలిప్పీన్స్ వాసులు అత్యధికంగా సమయం ఫోన్లతో గడుపుతుంటే.. జపాన్ పౌరులు మాత్రం గ్లోబల్ సగటు కంటే తక్కువగా ఫోన్లపై గడుపుతున్నారు. 12–27 ఏళ్లలోపు వయస్కులే స్మార్ట్ఫోన్లలో మునిగిపోతున్నట్టు అంతర్జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఒకప్పుడు వారాంతాల్లో ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుని ఎక్కువ సేపు ఫోన్ చూసేవారు. తాజా పరిణామాలతో సాధారణ రోజుల్లోనే స్మార్ట్ఫోన్ల స్క్రీనింగ్ సమయం పెరిగిపోయింది. ఇక్కడ ప్రతి నిముషానికి ఒకసారి ఫోన్ చూసుకోవడం అలవాటుగా మారిపోయింది. ఫిలిప్పీన్స్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్, ఘనా దేశాల్లో రోజు వారీ స్క్రీనింగ్ సమయం 5 గంటలు దాటిపోతోంది. నాలుగు దక్షిణ అమెరికా, 4 సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలు టాప్–10 అత్యధిక స్క్రీనింగ్ జాబితాలో నిలిచాయి. అగ్రరాజ్యంగా పిలిచే అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లో గడుపుతున్నారని.. వీరిలో దాదాపు 40 శాతం మంది అధిక స్క్రీనింగ్ అలవాటును తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ సమయం ఫోన్లో గడుపుతున్నట్టు తెలుస్తోంది. వారి రోజువారీ సగటు స్క్రీనింగ్ సమయం 2.47 గంటలుగా ఉంటే.. పురుషులకు 2.34 గంటలుగా గుర్తించారు. ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్ వినియోగంలో ఎక్కువ సమయం ఇంటర్నెట్కు కేటాయిస్తున్నారు. -
‘బంధం’ తెగిపోతోంది!
సాక్షి, హైదరాబాద్: పెళ్లంటే నూరేళ్ల పంట అని, దంపతులు జీవితాంతం కలిసి ఉండటమే లక్ష్యమనేది ఎన్నాళ్లుగానో ఉన్న అభిప్రాయం. కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోతోంది. ఎన్నో జంటలు పెళ్లయిన ఏడాది, రెండేళ్లకే విడాకులు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు సెలబ్రిటీలు, సంపన్నవర్గాల్లోనే కొంతవరకు కనిపించిన ఈ ట్రెండ్.. ఇప్పుడు అన్నివర్గాల్లోనూ సాధారణమైపోయింది. గత రెండు దశాబ్దాల కాలంలో దేశంలో విడాకుల శాతం గణనీయంగా పెరిగిపోయిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. విడాకులు అనగానే అదేదో మంచి పద్ధతి కాదని చాలా మందిలో తొలుత అభిప్రాయం వ్యక్తమవుతున్నా.. వ్యక్తిగత స్వేచ్ఛ, సాధికారికంగా జీవించడమనే భావన దానిని అధిగమిస్తోంది. పరస్పర అంగీకారానికి దూరమై.. వైవాహికపరమైన వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించే ప్రయత్నాలు జరగకపోవడం.. ఇతర మార్గాలను అన్వేíÙంచకుండానే కోర్టు మెట్లు ఎక్కడం.. ఆధునిక సమాజంలో మారుతున్న కాలంతో వివాహ వ్యవస్థ, కుటుంబ విలువలు ఒత్తిళ్లకు గురవడం.. సామాజిక–సంప్రదాయ విలువలు, భావాల మధ్య సంఘర్షణ వంటివి విడాకులు పెరగడానికి కారణమని నిపుణులు చెప్తున్నారు. గణాంకాలను బట్టి 2022 చివరినాటికి విడాకుల శాతంలో.. మహారాష్ట్ర టాప్‌లో ఉండగా, తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. కోర్టులో ఏళ్లకేళ్లు సాగుతున్న కేసుల నేపథ్యంలో.. అనధికారికంగానే విడిగా ఉంటున్న జంటలూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారని నిపుణులు చెప్తున్నారు. విడాకులు పెరగడానికి ప్రధాన కారణాలివీ» దంపతుల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం.. కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు » వివాహ బంధంలో భావోద్వేగం కొరవడటం » ఒకరి పట్ల మరొకరికి విశ్వాసం, నమ్మకం సన్నగిల్లడం.. జీవనం సాగిస్తున్న తీరుపై అసంతృప్తి, అభద్రతా భావం, కుంగుబాటు » భిన్నమైన కుటుంబ నేపథ్యం, విలువలు కలిగి ఉండటం.. వ్యక్తిగత స్వేచ్ఛ, స్వతంత్రంగా ఉండాలని కోరుకోవడం » ఇద్దరు పనిచేసే వేళల్లో అంతరాలు ఉండటం » మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు విడాకుల లెక్కలివీ.. » 2022 చివరి నాటికి దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల విడాకుల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. » ఇండోర్ ఫ్యామిలీ కోర్టులో 8,400 కేసులు పెండింగ్‌లో ఉండగా.. అందులో 5,500 విడాకుల కోసం వచి్చనవే. ఇందులోనూ మూడు వేల కేసులు పెళ్లయిన ఏడాదిలో పెట్టిన కేసులే. » దేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న కేరళలో గత పదేళ్లలో విడాకులు 350 శాతం పెరిగాయి. » పంజాబ్, హరియాణా, ఢిల్లీల్లోనూ విడాకులు బాగా పెరిగాయి. » ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో విడాకుల కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.ఆర్థిక స్వేచ్ఛ, బాధ్యతల భారంతో.. కొన్నేళ్లుగా దేశంలో ఉద్యోగవకాశాలు పెరిగాయి. మహిళలకూ ఆర్థిక స్వాతంత్య్రం పెరిగింది. అటు ఆఫీసులో, ఇటు ఇంట్లో బాధ్యతలు, గిల్లికజ్జాలు, చికాకులు, ఇబ్బందులు, సమస్యలతో వివాహ బంధాన్ని కొనసాగించడం కంటే.. విడిపోవడమే మేలనే భావనకు వస్తున్నారు. పాత, సంప్రదాయ పద్ధతుల్లో ఆలుమగల సంబంధాలు ఉండాలని పెద్దవాళ్లు కోరుకుంటుండటం, కొన్నిసార్లు ప్రతీ చిన్న విషయంలో కలుగజేసుకోవడంతో ఘర్షణలు పెరుగుతున్నాయి. తాము అబ్బాయిల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదనే భావన అమ్మాయిల్లో బలపడడం.. దానిని అంగీకరించేందుకు అబ్బాయిలు సిద్ధంగా లేకపోవడం విడిపోవడానికి దారితీస్తున్నాయి. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ విడిపోవడానికే మొండి పట్టు ఈ మధ్యకాలంలో వారానికి ఏడెనిమిది కేసులైనా విడాకుల కోసం మా దగ్గరకు వస్తున్నాయి. వారిలో కొందరు కౌన్సెలింగ్‌తో వెనక్కి తగ్గుతుంటే.. చాలా మంది మొండిగా విడిపోవడానికే పట్టుపడుతున్నారు. విడాకులకు కారణాల్లో తల్లితండ్రుల పాత్ర కూడా ఎక్కువగా ఉంటోంది. చదువుకున్నారు, సంపాదిస్తున్నారు మీకేం తక్కువ అంటూ వారు రెచ్చగొడుతుండటంతో పరిస్థితులు తెగే దాకా వస్తున్నాయి. కుటుంబ విలువలు, సంబంధాలు తగ్గిపోవడం, పరస్పర అవగాహన, ఆకర్షణ లేకపోవడం, అనుమానాలు పెరగడం వంటివి విడాకులకు దారితీస్తున్నాయి. పరస్పరం తప్పులను ఎత్తిచూపకుండా ఉండటం, పాత విషయాలను పదేపదే ప్రస్తావనకు తేకపోవడం, గొడవల్లోకి తల్లితండ్రులు, తోబుట్టువులను తీసుకురాకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకుంటే.. దంపతుల మధ్య సర్దుబాటుకు అవకాశాలుంటాయి. – అనిత, ఫ్యామిలీ కౌన్సెలర్, భాస్కర మెడికల్ కాలేజీ క్లినికల్ సైకాలజిస్ట్ -
ఎకానమీకి వాణిజ్యలోటు పోటు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు మేలో 9 శాతం (2023 ఇదే నెలతో పోల్చి) పెరిగాయి. విలువలో 38.13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులుసైతం సమీక్షా నెల్లో 7.7 శాతం పెరిగి 61.91 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు భారీగా 7 నెలల గరిష్ట స్థాయిలో 23.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇంత భారీ వాణిజ్యలోటు ఎకానమీకి ఒక్కింత ఆందోళన కలిగించే అంశం. తాజా గణాంకాలను పరిశీలిస్తే.. → అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి పరిస్థితి నెలకొన్నప్పటికీ, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, జౌళి, ప్లాస్టిక్స్ వంటి రంగాలు మంచి పనితీరును ప్రదర్శించాయి. → మొత్తం దిగుమతుల్లో చమురు విభాగంలో 28 % పెరుగుదలను నమోదుచేసుకుని విలువలో 20 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. → పసిడి దిగుమతులు మాత్రం స్వల్పంగా తగ్గి 3.69 బిలియన్ డాలర్ల నుంచి 3.33 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్– మే నెలల్లో వృద్ధి 5.1 శాతం ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలు–ఏప్రిల్, మేలలో ఎగుమతులు 5.1 శాతం పెరిగి 73.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 8.89 శాతం పెరిగి 116 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి వాణిజ్యలోటు 42.88 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఈ నెలల్లో ఒక్క చమురు దిగుమతుల విలువ 24.4 శాతం పెరిగి 36.4 బిలియన్ డాలర్లకు చేరింది. సేవలూ బాగున్నాయ్... సేవల రంగం ఎగుమతులు మేలో 30.16 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తొలి అంచనా. 2023 మేలో ఈ విలువ 26.99 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ ఇదే కాలంలో 15.88 బిలియన్ డాలర్ల నుంచి 17.28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. రత్నాలు, ఆభరణాల ఎగుమతులు డౌన్ మరోవైపు రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి ఒక ప్రకటన చేస్తూ, మేనెల్లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 5 శాతం తగ్గి రూ.20,713.37 కోట్లుగా నమోదయినట్లు పేర్కొంది. 2023 ఇదే నెల్లో ఈ విలువ రూ.21,795.65 కోట్లు (2,647 మిలియన్ డాలర్లు). -
జవాన్ మూవీ అరుదైన రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్!
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బాద్షా కాంబోలో వచ్చిన చిత్రం జవాన్. 2023లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు.అయితే తాజాగా అట్లీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వెతికిన సినిమాల జాబితాలో జవాన్ చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని అట్లీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. వరల్డ్ వైడ్‌గా గూగుల్‌లో అత్యధిక మంది వెతికిన చిత్రాల్లో జవాన్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి, రెండు స్థానాల్లో హాలీవుడ్ చిత్రాలు బార్బీ, ఓపెన్ హైమర్ నిలిచాయి. అంతే కాకుండా బాలీవుడ్ చిత్రాలైన గదర్-2, పఠాన్ వరుసగా 8,10 స్థానాలు దక్కించుకున్నాయి. కాగా.. ఈ వివరాలను వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. ❤️❤️❤️ https://t.co/NUiGjSORLJ— atlee (@Atlee_dir) June 6, 2024 -
డిగ్రీకి డిగ్నిటీ...పీజీకి ఫుల్ పవర్
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో ఈ విద్యా సంవత్సరం నుంచి సరికొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. మార్కెట్ డిమాండ్‌ను బట్టి ఆయా కోర్సులను డిజైన్ చేస్తున్నారు. ఇంజనీరింగ్‌కు సమాంతరంగా డిగ్రీ, పీజీ కోర్సులను తీర్చిదిద్దాలని యూజీసీ అన్ని రాష్ట్రాలకూ సూచించింది. ఈ దిశగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇప్పటికే పలు కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టింది. సంప్రదాయ కోర్సుల స్థానంలో ఆనర్స్ కోర్సులు తీసుకొస్తున్నారు.తాజాగా బీఎస్సీలో బయో మెడికల్ కోర్సును, బీకాంలో ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ కోర్సులను పరిచయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బీఏ ఆనర్స్లోనూ ఎనలైటికల్ కంప్యూటర్స్ కోర్సులను తీసుకొచ్చే యోచనలో ఉన్నారు. విస్తరిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించేందుకు బయో మెడికల్ కోర్సు ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. డిగ్రీ తర్వాత చేసే పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనూ స్కిల్ ప్రాధాన్యత పెంచాలని భావిస్తున్నారు. ఎమ్మెస్సీ డేటా సైన్స్‌లో మార్పులు.. » పీజీ కోర్సులకు జవసత్వాలు అందించే యోచనలోనూ కసరత్తు జరుగుతోంది. ఎంఎస్సీ డేటా సైన్స్, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ వంటి కోర్సుల్లో మార్పులు చేశారు. పుస్తకాల ద్వారా సంపాదించే పరిజ్ఞానం తగ్గించి, పరిశ్రమల్లో నేరుగా విజ్ఞానం పొందే విధానాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నారు. పరిశ్రమల భాగస్వామ్యంతో పీజీ కోర్సులు నిర్వహించాలని యూజీసీ సూచిస్తోంది. పీజీ తర్వాత పరిశోధన రంగానికి ఆయా విద్యార్థులు వెళ్లేలా నూతన విధానంపై కసరత్తు చేయాలని సూచించింది. దీనిపై ఈ విద్యా సంవత్సరంలోగా సరికొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని యూజీసీ భావిస్తోంది. ఉపాధే లక్ష్యంగా... » కొన్నేళ్లుగా విద్యార్థుల ఆలోచనా విధానంలో మార్పు కనిపిస్తోంది. గ్రాడ్యుయేషన్ తర్వాత తక్షణ ఉపాధి కోరుకుంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ఇంటర్ పాసవుతుంటే, వీరిలో 90 వేల మంది ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారు. మరో 20 వేల మంది ఇతర రాష్ట్రల్లోని డీమ్డ్ వర్సిటీల్లోకి వెళ్తున్నారు. 40 వేల మంది వరకూ ఇంటర్‌తో విద్య ముగించి ఏదో ఒక వృత్తి, ఉద్యోగంలో స్థిరపడుతున్నారు. ఇక బీఏ, బీకాం, బీఎస్సీ సహా ఇతర డిగ్రీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య ఏటా 2.20 లక్షల వరకూ ఉంటుంది. ఇందులోనూ కంప్యూటర్ నేపథ్యం ఉన్న బీకాం, హానర్స్ బీఏ వంటి కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నారు. డిగ్రీ తర్వాత ఉన్న పరిజ్ఞానంతో ఏదో ఒక ఉద్యోగంలోకి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. బీఎస్సీ చేసిన విద్యార్థులు కూడా ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాల వైపు చూస్తున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్ చేసినా పెద్దగా ఉద్యోగాలు ఉండవని, లెక్చరర్‌గా వెళ్లేందుకు మాత్రమే ఇది తోడ్పడుతుందనే భావన యువతలో ఉంది. దీంతో డిగ్రీ చేసినా పీజీకి వెళ్లడం లేదని ఇటీవల యూజీసీ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. వాస్తవానికి ఇప్పుడున్న సంప్రదాయ కోర్సులైన బీఏ కోర్సుల్లో చేరే వాళ్లే తక్కువగా ఉంటుంటే, ఎంఏ వరకూ వెళ్లాలనుకునే వారి సంఖ్య ఇంకా తక్కువ. గ్రూప్స్, సివిల్స్ రాయాలనుకునే విద్యార్థులు ఇటువైపు వెళ్తున్నారు. ఈ మూడు ప్రధాన కోర్సులకు కలిపి రాష్ట్రంలో 50 వేల కనీ్వనర్ కోటా సీట్లు ఉంటే, గడచిన విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులు 20,484 మంది మాత్రమే. అందుకే ఇలాంటి కోర్సులను కొత్త పద్ధతుల్లో నిర్వహించడం వల్ల విద్యార్థులు ఆకర్షితులవుతారనేది ఉన్నత విద్యా మండలి ఆలోచన. బీకాంలో కంప్యూటర్ అనుసంధానం చేయడం, ఇన్సూరెన్స్, మార్కెటింగ్ రంగంలో ఉపాధి పోటీని నిలబెట్టుకునే కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. వీటిని ఆయా రంగాల్లో పరిశ్రమల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందేలా మార్పులు తెస్తున్నారు. -
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌కు ఇజ్రాయెల్ కౌంటర్
గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దళాలు జరిపిన మారణకాండకు ప్రతికారంగా ఆ దేశం.. గాజాపై దాడులు చేస్తోంది. కాల్పుల విరమణ చేసి.. పాలస్తీనా ప్రజలకు మానవతా సాయం అందిచాలని ఆమెరికాతో పాటు పలు దేశాలు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. కొన్ని దేశాలు ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తున్నాయి. అయితే తాజాగా ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్ కలిగిన ప్రజలను ఈ జాబితాలోని దేశాలు.. తమ దేశంలోకి అనుమతించవని వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేసింది. ఆ జాబితాలో అల్జేరియా, బంగ్లాదేశ్, బ్రూనై, ఇరాన్, ఇరాక్, కువైట్, లెబనాన్, లిబియా, పాకిస్తాన్ దేశాలు ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ చట్టాల ప్రకారం.. లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్, ఇరాన్ దేశాలు శత్రు దేశాలు జాబితాలో ఉన్నాయి. ఈ అయితే ఈ దేశాలకు ఇజ్రాయెల్ పౌరులు.. వెళ్లాలంటే ఇజ్రాయెల్ మంత్రిత్వ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందే. అయితే మధ్యప్రాచ్య దేశాల్లో ఇజ్రాయెల్‌కు వీసా ఫ్రీ దేశంగా కేవలం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఉండటం గమనార్హం. We’re good pic.twitter.com/GmiwEzZGck — Israel ישראל 🇮🇱 (@Israel) March 14, 2024 అయితే దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ పౌరులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశంలో ఓ రాష్ట్ర అధికారిక ట్విటర్ హ్యాండిల్ కౌంటర్ ఇచ్చింది. ‘మేం బాగున్నాం’ అని ‘ఎక్స్’లో రీట్వీట్ చేసింది. ఇక..2024 నాటికి ప్ఇజ్రాయెల్ దేశం రపంచంలో 171 దేశాల్లో వీసా రహిత లేదా వీసా ఆన్ అరైవల్ యాక్సెస్‌ను కలిగి ఉంది. అదేవిధంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఇజ్రాయెల్ పాస్‌పోర్టు 20వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్ కలిగిన పౌరులు చాలా యురోపీయన్ దేశాలుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా వెళ్తారు. అదేవిధంగా లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు కూడా ఇజ్రాయెల్ ప్రజలు తమ పాస్‌పోర్టు ద్వారా సందర్శిస్తారు. ఇదీ చదవండి: స్వలింగ వివాహం చేసుకున్న విదేశాంగ మంత్రి! -
ఈపీఎఫ్‌వోలో 13.95 లక్షల మంది చేరిక
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) 2023 నవంబర్ నెలలో 13.95 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. ఇందులో 7.36 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్‌వో కింద నమోదు చేసుకున్నారు. కొత్త సభ్యుల్లో 1.94 లక్షల మంది మహిళలు కావడం గమనించొచ్చు. నవంబర్‌లో మొత్తం మహిళా సభ్యుల చేరిక 2.80 లక్షలుగా (20 శాతం) ఉంది. సంఘటిత రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు ఇది తెలియజేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి నికర సభ్యుల చేరిక, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఎక్కువగా ఉన్నట్టు కేంద్ర కారి్మక శాఖ విడుదల చేసిన పేరోల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నూతన సభ్యుల్లో 18–25 ఏళ్ల నుంచి చేరిన వారు 57.30 శాతం ఉన్నారు. 10.67 లక్షల మంది ఒక సంస్థలో మానేసి, మరో సంస్థకు తమ ఖాతాలను బదిలీ చేసుకున్నారు. నవంబర్‌లో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి 58.81 శాతం చేరారు. ఇందులో మహారాష్ట్ర వాటాయే 21.60 శాతంగా ఉంది. -
జైళ్లు సరిపోవట్లే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని జైళ్లలో ఉండాల్సిన సంఖ్య కంటే ఎక్కువమంది కిక్కిరిసి ఉంటున్నారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 1,330 జైళ్లలో 4,36,266 మంది ఖైదీలను ఉంచేందుకు వీలుండగా.. గతేడాది డిసెంబర్ 31 నాటికి ఏకంగా 5,73,220 మంది ఖైదీలు ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, పంజాబ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని జైళ్లలో సామర్థ్యం కంటే తక్కువగా ఖైదీలు ఉన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని జైళ్లలో సామర్థ్యం కంటే స్వల్పంగా ఎక్కువ సంఖ్యలో ఖైదీలు ఉన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా లిఖితపూర్వకంగా ఇచ్చి న సమాధానంలో ఈ వివరాలనువెల్లడించారు. యూపీలో అత్యధికంగా.. ♦ దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్(యూపీ)లోని 77 జైళ్లలో 67,600 మంది ఖైదీల సామర్థ్యం ఉండగా.. ఏకంగా 1,21,609 మంది ఖైదీలు మగ్గుతున్నారు. బీహార్‌లోని 59 జైళ్లలో 47,750 మంది సామర్థ్యానికిగాను 64,914 మంది ఖైదీలు ఉన్నారు. ♦ మధ్యప్రదేశ్‌లోని 132 జైళ్లలో 48,857 మంది ఖైదీలు.. మహారాష్ట్రలోని 64 జైళ్లలో 41,070 మంది ఖైదీలు.. పంజాబ్‌లోని 26 జైళ్లలో 30,801 మంది ఖైదీలు.. జార్ఖండ్‌లోని 32 జైళ్లలో 19,615 ఖైదీలు.. ఢిల్లీలోని 16 జైళ్లలో 18,497 మంది ఖైదీలు ఉన్నారు. ♦ తెలంగాణలోని 37 జైళ్లలో 7,997 మంది సామర్థ్యానికిగాను 6,497 మంది ఖైదీలు ఉన్నారు. ఇందులో 2,102 మంది దోషులు, 4,221 మంది విచారణ ఖైదీలు, 174 మంది నిర్బంధిత ఖైదీలు ఉన్నారు. ♦ ఆంధ్రప్రదేశ్‌లోని 106 జైళ్లలో 8,659 ఖైదీల సామర్థ్యానికిగాను 7,254 మంది ఖైదీలు ఉన్నారు. ఇందులో 1,988 మంది దోషులు, 5,123 మంది విచారణ ఖైదీలు, 134 మంది నిర్బంధిత ఖైదీలు, 9 మంది ఇతరులు ఉన్నారు. -
జీడీపీ గణాంకాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా దేశ ఆర్థిక పురోగతి గణాంకాలపై ఆధారపడి కదిలే వీలుంది. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికానికి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వివరాలు గురువారం(30న) వెల్లడికానున్నాయి. అక్టోబర్ నెలకు మౌలిక సదుపాయాల గణాంకాలు సైతం ఇదే రోజు విడుదలకానున్నాయి. గురునానక్ జయంతి సందర్భంగా సోమవారం మార్కెట్లకు సెలవుకావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. గురువారం నవంబర్ డెరివేటివ్స్ సిరీస్ గడువు ముగియనుంది. శుక్రవారం(డిసెంబర్ 1న) తయారీ రంగ పనితీరు వెల్లడించే నవంబర్ పీఎంఐ ఇండెక్స్ వివరాలు తెలియనున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కోవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. స్థూల ఆర్థిక గణాంకాలతోపాటు, విదేశీ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులకు అనుగుణంగా ట్రెండ్ ఏర్పడే అవకాశమున్నట్లు పేర్కొంటున్నారు. ఇతర అంశాలూ కీలకమే.. ఆరు ప్రధాన కరెన్సీలతో డాలరు మారకంతోపాటు.. దేశీయంగా రూపాయి కదలికలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. గత వారం డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 83.38వరకూ నీరసించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ముడిచమురు ధరలు, యూఎస్ బాండ్ల ఈల్డ్స్‌కు సైతం ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మీనా తెలియజేశారు. నవంబర్ నెలకు వాహన విక్రయ గణాంకాలు వెల్లడికానున్న నేపథ్యంలో వారాంతాన ఆటో రంగ దిగ్గజాలు వెలుగులో నిలిచే వీలున్నట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అర్వీందర్ సింగ్ నందా తెలియజేశారు. వీటికితోడు యూఎస్ జీడీపీ, యూఎస్ పీఎంఐ, చమురు నిల్వలు, యూరోజోన్ సీపీఐ తదితర గణాంకాలు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేíÙంచారు. వడ్డీ రేట్ల ప్రభావం గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా బలపడ్డాయి. హెచ్చుతగ్గుల మధ్య నికరంగా సెన్సెక్స్ 175 పాయింట్లు, నిఫ్టీ 63 పాయింట్లు చొప్పున పుంజుకున్నాయి. అయితే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు లేదా పెట్టుబడులు ఈ వారం కొంతమేర ప్రభావం చూపనున్నట్లు మీనా పేర్కొన్నారు. యూఎస్‌లో అంచనాలకంటే అధికంగా ద్రవ్యోల్బణం తగ్గడంతో మార్కెట్లలో విశ్వాసం నెలకొననున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఇది కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు యోచనను అడ్డుకోవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో పదేళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ రెండు వారాల క్రితం నమోదైన 5 శాతం నుంచి 4.4 శాతానికి దిగివచ్చాయి. వెరసి దేశీ ఈక్విటీలలో ఎఫ్‌పీఐల అమ్మకాలు నెమ్మదించవచ్చని తెలియజేశారు. -
ప్రభుత్వోద్యోగ గణాంకాలతో వెబ్సైట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు భర్తీ చేసిన ఉద్యోగ వివరాలతో కూడిన ప్రత్యేక వెబ్సైట్ www.telanganajobstats.in ను మంత్రి కె. తారక రామారావు మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వోద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్ష పార్టీలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించిన కేటీఆర్... దీనిపై వాస్తవ సమాచారాన్ని వెల్లడించేందుకే ఈ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉద్యోగాల భర్తీ వివరాలను అందులో పొందుపరిచినట్లు వివరించారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువతీ యువకులు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి నిజాలు తెలుసుకోవాలని కోరారు. గత తొమ్మిదిన్నరేళ్లలో 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించామని, వాటిలో 1.60 లక్షలకుపైగా ప్రభుత్వోద్యోగాల భర్తీని పూర్తి చేశామని కేటీఆర్ తెలిపారు. జనాభాతో పోల్చి చూసినప్పుడు దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. -
AP: విమానయానం ఫుల్ జోష్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విమానయానరంగం జోరుమీద కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల ద్వారా 27,49,835 మంది ప్రయాణించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఆరు నెలల కాలంతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో విమాన ప్రయాణికుల సంఖ్యలో 17.22శాతం వృద్ధి నమోదైంది. 2022-23 సంవత్సరంలో రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల నుంచి 23,45,795 మంది ప్రయాణించగా, ఆ సంఖ్య ఈ ఏడాది 27,49,835కు చేరింది. రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జోరుగా కొనసాగుతున్నాయన్న విషయాన్ని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విశాఖలో అత్యధిక వృద్ధి... పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నం విమానాశ్రయం అన్నిటికంటే అత్యధికంగా 30.5శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. గత ఏడాది విశాఖ నుంచి 11.50 లక్షల మంది ప్రయాణించగా, ఆ సంఖ్య ఈ ఏడాది ఏకంగా 15.03 లక్షలకు పెరిగింది. పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి విశాఖకు విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, గత కొన్ని నెలలుగా నమోదవుతున్న గణాంకాలే దీనికి నిదర్శనమని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. విశాఖ తర్వాత గడిచిన ఆరు నెలల్లో విజయవాడ నుంచి 5.41 లక్షల మంది, తిరుపతి నుంచి 4.30 లక్షల మంది, రాజమండ్రి నుంచి 2.11 లక్షల మంది ప్రయాణించారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి 41,056 మంది, కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి 21,326 మంది ప్రయాణించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల విమానాలు రద్దు కావడంతో తిరుపతి, కర్నూలు విమానాశ్రయాల నుంచి ప్రయాణించేవారి సంఖ్యలో స్వల్ప తగ్గుదల నమోదైందని, రానున్నకాలంలో ఈ రెండు చోట్ల నుంచి కూడా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ‘భోగాపురం’తో డబుల్ ప్రస్తుతం నడుస్తున్న విశాఖపట్నం విమానాశ్రయం ఎయిర్‌ఫోర్స్ వారిది కావడంతో రాత్రిపూట అనేక ఆంక్షలు ఉన్నాయని, భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఆంక్షలు తొలగిపోతాయని, ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో భోగాపురం విమానాశ్రయం నిర్మిస్తున్నారు. ఈ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ విమానాశ్రయం 2025 నాటికి అందుబాటులోకి రానుంది. చదవండి: వావ్..విశాఖ! -
‘అమెరికా’ ఏం చదువుతోంది?
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) అమెరికాలో విద్యనభ్యసించడం వివిధ దేశాలకు చెందిన ఎన్నో లక్షల మంది విద్యార్థుల స్వప్నం. ఎన్నో కష్టాలు పడి, వివిధ పరీక్షలు రాసి అమెరికాకు పరుగులు తీస్తుంటారు. అక్కడే గ్రాడ్యుయేషన్లు, పోస్ట్గ్రాడ్యుయేషన్లు చేసి.. ఉద్యోగాలు కూడా సంపాదించి స్థిరపడిపోతుంటారు. కానీ అసలు అమెరికా విద్యార్థులు ఏం చేస్తున్నారు? ఏఏ కోర్సులు ఎక్కువగా చదువుతున్నారు? ఏఏ రంగాలపై ఆసక్తి చూపిస్తున్నారు? అనే ప్రశ్నలు మనలో తలెత్తుతుంటాయి. ఈ అంశాలపై అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ (ఎన్సీఈఎస్) అధ్యయనం చేసి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పలు ముఖ్యమైన కోర్సులపై అధ్యయనం చేసింది. 2010–11 విద్యా సంవత్సరంలో వివిధ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్యతో.. సరిగ్గా దశాబ్దం తర్వాత అంటే 2020–21లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్యతో పోల్చి గణాంకాలు రూపొందించింది. కంప్యూటర్ సైన్స్‌కే పట్టం అమెరికాలో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుకే విద్యార్థుల నుంచి విశేష ఆదరణ దక్కింది. దశాబ్దకాలం తర్వాత కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లు 144 శాతం పెరిగారు. 2010–11లో 43,066 మంది కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, 2020–21లో ఈ రంగం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్య 1,04,874కు పెరిగింది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా అందుబాటులో ఉండటం, భవిష్యత్‌ను శాసించే శక్తి ఉందని యువత భావించడం వల్లే దీనిపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైద్య రంగంలోనూ భారీ వృద్ధి: వైద్య, ఆరోగ్య రంగంలోని విస్తృత అవకాశాలు కూడా అమెరికా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. 2010–11తో పోలి్చతే.. 2020–21 విద్యా సంవత్సరంలో 87 శాతం వృద్ధితో 2.6 లక్షల మంది విద్యార్థులు ఈ రంగంలో పట్టాలు అందుకున్నారు. అమెరికాలోని మొత్తం గ్రాడ్యుయేట్లలో వైద్య, ఆరోగ్య రంగంలో పట్టభద్రులైన విద్యార్థుల సంఖ్య దాదాపు 13 శాతం. అలాగే బయోమెడికల్ సైన్స్‌లోనూ 46 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్ సంక్షోభం తర్వాత ఈ విభాగంలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వన్నె తగ్గని ఇంజనీరింగ్ కోర్సులు కంప్యూటర్ సైన్స్‌ను మినహాయించి మిగతా బ్రాంచ్‌లను ఇంజనీరింగ్ కింద పరిగణించారు. దశాబ్దకాలంలో 65 శాతం వృద్ధితో 1.26 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు 2020–21లో కాలేజీల నుంచి పట్టాలతో బయటకు వచ్చారు. ఏటా లక్ష డాలర్లకు తగ్గని వేతనాలు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవ ఉండదనే భరోసా.. ఈ రంగం వైపు విద్యార్థులు ఆకర్షితులవ్వడానికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారుతున్న వారిలో ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారి శాతమే ఎక్కువ. దాదాపు 4 లక్షల మంది.. అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్కు ఆదరణ ఏటా పెరుగుతూనే ఉంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న వారిలో అత్యధికులు ఈ రంగం వారే. 2020–21లో దాదాపు 4 లక్షల మంది ఈ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పడిపోతున్న ‘ఆర్ట్స్’ అమెరికాలో పలు ఆర్ట్స్ గ్రూప్‌లకు ఆదరణ తగ్గుతోంది. సామాజిక శా్రస్తాలు, భాషలు, చరిత్ర లాంటి 17 సబ్జెక్టుల్లో గత దశాబ్దకాలంలో విద్యార్థుల చేరికలు తగ్గినట్లు తేలింది. ఇంగ్లిష్, చరిత్ర తదితర సబ్జెక్టుల్లో దశాబ్దకాలంలో 35 శాతం విద్యార్థుల సంఖ్య పడిపోయింది. పాకశాస్త్రంలో తగ్గుదల 50 శాతానికిపైగా ఉంది. ఉపాధి అవకాశాలున్నా.. తగ్గిన చేరికలు అమెరికాలో ఎడ్యుకేషన్ రంగంలో గ్రాడ్యుయేషన్ చేసే వారి సంఖ్య తగ్గుతోంది. టీచర్ల వేతనాలు పెద్దగా పెరగకపోవడం ఈ రంగంలోకి విద్యార్థులు రాకపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. టీచర్ల కొరత ఉన్నందున ఉద్యోగవకాశాలు సులభంగా దక్కే అవకాశం ఉన్నా.. ఇతర రంగాల వైపే విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. దశాబ్దకాలంలో 16 శాతం మేర చేరికలు తగ్గాయి. అలాగే మారుతున్న ప్రపంచంలో పరిశ్రమలు స్పెషలైజేషన్‌ను కోరుకుంటుండటంతో విద్యార్థులు కూడా లిబరల్ ఆర్ట్స్‌వైపు ఆసక్తి చూపించం లేదు. దీంతో విద్యార్థుల సంఖ్య దశాబ్దకాలంలో 10 శాతం తగ్గింది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఇంగ్లిష్దీ ఇదే పరిస్థితి. -
క్యూ1 జీడీపీ గణాంకాలు పూర్తి పారదర్శకం
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి గణాంకాల మదింపు తగిన విధంగా జరగలేదని వస్తున్న విమర్శల్లో ఎటువంటి వాస్తవం లేదని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్ స్పష్టం చేశారు. ఏప్రిల్–జూన్‌లో భారత్ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదయినట్లు గత నెల చివర్లో అధికారిక గణాంకాలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ‘‘ఇండియాస్ ఫేక్ గ్రోత్ స్టోరీ’’ పేరుతో ప్రాజెక్ట్ సిండికేట్ పోస్ట్ చేసిన ఒక కథనంలో ఆర్థికవేత్త, ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అశోక మోడీ తీవ్ర విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత అధికారులు ప్రతికూల స్థూల ఆర్థిక వాస్తవాలను తక్కువ చేసి చూపుతున్నారు. తద్వారా వారు జీ20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ముందు పొగడ్తలతో కూడిన హెడ్లైన్ గణాంకాలను విడుదల చేసి ఉండవచ్చు. కానీ, అత్యధిక మంది భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్లను కప్పిపుచ్చుతూ వారు ప్రమాదకరమైన గేమ్ ఆడుతున్నారు. వాస్తవ జీడీపీ గణాంకాలు చాలా తక్కువ స్థాయిలోనే ఉంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో అసమతౌల్యత పెరుగుతోందని. ఉపాధి కల్పనలో లోటు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ విమర్శలను నాగేశ్వరన్ త్రోసిపుచ్చారు. ఇండియన్ కార్పొరేట్, ఫైనాన్షియల్ రంగాలు గత దశాబ్ద కాలంగా ఎదుర్కొంటున్న బ్యాలెన్స్ షీట్ ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోయాయని అన్నారు. బ్యాంకుల్లో రెండంకెల రుణ వృద్ధి నమోదవుతోందని, కంపెనీల పెట్టుబడులు ప్రారంభమయ్యాయని ఒక ఆర్టికల్‌లో పేర్కొన్నారు. -
ప్రఖ్యాత గణాంకశాస్త్ర నిపుణుడు కల్యంపూడి రాధాకృష్ణారావు కన్నుమూత
వాషింగ్టన్: ప్రఖ్యాత భారత్–అమెరికన్ గణిత శాస్త్రవేత్త, గణాంకశాస్త్ర(స్టాటిస్టిక్స్) నిపుణుడు కల్యంపూడి రాధాకృష్ణారావు(102) అమెరికాలో కన్నుమూశారు. రాధాకృష్ణారావు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. స్టాటిస్టిక్స్ రంగంలో సీఆర్ రావు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కాగా సీఆర్ రావుకు ఇటీవలె ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం వరించిన విషయం తెలిసిందే. గణాంక శాస్త్ర రంగంలో నోబెల్ బహుమతితో సమానమైన ‘ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్’ను 2023 సంవత్సరానికి గాను రాధాకృష్ణారావు ఈ ఏడాది మే1 ఆయనకు ఈ అవార్డును అందుకున్నారు. 1945లో కలకత్తా మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన సీఆర్ రావు పరిశోధన పత్రానికిగాను ఈ అవార్డు దక్కింది. ఇదే గాక భారత స్టాటిస్టిక్స్ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రొఫెసర్ రావును భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. With a heavy heart, we share the news of the passing of Prof. C R Rao, a true luminary in the field of statistics. #crrao #statistics #statistician #profcrrao #rao #datascience #R #python #omshanti pic.twitter.com/phwDdg6HZA — Statistics for You (@statistics4you) August 23, 2023 ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ.. కల్యంపూడి రాధాకృష్ణారావు 1920 సెప్టెంబరు 10న కర్ణాటకలోని హడగళిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలో విద్యాభ్యాసం సాగింది. ఆంధ్ర విశ్వావిద్యాలయం నుంచి గణితశాస్త్రంలో ఎంఎస్సీ చేశారు. 1943లో కలకత్తా యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్‌లో ఎంఏ డిగ్రీ అందుకున్నారు. ఇంగ్లండ్‌లో కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన కింగ్స్ కాలేజీలో 1948లో పీహెచ్డీ చేశారు. 1965లో కేంబ్రిడ్జి వర్సిటీ నుంచి డీఎస్సీ డిగ్రీ స్వీకరించారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, తర్వాత కేంబ్రిడ్జిలోని ఆంత్రోపాలాజికల్ మ్యూజియంలో సేవలందించారు. పలు భారత, విదేశీ వర్సిటీల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రపంచ ప్రఖ్యాత గణాంక, గణిత శాస్త్రవేత్త డాక్టర్ కల్యంపూడి రాధాకృష్ణ రావు గారు పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. నిండు నూరేళ్లు జీవించిన ఈ అపర సరస్వతీ పుత్రుడు గణిత, గణాంక శాస్త్ర రంగాలలో చేసిన కృషి నిరూపమానం. 75 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల పిన్న వయసులో కోల్‌కతా మ్యాథమెటికల్… pic.twitter.com/Kbyca0cWyU — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) August 23, 2023 -
గణాంకాలు, ఫలితాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను పలు అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఐటీ దిగ్గజాలతోపాటు, ప్రయివేట్ రంగ బ్యాంకులు ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలు విడుదల చేయనున్నాయి. సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. మరోవైపు ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాలు సైతం వెలువడనున్నాయి. వీటికి జతగా చైనా, యూఎస్ ద్రవ్యోల్బణ వివరాలు వెల్లడికానున్నాయి. ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లలో భారీ పెట్టుబడులు కుమ్మరిస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సైతం మార్కెట్లకు జోష్ నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం.. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ.. సై టాటా గ్రూప్ బ్లూచిప్ కంపెనీ టీసీఎస్ తొలిగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను ఈ నెల 12న ప్రకటించనుంది. ఈ బాటలో ఇదే రోజు ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సైతం క్యూ1 పనితీరు వెల్లడించనుండగా.. మరో ఐటీ దిగ్గజం విప్రో 13న ఫలితాలు విడుదల చేయనుంది. అయితే అనిశ్చితులు ఎదుర్కొంటున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఐటీ రంగానికి అంత ఆశావహంగా లేనట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నా యి. దీంతో ఐటీ దిగ్గజాల ఫలితాలు ఆకర్షణీయ స్థా యిలో వెలువడకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ప్రయివేట్ రంగ సంస్థలు ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ సైతం ఈ వారంలో క్యూ1 పనితీరును వెల్లడించనున్నాయి. కాగా.. ఈ వారం నుంచీ స్టాక్ ఆధారిత యాక్టివిటీ ఊపందుకోనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ లిమిటెడ్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. ఇందుకు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో తెరతీయనున్నట్లు తెలియజేశారు. టోకు ధరల ఎఫెక్ట్ జూన్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ)తోపాటు, మే నెలకు తయారీ రంగం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు బుధవారం(12న) విడుదలకానున్నాయి. ఇక టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు శుక్రవారం(14న) వెలువడనున్నాయి. మరోపక్క చైనా ద్రవ్యోల్బణ రేటు 10న వెల్లడికానుండగా.. 12న కీలక ద్రవ్యోల్బణ గణాంకాలను యూఎస్ ప్రకటించనుంది. వారాంతాన యూఎస్ పేరోల్స్, నిరుద్యోగ వివరాలు వెల్లడైన సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం దేశ, విదేశీ ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును ప్రభావితం చేసే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. వీటికితోడు ఎఫ్‌పీఐల పెట్టుబడుల తీరు సైతం మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించగలదని మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ లిమిటెడ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అరవిందర్ సింగ్ నందా అభిప్రాయపడ్డారు. గత వారం కొత్త రికార్డ్ ఎఫ్‌పీఐ పెట్టుబడుల అండతో గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 65,899 వద్ద, నిఫ్టీ 19,524 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. నికరంగా సెన్సెక్స్ 562 పాయింట్లు జమ చేసుకుని 65,280 వద్ద నిలవగా.. 143 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 19,332 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి 300 లక్షల కోట్లను అధిగమించి చరిత్ర సృష్టించింది. అయితే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మళ్లీ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు ఇవ్వడంతో వారాంతాన ప్రపంచ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. ఎఫ్‌పీఐల దన్ను గత వారం దేశీ స్టాక్ మార్కెట్లకు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీ పెట్టుబడులతో జోష్‌నిచ్చారు. ఈ నెల తొలి వారంలో దేశీ ఈక్విటీలలో దాదాపు రూ. 22,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనిశి్చతులున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టత ఎఫ్‌పీఐలను ఆకర్షిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఈ నెలలో ఎఫ్‌పీఐ పెట్టుబడులు మే(రూ. 43,838 కోట్లు), జూన్(రూ. 47,148 కోట్లు)లను మించవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. మార్చి నుంచి నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్న ఎఫ్‌పీఐలు జనవరి, ఫిబ్రవరిలలో రూ. 34,626 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. రుతుపవన విస్తరణ, అంచనాలను మించనున్న కార్పొరేట్ ఫలితాలు వంటి అంశాలు ఎఫ్‌పీఐలకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. -
నిలిచిపోతున్న ‘సిప్’ ఖాతాలు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించిన సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (సిప్)లు కొన్ని నిలిచిపోతున్నాయి. మార్కెట్లు స్థిరంగా ర్యాలీ చేస్తున్నప్పటికీ మే నెలలో సిప్ ద్వారా పెట్టుబడులను నిలిపివేసిన ఖాతాల సంఖ్య 14.19 లక్షలకు చేరింది. ఏప్రిల్ చివరికి ఉన్న 13.21 లక్షల ఖాతాలతో పోలిస్తే 7.4 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ గణాంకాలను విడుదల చేసింది. మరోవైపు సిప్ రూపంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి మే నెలలో రికార్డు స్థాయిలో రూ.14,749 కోట్ల పెట్టుబడులు వచి్చనట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. కొత్త ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఈ సాధనాన్ని ఎంపిక చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మే నెలలో నూతన సిప్ ఖాతాల నమోదు 24.7 లక్షలుగా ఉంది. ఏప్రిల్ నెలలో ఇది 19.56 లక్షలుగా ఉండడం గమనార్హం. నిలిచిపోయిన సిప్ ఖాతాలతో పోలిస్తే కొత్తగా నమోదైన సిప్ ఖాతాల సంఖ్య ఎక్కువగా ఉండడం, ఈ మార్గం పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తిని తెలియజేస్తోందని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ డిప్యూటీ ఎండీ డీపీ సింగ్ పేర్కొన్నారు. సిప్‌లను సులభంగా ఆన్లైన్లో రద్దు చేసుకునే సదుపాయం ఉండడం కూడా ఒక కారణమన్నారు. సిప్ ఆస్తులు రూ.7.53 లక్షల కోట్లు మరోవైపు మే నెలలో ఇన్వెస్టర్లు సిప్ ద్వారా రికార్డు స్థాయిలో పెట్టుబడుల పెట్టడంతో మొత్తం సిప్ ఆస్తుల విలువ ఏప్రిల్ చివరికి ఉన్న రూ.7.17 లక్షల కోట్ల నుంచి మే చివరికి రూ.7.53 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద 1.43 కోట్ల సిప్ ఖాతాలు నిలిచిపోవడం లేదా గడువు తీరిపోవడం జరిగింది. 2021–22లో ఇలాంటి ఖాతాలు 1.11 కోట్లుగా ఉన్నాయి. ఇక మే చివరికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల నిర్వహణలోని ఆస్తుల విలువ 4.5 శాతం వృద్ధితో రూ.16.56 లక్షల కోట్లకు చేరింది. -
ప్రపంచంలో 230 కోట్ల మందికి వంటగ్యాస్ లేదు
ఐక్యరాజ్యసమితి: నేటి ఆధునిక యుగంలోనూ విద్యుత్ వెలుగులు చూడనివారు, వంటగ్యాస్ అందుబాటులో లేనివారు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఉన్నారు. ఈ మేరకు ఐదు అంతర్జాతీయ సంస్థలు.. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎజెన్సీ, ఐక్యరాజ్యసమితి గణాంక విభాగం, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజాగా ఒక నివేదిక విడుదల చేశాయి. ప్రపంచంలో దాదాపు 230 కోట్ల మంది వంటచెరుకుగా కట్టెలు, పిడకల వంటివి ఉపయోగిస్తున్నారని వెల్లడించాయి. 67.50 కోట్ల మందికి ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదని తెలియజేశాయి. ♦ 2030 నాటికి కరెంటు లేని వారి సంఖ్య 66 కోట్లకు, వంట గ్యాస్ లేని వారి సంఖ్య 190 కోట్లకు తగ్గిపోతుంది. ♦ 2010లో ప్రపంచంలో 84 శాతం మందికి విద్యుత్ సౌకర్యం ఉంది. 2021 నాటికి ఇది 91 శాతానికి చేరింది. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి వల్ల 2019–21లో ఈ వృద్ది కొంత మందగించింది. ♦ కరెంటు సౌకర్యం లేనివారిలో 80 శాతం మంది (56.7 కోట్లు) సబ్ సహారన్ ఆఫ్రికాలో నివసిస్తున్నారు. ♦ ఇంధన వనరుల విషయంలో ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ♦ వంట గ్యాస్ లేకపోవడంతో కట్టెలు, పిడకలు వంటి కాలుష్యకారక ఇంధనాల వాడకం, దానివల్ల వాయు కాలుష్యం కారణంగా ప్రపంచంలో ప్రతిఏటా దాదాపు 32 లక్షల మంది చనిపోతున్నారని అంచనా. -
గణాంకాలు, ఫలితాలే దిక్సూచి
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను క్యూ4 ఫలితాలు, ఆర్థిక గణాంకాలు నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే పలు దిగ్గజాలు గతేడాది(2022–23) క్యూ4(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించాయి. వారాంతాన(13న) డీమార్ట్ స్టోర్ల దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ క్యూ4 పనితీరు వెల్లడించింది. ఈ బాటలో బెర్జర్ పెయింట్స్, ఫైజర్ ఈ నెల 15న, బ్యాంక్ ఆఫ్ బరోడా, భారతీ ఎయిర్టెల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 16న, స్టేట్‌బ్యాంక్, యునైటెడ్ స్పిరిట్స్, గెయిల్ ఇండియా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్(ఇండిగో) 18న, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, 19న ఫలితాలు విడుదల చేయనున్నాయి. ఈ జాబితాలో ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సైతం ఉన్నాయి. డీమార్ట్ ఫలితాల ప్రభావం నేటి(15న) ట్రేడింగ్‌లో ప్రతిఫలించనున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఐఐపీ, ధరల ఎఫెక్ట్ శుక్రవారం(12న) మార్కెట్లు ముగిశాక మార్చి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), తయారీ రంగ గణాంకాలు వెలువడ్డాయి. ఇక ఏప్రిల్ నెలకు రిటైల్ ధర ద్రవ్యోల్బణ(సీపీఐ) వివరాలూ వెల్లడయ్యాయి. నేడు ఏప్రిల్ టోకుధరల ద్రవ్యోల్బణ తీరు వెల్లడికానుంది. ఈ ప్రభావం సైతం మార్కెట్లలో నేడు కనిపించే వీలున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇవికాకుండా విదేశీ మార్కెట్లో నెలకొనే పరిస్థితులు ట్రెండ్‌ను ప్రభావితం చేయగలవని వివరించారు. ఏప్రిల్ నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి, యూఎస్ రిటైల్ అమ్మకాల గణాంకాలు 16న వెలువడనున్నాయి. జపాన్ ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణ గణాంకాలను 19న ప్రకటించనుంది. ఇతర అంశాలు కూరగాయలు, వంటనూనెల ధరలు తగ్గడంతో సీపీఐ 18 నెలల కనిష్టానికి చేరినప్పటికీ ఐఐపీ ఐదు నెలల కనిష్టాన్ని తాకడం బలహీన అంశమని స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. విద్యుత్, తయారీ రంగాలు ఇందుకు కారణమయ్యాయి. ఇవికాకుండా డాలరుతో రూపాయి మారకపు తీరు, బాండ్ల ఈల్డ్స్, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడి చమురు ధరలు తదితర అంశాలూ మార్కెట్ల కదలికలను నిర్దేశించగలవని వివరించారు. కర్ణాటక్ మ్యూజిక్ వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకంటే ముందుగా అత్యంత ఆసక్తిని రేపిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష స్థాయికి చేరగా.. దశాబ్ద కాలం తదుపరి కాంగ్రెస్ పటిష్ట మెజారిటీని సాధించింది. ఇది కొంతమేర మార్కెట్లలో సెంటిమెంటును ప్రభావితం చేయగలదని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అభిప్రాయపడ్డారు. గత వారం జూమ్ గడిచిన వారం దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. సెన్సెక్స్ 974 పాయింట్లు జంప్‌చేసి 62,000 మార్క్‌ను మళ్లీ దాటింది. 62,027 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 246 పాయింట్లు ఎగసి 18,315 వద్ద ముగిసింది. మార్కెట్ల ప్రభావంతో చిన్న షేర్లకూ డిమాండ్ పెరిగింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.4 శాతం, స్మాల్ క్యాప్ 1.2 శాతం చొప్పున బలపడ్డాయి. -
నేషనల్ హైవేలుకాదు..లోకల్ రోడ్లే డేంజర్!
సాక్షి, హైదరాబాద్ : విశాలంగా ఉండే జాతీయ రహదారులు.. వేగంగా దూసుకెళ్లే వాహనాలు... దీంతో అక్కడే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని అనుకోవడం సహజం. కానీ గ్రామీణ ప్రాంతాలు, రాష్ట్ర రహదారులే యమ డేంజర్ అని పోలీస్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జాతీయ రహదా రుల్లో ప్రయాణంతో పోలిస్తే వాహనదారులు స్థానిక రోడ్లపై నడిపేటప్పుడు అంత్యంత నిర్లక్ష్యంగా ఉంటున్నారని తెలుస్తోంది. పక్క ఊరికే కదా వెళ్లేది.. పది కిలోమీటర్ల దూరానికే హెల్మెట్ ఎందుకు? ఊర్లో కూడా హెల్మెట్ పెట్టుకుని తిరగాలా? కారులో సీటు బెల్ట్ పెట్టుకోకున్నా అడిగేదెవరు..? అన్న ధీమాతో వెళుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నట్టు వెల్లడవుతోంది. నిర్లక్ష్యమే మృత్యుపాశం.. వాహనదారుల నిర్లక్ష్యమే వారి పాలిట మృత్యువై వెంటాడుతోంది. జాతీయ రహదారులతో పోలిస్తే.. స్థానిక రోడ్లపై వాహనాలు నడిపే సమయంలో ఏమాత్రం రోడ్డు భద్రత నియమాలను లెక్క చేయడం లేదు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మృతులు ద్విచక్రవాహనదారులే ఉంటున్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది హెల్మెట్ ధరించకపోవడం.. హెల్మెట్ పెట్టుకున్నా.. దాన్ని సరిగా లాక్ చేయకపోవడం మరణాలకు ప్రధాన కారణాలని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. దూరం ఎంతైనా సరే.. తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను అలవర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. అదేవిధంగా కారులో సీటుబెల్ట్, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ వాడకం తప్పక అలవాటు చేసుకోవాలని చెపుతున్నారు. పట్టణ, గ్రామీణప్రాంతాల వారీగా 2022లో నమోదైన రోడ్డు ప్రమాదాలు.. పట్టణ ప్రాంతాల్లో మొత్తం రోడ్డు ప్రమాదాలు - 12203 మృతుల సంఖ్య - 2873 గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం రోడ్డు ప్రమాదాలు - 9416 మృతుల సంఖ్య - 4684 రాష్ట్రంలో 2022లో నమోదైన రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య ఇలా.. -
కల్యంపూడి రాధాకృష్ణారావుకు అంతర్జాతీయ స్టాటిస్టిక్స్ పురస్కారం
వాషింగ్టన్: ప్రఖ్యాత భారత్–అమెరికన్ గణిత శాస్త్రవేత్త, గణాంకశాస్త్ర(స్టాటిస్టిక్స్) నిపుణుడు కల్యంపూడి రాధాకృష్ణారావు(102)ను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం వరించింది. స్టాటిస్టిక్స్ రంగంలో నోబెల్ బహుమతితో సమానమైన ‘ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్’ను 2023 సంవత్సరానికి గాను రాధాకృష్ణారావుకు అందజేయనున్నట్లు ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. స్టాటిస్టిక్స్‌లో 75 ఏళ్ల క్రితం ఆయన చేసిన కృషి సైన్స్‌పై ఇప్పటికీ అమిత ప్రభావం చూపిస్తోందని ప్రశంసించింది. కెనడాలోని ఒట్టావాలో ఈ ఏడాది జూలైలో జరిగే ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వరల్డ్ స్టాటిస్టిక్స్ కాంగ్రెస్‌లో అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ బహుమతి కింద 80,000 డాలర్లు అందజేస్తారు. ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ను ప్రతి రెండేళ్లకోసారి ప్రదానం చేస్తారు. 2017లో తొలిసారిగా ఈ అవార్డును డేవిర్ ఆర్ కాక్స్ అందుకున్నారు. 2019లో బ్రాడ్జీ ఎఫ్రాన్, 2021లో నాన్ లాయిర్డ్ స్వీకరించారు. ఏపీలో విద్యాభ్యాసం కల్యంపూడి రాధాకృష్ణారావు కర్ణాటకలోని హడగళిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలో విద్యాభ్యాసం సాగింది. ఆంధ్రా విశ్వావిద్యాలయం నుంచి గణితశాస్త్రంలో ఎంఎస్సీ చేశారు. 1943లో కలకత్తా యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్‌లో ఎంఏ డిగ్రీ అందుకున్నారు. ఇంగ్ల్లండ్‌లో కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన కింగ్స్ కాలేజీలో పీహెచ్డీ చేశారు. 1965లో కేంబ్రిడ్జి వర్సిటీ నుంచి డీఎస్సీ డిగ్రీ స్వీకరించారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, తర్వాత కేంబ్రిడ్జిలోని ఆంత్రోపాలాజికల్ మ్యూజియంలో సేవలందించారు. పలు భారత, విదేశీ వర్సిటీల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ అందుకున్నారు. -
అంచనాలకు మించి పన్ను వసూళ్లు.. ఏకంగా రూ.16.61 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత్ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 18 శాతం పెరిగి, రూ.16.61 లక్షల కోట్లకు ఎగశాయి. ఆర్థిక శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. (రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు) 2021–22లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.12 లక్షల కోట్లు. రిఫండ్స్‌ను సర్దుబాటు చేయకుండా స్థూలంగా చూస్తే, పన్ను వసూళ్లు రూ.19.68 లక్షల కోట్లని ఆర్థికశాఖ వివరించింది. వీటిలో నుంచి మార్చి 31 వరకూ రూ.3.07 లక్షల కోట్ల రిఫండ్స్ జరిగాయి. (అప్పుడు కొనలేకపోయారా..? ఇప్పుడు కొనండి..) -
క్రెడిట్‌కార్డ్... అవసరాలకు భరోసా!
న్యూఢిల్లీ: దేశంలో క్రెడిట్ కార్డ్ రుణ పరిమాణం గణనీయంగా పెరుగుతోంది. 2023 జనవరిలో వార్షికంగా వినియోగం 29.6 శాతం పెరిగి, రూ. 1,86,783 కోట్లుగా నమోదయ్యింది. 2022 జనవరితో (13 నెలల్లో) పోల్చితే 32 శాతంపైగా పెరుగుదల (రూ. 1,41,254 కోట్ల నుంచి రూ. 1,86,783 కోట్లు) నమోదుకావడం గమనార్హం. ఈ స్థాయిలో రుణాల విలువ నమోదుకావడం ఒక రికార్డు. డిజిటలైజేషన్‌పై విశ్వాసం పెరగడం ప్రత్యేకించి కోవిడ్ అనంతరం కాలంలో వినియోగ అవసరాలు దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెలువరించిన ఒక సర్వే గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు... ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 నెలల కాలంలో (2022 ఏప్రిల్–2023 జనవరి) రుణ పరిమాణం 20 శాతం పెరిగింది. ఒక్క జూన్‌లో రికార్డు స్థాయిలో 30.7 శాతం పురోగతి కనబడింది. ► 2023 జనవరి చివరినాటికి వివిధ బ్యాంకులు దాదాపు 8.25 కోట్ల క్రెడిట్ కార్డులు జారీ చేశాయి. ► హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల జారీలో మొదటి ఐదు స్థానాలూ ఆక్రమించాయి. ► రోనా కష్టకాలం నేపథ్యంలో 2021 మధ్యలో క్రెడిట్ కార్డ్ వినియోగం చరిత్రాత్మక కనిష్ట స్థాయిని చూసింది. అయితే అప్పటితో పోల్చితే ఇప్పుడు పరిస్థితి ఎంతో మెరుగైంది. సంబంధిత సూచీ రికవరీ మార్గంలో పురోగమిస్తోంది. సాధారణ ఆర్థిక పరిస్థితులు నెలకొనడం, గృహ ఆదాయంపై మెరుగుదల వంటి సానుకూల సెంటిమెంట్ దీనికి నేపథ్యం. చెల్లింపుల సౌలభ్యత పలు విభాగాలు డిజిటలైజ్ అయ్యాయి. దీని ఫలితంగా కస్టమర్ల క్రెడిట్ కార్డ్ వ్యయాలు పెరిగాయి. ఆరోగ్యం, ఫిట్నెస్, విద్య, యుటిలిటీ బిల్లులు తదితర విభాగాల్లో ఖర్చు పెరగడానికి క్రెడిట్ కార్డ్ చెల్లింపుల సౌలభ్యత ఖచ్చితంగా దోహదపడింది. క్రెడిట్ కార్డ్ వినియోగంలో నెలవారీ వృద్ధి ధోరణి పటిష్టంగా ఉంది. గడచిన కొన్ని నెలలుగా క్రెడిట్ కార్డ్ వ్యయాల్లో స్థిరమైన వృద్ధి ఉంది. ముఖ్యంగా గత 11 నెలల నుండి క్రెడిట్ కార్డ్ వ్యయాలు స్థిరంగా రూ. 1 లక్ష కోట్లు పైబడి ఉండడం ఇక్కడ గమనించాల్సిన అంశం. డిసెంబర్ 2022లో మొత్తం క్రెడిట్ కార్డ్ వ్యయాల్లో ఈ–కామర్స్ వాటా 60 శాతంగా ఉండడం మరో విశేషం. భవిష్యత్తులోనూ క్రెడిట్ కార్డ్ వినియోగం మరింత పుంజుకుంటుందని విశ్వసిస్తున్నాం. – రామమోహన్ రావు, ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈఓ వ్యక్తిగత రుణాలు పెరుగుతున్నాయ్ ఈ రోజుల్లో తనఖా రుణాలు, వ్యాపార రుణాలు వంటి సురక్షిత రుణాలు వెనుకబడుతుండగా, వ్యక్తిగత రుణ విభాగం పెరుగుతోంది. ఇప్పు డే ఉపాధి రంగంలోకి ప్రవేశిస్తున్న తాజా గ్రాడ్యుయేట్లు, వారి ముందువారి కంటే ఆర్థికంగా ఎక్కువ అవగాహన కలిగి ఉన్నారు. అలాగే వారి క్రెడిట్ స్కోర్లను అధికంగా కొనసాగించడానికి చురుకుగా ప్రయత్నిస్తున్నారు. మరిన్ని ఫిన్‌టెక్ కంపెనీలు ఆన్లైన్లో తమ కార్యకలాపాలను పెంచుకోవడం, సమాచారాన్ని పంచుకోవడంతో యువకులు మరింత సమాచారంతో క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లను చేస్తున్నారు. మహమ్మారి సమయంలో క్రెడిట్ కార్డులు ప్రధానంగా కిరాణా కొనుగో లు, యుటిలిటీ బిల్లులు చెల్లించడానికి ఉపయోగించడం జరిగింది. తిరిగి మళ్లీ ఆయా విభాగాల్లో క్రెడిట్ కార్డ్ వ్యయాలు పెరుగుతున్నాయి. వీ స్వామినాథన్, ఆండ్రోమెడ లోన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ -
ప్రత్యక్ష పన్నుల స్థూల వసూళ్లలో 24 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను స్థూల వసూళ్లు ఫిబ్రవరి 10వ తేదీ నాటికి 24 శాతం పెరిగి (2021–22 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో పోల్చి) రూ.15.67 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్స్‌పోను నికర వసూళ్లు 18.40 శాతం పెరిగి రూ.12.98 లక్షల కోట్లుగా నమోదయినట్లు ఆర్థికశాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు లక్ష్యంలో (2023–24 బడ్జెట్లో సవరిత గణాంకాల ప్రకారం) 79 శాతానికి (ఫిబ్రవరి 10 నాటికి) చేరినట్లు గణాంకాలు తెలిపాయి. 2022–23 బడ్జెట్లో ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని రూ.14.20 లక్షల కోట్లుగా నిర్దేశించుకోగా, ఈ మొత్తాన్ని తాజాగా రూ.16.50 లక్షల కోట్లకు పెంచిన సంగతి తెలిసిందే. ఏప్రిల్–ఫిబ్రవరి 10 మధ్య స్థూల కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీ) వసూళ్లు 19.33 శాతం పెరగ్గా, వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ) వసూళ్లు 29.63 శాతం ఎగశాయి. -
ఇక నెలకు ఒకసారే వాణిజ్య గణాంకాలు
న్యూఢిల్లీ: నెలవారీ ఎగుమతులు-దిగుమతుల గణాంకాలను నెలకు ఒకసారి మాత్రమే విడుదల చేసే విధానాన్ని తిరిగి ప్రారంభించాలని వాణిజ్యమంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు ఒక అధికారి తెలిపారు. దేశ వాణిజ్యం గురించి స్పష్టమైన చిత్రాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారి తెలిపారు. అక్టోబర్ 2020 నుంచి నెలకు రెండుసార్లు వాణిజ్య డేటా విడుదలవుతోంది. తొలి గణాంకాలు నెల మొదట్లో వెలువడితే, తుది గణాంకాలు నెల మధ్యన వెలువడుతున్నాయి. రెండు గణాంకాల భారీ వ్యత్యాసాలూ నమోదవుతున్నాయి. గడచిన మూడు నెలల్లో తొలుత క్షీణత నమోదుకావడం, తుది గణాంకాల్లో వృద్ధి ధోరణికి మారడం సంభవిస్తోంది. ఆయా అంశాల నేపథ్యంలో అస్పష్టత నివారణ, ఒకేసారి స్పష్టమైన తుది గణాంకాల విడుదల లక్ష్యంగా మంత్రిత్వశాఖ తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిప్రకారం రానున్న అక్టోబర్ గణాంకాలు నవంబర్ నెల మధ్యలో విడుదలవుతాయి. గడచిన మూడు నెలలూ ఇలా... తుది, తొలి గణాంకాల్లో భారత్ వస్తు వాణిజ్య లెక్కలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న పరిస్థితి కనబడుతోంది. వరుసగా మూడు నెలల్లో తొలి నిరాశాకరమైన గణాంకాలు తుది గణాంకాల్లో సానుకూలంగా మారాయి. గడచిన మూడు నెలలుగా పరిస్థితి చూస్తే, తాజా సమీక్షా నెల సెప్టెంబర్‌లో భారత్ ఎగుమతులు 4.82 శాతం పెరిగి 35.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ నెల మొదటి వారంలో వెలువడిన తొలి గణాంకాల ప్రకారం భారత్ ఎగుమతులు సెప్టెంబర్‌లో 3.52 శాతం క్షీణించి 32.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జూలై, ఆగస్టు నెలల్లో ఎగుమతుల తొలి లెక్కలు క్షీణతలో ఉండడం, అటు తర్వాత వాటిని వృద్ధిబాటలోకి రావడం జరిగింది. -
ప్రపంచ వింతల్లో మహాబలిపురం
సాక్షి, చెన్నై: ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న మహాబలిపురం ప్రపంచ వింతల్లో చేరటమే కాకుండా పర్యాటకుల సందర్శనలో తాజ్ మహల్‌నే అధిగమించి తమిళనాడుకే గర్వకారణంగా నిలిచింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ విడుదల చేసిన ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్ 2022 పేరుతో భారత పురావస్తు శాఖ నివేదిక ప్రకారం మన దేశంలో విదేశీయులు ఎక్కువగా సందర్శించే స్మారక చిహ్నాల జాబితాలో తమిళనాడులోని మహాబలిపురం అగ్రస్థానంలో ఉందని ప్రకటించారు. పల్లవ రాజులు నిర్మించిన 7వ, 8వ శతాబ్దపు సముద్రతీర దేవాలయాలు, శిల్పా సౌందర్యంతో కూడిన దేవాలయాలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. వందల ఏళ్ల క్రితం మహేంద్రవర్మ నిర్మించిన రాతి రథాలు, ఆలయాలు కాలంతో పాటు సగర్వంగా నిలుస్తున్నాయి. యునెస్కో జాబితాలో సైతం చోటు సంపాదించింది. ఈ అద్భుతాన్ని చూసేందుకు ఏటా లక్షల మంది ప్రజలు, పర్యాటకులు, విదేశీయులు ఇక్కడికి వస్తుండటం విశేషం. ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్ 2022 పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్ 2022 ప్రకారం, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా వర్గీకరించిన మహాబలిపురానికి విదేశీ సందర్శకుల సంఖ్యలో తాజ్ మహల్‌ను అధిగమించింది. సెప్టెంబరు 27న న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్లో ప్రపంచ పర్యాటక దినోత్స వం సందర్భంగా ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్ దీనిని విడుదల చేశారు. పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామల్లపురం (మహాబలిపురం)ను 2021–22లో 1,44,984 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారు. 45.50 శాతం మంది విదేశీయులు పర్యటించి మొదటి స్థానంలో నిలువుగా, ఆగ్రాలోని తాజ్ మహల్‌ను 38,922 మంది విదేశీ సందర్శకులతో రెండో స్థానంలో నిలిచి 12.21 శాతంగా నిలిచింది. మహాబలిపురం విశేషాలు ఈ ప్రదేశంలో 7వ , 8వ శతాబ్దపు హిందూ మతపరమైన స్మారక చిహ్నాల సేకరణ ఉంది. 40 పురాతన దేవాలయాలు, స్మారక కట్టడాల్లో గంగా అవరోహణ, పంచ రథాలు, ఏకశిలా పిరమిడ్ నిర్మాణాలు, 7వ శతాబ్దానికి చెందిన 10 రాక్–కట్ గుహ దేవాలయాలు, ఒక బీచ్ టెంపుల్‌తో సహా కళాత్మక రాతి నిర్మాణాలు పర్యటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. భారత పర్యాటక శాఖ ప్రచురించిన జాబితాలోని మొదటి 10 స్మారక చిహ్నాలలో ఆరు తమిళనాడులో ఉండటం విశేషం. మహాబలిపురంలో అనేక అద్భుత క్షేత్రాలతో పాటు సీషెల్, మారిటైమ్ హెరిటేజ్ మ్యూజియం, 40,000 పైగా అరుదైన సీషెల్ నమూనాలు, ముత్యాలు, అక్వేరియంలు, డైనోసార్ శిలాజాలు పర్యటకులను సంమ్మోహన పరుస్తాయి. మామల్లపురం సముద్రపు గవ్వలతో చేసిన కళాఖండాలు మనకంటే విదేశీయులు ఎక్కువగా కొనుగోలు చేసి ఆనందిస్తారు. మొత్తానికి మహాబలిపురం ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా నిస్సందేహంగా రుజువు చేస్తుంది. -
విధాన నిర్ణయాల్లో డేటాదే కీలక పాత్ర
ముంబై: విధాన నిర్ణయాల పటిష్టతలో గణాంకాల (డేటా) పాత్ర చాలా కీలకమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. తగిన సమాచారంతో విధాన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయని సూచించారు. ఇందుకు స్పష్టమైన, పారదర్శకమైన డేటా అందుబాటులో ఉండడం అవసరమని అన్నారు. తద్వారా నిర్ణయాధికారుల నుండి తగిన నిర్ణయాలు వెలువడతాయని, మార్కెట్ భాగస్వాములు హేతుబద్ధమైన అంచనాలకు రాగలుగుతారని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ వార్షిక ‘స్టాటిస్టిక్స్ డే’ సదస్సులో ఈ మేరకు గవర్నర్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► పబ్లిక్ పాలసీలో గణాంకాల ప్రాముఖ్యత ఎంతో ఉంది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఏర్పడిన తీవ్ర అనిశ్చితి నేపథ్యంలో పారదర్శక, పటిష్ట గణాంకాల పాత్ర మరింత పెరిగింది. ► మునుపెన్నడూలేని విధంగా ఏర్పడిన ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు మానవాళి లక్ష్యాలు, దృక్పధాన్ని పరిశోధిస్తోంది. భారత్‌సహా వివిధ దేశాలలో విధించిన లాక్డౌన్లు... మహమ్మారి వ్యాప్తి, ఆర్థిక వ్యవస్థలపై దాని ప్రభావాలకు సంబంధించిన డేటా లభ్యత విషయంలో క్లిష్టమైన స్థితిని సృష్టించింది. మునుపెన్నడూ చూడని ఈ సమస్యకు అత్యవసరంగా పరిష్కారాలు కనుగొనడం అవసరం. ► డేటా లభ్యత విషయంలో 2020లో మహమ్మారి మొదటి వేవ్ సమయంలో దేశంలో అనేక వస్తువుల ధరల సేకరణలో అపారమైన ఇబ్బందులు నెలకొన్నాయి. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది. ► అయితే ఈ పరిస్థితి డేటా సేకరణలో నూతన సాంకేతిక విధానాలను అవలంభించే అవకాశాలనూ మహమ్మారి సృష్టించింది. ఈ నూతన విధానాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగి ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే కొత్త డేటా వనరులు అధికారిక గణాంకాల కోసం తాజా అవకాశాలను సృష్టిస్తుండగా, ఇది ఈ విషయంలో డేటా విశ్వసనీయత, క్రమశిక్షణకు సంబంధించిన సమస్యలను కూడా లేవనెత్తుతుండడం మరో ప్రతికూలాంశం. ఈ సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించాల్సి ఉంటుంది. ► సరైన డేటా నాణ్యతకు తగిన ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, డేటా గోప్యత, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని 2022 ఏప్రిల్‌లో జరిగిన ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ కాన్ఫరెన్స్’ ఉద్ఘాటించింది. ► విధాన నిర్ణయాలు తీసుకోవడంలో, వాటి ఫలితాలను అంచనా, మదింపు వేయడంలో సెంట్రల్ బ్యాంకులకు గణాంకాలు ఎంతో కీలకం. ఇక్కడ గణాంకాలు సేకరించడం, వాటిని వినియోగించుకోవడం రెండు బాధ్యతలూ సెంట్రల్ బ్యాంకులకు సంబంధించినవే. మహమ్మారి వంటి కల్లోల సమయాల్లో సెంట్రల్ బ్యాంకులు తమ విధానాలు, చర్యల మదింపునకు సంబంధించిన డేటా సమీకరణలో పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయా అంశాలకు సంబంధించి ఎదురయిన సవాళ్లనూ సెంట్రల్ బ్యాంకులు మహమ్మారి సమయాల్లో పరిష్కరించుకోవాల్సి వచ్చింది. మహమ్మారి సమయంలో ప్రత్యామ్నాయ సూచీలు, డేటా సమీకరణ వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. భారత్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు ఆర్బీఐ విషయానికి వస్తే, పటిష్ట గణాంకాల సేకరణ, వినియోగ వ్యవస్థలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. డేటా ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడంలో ఆర్బీఐ ప్రయత్నాలు, సాంకేతికతపై పెట్టుబడులు, నియంత్రిత సంస్థలతో నిరంతర సంప్రతింపులు మంచి ఫలితాలను అందించాయి. డేటా సర్వే, సేకరణ రీతుల్లో కొంత మార్పుతో పాటు, ఆయా అంశాల్లో మరింత స్థిరత్వం నెలకొల్పడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. డేటా నాణ్యతను నిర్ధారించడానికి పునఃపరిశీలన విధానాలను అవలంభించడం జరుగుతోంది. డేటా సేకరణ, ధ్రువీకరణ, నిర్ణయాల్లో వాటి అనుసంధానం వంటి అంశాల్లో వినూత్న విధానాలకు శ్రీకారం చుట్టాం. ఆయా అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను సెంట్రల్ బ్యాంక్ అనుసరిస్తోంది. అంతర్జాతీయంగా మరిన్ని సూచీలు, ఉప సూచీలు, ఇతర గణాంకాలు కూడా ప్రస్తుతం తెరపైకి వచ్చాయి. దేశాలు ఉన్నత జీవన ప్రమాణాలను సాధించడానికి ఆయా సూచీలో ప్రయత్నిస్తున్నాయి. బహుళ కోణాలలో దేశాల పురోగతిని పర్యవేక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. మానవాభివృద్ధి సూచికలు, హ్యాపీ ఇండెక్స్‌లు, అసమానత సూచికల వంటివి వాటిని ఈ సందర్భంలో ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఆయా సూచీలను ప్రస్తుతం వివిధ జాతీయ– అంతర్జాతీయ సంస్థలు నిర్వహిస్తున్నాయి. వైశాల్యం, భౌగోళిక వైవిధ్యం దృష్ట్యా భారతదేశానికి ప్రాంతీయ అంశాలను సూచించే జాతీయ సూచికల అవసరం ఉంది. రిజర్వ్ బ్యాంక్‌లో మేము సమాచారాన్ని ’ప్రజా ప్రయోజనకరమైన అంశం’గా పరిగణిస్తాము. వివిధ వాటాదారుల అవసరాలు, అంచనాలకు అనుగుణంగా మన సమాచార నిర్వహణ వ్యవస్థలను క్రమబద్ధం చేయాలని భావిస్తున్నాము. ఆర్బీఐ మరింతగా ప్రత్యామ్నాయ డేటా వనరులపై దృష్టి సారించాలి. ఇప్పటికే ఉన్న డేటా విశ్లేషణాత్మక ఫ్రేమ్‌వర్క్ విధానాలతో వాటిని అనుసంధించడానికి ప్రయత్నం జరగాలి. -
ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలు కీలకం
ముంబై: స్టాక్ మార్కెట్లపై ఈ వారం స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలతో పాటు కంపెనీల త్రైమాసిక ఫలితాలు ప్రభావం చూపనున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వచ్చే వారం జూన్ 6–8 తేదిల్లో జరిగే ఆర్బీఐ ద్రవ్య పాలసీ సమావేశ నిర్ణయాలకు(వడ్డీరేట్ల పెంపు) అనుగుణంగా మార్కెట్ పొజిషనింగ్‌కు సన్నద్ధం కావొచ్చంటున్నారు. వాతావరణ శాఖ వెల్లడించే వర్షపాత నమోదు వార్తలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించవచ్చు. ఇదే వారంలో ఏథర్, ఈముద్ర, ఈథోస్ ఐపీవోలు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదిలికలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘అమెరికా మార్కెట్ల రీబౌండ్ ర్యాలీ కొంత ఒత్తిడిని తగ్గించింది. అయితే అనిశ్చితులు తగ్గి స్థిరత్వాన్ని ఏర్పరుచుకోవడం కీలకం. చివరి ట్రేడింగ్ సెషన్లో సాంకేతికంగా నిఫ్టీ 16,350 స్థాయిపై ము గిసింది. బౌన్స్‌బ్యాక్ ర్యాలీ కొనసాగితే 16,400 స్థా యిని.., ఆపై 16,700 –16,800 శ్రేణిలో కీలక నిరో ధాన్ని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు జరిగితే దిగువ స్థాయిలో 15,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 15,700 వద్ద మద్దతు లభిం చొచ్చు. ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో రక్షణాత్మక రంగాలుగా భావించే ఎఫ్ఎంజీసీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించవచ్చు’’ శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెచ్ యశ్ షా తెలిపారు. సూచీలు గత వారంలో మూడు ట్రేడింగ్ సెషన్లో లాభాలను ఆర్జించగా, రెండు రెండురోజులు నష్టాలను చవిచూసింది. మొత్తం ఐదు ట్రేడింగ్‌ల్లో సెన్సెక్స్ 558 పాయింట్లు, నిఫ్టీ 86 పాయింట్లు చొప్పున పెరిగాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను విశ్లేషిస్తే.., స్థూల ఆర్థిక గణాంకాలు జర్మనీ మే ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు విడుదల అవుతాయి. రేపు భారత జీడీపీ డేటాతో పాటు ఈయూ మే ద్రవ్యోల్బణ గణాంకాలు (మే 31)న వెల్లడి కానున్నాయి. దేశీయ మే జీఎస్టీ వసూళ్లు, వాహన విక్రయాల గణాంకాలూ బుధవారం(జూన్ 1న) విడుదల అవుతున్నాయి. అదే రోజున చైనా తయారీ రంగ గణాంకాలు, వెల్లడి అవుతాయి. యూఎస్ తయారీ డేటా గురువారం.., యూఎస్ ఉద్యోగ గణాంకాల డేటా శుక్రవారం విడుదల అవుతుంది. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను తెలియజేసే ఈ గణాంకాల ప్రకటనకు ముందుకు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. కార్పొరేట్ ఫలితాల ప్రభావం దేశీయ ఆర్థిక ఫలితాల సీజన్ ఈ వారంతో ముగియనుంది. సుమారు 300కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. సన్ ఫార్మా, ఎల్ఐసీ, జుబిలెంట్ ఫుడ్స్, డెల్హివరీ, దిక్సాస్ టెక్నాలజీ, దీలీప్ బిల్డ్‌కాన్, డిష్ టీవీ, ధని సర్వీసెస్, ఈక్విటాస్ హోల్డింగ్స్, నురేకా, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టీటీకే ప్రస్టేజ్, వికాస్ ఎకో టెక్ సంస్థలు మొదలైనవి జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో ఒడిదుడుకుల ట్రేడింగ్ చవిచూడొచ్చు. మూడు లిస్టింగులు ముందుగా నేడు ఈథోస్ ఐపవో షేర్లు లిస్ట్ అవుతుంది. గ్రే మార్కెట్లో ఈ షేరు డిస్కౌంట్లో ట్రేడ్ అవుతోంది. లిస్టింగ్‌లో మెప్పించకపోవచ్చు. జూన్ ఒకటో తేదిన ఈ ముద్ర షేర్లు లిస్టవనున్నాయి. వారాంతపు రోజున స్పెషాలిటీ కెమికల్స్ తయారీ సంస్థ ఏథర్ ఇండస్ట్రీస్ షేర్లు ఎక్చే్చంజీల్లో లిస్ట్‌కానున్నాయి. ఈ నేపథ్యంలో లిస్టింగ్‌ల స్పందనలను ఇన్వెస్టర్లు గమనించవచ్చు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు విదేశీ ఇన్వెస్టర్లు ఈ మే నెల(27 తేదీ నాటికి)లో ఇప్పటి వరకు రూ.44,346 కోట్ల షేర్లను అమ్మేశా రు. బాండ్లపై రాబడులు పెరగడం, పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచొచ్చనే భయా లు, దేశీయ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనల తో ఎఫ్ఐఐలు పెద్ద ఎత్తున పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. మరి కొంతకాలం ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నా రు. ఎఫ్ఐఐలు గడిచిన ఎమినిది నెలల్లో రూ. 2.50 లక్షల కోట్ల పెట్టుబడులను విక్రయించడం ఈక్విటీ మార్కెట్లను ఒత్తిడికి గురిచేస్తోంది. -
భద్రతలో భేష్.. దోషులకు సత్వర శిక్షలు
సాక్షి, అమరావతి: నేరాల కట్టడి, దోషులకు సత్వర శిక్షలు పడేలా కేసుల సత్వర దర్యాప్తులో రాష్ట్ర పోలీసు శాఖ దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరుస్తోందని డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్లు నమోదులో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. మహిళలపై లైంగిక వేధింపుల కేసుల్లో చార్జిషీట్ల దాఖలులోనూ అగ్రస్థానం సాధించిందన్నారు. ప్రభుత్వం దిశ యాప్ ద్వారా ఇచ్చిన భరోసాతో మహిళలు ధైర్యంగా ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. వేధింపులకు పాల్పడుతున్న వారికి శిక్షలు విధించడం కూడా పెరిగిందని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో సత్ఫలితాలు సాధిస్తున్నామన్నారు. 2019లో పోలిస్తే రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, వరకట్న వేధింపుల కేసులు, వైట్‌కాలర్ నేరాలు తగ్గాయని తెలిపారు. అన్ని కేటగిరీల నేరాలు కలిపి 2019తో పోలిస్తే 27 శాతం, 2020తో పోలిస్తే 18 శాతం తగ్గాయని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పోలీసులు విశేష సేవలు అందించారని అన్నారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. జాతీయ స్థాయిలో అవార్డులు రావడం రాష్ట్ర పోలీసుల పనితీరుకు నిదర్శనమని చెప్పారు. వచ్చే ఏడాది మరిన్ని వినూత్న ఆవిష్కరణలు, విధానాలతో పోలీసు వ్యవస్థను మరింత పటిష్ట పరుస్తామన్నారు. 2021 సంవత్సరం పోలీసు శాఖ పనితీరు నివేదికను ఆయన మంగళవారం విడుదల చేశారు. ఆయన వెల్లడించిన ప్రధాన అంశాలివీ.. రికార్డుస్థాయిలో ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్లు దోషులకు సత్వరం శిక్షలు పడేలా కేసుల దర్యాప్తును వేగవంతం చేశాం. 2021లో ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2021లో 45,440 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, వీటిలో 36 శాతం కోవిడ్ నిబంధనల అమలు వంటి అవుట్‌రీచ్ కార్యక్రమాలకు చెందినవే. 2018లో 83 శాతం, 2019లో 85.9 శాతం, 2020లో 89.1 శాతం చార్జ్షీట్లు నమోదు కాగా 2021లో 90.2 శాతం నమోదయ్యాయి. ►715 జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. 75 అత్యాచారం కేసులు, 1,061 లైంగిక దాడుల కేసుల్లో 7 రోజుల్లోనే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ూ సైబర్ బుల్లీయింగ్ కేసుల్లో 1,551 చార్జిషీట్లు నమోదు చేశాం. ►స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 40,404 ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. 96% సమస్యలను 7 రోజుల్లోనే పరిష్కరించాం. 75 శాతం కేసుల్లో దోషులకు శిక్షలు 2021లో రికార్డు స్థాయిలో శిక్షలు పడ్డాయి. 2017లో 49.4%, 2018లో 52.6%, 2019లో 38.4%, 2020లో 69.7% కేసుల్లో శిక్షలు పడగా... 2021లో 75.09 % కేసుల్లో దోషులకు శిక్షలు పడటం పోలీసు శాఖ సమర్థతకు నిదర్శనం. గంజాయి సాగుపై ఉక్కుపాదం దేశంలోనే తొలిసారిగా ఆపరేషన్ పరివర్తన్ పేరుతో 7,226 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశాం. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.8,875.24కోట్లు. 2,762 గంజాయి కేసులు నమోదు చేశాం. 1,694 వాహనాలను జప్తు చేసి రూ.314.50 కోట్ల విలువైన 3,13,514 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాం. అక్రమ మద్యం, సారా ముఠాలపై 43,293 కేసులు నమోదు చేశాం. క్షీణించిన మావోయిస్టుల ప్రాబల్యం 2021లో రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ఏడాది రాష్ట్రంలో నాలుగు ఎన్కౌంటర్లు జరిగాయి. ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. నలుగురు మావోయిస్టు నేతలను, 43 మంది మిలీషియా సభ్యులను అరెస్టు చేశాం. 13 మంది నేతలు, 5 మంది మిలిషియా సభ్యులు లొంగిపోయారు. జాతీయ స్థాయిలో అవార్డులు ►స్మార్ట్ పోలీసింగ్‌పై ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ చేసిన సర్వేలో ఏపీ పోలీసు శాఖ మొదటిస్థానం సాధించింది. ►కేంద్ర ప్రభుత్వం, ఇతర సంస్థలు దాదాపు 150 జాతీయ అవార్డులను పోలీసు శాఖకు ప్రకటించాయి. ‘దిశ’తో ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్న మహిళలు దిశ యాప్ విప్లవాత్మక మార్పులు తెచ్చింది. రికార్డు స్థాయిలో 97,41,943 మంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. లైంగిక దాడుల కేసుల్లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 60 రోజుల్లోగా ఏకంగా 92.27 శాతం చార్జిషీట్లు దాఖలయ్యాయి. జాతీయ సగటు 40 శాతం మాత్రమే. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 34,037 మంది పిల్లలను రక్షించి వసతి గృహాలకు తరలించాం. -
కంప్యూటర్ ఆపరేటర్‌కు వేధింపులు.. మాతృ సంస్థకు ఉన్నతాధికారి
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ ఆపరేటర్‌ను లైంగికంగా వేధించాడనే ఫిర్యాదుతో జీహెచ్ఎంసీ ఆరోగ్య విభాగంలో స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఎస్ఓ)గా పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్‌ను ఆయన మాతృశాఖ అయిన వైద్యారోగ్య శాఖకు పంపించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ తనను కొంతకాలంగా వేధిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు నేరుగా మేయర్‌ను కలిసి ఫిర్యాదు చేయడం, సీరియస్ అయిన మేయర్ ఎస్ఓను మాతృశాఖకు పంపించాల్సిందిగా ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ను మా తృశాఖకు పంపించడంతో పాటు ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి, తదుపరి చ ర్యల నిమిత్తం నివేదికను ఆయన మాతృశాఖకు పంపిస్తామని ఉత్తర్వులో పేర్కొన్నారు. చదవండి: సినీ పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ దర్శకుడు కన్నుమూత -
నేడు ప్రపంచ గణాంకాల దినోత్సవం
అధికారిక గణాంకాల ప్రాథమిక సూత్రాల ప్రాముఖ్యతను వివరించడం కోసమే ప్రతి ఏడాది అక్టోబర్ 20న గణాంకాల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అయితే ఈ గణాంకాల దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ రూపొందించింది. ఈ మేరకు ఈ దినోత్సవాన్ని 2010 నుంచి గుర్తించడం మొదలైంది. (చదవండి: బాహుబలి గోల్డ్ మోమోస్.. ధర తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే) అంతేకాదు 2010 నుండి 103 మంది భాగస్వామ్యం సహకారంతో 51 ఆఫ్రికన్ దేశాలు ఏటా నవంబర్ 18న ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేవి. అయితే భారత్‌లో మాత్రం జూన్ 29న బెంగాల్‌కు చెందిన గణాంక శాస్రవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ జన్మదినం పురస్కరించుకుని జాతీయ గణాంకాల దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంది. ఈ మేరకుమహాలనోబిస్ దూరం, గణాంక కొలత తదితర గణాంక పరిశోధనలు ఎంతలా ప్రఖ్యాతిగాంచాయో అందరి తెలిసిందే. జాతీయ గణాంక కార్యాలయాలు జాతీయ సమన్వయ కర్తలుగా పనిచేయడమే కాక ఆయా సమాచారాన్ని జాతీయ భాషల్లోకి అనువదించి జాతీయ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహిస్తాయి. అంతేకాదు ఈ గణాంకాల దినోత్సవం కోసం యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డివిజన్ దేశవ్యాప్తంగా సమన్వయ ప్రచారాలు నిర్వహించడమే కాక కీలక సందేశాలను ఇవ్వడం, ఇతర భాగస్వామ్య దేశాలకు కావల్సినంత వనరులను అందుబాటులోకి తీసుకువస్తుంది. గణాంకాల ప్రాముఖ్యత ప్రపంచంలోని దాదాపు ప్రతి పరిశ్రమ,సంస్థలు ఈ గణాంక డేటా, పరిశోధనల నుండి ప్రయోజనం పొందుతుంది. వ్యాపారం, కెరియర్లపై సరియైన విధంగా దృష్టి సారంచాలంటే ఈ గణాంకాలు అత్యంత కీలకమైనవి. పెద్ద కంపెనీల ప్రచారాలకు, సరైన వ్యూహంతోప ముందంజలో దూసుకుపోవాలన్న కచ్చితమే ఈ గణాంక డేటా, పరిశోధనల ఆధారంగానే సాధ్యమవుతుంది. ఈ గణంక డేటా అదనంగా సమాచార దృకృథాలను జోడించడమే కాకుండా సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా వాస్తవాలను నిరూపించేలా ఉపకరిస్తుంది. నేటి ప్రపంచంలో మానవ కార్యకలాపాలన్ని ఈ గణాంకాల ఆధారంగా నిర్వహించగలుగుతున్నాం అనటంలో అతిశయోక్తి లేదు. అంతేందుకు వ్యక్తుల పోకడలు, ఇష్టాలు, అయిష్టాలను అర్థం చేసుకోవడానికి అనేక వ్యాపారాలు, సంస్థలకు గణాంకాల డేటాగా సోషల్ మీడియానే అతిపెద్ద డేటా వనరుగా మారింది. ఎలా జరుపుకుంటారు: స్టాటిస్టిక్స్ డే అనేది పరిశ్రమలు, సంస్థల గణాంకాల డేట పరిశోధనలు సమాచార ప్రాముఖ్యతను తెలియజేయడం పర్యావరణం, క్రీడలు, రాజకీయాలు, సమాజం, నేరం, కళ గురించి ఆసక్తికరమైన డేటాను పరిశోధించడం లేదా వ్యక్తులతో పంచుకోవడం ద్వారా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. (చదవండి: ఒకే వ్యక్తి ఏకంగా తన ఇంటినే క్యాసెట్ల స్టోర్‌గా మార్చేశాడు) -
తొలి భాగం మొత్తం వీళ్లదే.. రాహుల్ మెరుపులు.. గబ్బర్ గర్జన.. సంజూ శతక్కొట్టుడు
Recap Of First Half IPL 2021: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్-2021 రెండో అంచె నేటి నుంచి ప్రారంభం కానుంది. కోవిడ్ కారణంగా ఆకస్మికంగా వాయిదా పడిన క్యాష్ రిచ్ లీగ్.. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో పునః ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సీజన్ మొదటి దశలో చాలా మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. బౌలర్లపై బ్యాట్స్మెన్లు పూర్తి ఆధిపత్యం చలాయించారు. భారీ సంఖ్యలో ఫోర్లు, సిక్సర్లు నమోదవ్వడంతో పరుగుల వరద పారింది. కొన్ని మ్యాచ్‌ల్లో బౌలర్లు సైతం ప్రతాపం చూపినప్పటికీ వారి ప్రభావం నామమాత్రమే. సీజన్ తొలి దశలో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే.. టీమిండియా బ్యాట్స్మెన్లు పరుగుల వరద పారించారు. ముఖ్యంగా శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గబ్బర్.. ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచ్‌ల్లో 54.28 సగటుతో 380 పరుగులు చేసి ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుత సీజన్లో అత్యధిక ఫోర్ల (43) రికార్డు కూడా ధవన్ పేరిటే ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 3 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ధవన్.. ఓ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 92 పరుగులు చేశాడు. తొలి దశలో గర్జించిన గబ్బర్.. రెండో దశలో ఎలా రాణిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: IPL 2021: జోరు మీదున్న ధోని.. సీఎస్కే ప్రతీకారం తీర్చుకుంటుందా? మరోవైపు తొలిదశ ఐపీఎల్-2021లో టీమిండియా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం మెరుపులు మెరిపించాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఆశించిన మేరకు ప్రభావం చూపనప్పటికీ.. వ్యక్తిగతంగా రాణించాడు. ఈ సీజన్లో రాహుల్ సారధ్యంలో పంజాబ్ 8 మ్యాచ్‌ల్లో మూడింటిలో మాత్రమే నెగ్గింది. అయినా బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 7 మ్యాచ్‌ల్లో 66.20 సగటుతో 331 పరుగులు చేసి ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. దీంతో పాటు ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు (16), అత్యధిక అర్ధ సెంచరీ(4)ల రికార్డులు కూడా రాహుల్ పేరిటే నమోదై ఉన్నాయి. కాగా, టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులో ఉన్న రాహుల్ రెండో దశలోనూ రాణించి.. జట్టును విజయాల బాట పట్టించాలని పంజాబ్ కింగ్స్ అభిమానులు కోరుకుంటున్నారు. వీరిద్దరితో పాటు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డుప్లెసిస్( 7 మ్యాచ్‌ల్లో 64 సగటుతో 320 పరుగులు, 4 హాఫ్ సెంచరీలు), మరో ఢిల్లీ ఆటగాడు పృథ్వీ షా(8 మ్యాచ్‌ల్లో 38.50 సగటుతో 308 పరుగులు, 3 అర్ధ శతకాలు), రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్(7 మ్యాచ్‌ల్లో 46.16 సగటు, 145.78 స్ట్రయిక్ రేట్‌తో 277 పరుగులు, సెంచరీ), మరో రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్(7 మ్యాచ్‌ల్లో 36. 29 సగటు, 153.01 స్ట్రయిక్ రేట్‌తో 254 పరుగులు, సెంచరీ), రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్(6 మ్యాచ్‌ల్లో 39 సగటు, 152.34 స్ట్రయిక్ రేట్‌తో 195 పరుగులు, సెంచరీ) జోరును ప్రదర్శించారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ సీజన్ మొత్తానికే హైలైట్‌గా నిలిచాడు. 7 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టి సీజన్ టాప్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇందులో ఓసారి ఐదు వికెట్ల ప్రదర్శన(5/27) కూడా ఉంది. హర్షల్ తర్వాత చెప్పుకోదగ్గ బౌలింగ్ ప్రదర్శనల్లో ఆవేశ్ ఖాన్(8 మ్యాచ్‌ల్లో 14), క్రిస్ మోరిస్(7 మ్యాచ్‌ల్లో 14) ఉన్నారు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఆటగాడు ఆండ్రీ రసెల్(5/15) సీజన్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. చదవండి: ఆ మూడు బాదితే రోహిత్ ఖాతాలో మరో రికార్డు.. -
కోవిడ్ మరణాల లెక్కలు: ఐహెచ్ఎంఈ షాకింగ్ స్టడీ
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వైరస్ మరణాల లెక్కలకు సంబంధించి తాజా అధ్యయనం షాకింగ్ అంచనాలను వెలువరించింది. అనేక దేశాలు వాస్తవ గణాంకాల కంటే తక్కువ మరణాలను చూపించాయని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా భారతదేశంలో 4.3 లక్షల మేర కరోనా మరణాలను తగ్గించినట్లు యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ) పరిశోధకులు తెలిపారు 'కోవిడ్-19 కారణంగా మొత్తం మరణాల అంచనా' అనే శీర్షికతో ఐహెచ్ఎంఈ ఈ డేటాను విశ్లేషించి ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా ప్రకటించిన సంఖ్యల కంటే మొత్తం మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధ్యయనం అంచనా వేసింది. అమెరికా మరణాల సంఖ్యను 3.4 లక్షలు తగ్గించిందని అధ్యయనం చెబుతోంది. ఇతర అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందని దేశాల మాదిరిగానే ఇండియా కూడా కోవిడ్ మరణాలను తక్కువ చేసి చూపించిందని ఐహెచ్ఎంఈ తేల్చింది. భారతదేశం 4.3 లక్షల మరణాలను తక్కువగా చూపించండమో లేదా లెక్కించకపోవడమో చేసింది. అలాగే రష్యా దాదాపు 5.93 లక్షలు తగ్గించిందని అధ్యయనం కనుగొంది. మార్చి 2020- మే, 2021 వరకు సంభవించిన కోవిడ్ మరణాలపై 20 దేశాల డేటాను ఈ అధ్యయనం విశ్లేషించింది. కరోనా మరణాలపై రిపోర్టింగ్‌పై గుజరాత్, మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల అనేక మీడియా పలు నివేదికలు వచ్చాయని గుర్తు చేసింది. అలాగే ఏప్రిల్‌లో, గుజరాత్ హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిందని పేర్కొంది. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, అస్సాం, ఒడిశా, కర్ణాటక, బిహార్, హర్యానా, ఛత్తీస్గడ్ కూడా కోవిడ్-19 మరణాలను తక్కువగా నివేదించినట్లు పలు మీడియా నివేదికలు తెలిపాయని వెల్లడించింది. మరణాల నమోదు విషయంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మార్గదర్శకాలను చాలా రాష్ట్రాలు పాటించడం లేదని తెలిపింది. ముఖ్యంగా ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం కోవిడ్ సోకిన వ్యక్తి మరణిస్తే, కోవిడ్ మరణం కింద లెక్కించాల్సి ఉంటుంది. అయితే ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ కోడ్ ప్రకారం మరణించే సమయానికి కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి కోలుకుని తరువాత మరణిస్తే, కోవిడ్ లక్షణాలు లేనప్పటికీ కూడా దాన్ని కరోనా మరణంగానే నమోదు చేయాలి. తమ విశ్లేషణ ప్రకారం, మే 3, 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 6.93 మిలియన్లని తేల్చి చెప్పింది. ఇది అధికారంగా ప్రకటించిన 3.24 మిలియన్ల మరణాల కంటే మరింత ఎక్కువ అని నివేదిక వెల్లడించింది. అలాగే ఇప్పటివరకు కోవిడ్ ఆసుపత్రులు దాదాపు అన్ని ప్రదేశాలకు అధికారికంగా నివేదించిన అంశాలను పరిశీలించామని, ఇకపై కొత్తపద్దతిని అవలంబించబోతున్నామని తెలిపింది. ఇందుకు అనేక కారణాలున్నాయని పేర్కొంది. చదవండి: కరోనా: జియో ఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్లు దిగుమతి చేసుకున్న స్పుత్నిక్-వీ ధర ఎంతంటే? -
టీఆర్ఎస్ ఎదురుదాడి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, వేతన సవరణ (పీఆర్సీ) వంటి అంశాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్.. ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో ప్రతి విమర్శలకు సిద్ధమవుతోంది. తెలం గాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గడిచిన ఆరున్నరేళ్లలో యువత, నిరుద్యోగుల కోసం ఉద్యోగాల భర్తీ, వేతనాల పెంపు వంటి అంశాలపై రోజుకో నివేదిక విడుదల చేయడం ద్వారా విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, వేతనాల పెంపు వంటి అంశాలు పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకం కానుండటంతో ఆయా అంశాలకు సంబంధించిన గణాంకాలను ఎన్నికల ప్రచార ఎజెండాగా మార్చుకోవాలని నిర్ణయిం చింది. ఇందులో భాగంగానే 2014 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యో గాలు భర్తీ చేశామని, దీనిపై ఎవరికైనా సందేహాలు ఉంటే చర్చకు సిద్ధమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు రెండు రోజుల క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో సవాల్ చేశారు. దీనిపై చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్, బీజేపీ నుంచి ప్రతిస్పందన రావడంతో 1.32 లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించిన గణాంకాలను ప్రభుత్వ విభాగాలవారీగా విడుదల చేసిన కేటీఆర్... సందేహాలుంటే సంబంధిత విభాగాల్లో సరిచూసుకోవాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీపాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా మంటూ గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వహించలేమనే ప్రధాని ప్రకటనలు తదితరాలపై టీఆర్ఎస్ అటు మీడియా, ఇటు సోషల్ మీడియాలో ఎదురుదాడి చేస్తోంది. ప్రచారాస్త్రంగా వేతనాల పెంపు... వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) సిఫార్సులపై విమర్శలతోపాటు వేతన సవరణపై ప్రభుత్వ ప్రకటనలో జాప్యంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తి పట్టభద్రుల ఎన్నికలపై ప్రభావం చూపకుండా టీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. తమది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని ప్రకటించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులతో తమకున్న అనుబంధాన్ని మరోమారు తెరమీదకు తెచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత అత్యధికంగా 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేయడంతోపాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న చిరుద్యోగులకు వేతనాలు సవరించిన తీరుపై తాజాగా గణాంకాలు విడుదల చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బంది, హోంగార్డులు, జీహెచ్ఎంసీ కార్మికులు తదితరులతో సీఎం స్వయంగా భేటీ కావడంతోపాటు వేతనాలు పెంచిన విషయాన్ని ఎన్నికల ప్రచారంలో గుర్తుచేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. చిరుద్యోగుల జీతాలను రెట్టింపు చేయడంతోపాటు ప్రతి నెలా వేతనాలు అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఓట్లను కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వేతనాలు రెట్టింపు చేసిన విషయాన్ని ఎన్నికల ప్రచారాంశాల్లో చేర్చాలని పార్టీ నిర్ణయించింది. హోంగార్డుల నుంచి పారిశుద్ధ్య కార్మికుల దాకా... రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం రూ. 9 వేలుగా ఉన్న హోంగార్డుల వేతనం ప్రస్తుతం రూ. 23,250కి చేరగా, 108 సిబ్బందికి రూ. 4 వేలు చొప్పున పెరిగింది. వీఆర్ఏలకు రూ. 10,500, వీఏఓలకు రూ. 5 వేలు, కాంట్రాక్టు లెక్చరర్లకు రూ. 37,100 వేతనాలు ఇస్తున్న విషయాన్ని తాజా నివేదికలో టీఆర్ఎస్ పేర్కొంది. వీరితోపాటు ప్రధానంగా అటెండర్లు, ఉపాధి హామీ ఉద్యోగులు, సెర్ప్, ఆశా వర్కర్లు, అర్చకులు, సీఆర్టీలు, పీఈటీలు, ఏఎన్ఎంలు తదితరులకు ఆరున్నరేళ్లలో వేతనాలు పెంచిన తీరును గణాంకాలతో సహా ప్రసంగాలు, కరపత్రాలు, సామాజిక మాధ్యమాల ద్వారా ఓటర్లకు వివరించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. దీంతోపాటు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పనకు సంబంధించి పారిశ్రామిక, ఐటీ రంగాల్లో పెరిగిన ఉద్యోగ అవకాశాలపైనా గణాంకాలను విడుదల చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. -
8,536 మందికి ఒక ప్రభుత్వ డాక్టర్
సాక్షి, హైదరాబాద్: ఎంతమందికి జనాభాకు ఒక ప్రభుత్వ డాక్టర్ అందుబాటులో ఉన్నారనే నిష్పత్తిలో తెలంగాణ దేశంలో 15వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు తాజా జాతీయ ఆరోగ్య గణాంకాల నివేదిక–2019 వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లో అక్కడి జనాభాలో డాక్టర్లు ఎందరున్నారో విశ్లేషించింది. తెలంగాణలో ప్రభుత్వ అలోపతిక్ డాక్టర్ల సంఖ్య 4,123 మంది ఉన్నారు. అంటే 8,536 మంది జనాభాకు ఒక ప్రభుత్వ అలోపతిక్ డాక్టర్ ఉన్నారు. ఏపీలో 9,657 మందికి ఓ ప్రభుత్వ డాక్టర్ ఉన్నారు. తెలంగాణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 1,066 మంది డాక్టర్లు పనిచేస్తున్నారు. అంటే 33,015 మంది జనాభాకు ఒక పీహెచ్సీ డాక్టర్ ఉన్నట్లు పేర్కొంది. ఇక రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆయుష్ డాక్టర్లు 20,926 మంది ఉండటం విశేషం. అంటే ప్రతీ 1,682 మందికి తెలంగాణలో ఒక ఆయుష్ డాక్టర్ ఉన్నారు. ఆయుష్ డాక్టర్లలో దేశంలో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. అలాగే రాష్ట్రంలో మొత్తం 12,159 మంది నర్సులు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో ప్రతీ 2,894 మందికి ఒక నర్సు ఉన్నారు. ఈ విషయంలో దేశంలో తెలంగాణ 19వ స్థానంలో నిలిచింది. ఇక రాష్ట్రంలో ఫార్మసిస్టుల సంఖ్య ఏకంగా 64,881 మంది ఉండటం విశేషం. ప్రతీ 542 మంది జనాభాకు ఒక ఫార్మసిస్టు ఉన్నారని కేంద్రం తెలిపింది. ఫార్మసిస్టుల సంఖ్యలో తెలంగాణ దేశంలో ఆరో స్థానంలో నిలిచింది. ఇదిలావుండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం ప్రతీ వెయ్యి మందికి ఒక ప్రభుత్వ వైద్యుడు ఉండాలి.ఆ మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల సంఖ్య పెరగాల్సి ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. అమెరికాలో ప్రతీ 200 మందికి ఒక ప్రభుత్వ వైద్యుడు ఉండటం గమనార్హం. -
‘స్టాటిస్టిక్ ఆఫ్ ది ఇయర్’గా 332
న్యూఢిల్లీ : ఈసారి అంతర్జాతీయ ‘స్టాటిస్టిక్ ఆఫ్ ది ఇయర్’గా 332 సంఖ్యను ప్రకటించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. చైనా శాస్త్రవేత్తలు గత జనవరి పదవ తేదీన ‘సార్స్–కోవిడ్–2’ జన్యు క్రమాన్ని వెల్లడించారు. ఈ నెల, డిసెంబర్ 8వ తేదీన లండన్ వైద్యాధికారులు సమర్థంగా పనిచేసే కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇవ్వడం ప్రారంభించారు. ఈ రెండు కీలక పరిణామాల మధ్యనున్న కాలమే 332 రోజులు. అందుకే 332 సంఖ్యను ‘స్టాటిస్టిక్ ఆఫ్ ది ఇయర్’గా బ్రిటన్‌లోని అన్ని రంగాలకు సంబంధించి అతి పెద్ద అంతర్జాతీయ డేటా కలిగిన ‘రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ (ఆర్ఎస్ఎస్)’ పరిగణించే అవకాశం ఉందని అందులోని జడ్జింగ్ ప్యానెల్ సభ్యుడయిన శాస్త్రవేత్త లిబర్టీ విటర్ట్ వెల్లడించారు. ఈ రాయల్ సొసైటీ 2017 సంవత్సరం నుంచి స్టాటిస్టిక్ ఆఫ్ ది ఇయర్ సంఖ్యను ప్రకటించడమే కాకుండా ఏడాది ఉత్తమ అవార్డు, ఉత్తమ పుస్తకం అంటూ ఇతర అవార్డులను కూడా ప్రకటిస్తూ వస్తోంది. ఆ సంవత్సరానికి అమెరికా ‘లాన్‌మూవర్ ఆక్సిడెంట్స్ (లాన్‌ను కత్తిరించే యాంత్రిక వాహనం ప్రమాదాల్లో) 62 మంది చనిపోవడంతో ఆ సంఖ్యను స్టాటిస్టిక్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించారు. ‘తోటి పౌరుల తుపాకుల్లో ఇంకా ఎంత మంది అమెరికా పౌరులు మరణించాలి’ అంటూ ట్వీట్ చేసిన అమెరికా సెలబ్రిటీ కిమ్ కర్దాషియన్‌ను 2018 సంవత్సరం ‘స్టాటిస్టిక్ ఆఫ్ ది ఇయర్’ విజేతగా రాయల్ సొసైటీ ప్రకటించింది. ఈసారి కరోనా వైరస్ జన్యు క్రమాన్ని వివరించిన గత జనవరి 10వ తేదీ నుంచి ఆ వైరస్‌ను నిర్వీర్యం చేసే వ్యాక్సిన్‌ను లండన్ ఇచ్చిన డిసెంబర్ 8వ తేదీ మధ్యకాలాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ కాలానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉండడమే అందుకు కారణం. వైరస్‌లకు ఇంత త్వరగా వ్యాక్సిన్ కనుగొనడం ఇదే మొదటి సారి. (చదవండి: వందేళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్..!) క్యాన్సర్‌కు వైరస్‌కు కూడా సంబంధం సర్వికల్ క్యాన్సర్‌కు పపిల్లోమా వైరస్‌కు నేరుగా సంబంధం ఉందని 1981లో పరిశోధకులు కనుగొన్నారు. ఆ వైరస్‌ను నిర్వీర్యం చేసే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను 25 ఏళ్ల తర్వాత 2006లో అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. ఆ తర్వాత చాలా వ్యాక్సిన్లను కనుగొనేందుకు సరాసరి సగటున పదేళ్ల కాలం పట్టింది. ఆ తర్వాత గవద బిళ్ళల వ్యాక్సిన్ కనుగొనేందుకు నాలుగేళ్లు పట్టింది. కరోనా వైరస్‌కు 332 రోజుల్లో వ్యాక్సిన్‌ను కనుగొని అమల్లోకి తీసుకురావడం శాస్త్ర విజ్ఞాన రంగంలో ఓ గొప్ప ముందడుగు. శాస్త్రవేత్త లిబర్టీ విట్టర్టి వాషింగ్టన్ యూనివర్శిటీలో ప్రాక్టీస్ ఆఫ్ ది డేటాలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. -
2 లక్షలు దాటిన కరోనా కేసులు..
కరోనా వైరస్ (కోవిడ్-19) పేరు చెబితినే ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. చైనాలో మొదలైన కరోనా.. రోజురోజుకు తన విస్తృతిని పెంచుకుంటుంది. కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు, 10వేలకు పైగా మరణాలు నమోదయ్యాయంటే తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో ఇప్పటివరకు 200 మందికి పైగా సోకిన కరోనా.. నలుగురిని బలితీసుకుంది. అలాంటి కరోనా వైరస్‌కు సంబంధించిన కొన్ని గణంకాలను కింది చిత్రాల్లో చుద్దాం.. -
నేడు 2018–19 జీడీపీ గణాంకాలు
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి సంబంధించి మార్చి త్రైమాసికంసహా (జనవరి–మార్చి) 2018–19 ఆర్థిక సంవత్సరం గణాంకాలు శుక్రవారం వెలువడనున్నాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం ఈ గణాంకాలను విడుదల చేయనుంది. మార్చి త్రైమాసికంలో వృద్ధి రేటు 6.5 శాతమే ఉండే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. ఇండస్ట్రీ చాంబర్ ఫిక్కీ ఇదే అంచనాలను గురువారం వెలువరించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే, వృద్ధి రేటు 7.4– 7.1 శాతం శ్రేణిలో ఉంటుందన్నది ఫిక్కీ అంచనా. అయితే 2019–20లో 7.1 శాతం, 2020–2021లో 7.2 శాతం వృద్ధి నమోదవుతుందని తన సర్వే అంచనావేసినట్లు ఫిక్కీ వివరించింది. 2019–20లో వృద్ధి రేటు 6.8 శాతం నుంచి 7.3 శాతం వరకూ ఉంటుందని సర్వే పేర్కొన్నట్లు తెలిపింది. కాగా సకాలంలో రుణ లభ్యత, జీఎస్టీ రిఫండ్స్ జరగాలని, ఎగుమతి సంబంధిత మౌలిక రంగం మరింత మెరుగుపడాలని ఆయా అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాయనీ ఫిక్కీ సర్వే అభిప్రాయపడింది. -
మోదీ చేతిలో ఉన్నది యాభైవేలే!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ స్థిరచరాస్థుల వివరాలు వెల్లడయ్యాయి. ఈ సంవత్సరం మార్చి 31నాటికి ఆయన వద్ద ఉన్న నగదు కేవలం రూ.48,944 అని తేలింది. ఈ వివరాలను ప్రధాని కార్యాలయం(పీఎంవో) తాజాగా తన వెబ్సైట్లో పొందుపరిచింది. గత ఏడాది మోదీ వద్ద రూ.1,50,000 నగదు ఉండగా ఈ ఏడాది 67శాతం తగ్గింది. ప్రస్తుతం మోదీ మొత్తం స్థిరచరాస్థుల విలువ రూ.2.28 కోట్లు. ఇందులో చరాస్తుల విలువ రూ.1,28,50,498. స్థిరాస్తి అయిన గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న మోదీ సొంతింటి మార్కెట్ విలువ దాదాపు రూ.కోటి. అయితే, 16ఏళ్ల క్రితం ఆ ఇంటిని మోదీ కేవలం రూ.లక్షకు కొనుగోలు చేశారు. గాంధీనగర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో మోదీకి రూ.11,29,690 డిపాజిట్లు ఉన్నాయి. అదే బ్రాంచీలో మోదీ రూ.1,07,96,288 ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. మోదీకి తన పేరు మీద కారుగానీ, మరే వాహనమూ లేదు. మోదీ వద్ద బంగారు నగలు లేవు. ప్రధానికాక ముందునాటి 45 గ్రాముల బరువైన రూ.1,38,060 విలువైన నాలుగు బంగారు ఉంగరాలు మాత్రం ఉన్నాయి. మోదీ ఏ బ్యాంకులో ఎలాంటి రుణాలు తీసుకోలేదు. -
మహిళ అంటే.. మరింత పొదుపు!!
మగ, ఆడ తేడా లేకుండా ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కాకపోతే ఆర్థిక అవసరాల పరంగా చూస్తే పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగులకే ఇవి ఎక్కువనేది నిపుణుల మాట. పురుషులతో పోలిస్తే తక్కువ వేతనం, సగటు ఉద్యోగ కాలం తక్కువగా ఉండటం, జీవన కాలం ఎక్కువగా ఉండటం వంటి అంశాలను దీనికి కారణాలుగా వారు చెబుతున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవన అవసరాల కోసం ఎక్కువగా పొదుపు చేయాల్సిన అవసరం మగవారితో పోలిస్తే మహిళలకే ఉంటుంది. జీవిత భాగస్వామి ఉన్నప్పటికీ ఆర్థికంగా స్వతంత్రులైన మహిళలు జీవిత లక్ష్యాలు, అవసరాల విషయంలో ఓ ప్రణాళిక వేసుకుని దాన్ని ఆచరణలో పెట్టడం శ్రేయస్కరమనేది ఆర్థిక నిపుణుల సూచన. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం మనదేశంలో స్త్రీ, పురుషుల మధ్య వేతన చెల్లింపుల్లో వ్యత్యాసం 20 శాతం మేర ఉంటోందని ‘మాన్స్టర్’ శాలరీ ఇండెక్స్ సూచిస్తోంది. మధ్య స్థాయిలో చూస్తే పురుషులు సగటున ఓ గంట పనికి రూ.231 పొందుతుంటే, మహిళలకు లభిస్తున్నది రూ.184.80 మాత్రమే. ఇక అనుభవం పెరుగుతున్న కొద్దీ ఈ అంతరం ఇంకా అధికమవుతోంది. ఏడేళ్ల సీనియారిటీ కలిగిన వారి మధ్య అంతరం 7.8 శాతం అయితే, 11 ఏళ్లు అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న స్త్రీ, పురుషుల మధ్య వేతనం చెల్లింపుల్లో అంతరం 25 శాతంగా ఉండటం గమనార్హం. ఈ గణాంకాలను చూసిన తర్వాతయినా మహిళలు తమ అవసరాలపై కొంచెం అధిక శ్రద్ధ వహించక తప్పదు. అందుకే వీరు పురుషులతో పోలిస్తే అదనంగా పొదుపు, మదుపు చేయడం అవసరం. ఉద్యోగ కాలం కూడా తక్కువే... పై గణాంకాలను చూస్తే మహిళలకు తక్కువ వేతనాలు వస్తున్నాయని అర్థమవుతోంది. అలాగే, మహిళల ఉద్యోగ కాలం కూడా పురుషులతో పోలిస్తే తక్కువే. ఎందుకంటే పిల్లల సంరక్షణ కోసం మధ్యలో విరామం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సగటున కనీసం ఓ ఏడేళ్ల పాటు వారు ఉద్యోగానికి దూరంగా ఉంటారు. అంటే ఆ కాలంలో వారు పొదుపు, పెట్టుబడులు చేయలేరు. అంతకాలం పాటు సీనియారిటీ కూడా కోల్పోయినట్టుగానే భావించాలి. దీంతో తిరిగి ఉద్యోగంలో చేరితే వారికొచ్చే వేతనం తక్కువగా ఉంటుంది. దీనివల్ల పదవీ విరమణ సమయంలో వారికొచ్చే ప్రయోజనాల్లోనూ ఆ మేరకు కోత పడుతుంది. జీవన కాలం.. కాస్త అధికం పురుషులతో పోలిస్తే మహిళల సగటు జీవన కాలం కొంచెం ఎక్కువ. మహిళల సగటు జీవన కాలం 70 ఏళ్లు, మగవారి సగటు జీవన కాలం 67గా అంచనా. అంటే రిటైర్ అయిన తర్వాత మహిళలకు ఎక్కువ కాలం పాటు జీవన అవసరాలు ఉంటాయి. దాంతో వారికి అధిక నిధులు అవసరం అవుతాయి. కొందరు ఇంకా దీర్ఘకాలం పాటు జీవించొచ్చు. అప్పుడు ఆ అవసరాలు ఇంకా ఎక్కువ అవుతాయి. వైద్య సంరక్షణ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితుల్లో నిధుల అవసరం ఎంతో ఉంటుంది. మరింత పొదుపు చేయాల్సిందే.. మహిళలు మగవారితో పోలిస్తే కనీసం రెట్టింపు పొదుపు చేయాలి. విశ్రాంత జీవనం కోసం వేతనంలో 10 శాతానికి బదులు 20– 25 శాతం వరకూ ఇన్వెస్ట్ చేయాలనేది ఫైనాన్షియల్ ప్లానర్ పంకజ్ మాల్దే సూచన. ఒకవేళ ఉద్యోగం వచ్చిన కొత్తలో అవసరాలకు అధికంగా ఖర్చవుతూ పొదుపు చేయలేకపోతుంటే బ్యాంకు ఖాతా నుంచి పెట్టుబడులకు వెళ్లేలా ఈసీఎస్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అలాగే, ప్రావిడెంట్ ఫండ్‌లో మరింత ఇన్వెస్ట్ చేయాలి. ఇందుకోసం వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు. అంటే ఉద్యోగి తన ఈపీఎఫ్ వాటాకు సొంతంగా మరికొంత జోడించడం. దీనివల్ల మీ వేతనం నుంచి ఆటోమేటిగ్గా భవిష్యనిధికి జమ అవుతుంది. దీనిపై ఈపీఎఫ్‌కు సమానంగా వడ్డీ రేటు, పన్ను ప్రయోజనాలు లభించడం అదనపు ఆకర్షణ. మెరుగ్గా ఇన్వెస్ట్మెంట్... పొదుపు చేయడంతోనే ఆగిపోతే లాభం ఉండదు. తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి. దీర్ఘకాల లక్ష్యాల కోసం డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం తక్కువ పొదుపు చేయడం కంటే ప్రమాదమన్నది ఆర్థిక సలహాదారుల మాట. తక్కువ భాగమే డెట్‌లో ఇన్వెస్ట్‌చేసి అధిక భాగాన్ని ఈక్విటీ లేదా బ్యాలన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా, దీర్ఘకాలంలో డెట్ కంటే అధిక రాబడులను పొందొచ్చు. ఇంకో విషయం మీ లక్ష్యానికి తగ్గట్టుగానే ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. రిటైర్మెంట్కు ఎంత అవసరం అన్నది లెక్కవేసుకోవాలి. ద్రవ్యోల్బణం, పన్ను పరమైన అంశాల ప్రభావాన్ని విశ్లేషించిన తర్వాత ఆ మేరకు ఇన్వెస్ట్ చేయాలి. హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి... ఇక రిటైర్మెంట్ నిధి కరిగిపోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యమైనది వైద్య బీమా పాలసీ ఒకటి. వైద్య ఖర్చుల విషయంలో ద్రవ్యోల్బణం 12–15 శాతంగా ఉంటోంది. వృద్ధాప్యంలో జీవనశైలి వ్యాధుల ముప్పు పెరిగిపోతోంది. అందుకని పెద్ద వయసులో వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉండచ్చు. బీమా పాలసీ ఉంటే విశ్రాంత జీవన అవసరాల కోసం కష్టపడి కూడబెట్టిన నిధులు కరిగిపోకుండా ఉంటాయి. మెరుగైన వేతనం... ఇక ఉద్యోగంలో ఎదుగుదల చూసుకోవడం కూడా ముఖ్యమైన అంశాల్లో ఒకటి. అధిక వేతనం కోసం ఉద్యోగం మారడం, ఎదుగుదల లేని సంస్థను వీడటం ద్వారా అధిక ఆర్జనకు బాటలు వేసుకోవచ్చు. ఎక్కువ ఆర్జన ఉంటే పొదుపు, మదుపులకు ఎక్కువ కేటాయించుకోవచ్చు. ఇక రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక ఉద్యోగంలో కొనసాగడం అవసరమవుతుంది ఈ రోజుల్లో. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత కనీసం 15–20 ఏళ్ల పాటు జీవన కాలం ఉంటోంది. -
ఇళ్ల విక్రయాలు 40 శాతం డౌన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో 2017వ సంవత్సరం ఇళ్ల విక్రయాల పరంగా కలసిరాలేదు. అమ్మకాలు ఏకంగా 40 శాతం తగ్గి 2,02,800 యూనిట్లకు పరిమితమైనట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ సంస్థ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రో, పుణె, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో విక్రయాల గణాంకాలను విశ్లేషించింది. ‘‘నివాస గృహాల మార్కెట్ ధోరణలను పరిశీలిస్తే 2013, 2014 సంవత్సరాలు బావున్నాయి. ఆ తర్వాత ఇళ్ల విక్రయాలు క్షీణ బాట పట్టగా, ఇప్పటి వరకు ఇవి తిరిగి గాడిన పడినట్టు స్పష్టమైన సంకేతాలు ఏవీ కనిపించడం లేదు’’ అని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. 2013, 2014 సంవత్సరాల్లో వార్షికంగా సగటున 3.3 లక్షల నివాస గృహ యూనిట్లు అమ్ముడుపోయాయి. 2015–16 సంవత్సారాల్లో విక్రయాలు సగటున 2.7 లక్షల యూనిట్లకు తగ్గాయి. 2013, 2014 సంవత్సరాలతో పోలిస్తే 17 శాతం తగ్గుదల ఉందని అనరాక్ తెలిపింది. ఇక 2017లో ఇవి మరింత క్షీణించి 2,02,800 విక్రయాలకే పరిమితమైనట్టు పేర్కొంది. 2013–14 సంవత్సరాల్లో నమోదైన నివాస గృహ విక్రయాలతో పోలిస్తే 2017 సంవత్సరంలో 40 శాతం తగ్గాయని వివరించింది. పట్టణాల వారీగా... ►అధిక విక్రయాలు జరిగే ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రో ప్రాంతంలో 2013–14తో పోలిస్తే 2017లో అమ్మకాలు వరుసగా 68 శాతం, 27 శాతం చొప్పున తగ్గాయి. 2017లో ఢిల్లీ ఎన్సీఆర్లో 37,600 యూనిట్లు అమ్మడయ్యాయి. 2013–2014లో అమ్మకాలు 1,16,250 యూనిట్లుగా ఉండటం గమనార్హం. ► బెంగళూరులో 17%, చెన్నైలో 45% తగ్గాయి. ► పుణెలోనూ ఇళ్ల అమ్మకాలు 29% క్షీణించాయి. కోల్‌కతాలో అమ్మకాలు 12% తగ్గాయి. ►ఇక హైదరాబాద్ మార్కెట్లో పరిస్థితి వీటికి భిన్నంగా ఉంది. ఇక్కడ 2013–14 నాటితో పోలిస్తే 2017లో నివాస గృహాల అమ్మకాల్లో 32% వృద్ధి ఉందని అనరాక్ వెల్లడించింది. -
ప్రజారవాణాను పెంచడం పైనే తమ దృష్టి
-
‘ఒక్క నెలలో 32 లక్షల మంది ప్రయాణించారు’
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు ప్రారంభించిన ఒక్క నెలలోనే 32.25 లక్షల మంది ప్రయాణించారని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రకటన సారాంశం...అనేక సమస్యలు ఎదుర్కొని మెట్రో రైలును అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాను ఎన్నో సార్లు మదనపడ్డానని, ఎన్నో విమర్శలు కూడా వచ్చాయని చెప్పారు. తెలంగాణ వస్తే ఎల్ అండ్ టీ వెళ్లిపోతుందనే పుకార్లు కూడా వచ్చాయని అన్నారు. అన్నింటినీ తట్టుకున్నామని వ్యాఖ్యానించారు. నెల రోజుల కిందట రైలు ప్రారంభం అయిందని, ప్రి మెట్రో, పోస్ట్ మెట్రోకు సంబంధించి ముందే ప్రెజేంటేషన్ ఇచ్చానని వెల్లడించారు. రైలు ప్రారంభం అయిన తర్వాత కూడా విమర్శలు వచ్చాయని, సగటున రోజుకు లక్షమంది ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. 23 స్టేషన్ల వద్ద పార్కింగ్ సౌకర్యం ఉందని, ఒక్క ప్రకాష్ నగర్ స్టేషన్ వద్ద మాత్రమే పార్కింగ్ సౌకర్యం లేదన్నారు. ప్రజారవాణాను పెంచడం పైనే తమ దృష్టి ఉందన్నారు. కంప్యూటరైజ్డ్ స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థను త్వరంలో ప్రవేశపెడతామని చెప్పారు. కలర్ కోడింగ్‌ను అమలు చేసి పార్కింగ్ ఇబ్బందులు తొలగిస్తామన్నారు. ఫుట్ పాత్ నడకను నగర వాసులకు అలవాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు, 220 మీటర్ల ప్రాంతం ప్రతి స్టేషన్లో ఫుట్ పాత్ కోసం కేటాయిస్లున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకూ 1.5 లక్షల స్మార్ట్ కార్డులు అమ్ముడు పోయానని, 22 శాతం ప్రయాణికులు స్మార్ట్ కార్డులు ఉపయోగిస్తున్నారని తెలిపారు. ప్రతిరోజూ కొత్తగా రెండు వేల మంది ప్రయాణికులు స్మార్ట్‌కార్డులు తీసుకుంటున్నారని చెప్పారు. నాలుగైదు రోజుల్లో ప్రతి స్టేషన్లో మెట్రో టైం టేబుల్ ప్రదర్శించేవిధంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే టాయిలెట్ల ఏర్పాటు, మెయింటెనన్స్ కోసం వారంలో టెండర్లు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. -
డిమానిటైజేషన్ : మీకు తెలియని గణాంకాలు
పెద్ద నోట్ల రద్దుకు సంవత్సరం. దేశంలో ఎవరూ ఊహకు అందని ఈ నిర్ణయంతో.. ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుదేలయింది. ప్రజలంతా నిశ్చేష్టులయ్యారు. దేశంలో అసలు ఏం జరుగుతోంది? అన్న ప్రశ్న సామాన్యుడి నుంచి ఆర్థిక మేధావి వరకూ తొలిచేసింది. ఆర్థిక వేత్తలు, విశ్లేషకులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు.. ఇలా ఎవరికివారు విభిన్న విశ్లేషణలు చేశారు. ఏదైతేనేం.. పెద్దనోట్లకు కాలం చెల్లి ఏడాది. కొత్త కరెన్సీ అందుబాటులోకి వచ్చినా.. ఇంకా అది ప్రజల మన్ననలు పొందలేదనే చెప్పాలి. పెద్ద నోట్ల రద్దు తరువాత ఊహకందని గణాంకాలు మీకోసం. పెద్ద నోట్ల రద్దు ఆగస్టు 29, 2017 : వ్యవస్థలోకి తిరిగి వచ్చిన కరెన్సీ రూ.15.28 లక్షల కోట్లు డిసెంబర్ 8, 2016 : పెద్ద నోట్ల రద్దు సమయంలో కరెన్సీ విలువ రూ. 15.44 లక్షల కోట్లు (ఆర్బీఐ వార్షిక నివేదిక 2016-17 ఆధారంగా) సర్క్యులేషన్లో ఉన్న కరెన్సీ అక్టోబర్ 13, 2017 : రూ. 16.18 ట్రిలియన్లు నవంబర్ 4, 2016 : రూ. 17.97 ట్రిలియన్లు డిజిటల్ పేమెంట్స్ పీఓఎస్ యంత్రాల ద్వారా సెప్టెంబర్ 2017 : 29 లక్షలు అక్టోబర్ 2016 : 15.11 లక్షలు (ఆర్బీఐ నెలసరి డేటా ఆధారంగా) క్రెడిట్ కార్డ్స్ సెప్టెంబర్ 2017 : 23.33 కోట్లు అక్టోబర్ 2016 : 2.73 కోట్లు (ఆర్బీఐ నెలసరి డేటా ఆధారంగా) డెబిట్ కార్డ్స్ సెప్టెంబర్ 2017 : 82 కోట్లు అక్టోబర్ 2016 : 74కోట్లు (ఆర్బీఐ నెలసరి డేటా ఆధారంగా) ఏటీఎంల్లో డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ సెప్టెంబర్ 2017 : 71.78 కోట్లు అక్టోబర్ 2016 : 80.20కోట్లు (ఆర్బీఐ నెలసరి డేటా ఆధారంగా) పీఓఎస్ యంత్రాల్లో డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ సెప్టెంబర్ 2017 : 26.52 కోట్లు అక్టోబర్ 2016 : 14 కోట్లు (ఆర్బీఐ నెలసరి డేటా ఆధారంగా) ఎం వాలెట్లలో సెప్టెంబర్ 2017 : 72.72 లక్షలు అక్టోబర్ 2016 : 46.03 లక్షలు ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ ఆగస్టు 2017 వరకూ : 28.2 మిలియన్ల మంది ఆగస్టు 2016 వరకూ : 22.6 మిలియన్ల మంది వడ్డీ రేటు ఆగస్టు 2017 : 6:00 అక్టోబర్ 2016 : 6.25 పారిశ్రామిక ఉత్పత్తి సెప్టెంబర్ 2017 : +5.2 శాతం అక్టోబర్ 2016 : -1.8 శాతం (మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధారంగా) మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్టు 2017 : 3.1 శాతం అక్టోబర్ 2016 : 5.5 శాతం (మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధారంగా) ద్రవ్యోల్బణం (రిటైల్) సెప్టెంబర్ 2017 : 3.28 శాతం అక్టోబర్ 2016 : 4.2 శాతం దేశీయ కార్ల అమ్మకాలు సెప్టెంబర్ 2017 : 3,09,955 యూనిట్లు సెప్టెంబర్ 2016 : 2,78,428 యూనిట్లు (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటొమోబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆధారంగా) వడ్డీ రేట్లు (ఇంటి రుణాలు) అక్టోబర్ 2017 : 8.30 ->10 శాతం అక్టోబర్ 2016 : 9.10 ->10 శాతం స్టాక్ మార్కెట్ (బీఎస్ఈ సెన్సెక్స్) నవంబర్3, 2017 : 33,686 నవంబర్ 2016 : 27,591 పెట్రోల్ ధరలు నవంబర్ 3, 2017 : 72.43 లీటర్ నవంబర్ 6, 2016 : 69.74 లీటర్ -
వందేళ్లలోనే అశ్విన్ అరుదైన అద్భుత రికార్డు!
స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవలికాలంలో బంతిని అద్భుతంగా గింగిరాలు తిప్పుతూ.. ప్రత్యర్థులను చిత్తుచేసిన ఈ మేటి బౌలర్ తాజాగా న్యూజిల్యాండ్ సిరీస్‌లోనూ సత్తా చాటాడు. ఇండోర్‌లో న్యూజిల్యాండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఏకంగా 13వికెట్లు పడగొట్టి.. కెరీర్లోనే ఉత్తమ గణాంకాలు (13/140) నమోదు చేశాడు. మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన ఈ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్‌లో చివరి వికెట్ రూపంలో ట్రెంట్ బౌల్ట్‌ను ఔట్ చేయడం ద్వారా ఏడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అశ్విన్ సాధించిన అరుదైన రికార్డు ఏమిటంటే.. గత వందేళ్లలో ఏ బౌలర్ సాధించిన స్ట్రైక్ రేట్‌ను అశ్విన్ సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో 100 వికెట్లకుపైగా పడగొట్టిన బౌలర్లలో ఈ 30 ఏళ్ల ఇంజినీర్ ప్రథమ స్థానాన్ని ఆక్రమించాడు. టెస్టుల్లో అశ్విన్ స్ట్రైక్ రేట్ 49.4 కావడం గమనార్హం. ఒక వికెట్ పడగొట్టడానికి బౌలర్ వేసే బంతులను బట్టి అతని స్ట్రైక్ రేట్‌ను నిర్ధారిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే.. తాను వేసిన ప్రతి 50 (49.4) బంతులకు అశ్విన్ ఒక వికెట్ పడగొడుతూ వచ్చాడు. టెస్టుల్లో స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే గత వందేళ్లలో అశ్విన్ టాప్ స్థానంలో నిలువగా.. అతని తదుపరి స్థానంలో మెక్‌గిల్ (ఆస్ట్రేలియా) 54 స్ట్రైక్ రేటుతో, ఆ తర్వాతిస్థానంలో మురళీధరన్ 55 స్ట్రైక్‌రేటుతో ఉన్నారు. టాప్-10లో ఉన్న శ్రీలంక బౌలర్ రంగనా హెరాత్, ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లియన్ మాత్రమే ప్రస్తుతం ఆడుతున్న అశ్విన్ సమీకాలికులు. ఈ జాబితాలో భారత బౌలర్ బీఎస్ చంద్రశేఖర్ 13వ స్థానంలో ఉండగా, ఆయన తర్వాతి స్థానంలో అనిల్ కుంబ్లే ఉన్నారు. ఇక ఆల్‌టైమ్ టెస్టు చరిత్ర ప్రకారం చూసుకుంటే 1910లో క్రికెట్ ఆడిన ఇంగ్లిష్ బౌలర్లు జానీ బ్రిగ్స్, కొలిన్ బ్లైత్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. మూడో స్థానంలో అశ్విన్ నిలిచాడు. ఇక టెస్టు క్రికెట్లో బౌలింగ్ దిగ్గజాలుగా భావించే మురళీధరన్, షేన్ వార్న్ ఈ జాబితాలో ఐదు, ఆరు స్థానాల్లో ఉండగం గమనార్హం. -
జపాన్‌లో శతాధిక వృద్ధులు 60 వేలు
టోక్యో: జపాన్‌లో వందేళ్లకు పైబడి జీవిస్తున్న వారు 60 వేల మంది. ఈ సంఖ్య వచ్చే వారానికి 61,568కి చేరుతుంది. ఆ దేశ సంక్షేమ శాఖ ఈ గణాంకాలు ప్రకటించింది. వీరిలో 87 శాతం మంది బామ్మలే. సెప్టెంబర్ 15ను ‘సెంచరీ మార్కర్స్ సీనియర్స్ డే’గా జపాన్ ప్రకటించింది. ఆ రోజు వందేళ్లకు పైబడిన 30,379 మందికి 65 డాలర్ల విలువైన వెండి గిన్నెలను ప్రభుత్వం బహుకరించనుంది. -
ద్రవ్యోల్బణం, ఎస్బీఐ ఫలితాలపై దృష్టి
ఈ వారం గణాంకాలు - 12న రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి డేటా - 14న టోకు ద్రవ్యోల్బణం ఈ వారం ఫలితాలు - ఎస్బీఐ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, టాటా స్టీల్, సన్‌ఫార్మా న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గణాంకాలు, చివరిదశ కార్పొరేట్ ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని విశ్లేషకులు అంచనావేశారు. జూలై నెల రిటైల్ ద్రవ్యోల్బణం, జూన్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వచ్చే బుధవారం వెలువడనున్నాయి. టోకు ద్రవ్యోల్బణం డేటా శుక్రవారం వెల్లడవుతుంది. మార్కెట్లో పెట్టుబడుల కోసం ఈ గణాంకాల తీరును ఇన్వెస్టర్లు పరిశీలిస్తారని క్యాపిటల్ వయా రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. . కార్పొరేట్ ఫలితాల సీజన్ చివరిదశకు వచ్చింది. ఈ దశలో ఎస్బీఐ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, టాటా స్టీల్, సన్‌ఫార్మా తదితర బ్లూచిప్ కంపెనీలు క్యూ1 ఫలితాల్ని ఈ వారం ప్రకటించనున్నాయి. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల్లో అనూహ్యమైనవి ఏవీ లేవని, దాంతో ఇన్వెస్టర్లు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని నిపుణులు చెప్పారు. ఈ వారం వెల్లడయ్యే బ్లూచిప్ ఫలితాలు ఆశ్చర్యకరంగా వుంటే మార్కెట్ ట్రెండ్ మారుతుందని వివేక్ గుప్తా వివరించారు. పార్లమెంటు వైపు చూపు పార్లమెంటులో భూసేకరణ బిల్లు, జీఎస్టీ బిల్లుల ప్రగతిపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి కేంద్రీకరిస్తారని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ అన్నారు. ఇప్పటివరకూ వివాదాల కారణంగా పార్లమెంటు సమావేశాల్లో బిల్లులకు సంబంధించి ముందడుగు ఏదీ పడలేదని, ఈ వారమైనా ప్రగతి వుండవచ్చన్న ఆశలు ఇన్వెస్టర్లలో ఉన్నాయని ఆయన అన్నారు. ఆగస్టు 13తో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి. అమెరికా జాబ్స్ డేటాకు స్పందన.. గత శుక్రవారం వెలువడిన అమెరికా జాబ్స్ డేటాకు స్పందనతో ఈ సోమవారం మార్కెట్ మొదలవుతుందని విశ్లేషకులు తెలిపారు. జూలై నెలలో అమెరికాలో కొత్త ఉద్యోగ కల్పన అంచనాలకంటే మెరుగ్గా జరిగినట్లు డేటా వెలువడటంతో సెప్టెంబర్ నెలలో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. దాంతో శుక్రవారం అమెరికా స్టాక్ సూచీలు క్షీణించాయి. మన దేశంలో ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలను బట్టి ఇక్కడ రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు నెలకొంటే మార్కెట్ పెరుగుతుందని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ టెక్నికల్ హెడ్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. అయితే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచవచ్చని ఆర్బీఐ భావిస్తే , ఇక్కడి వడ్డీ రేట్ల తగ్గుదలకు బ్రేక్‌పడుతుందని, ఈ దిశగా అంచనాలు మార్కెట్‌ను క్షీణింపచేస్తుందని, వెరసి మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని జేమ్స్ విశ్లేషించారు. గతవారం మార్కెట్... గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 122 పాయింట్ల పెరుగుదలతో 28,236 పాయింట్ల వద్ద ముగిసింది. కాగ్నిజెంట్ మంచి గెడైన్స్‌ను ప్రకటించడంతో క్రితం వారం ఐటీ షేర్లు ర్యాలీ జరిపాయి. ఐదు రోజుల్లో 2,200 కోట్ల పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు భారత్ క్యాపిటల్ మార్కెట్లో ఆగస్టు నెల తొలి ఐదు ట్రేడింగ్ రోజుల్లో రూ. 2,200 కోట్లు పెట్టుబడి చేశారు. ఆగస్టు 3-7 తేదీల మధ్య విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఈక్విటీల్లో రూ. 1,552 కోట్లు, రుణపత్రాల్లో రూ. 631 కోట్లు పెట్టుబడి చేసినట్లు సెంట్రల్ డిపాజిటరీల డేటా వెల్లడిస్తున్నది. -
లంకలో కొత్త నీరు!
అందరూ ఊహించినట్టే, సర్వేలన్నీ జోస్యం చెప్పినట్టే శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స అక్కడ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. విపక్షానికి చెప్పుకోదగ్గ నాయకుడే లేని స్థితిని అదునుగా తీసుకుని, తనపై అంతకంతకూ పెరుగుతున్న అసంతృప్తిని పసిగట్టి... ఇప్పుడే ఎన్నికలకు వెళ్లడం ఉత్తమమని రాజపక్స భావించారు. పైగా ఆయనకు సంఖ్యా శాస్త్రంపై అపారమైన నమ్మకం. ఇటు సంవత్సరమూ, అటు తేదీ తన అదృష్ట సంఖ్య 8కి సరిపోయేలా ఉన్నాయి గనుక... జనవరి 8న ఎన్నికలు జరిగేలా ఆయన చూశారు. అన్నీ సరిపోయినా అధికార పీఠం అందుకోవడానికి తప్పనిసరైన జనం మద్దతు మాత్రం ఆయనకు లేకుండా పోయింది. ఇందుకు రెండే కారణాలు-ఆయన కుటుంబ పాలన, దానితో పెనవేసుకుపోయిన అవినీతి. రాజపక్స ఇద్దరు సోదరులు మంత్రులుకాగా, మరో సోదరుడు పార్లమెంటు స్పీకర్, కుమారుడు ఎంపీ. మొన్నటి నవంబర్‌లో ఎన్నికలు ప్రకటించిన రెండురోజుల తర్వాత అప్పటికి రాజపక్స ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా, నంబర్ టూ గా ఉన్న మైత్రిపాల సిరిసేన తన పదవికి రాజీనామా చేసి విపక్ష శిబిరంలో చేరి ఉండకపోతే ఇదంతా యథాతథంగా కొనసాగేదేమో! ఎల్టీటీఈని తుడిచిపెట్టడాన్ని స్వాగతించిన సింహళ బౌద్ధులు 2009 ఎన్నికల్లో రాజపక్స వెనక గట్టిగా నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో మైనారిటీ వర్గాలైన తమిళులు (15.3శాతం), ముస్లింలు (9.3 శాతం), క్రైస్తవులు (7.4శాతం) అనేక కారణాలవల్ల చీలివున్నారు. మొత్తంగా 32 శాతంగా ఉన్న మైనారిటీలు ఆ ఎన్నికల్లో విడివడి ఉండటంతో రాజపక్స ఘనవిజయం సాధించగలిగారు. ఈసారి పరిస్థితి తారుమారైంది. మెజారిటీ సింహళుల్లో చీలిక వచ్చి ఎక్కువ మంది ఆయనకు వ్యతిరేకమయ్యారు. వీరి మద్దతును తిరిగి పొందడం కోసం ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. తాను తప్పుకుంటే మళ్లీ తమిళ టైగర్లు విజృంభిస్తారని హెచ్చరించారు. సింహళులకూ, ముస్లింలకూ మధ్య...సింహళులకూ, క్రైస్తవులకూ మధ్య ఘర్షణలు రెచ్చగొట్టాలని చూశారు. అయితే, ఇది ఫలించలేదు సరిగదా...మైనారిటీలతో సింహళులు కూడా జతకట్టారు. ఫలితంగా సిరిసేన 51.3 శాతం ఓట్లతో నెగ్గగలిగారు. ముస్లింలు, తమిళులు అధికంగా ఉండే ప్రాంతాల్లో సిరిసేన 70 శాతానికిపైగా ఓట్లు తెచ్చుకోగలగడం రాజపక్సపై ఆ వర్గాల్లో ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తుంది. విపక్షాల అభ్యర్థిగా అధ్యక్ష పీఠాన్ని గెలుచుకున్న సిరిసేనకు అసలు అగ్నిపరీక్షలు ఇప్పుడు మొదలవుతాయి. ఆయన ముందుగా తన అధికారాలను తాను రద్దు చేసుకోవాల్సి ఉన్నది. తాను అధికారంలోకొచ్చిన వెంటనే దేశంలో నియంతృత్వానికి తావిస్తున్న అధ్యక్ష తరహా పాలనకు స్వస్తి పలుకుతానని సిరిసేన వాగ్దానం చేశారు. దేశంలో తిరిగి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నెలకొల్పుతానన్నారు. అధ్యక్ష తరహా పాలనలో ఉండే లొసుగులవల్లే ప్రభుత్వ ఖజానాను రాజపక్స అయినవారికి దోచిపెట్టారని సిరిసేన ప్రచారం చేసివున్నారు. దిగువ మధ్యతరగతి, పేద వర్గాలవారి బతుకులు దుర్భర ం చేస్తున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలనూ, ఇతర నిత్యావసరాల ధరలనూ తగ్గిస్తామని చెప్పారు. వీటితోపాటు రాజపక్స కుటుంబం చెప్పినట్టల్లా ఆడిన పోలీసు విభాగాన్ని పట్టాలెక్కించి దేశంలో చట్టబద్ధ పాలనను పునరుద్ధరించడం, న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని పునఃప్రతిష్టించి, రాజపక్స కారణంగా పదవి కోల్పోయిన షిరానీ బండారునాయకేను మళ్లీ చీఫ్ జస్టిస్‌గా నియమించడం వంటివి దేశ ప్రజలు సిరిసేన నుంచి తక్షణం ఆశిస్తున్నవి. ఇవిగాక ఆయన సమర్థతకు పరీక్షపెట్టే ఇతర అంశాలు చాలా ఉన్నాయి. రాజపక్స పాలనలో టైగర్ల అణచివేత పేరిట తమిళులపై సాగించిన దురంతాలపై ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో విచారణకు సిద్ధపడటం అందులో కీలకమైనది. సైన్యం అత్యాచారాల సమయంలో సిరిసేన కొద్దికాలం రక్షణ మంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయనను బలపరిచిన సింహళ జాతీయవాద పార్టీలు ఇలాంటి విచారణకు ససేమిరా అంటున్నాయి. అలాగే తమిళ పార్టీల ఆధ్వర్యంలో ఉన్న ఉత్తర తూర్పు ప్రాంత మండలికి అధికారాలను ఇచ్చేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించాలన్న డిమాండును నెరవేర్చడం సిరిసేనకు తలకు మించిన భారం. దీనికి సంబంధించిన 13వ రాజ్యాంగ సవరణను సింహళ పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. సిరిసేనకు మద్దతిచ్చిన తమిళ పార్టీలు మాత్రం ఆ సవరణ తీసుకురావల్సిందేనంటున్నాయి. వీటన్నిటితోపాటు లంక ఆర్థిక వ్యవస్థతో పెనవేసుకుపోయిన చైనా ప్రభావాన్ని తగ్గించడం సిరిసేనకు పెను సవాలు. చైనాకు దగ్గరకావాలన్న ఉద్దేశంతో అధిక వడ్డీరేట్లపై ఆ దేశంనుంచి భారీ మొత్తంలో రాజపక్స రుణాలు తీసుకొచ్చారు. ఆయన ఓటమికి ఈ రుణభారం కూడా ఒక కారణం. భారత్‌కు వ్యతిరేకంగా ఒక్కొక్క దేశాన్నే చేరదీయాలన్న చైనా వ్యూహంలో భాగంగానే లంకకు భారీ మొత్తంలో రుణాలు అందజేసింది. ఆ దేశానికి చెందిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. శ్రీలంక సైన్యం ఉపయోగిస్తున్న రక్షణ పరికరాల్లో 70 శాతం ‘మేడిన్ చైనా’ గుర్తువే. దీన్నంతటినీ తిరగదోడటం, భారత్‌కు సన్నిహితం కావడం సిరిసేనకు పెద్ద పరీక్షే. ఈ విషయంలో ఆయన ఏం చేస్తారన్న విషయంలో చైనా, భారత్‌లే కాదు...ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. మరోపక్క లంక గడ్డపైనుంచి భారత్ లక్ష్యంగా పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కార్యకలాపాలు కొంతకాలంగా సాగుతున్నాయి. రాజపక్స హయాంలో లంకలో పెరిగిన చైనా, పాక్‌ల పలుకుబడి తగ్గించాలని భారత్ కృతనిశ్చయంతో ఉన్నది. అందువల్లనే సిరిసేన నెగ్గిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు చెప్పడంతోపాటు భారత్ సందర్శించాలని ఆహ్వానించారు. లంకలో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆ దేశంతో మన సంబంధాలు ఏ మేరకు మెరుగుపడగలవో చూడాల్సి ఉన్నది. -
బాబోయ్ బుధవారమే!
*ఆ ఒక్కరోజే బెంగళూరులో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు *మధ్యాహ్నం 12 నుంచి 3గంటల మధ్యలో బెంగళూరు: బుధవారం అంటే బెంగళూ రు వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుం టున్నారు. ఆ ఒక్కరోజే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2014 ఏడాదిలో మొత్తం 5004 రోడ్డు ప్రమాదాలు జరగగా అందులో ఒక్క బుధవారమే 803 ప్రమాదాలు జరిగాయి. అంతకు ముందు ఏడాది (2013)తో పోలిస్తే ఈ సంఖ్య 31 ఎక్కువగా ఉండడం గమనా ర్హం. అటుపై రెండోస్థానంలో శనివారం ఉం టోంది. ఆ రోజు 773 రోడ్డు ప్రమాదాలు జరి గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది బెంగళూరు పరిధిలో జరిగిన రోడ్డు ప్ర మాదాలను అనుసరించి నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం రూపొందించిన గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రమాద మృతులు, క్షతగాత్రుల విషయం లో మహిళలతో పోలిస్తే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది. మృతుల్లో 599 పురుషు లు, 130 మహిళలు ఉండగా క్షతగాత్రుల్లో ఆ సంఖ్య 3,165,933గా ఉంది. వయస్సును ప్రతిపాదికన తీసుకుంటే మృతుల్లో 31 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నవారు ఎక్కువగా ఉండగా క్షతగాత్రుల విషయంలో 19 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. * మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది ఆ సమయంలో మొత్తం 898 ప్రమాదాలు జరిగాయి. తర్వాత ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య 897 ప్రమాదాలు జరిగాయి. * రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహనాల్లో లైట్ మోటార్ వెహికల్స్ (1,424), ద్విచక్రవాహనాలు (1,420) వరుసగా మొదటి, రెండో స్థానంలో ఉన్నాయి. * రోడ్డు ప్రమాదాల మృతుల్లో ఎక్కువగా ద్విచక్రవాహనదాలు (332), అటుపై పాదచారులు (331) ఉన్నారు. * మొత్తంగా 2004 ఏడాదిలో 5,004 రోడ్డు ప్రమాదాలు జరుగగా అందులో 729 మంది చనిపోయారు. * 2005లో బెంగళూరులో 24,67,270 వాహనాలు ఉండగా 2014 నవంబర్‌కు ఆ సంఖ్య 53,92,847కు పెరిగింది. రూ.65 కోట్ల అపరాధ రుసుం వసూలు ‘2014 ఏడాదిలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిన వారికి సంబంధించి మొత్తం 74,36,336 కేసులు నమోదు చేశాం. వీరి నుంచి రూ.65,92,21,449ను అపరాధ రుసుం వసూలు చేశాం. నగర ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న కఠిన నిబంధనలతో పాటు ప్రజల ఆలోచన విధానంలో వస్తున్న మార్పుల వల్ల 2013 ఏడాది కంటే 2014 ఏడాదిలో రోడ్డు ప్రమాదాల సంఖ్యతో పాటు మృతులు, క్షతగాత్రుల సంఖ్య తగ్గింది.’ - దయానంద, అదనపు కమిషనర్ (ట్రాఫిక్), బెంగళూరు -
ఆయన ఒక అంకెల మాంత్రికుడు
బాల్యంలో ఎక్కాలతో ఆటాడుకున్న ఆ బాలుడు గణాంకశాస్త్రంలో మేటి శాస్త్రజ్ఞుల సరసన నిలబడ్డారు. సాంఖ్యశాస్త్రం పేరు చెబితే నేటికీ డా॥సి.ఆర్.రావు గురించి తప్పక పేర్కొంటారు. 14 పుస్తకాలు, 350 పరిశోధనా పత్రాలు వెలువరించిన వీరు నేటికీ పరిశోధిస్తూనే ఉన్నారు. అమోఘమైన ప్రతిభ, అపారమైన పట్టుదల, అమితమైన భాషాభిమానం, అమేయమైన దేశ భక్తి - ఒకే వ్యక్తిలో మేళవించడం అసాధా రణ సందర్భం! అలాంటి వ్యక్తి జగదీశ్ చంద్రబోస్, శ్రీనివాస రామానుజం, సీవీ రామన్, హరగోవింద ఖొరానా, సత్యేంద్రనాథ్ బోస్, హోమీ జహంగీర్ భాభా, జి.ఎన్.రామచం ద్రన్, హరీష్ చంద్ర వంటి మహామహుల సరసన నిలవడం ఇంకా అపురూ పం!! ఈ అంకెల అద్భుతం, గణాంక శాస్త్ర శిఖరం పేరు డా॥కల్యంపూడి రాధాకృష్ణా రావు. ఈ పూర్తి పేరుతో పేర్కొంటే ఈయన తెలుగువాడని మనకు తెలియవచ్చు కానీ, ప్రపంచంలో చాలా మందికి తెలియకపో వచ్చు. ఎందుకంటే డా॥సి.ఆర్. రావుగానే వారు అంతర్జాతీయ కీర్తి పొందారు. 93 ఏళ్లు నిండిన ఈ ముదుసలి ఇంకా యావత్ ప్రపంచం గర్వించే రీతిలో నేటికీ స్టాటిస్టిక్స్ పరిశోధన చేస్తున్నారు. వారి దేశ భక్తి గురించి విశదం చేసే రెండు సందర్భాలు చూద్దాం. 1963లో డా॥సి.ఆర్.రావు గారికి భట్నాగర్ అవార్డు ప్రకటించారు. ఆ సమ యంలో మన దేశం చైనాతో యుద్ధంలో పోరాడుతోంది. అప్పటి ప్ర ధాని జవహర్లాల్ నెహ్రూ ఈ అవార్డు ప్రదానం చే స్తూ పదివేల రూపాయల నగదును రావు గారికి అం దించారు. ‘ఈ డబ్బు నాకన్నా దేశానికే ఎక్కువ అవసరమం’టూ ప్రధాన మంత్రి నిధికి విరాళంగా తిరిగి ఇచ్చారు. దాంతో నెహ్రూ పొంగిపోయి ఆయ న్ను కావులించుకున్నారు. ఇది 1963 ముచ్చట. 2010 సంగతి చూద్దాం. రావు జీవిత కాలపు కృషికి ఇండియా సైన్స్ అవార్డు పేర 25 లక్షల రూపా యల అవార్డును నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రదానం చేశారు. ఈ అవార్డును హైద రాబాద్‌లో స్వీకరిస్తూ - ఆ ధనంతో గణితం, గణాంకశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ రంగాల కొరకు ప్రపంచస్థాయి సంస్థను ప్రారంభి స్తున్నట్లు ప్రకటించారు. దాంతో పొంగిపో యిన ప్రధాని రూ.15 కోట్లు మంజూరు చేశా రు. రావు సతీమణి భార్గవి తాను దాచుకున్న నగలు, ధనం ఈ సంస్థకు విరాళంగా ఇవ్వడం కొసమెరుపు. అలా ఏర్పడినదే సీఆర్ రావ్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేథమేటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. జాతీయ, అంతర్జాతీ య విశ్వవిద్యాలయాలు ఆయనకు 30కి పైగా డాక్ట రేట్లు ఇచ్చాయి. అలా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చిన గౌరవ డాక్టరేట్‌ను స్వీకరిస్తూ - థీసెస్సు రాని డాక్టరేటు తీసుకుంటానం టే, అప్పుడు తిరస్కరించి ఇప్పుడు పళ్లెంలో పెట్టి ఇస్తున్నారని ఆయన చమ త్కరించారు. దరఖాస్తు చే యడంలో రెండు రోజులు ఆలస్యమైందని నాటి ప్రిన్సిపల్ విస్సా అప్పా రావు, వైస్ చాన్స్‌లర్ సీఆర్ రెడ్డి కుదరదన్నా రు మరి. అప్పట్లోనే ఆర్మీ సర్వే యూనిట్లో మేథమేటిషియన్ ఉద్యోగం కోసం కలకత్తా వెళ్లారు. అక్కడ ఎంపిక కాలేదు, కానీ బస చేసిన హోటల్ దగ్గర పరిచయమైన సుబ్ర మణ్యం ఒక గొప్ప పనిచేశాడు. కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూ ట్లో పనిచేస్తున్న డా॥మహల్నాబీస్ గారికి పరిచయం చేశారు. శిక్షకుడిగా చేరి, అక్కడే ఎంఏ స్టాటిస్టిక్స్ చేసి - అదే సంస్థలో పదవీ విరమణ చేశారు రావుగారు. సాంఖ్యశాస్త్రం లేదా గణాంకశాస్త్రం గురిం చి చెప్పుకొన్నప్పుడు రావు గురించి తప్పక పేర్కొంటారు. అంత గొప్పది మరి ఆయన కృషి. పాతికేళ్ల వయసులో ప్రతి పాదించిన ‘క్రామర్-రావ్’ ఇనీక్వాలిటీ ఎంతో పేరు గాంచింది. ఇంకా వారి పేరుతో పలు ఆవిష్కరణలున్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ గౌరవాన్ని పొందిన సిద్ధాంతాలు. 14 పుస్తకాలు, 350 పరిశోధనా పత్రాలు వెలు వరించిన వీరు నేటికీ పరిశోధన చేస్తున్నారు. జీవిత వివరాలు: కర్ణాటకలో ఉండే హవి న హడగల్లిలో సి.దొరైస్వామి నాయుడు - లక్ష్మీకాంతమ్మ దంపతులకు 1920, సెప్టెంబర్ 10న రాధాకృష్ణ జన్మించాడు. అష్టమ సంతా నానికి శ్రీకృష్ణుడి పేరు పెట్టుకోవడం ఒక సం ప్రదాయం. గూడూరు, నందిగామ, నూజి వీడు, విశాఖపట్నంలలో విద్యాభ్యాసం సాగిం ది. తండ్రి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌గా పని చేస్తూ, బదిలీ కావడమే కారణం. తల్లి ప్రేర ణతో, చాలా చిన్న వయసులో ఎక్కాలే కాదు, వేటూరి ప్రభాకరశాస్త్రి చాటు పద్య మణిమం జరిని కూడా ఆరాధించాడు. ఎనిమిదో తరగతి నుంచి విశాఖపట్నంలోని మిసెస్ ఏవీఎన్ కాలేజీలో చదివారు. అక్కడే చదివిన విఖ్యాత శాస్త్రవేత్త సీవీ రామన్ తన తండ్రి పేర చంద్రశేఖర్ అయ్యర్ స్కాలర్షిప్ ఏర్పరి చా రు. దీన్ని సి.ఆర్.రావు రెండుసార్లు పొందడం విశేషం. (వ్యాసకర్త ఆకాశవాణి ప్రయోక్త) డా॥వేణుగోపాల్ -
దేశాభివృద్ధిలో స్టాటిస్టిక్స్ పాత్ర కీలకం
సెంట్రల్ యూనివర్సిటీ: దేశాభివృద్ధిలో గ ణాంకాల (స్టాటిస్టిక్స్) పాత్ర కీలకమని ప్రధాని మాజీ ఆర్థిక సలహాదారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్ సి.రంగరాజన్ అభిప్రాయపడ్డారు. సెంట్రల్ యూనివర్సిటీలోని సీఆర్. రావు స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ఆదివారం 8వ స్టాటిస్టిక్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా సి.రంగరాజన్ మాట్లాడుతూ సాంకేతిక శాస్త్రాన్ని, ఆధునిక టెక్నాలజీలో విరివిగా వినియోగిస్తున్నారని తెలిపారు. దేశానికి సాంకేతిక శాస్త్రవేత్తల అవసరం ఉందన్నారు. స్టాటిస్టిక్స్‌కు భారత్ మూలమని, సిఆర్. రావు లాంటి వ్యక్తులు ఈ రంగంలో ఖ్యాతి గడించారని అన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జగన్నాథరావు మాట్లాడుతూ న్యాయ సమస్యలను పరిష్కరించడంలో గణాంకాలు కీలకంగా మారుతున్నాయని పేర్కొన్నారు. దేశంలోని పలు పెండింగ్ వివాదాలను గణాంకాల ఆధారంగా పరిష్కరించిన ఘటనలను గుర్తుచేశారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యాభివృద్ధి జరగాలని సూచించారు. అప్పుడే దేశాభివృద్ది సాధ్యమన్నారు. స్టాటిస్టికల్ ఒలింపియాడ్‌లో విజేతలైన పలు పాఠశాలల విద్యార్థులకు రంగరాజన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ద్రవిడ యూనివర్సిటీ మాజీ వీసీ అరుణాచలం, హెచ్‌సీయూ వైస్‌ఛాన్సలర్ హరిబాబు, సీఆర్ రావు ఇనిస్టిట్యూట్ డెరైక్టర్ అల్లం అప్పారావు, ప్రొఫెసర్ యుగేందర్, ఎస్‌బీరావు, తదితరులు పాల్గొన్నారు. -
అరుదైన కోర్సు.. అద్భుత అవకాశాలు!!
స్టాటిస్టిక్స్ (సాంఖ్యక శాస్త్రం).. సర్వేలు, డేటాలు, పైచార్ట్‌లు, ఫ్లోచార్ట్లతో ఆయా అంశాలను సమగ్రంగా విశ్లేషించే సబ్జెక్ట్! సెన్సస్ నుంచి స్పేస్ రీసెర్చ్ వరకూ.. నేడు స్టాటిస్టిక్స్ అవసరం లేని రంగం లేదంటే అతిశయోక్తికాదు!! స్టాటిస్టీషియన్లు టన్నులకొద్దీ డేటాను సునిశితంగా పరిశీలించి.. విశ్లేషించి.. సమస్యకు సచిత్రంగా పరిష్కారం చూపెడతారు. ఆర్థిక గణాంకాల విశ్లేషణ, జనాభా, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగం మొదలు అంతరిక్ష పరిశోధన వరకూ.. ఆయా రంగాల్లో డేటాను విశ్లేషించేందుకు స్టాటిస్టిక్స్ స్కిల్స్ ఉన్నవారి అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. విద్యార్థులు స్టాటిస్టిక్స్ కోర్సును పూర్తిచేయడం ద్వారా అద్భుత అవకాశాలు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు సీఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ (ఏఐఎంఎస్సీఎస్) డైరెక్టర్ డాక్టర్ అల్లం అప్పారావు. ఆయనతో గెస్ట్‌కాలమ్.. దశాబ్దాల క్రితమే స్టాటిస్టిక్స్ అవసరాన్ని ప్రభుత్వం, ఆర్థికవేత్తలు దశాబ్దాల క్రితమే గుర్తించారు. ఆ క్రమంలోనే ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ పి.సి.మహలనోబిస్ ఆధ్వర్యంలో 1931లో కోల్‌కతాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ) ఏర్పాటైంది. ప్రస్తుతం కోల్‌కతాతోపాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, తేజ్‌పూర్‌లలో ఈ సంస్థ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో అకడమిక్ కోర్సుల బోధన సాగుతోంది. అవగాహన పెరగాలి దశాబ్దాల క్రితమే స్టాటిస్టిక్స్ ఆవశ్యకతను గుర్తించి ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసినా.. నేటికీ ఈ కోర్సుల పట్ల అవగాహన ఆశించిన స్థాయిలో లేదు. దేశంలోని యూనివర్సిటీలు బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో భాగంగా కొన్ని కాంబినేషన్లలో స్టాటిస్టిక్స్ను ఒక సబ్జెక్ట్‌గా బోధిస్తున్నాయి. దానివల్ల విద్యార్థులకు పూర్తిస్థాయి నైపుణ్యాలు లభించడంలేదు. కాబట్టి ఈ విషయంపై విద్యావేత్తలు, ఇన్స్టిట్యూట్లు దృష్టిసారించి పూర్తిస్థాయి కోర్సుల రూపకల్పన దిశగా కృషిచేయాలి. స్టాటిస్టిక్స్ కోర్సులు అభ్యసించినవారికి అందివస్తున్న అవకాశాలపై అవగాహన కల్పించాలి. స్టాటిస్టిక్స్ పట్ల పాఠశాల స్థాయి నుంచే అవగాహన పెంచేందుకు సీఆర్ రావు ఏఐఎంఎస్సీఎస్ కృషి చేస్తోంది. ఈ క్రమంలో పదోతరగతి, 10+2 ఉత్తీర్ణులకు ప్రతిఏటా ఏప్రిల్/మే నెలల్లో జాతీయస్థాయిలో స్టాటిస్టిక్స్ ఒలింపియాడ్ నిర్వహిస్తున్నాం. మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దీనికి అర్హులు. పీజీ స్థాయిలోనైనా మన దేశంలో బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ కోర్సుపై పెద్దగా అవగాహనలేదు. కాబట్టి స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌గా డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు పలు ఇన్స్టిట్యూట్లు పీజీ స్థాయిలో స్టాటిస్టిక్స్ స్పెషలైజేషన్‌ను అందిస్తున్నాయి. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు పీజీ స్థాయిలోనైనా స్టాటిస్టిక్స్‌లో చేరి, మంచి అవకాశాలను అందుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ల సంఖ్య పెంచాలి బ్యాచిలర్, మాస్టర్ స్థాయిలో పూర్తిస్థాయి స్టాటిస్టిక్స్ కోర్సులు అందించే ఇన్స్టిట్యూట్ల సంఖ్య పెరగాలి. నేటికీ ఐఎస్ఐ- కోల్‌కతా, దాని అనుబంధ నాలుగు క్యాంపస్‌లు, తమిళనాడులో నాలుగైదు ఇన్స్టిట్యూట్లు, ఇలా పరిమిత సంఖ్యలోనే స్టాటిస్టిక్స్ కోర్సును అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఇవి స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలను అందిస్తున్నాయి. మన రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పూర్తిస్థాయి మాస్టర్స్ కోర్సు అందుబాటులో ఉంది. ఈ మొత్తం ఇన్స్టిట్యూట్ల నుంచి రెండు వేల మందిలోపు మాత్రమే స్టాటిస్టిక్స్ కోర్సులు పూర్తిచేసుకొని బయటకు వస్తున్నారు. అయితే, మార్కెట్ అవసరాలను పరిశీలిస్తే.. వేల సంఖ్యలో స్టాటిస్టీసియన్ల అవసరముంది. ఒక్క ప్రభుత్వ విభాగంలోనే అనేక అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వం కొత్తకొత్త పథకాలు ప్రవేశపెడుతుండటంతో.. అందుకు సంబంధించిన డేటా సేకరణలో స్టాటిస్టిక్స్ నైపుణ్యాలున్న వారి అవసరం పెరుగుతోంది. అవసరాలకు తగ్గట్లు రాష్ట్ర స్థాయిలోని యూనివర్సిటీలు పూర్తిస్థాయి స్టాటిస్టిక్స్ కోర్సులకు రూపకల్పన చేయాలి. సీఆర్ రావు ఏఐఎంఎస్సీఎస్ ఉద్దేశమిదే సీఆర్‌రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ప్రధాన ఉద్దేశం.. స్టాటిస్టిక్స్ కోర్సులతో అందుబాటులోకి వస్తున్న అవకాశాల గురించి విద్యార్థుల్లో అవగాహన కల్పించడం.. అందుకు తగిన కోర్సులు రూపొందించడం. ప్రస్తుతం ప్రధానంగా పరిశోధనలపై దృష్టిసారిస్తున్నాం. భవిష్యత్‌లో బ్యాచిలర్, మాస్టర్స్ స్థాయి కోర్సులు ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్నాం. అందుకు అవసరమైన మౌలికవసతుల కల్పన విషయంలో ప్రభుత్వాలు ఆర్థిక చేయూతనందిస్తే మా లక్ష్యం త్వరగా నెరవేరుతుంది. తద్వారా విద్యార్థులకు చక్కటి కెరీర్ సొంతమవుతుంది. అంతేకాకుండా స్టాటిస్టీషియన్ల నైపుణ్యం సమాజంలోని పలు సమస్యల పరిష్కారానికి దోహదపడుతుంది. మల్టీడిసిప్లినరీ దృక్పథం సీఆర్‌రావు ఏఐఎంఎస్సీఎస్.. ఈ ఇన్స్టిట్యూట్ పేరులోనే మూడు కోర్సులు ప్రతిబింబిస్తాయి. దీని అర్థం.. మల్టీ డిసిప్లినరీ విధానంలో పరిశోధనలు చేపట్టడం. స్టాటిస్టిక్స్‌కు వెన్నెముక మ్యాథమెటిక్స్. కాగా ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ కూడా కీలకంగా మారింది. అందుకే మేం చేపట్టే పరిశోధనల్లో ఈ మూడు అంశాలను సమ్మిళితం చేసేలా ప్రణాళికలు రూపొందించి, ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. పరిశోధనలతో పలు ప్రయోజనాలు ప్రస్తుతం స్టాటిస్టిక్స్‌తో పీజీ పూర్తికాగానే ఉద్యోగాలు లభిస్తున్న పరిస్థితి ఉంది. అయితే, పీజీ స్థాయిలో స్టాటిస్టిక్స్ కోర్సు పూర్తిచేసిన వారు పీహెచ్డీ దిశగా అడుగులు వేస్తే మరిన్ని అవకాశాలు సొంతమవడం ఖాయం. ఈ విభాగంలో మానవ వనరులకు ఉన్న డిమాండ్-సప్లయ్ వ్యత్యాసాల కారణంగా.. పీజీ కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. దాంతో చాలా తక్కువమంది మాత్రమే పరిశోధనల వైపు దృష్టిసారిస్తున్నారు. వందకోట్లకు పైగా జనాభా కలిగిన మన దేశంలో స్టాటిస్టిక్స్ అంశంపై పరిశోధనలు చేస్తున్న వారి సంఖ్య 200 లోపే ఉండటం గమనార్హం. విదేశాల్లో పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. ముఖ్యంగా అమెరికా, యూకే లాంటి దేశాల్లో లక్షలమంది విద్యార్థులు స్టాటిస్టిక్స్‌లో రీసెర్చ్, అడ్వాన్స్డ్ రీసెర్చ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రైవేట్.. ప్రభుత్వం రెండు విభాగాల్లోనూ స్టాటిస్టిక్స్ నిపుణుల అవసరం ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేట్ రంగంలోనూ అధికంగా ఉంది. ప్రైవేట్ రంగంలో యువత ఎంతో క్రేజీగా భావిస్తున్న ఐటీ,సాఫ్ట్వేర్ మొదలుకొని.. మెడికల్ సైన్స్, టెలికాం, మొబైల్ కమ్యూనికేషన్, ఫార్మా.. ఇలా ప్రతి పరిశ్రమలోనూ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రభుత్వ రంగంలో అవకాశాల విషయానికి వస్తే.. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా కేంద్ర గణాంక శాఖ, సంబంధిత విభాగాల్లో సుస్థిర కెరీర్ సొంతమవుతుంది. దాంతోపాటు ప్రణాళిక సంఘం, సెన్సస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వ పథకాలను పర్యవేక్షించే విభాగాల్లో.. వాస్తవ పరిస్థితులపై సర్వేలు నిర్వహించేందుకు స్టాటిస్టీషియన్ల అవసరం ఎంతో ఉంది. మ్యాథ్స్‌పై పట్టుంటే స్టాటిస్టిక్స్ ఎంతో సులభం స్టాటిస్టిక్స్ పట్ల విద్యార్థులు ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణం.. ఈ సబ్జెక్టు అనాసక్తిగా ఉంటుందని భావిస్తుండటమే! వాస్తవానికి మ్యాథమెటిక్స్‌పై పట్టున్న విద్యార్థులు స్టాటిస్టిక్స్‌లో సులభంగానే రాణిస్తారు. మ్యాథమెటిక్స్‌లో రాణిస్తున్న విద్యార్థులు కొంత విభిన్నంగా ఆలోచించి స్టాటిస్టిక్స్‌పై అడుగులు వేస్తే అద్భుతమైన కెరీర్ అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. కాబట్టి మ్యాథమెటిక్స్‌పై ఆసక్తి కలిగిన విద్యార్థులు.. కెరీర్ అంటే ఇంజనీరింగ్ మాత్రమే అనే ఆలోచనను వదిలి.. స్టాటిస్టిక్స్వైపు దృష్టిసారిస్తే మెరుగైన కెరీర్‌కు మార్గం వేసుకోవచ్చు. స్టాటిస్టిక్స్... కెరీర్లో రాణించాలంటే వాస్తవానికి స్టాటిస్టిక్స్.. అనువర్తిత ఆధారిత సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్‌లో ఉజ్వల కెరీర్‌ను సొంతం చేసుకోవాలంటే.. అకడెమిక్ స్థాయి నుంచే అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో అడుగులు వేయాలి. పలు విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్‌తో పెంచుకోవడంతోపాటు ఆయా విభాగాలపై ప్రాథమిక అవగాహన మెరుగుపర్చుకోవాలి. ఓర్పు, సహనం ఉంటే స్టాటిస్టీషియన్ కెరీర్లో ఉత్తమంగా రాణించడం సులభం. స్టాటిస్టిక్స్ పీజీ కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్-కోల్‌కతా (ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, తేజ్‌పూర్ క్యాంపస్‌లు) ఐఐటీ-బాంబే (ఎమ్మెస్సీ- అప్లయిడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మాటిక్స్, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్) ఐఐటీ-కాన్పూర్ (ఎమ్మెస్సీ- మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్) బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీఏ ఆనర్స్, ఎంఏ, ఎమ్మెస్సీ) ఢిల్లీ యూనివర్సిటీ (ఎంఏ, ఎమ్మెస్సీ-స్టాటిస్టిక్స్) మన రాష్ట్రంలో: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆంధ్రా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ద్రవిడియన్ యూనివర్సిటీ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వీటిలో ప్రవేశానికి ప్రతిఏటా ఆయా యూనివర్సిటీలు నిర్వహించే పీజీసెట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. -
గణాంకాల ఎఫెక్ట్!
న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక గణాంకాలు, రూపాయి కదలికలు, ఎస్బీఐ, ఓఎన్జీసీ వంటి బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్లపై ప్రభావం చూపనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వీటికితోడు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని తెలిపారు. ఆహార భద్రత బిల్లు తదితర పలు బిల్లులను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. కాగా, ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. ఈ నెల 15న(గురువారం) స్వాతంత్య్ర దినోత్సవం కారణంగా మార్కెట్లకు సెలవు. తొలుత సోమవారం(12న) జూన్ నెల పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), గణాంకాలు వెలువడనున్నాయి. అదే రోజు వినియోగ ధరల(రిటైల్) ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు కూడా తెలియనున్నాయి. ఇక బుధవారం(14న) జూలై నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం (డ బ్ల్యూపీఐ) గణాంకాలు వెల్లడికానున్నాయి. ఐఐపీ 1% ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకునే అవకాశమున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు. రుణ రేట్లు దిగిరాకపోవడంతో పారిశ్రామికోత్పత్తి ప్రగతికి అడ్డుకట్ట పడుతున్నదని చెప్పారు. డ బ్ల్యూపీఐ 5% లోపునకు పరిమితమైతే, వడ్డీ రేట్లను తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంకుకు వీలు చిక్కుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ విశ్లేషించింది. వరుసలో బ్లూచిప్స్: తొలి క్వార్టర్ ఫలితాలను సోమ వారం ఎస్బీఐ ప్రకటించనుంది. ఈ బాటలో ఇతర దిగ్గజాలు టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఎంఅండ్ఎం, హిందాల్కో, డీఎల్ఎఫ్ సైతం క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఎస్బీఐ ఫలితాలు రానున్న కొద్ది రోజులపాటు బ్యాంకింగ్ రంగ షేర్లపై ప్రభావాన్ని చూపనున్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ విభాగం ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అంచనా వేశారు. ఇటీవలి ట్రెండ్‌నుబట్టి మార్కెట్లు సాంకేతికంగా పుంజుకుంటే అమ్మకాలు పెరుగుతాయన్నారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ 5,750కుపైన నిలవగలిగితేనే కొనుగోళ్లకు అవకాశముంటుందని చెప్పారు. వెరసి దిగువముఖంగా 5,450 స్థాయిని నిఫ్టీ చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయని వివరించారు. అంతర్జాతీయ అంశాలు కూడా బ్లూచిప్ కంపెనీల ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలకు తోడు అంతర్జాతీయ అంశాలు కూడా మార్కెట్ల ట్రెండ్‌ను ప్రభావితం చేస్తాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. కాగా, డాలరుతో మారకంలో రూపాయి విలువ గత వారం చరిత్రాత్మక కనిష్ట స్థాయి 61.80ను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటివరకూ రూపాయి విలువ దాదాపు 13% పతనంకాగా, స్టాక్ మార్కెట్లు సైతం ఇటీవల బలహీనపడుతూ వచ్చాయి. ఈ ప్రభావంతో రిజర్వ్ బ్యాంకు రూపాయి విలువను నిలబెట్టేందుకే విధానపరమైన చర్యలను పరిమితం చేసింది. ఇకపై ప్రభుత్వం రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయగల చర్యలను చేపడుతుందని విశ్వసిస్తున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ నిపుణులు దీపేన్ షా చెప్పారు.