రాష్ట్రంలో వృక్ష, జంతుజాలంతో అలరారుతున్న వైవిధ్యత
ఆయా ప్రాంతాల్లోసందడి చేస్తున్న వన్యప్రాణులు
తాజా అధ్యయనంలో వెల్లడి
పులుల సంచారం పెరిగినా కవ్వాల్‌లో స్థిర నివాసం ఏర్పరచుకోకపోవడంపై ఆందోళన
సాక్షి, హైదరాబాద్: పెరిగిన జంతుజాలం, వృక్షజాలంతో రాష్ట్రంలో జీవ వైవిధ్యత అలరారుతోంది. అటవీ ప్రాంతాల్లో వివిధ రకాల జంతువుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 12 రక్షిత అటవీ ప్రాంతాలు (7 శాంక్చురీలు, 2 టైగర్ రిజర్వ్‌లు, 3 జాతీయ పార్కులు) ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 26,903 చ.కి.మీ పరిధిలో అటవీ ప్రాంతం విస్తరించి ఉండగా, 5,693 చ.కి.మీ.లో (21.16 శాతం) రక్షిత ప్రాంతాలున్నాయి. ప్రతీ రెండేళ్లకోసారి ఆయా రక్షిత ప్రాంతాలు, శాంక్చురీలు, టైగర్ రిజర్వ్‌లు, నేషనల్ పార్కుల్లో జంతు, వృక్ష జాతులపై అధ్యయనం నిర్వహిస్తున్నారు.
అటవీ ప్రాంతాల పరిధిలో చిరుతలు, అడవి దున్నలు, అడవి కుక్కలు, నక్కలు, జింకలు, దుప్పులు తదితర రకాల వన్యప్రాణులు సందడి చేస్తున్నాయి. కెమెరాట్రాపుల్లో వీటి కదలికలు తాజాగా రికార్డ్ కావడం, వీటి సంఖ్య పెరిగిన ఆనవాళ్లు కనిపించడం పట్ల అటవీశాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నిరకాల అనుకూల పరిస్థితులు, మెరుగైన సౌకర్యాలతో క వ్వాల్ టైగర్ రిజర్వ్ వన్యప్రాణుల వైవిధ్య కేంద్రంగా నిలుస్తోంది.
పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి పులుల సంచారం పెరిగినా, ఇక్కడ అనుకూల పరిస్థితులున్నా అవి ఇంకా స్థిరనివాసం ఏర్పరచుకోకపోవడం మాత్రం సవాల్‌గానే మారింది. మహారాష్ట్ర తడోబా నుంచి నేరుగా పులులు వచ్చేందుకు జాతీయ రహదారితోపాటు రైల్వేకారిడార్ ఉండడం, కొన్నిచోట్ల ఆక్రమణలతో కొంత అంతరాయం ఏర్పడుతోందని చెబుతున్నారు.
టైగర్ కన్జర్వేషన్ సొసైటీ పరిశీలనలో...
ఇటీవల హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ఆధ్వర్యంలో కవ్వాల్‌లోని ప్రధాన (కోర్), పొరు గు ప్రాంతాల నుంచి జంతువులు రాకపోకలు సాగించే (బఫర్) ఏరియాల్లో జంతువుల సంఖ్య పై అధ్యయనం నిర్వహించారు. కవ్వాల్‌లో పులుల అభయారణ్యం ఏ మేరకు సరిపోయేటట్టు ఉంది, ఏయే రకాల మాంసాహార, శాఖాహార జంతువులు ఉన్నాయనే దానిపై దృష్టి కేంద్రీకరించారు.
బఫర్ ఏరియాలోని కాగజ్‌నగర్, చెన్నూరు, ఆదిలాబాద్ డివిజన్లలో అనేక పులి పాదముద్రలను గుర్తించారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీ నుంచి ప్రాణహిత, పెన్‌గంగ నదు లను దాటి తడోబా అంథారి టైగర్ రిజర్వ్ నుంచి పులుల సంచారం ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించా రు. కవ్వాల్ ప్రధాన అటవీ ప్రాంతంలో చిరుత లు, అడవికుక్కలు, ఎలుగుబంట్లు ఇతర జంతువు లు కనిపించాయి.
తాళ్లపేట, ఇంథన్ పల్లిలో కృష్ణజింకలను అధికసంఖ్యలో గుర్తించారు. అడవి దున్న, అడవి పంది, నీల్గాయ్, సాంబారు, మచ్చలజింక, చౌసింగ వంటి శాఖాహార జంతువులను కూడా గుర్తించారు. నీల్గాయ్‌లు, అడవి పందుల జనాభా అటవీ ప్రాంతమంతా విస్తరించి ఉండగా, సాంబార్ జింకలు కొండ ప్రాంతాల్లో ఉన్న ట్టు గుర్తించారు. అయితే, ఈ అధ్యయనానికి సంబంధించి ఇంకా తుది నివేదిక రూపొందించలేదు. ఇది తయారయ్యాకే ఆయా రకాల జంతువుల సంఖ్యపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.
2,254 చ.కి.మీ. సర్వే చేశాం
అధ్యయనంలో భాగంగా ఆదిలాబాద్, కాగజ్‌నగర్, నిర్మల్, జన్నారం, చెన్నూ రు, మంచిర్యాలను కవర్ చేశాం. మొత్తం 2,254.35 చ.కి.మీ మేర కవర్ అయ్యింది. ఆదిలాబాద్, కాగజ్‌నగర్–చెన్నూరు సరిహద్దు లో పులుల ఉనికి గుర్తించాం. ఆదిలాబాద్, కాగజ్‌నగర్, జన్నారంలలో ఎలుగుబంట్లు, చిరుతలు, థోల్ తదితర జంతువులు కనిపించాయి.
జన్నారంలో అడవి గొర్రెలు, సాంబార్ జింకలు, చెన్నూ రు, కాగజ్‌నగర్, ఆదిలాబాద్‌లో నీల్గాయ్‌లు పెద్దసంఖ్యలో కనిపించాయి. వర్షాకాలం తర్వాత ఆసిఫాబాద్‌లో మళ్లీ సర్వే చేయాలని భావిస్తున్నాం. –ఇమ్రాన్ సిద్ది్దఖీ, డైరెక్టర్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ
Comments
Please login to add a commentAdd a comment