వరుస వైపరీత్యాలతో రాష్ట్రానికి వేల కోట్ల నష్టం
2015 నుంచి ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన 371 మంది
లక్షకుపైగా మూగజీవాల మృత్యువాత.. 80 వేలకు పైగా ఇళ్లు ధ్వంసం
18 లక్షల హెక్టార్లలో పంట నష్టం.. రూ.1,500 కోట్ల మేర నష్టం
ఐదేళ్లలో పిడుగుపాట్లకు 350 మంది బలి
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లలో ప్రకృతి వైపరీత్యం రాష్ట్రానికి పెద్ద నష్టమే చేసిందని గణాంకాలు చెబుతున్నాయి. వడగళ్లు, కరువు, భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్, అకాల వర్షాలు, వరదలు, అధిక వేడి, పిడుగుల్లాంటి ఘటనల కారణంగా భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 16వ ఆర్థిక సంఘానికి నివేదించిన లెక్కల ప్రకారం గత పదేళ్ల కాలంలో (2015–2024) ప్రకృతి వైపరీత్యాల కారణంగా వేల కోట్ల రూపాయల విలువైన నష్టం జరిగింది. ఒక్కో ఏడాది ఒక్కో రకమైన వైపరీత్యం కారణంగా ఇప్పటివరకు 371 మంది చనిపోయినట్టు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇక, మూగజీవాలు అయితే లక్షకు పైగా మృత్యువాత పడ్డాయి. మొత్తం 80 వేల ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాదాపు 40 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. వీటన్నింటి విలువ రూ.1,500 కోట్ల వరకు ఉందని ప్రభుత్వ నివేదికలో పేర్కొన్న గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment