ప్రాథమిక అంచనాల ప్రకారం రూ. 5,438 కోట్ల నష్టం
విపత్తు నిధుల వినియోగం నిబంధనలు సడలించాలి
తక్షణ మరమ్మతులు, పనులకు నిర్దేశించిన రేట్లు పెంచాలి
కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
విపత్తులు సంభవించినప్పుడు సాయం విషయంలో రాజకీయాలకు తావులేదన్న చౌహాన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరద బీభత్సంతో అపారనష్టం వాటిల్లిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు వివరించారు. రాష్ట్రంలో వరద నష్టం దాదాపు రూ.5,438 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలిపారు. సమగ్రంగా అంచనాలు వేసిన తర్వాత ఈ నష్టం మరింత పెరిగే అవకాశముందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి వచి్చన కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్, బండి సంజయ్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం సచివాలయంలో సమావేశమయ్యారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, సూర్యాపేటతోపాటు పలు జిల్లాల్లో ఒకే రోజు అత్యధికంగా 40 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసిందని, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించటంతో భారీ ప్రాణనష్టం తప్పిందని, కానీ వరద నష్టం భారీగా జరిగిందని సీఎం వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని దృశ్యాలను సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తోపాటు ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర మంత్రులకు చూపించారు.
మహబూబాబాద్ జిల్లాలో వరదలో కట్ట కొట్టుకుపోవటంతో వేలాడుతున్న రైల్వే ట్రాక్ పరిస్థితిని, రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. తెగిన చెరువులు, కుంటలు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల తాత్కాలిక మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం తక్షణసాయం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వీటిని శాశ్వతంగా పునరుద్ధరించే పనులకు తగినన్ని నిధులు కేటాయించాలని కోరారు.
ఆయిల్ పామ్ రైతులకు సరైన ధర కలి్పంచండి: తుమ్మల విన్నపం
ఆయిల్ పామ్ రైతులకు సరైన ధర వచ్చే విధంగా చూడాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్‌కు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విన్నవించారు. తెలంగాణలో కొబ్బరి తోటలకు సంబంధించి ఒక రీజినల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్గానిక్ ఫారి్మంగ్‌ను అశ్వారావుపేట (ట్రైబల్, నాన్ ట్రైబల్ శిక్షణ)లో ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన చౌహాన్ త్వరలోనే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
నిబంధనలను సడలించాలి
విపత్తు నిధులను రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ఇప్పుడు అమల్లో ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వరద బాధిత ప్రాంతాల్లో తక్షణ మరమ్మతులకు, శాశ్వత పునరుద్ధరణ పనులకు అంశాల వారీగా నిర్దేశించిన యూనిట్ రేట్లు కూడా పెంచాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వరదలతో దెబ్బతిన్న చెరువులు, కుంటల తక్షణ మరమ్మతులకు కనీసం రూ.60 కోట్లు అవసరమవుతాయని, ఇప్పుడున్న నిర్ణీత రేట్ల ప్రకారం రూ.4 కోట్లు కూడా విడుదల చేసే పరిస్థితి లేదని అధికారులు వివరించారు. ఏపీకి ఎలా సాయం అందిస్తారో అదే తీరుగా తెలంగాణకూ కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. విపత్తులు సంభవించినప్పుడు ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేసే విషయంలో పారీ్టలు, రాజకీయాలకు తావులేదని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment