![Preliminary assessment of flood damage in Khammam](/styles/webp/s3/article_images/2024/09/9/flood-damage-in-Khammam.jpg.webp?itok=9DA7du8V)
ఖమ్మం జిల్లాలో వరద నష్టంపై ప్రాథమిక అంచనా
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలతో ఎనిమిది శాఖల పరిధిలో ప్రధానంగా నష్టం ఎదురైందని అ«ధికార యంత్రాంగం గుర్తించింది. ఆయా శాఖల పరిధిలో రూ. 339.46 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసింది. మొత్తంగా 15,201 ఇళ్లు దెబ్బతినగా అందులో పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 6,500, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 8 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని లెక్కగట్టింది. రెవెన్యూ, పశుసంవర్థక శాఖ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయ, మత్స్య శాఖల పరిధిలో నష్టంపై ప్రభుత్వానికి యంత్రాంగం నివేదిక పంపింది.
ముఖ్యంగా 53,528 మంది రైతులకు సంబంధించి 79,914 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల రూ. 111.87 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా వరదలతో 76 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నాయని ప్రభుత్వానికి నివేదించారు. అలాగే 45 చెరువులకు గండ్లు పడ్డాయని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారంపై బాధితులు మండిపడుతున్నారు. వరద ఉధృతికి ఇళ్లు కొట్టుకుపోయిన తమకు ప్రభుత్వం అరకొర సాయం చేస్తే ఎలా సరిపోతుందని ప్రశి్నస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment