టోక్యో: జపాన్‌లో వందేళ్లకు పైబడి జీవిస్తున్న వారు 60 వేల మంది. ఈ సంఖ్య వచ్చే వారానికి 61,568కి చేరుతుంది. ఆ దేశ సంక్షేమ శాఖ ఈ గణాంకాలు ప్రకటించింది. వీరిలో 87 శాతం మంది బామ్మలే. సెప్టెంబర్ 15ను ‘సెంచరీ మార్కర్స్ సీనియర్స్ డే’గా జపాన్ ప్రకటించింది. ఆ రోజు వందేళ్లకు పైబడిన 30,379 మందికి 65 డాలర్ల విలువైన వెండి గిన్నెలను ప్రభుత్వం బహుకరించనుంది.