పదేళ్లలో రూ. 5 లక్షల వరకు ఆదాయ వర్గాలపై ఎస్‌బీఐ నివేదిక
న్యూఢిల్లీ: పదేళ్ల వ్యవధిలో దేశీయంగా ఆదాయ అసమానత గణనీయంగా దిగి వచ్చింది. రూ. 5 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారికి సంబంధించి 2013–14, 2022–23 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో అసమానతలు ఏకంగా 74.2 శాతం మేర తగ్గాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లోని ఎకనమిక్ డిపార్ట్‌మెంట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2014–2024 అసెస్‌మెంట్ ఇయర్స్ గణాంకాలను అధ్యయనం చేసిన మీదట ఎస్‌బీఐ దీన్ని రూపొందించింది.
దీని ప్రకారం ఆదాయాన్ని మెరుగుపర్చుకుంటూ పై స్థాయికి చేరుకుంటున్న అల్పాదాయ వర్గాల వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2014 ఆర్థిక సంవత్సరంలో రూ. 3.5 లక్షల వరకు ఆదాయాలున్న వారిలో 31.8 శాతంగా ఉన్న అసమానత 2021 ఆర్థిక సంవత్సరం నాటికి 12.8 శాతానికి తగ్గింది. రూ. 5.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వర్గాల సంపాదన గత దశాబ్దకాలంలో (కోవిడ్ ప్రభావిత 2020 అసెస్‌మెంట్ ఇయర్ తప్ప) ప్రతి సంవత్సరం సానుకూల రేటుతో వృద్ధి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment