Economic Department
-
74 శాతం తగ్గిన ఆదాయ అసమానతలు
న్యూఢిల్లీ: పదేళ్ల వ్యవధిలో దేశీయంగా ఆదాయ అసమానత గణనీయంగా దిగి వచ్చింది. రూ. 5 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారికి సంబంధించి 2013–14, 2022–23 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో అసమానతలు ఏకంగా 74.2 శాతం మేర తగ్గాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లోని ఎకనమిక్ డిపార్ట్మెంట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2014–2024 అసెస్మెంట్ ఇయర్స్ గణాంకాలను అధ్యయనం చేసిన మీదట ఎస్బీఐ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం ఆదాయాన్ని మెరుగుపర్చుకుంటూ పై స్థాయికి చేరుకుంటున్న అల్పాదాయ వర్గాల వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2014 ఆర్థిక సంవత్సరంలో రూ. 3.5 లక్షల వరకు ఆదాయాలున్న వారిలో 31.8 శాతంగా ఉన్న అసమానత 2021 ఆర్థిక సంవత్సరం నాటికి 12.8 శాతానికి తగ్గింది. రూ. 5.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వర్గాల సంపాదన గత దశాబ్దకాలంలో (కోవిడ్ ప్రభావిత 2020 అసెస్మెంట్ ఇయర్ తప్ప) ప్రతి సంవత్సరం సానుకూల రేటుతో వృద్ధి చెందింది. -
క్రిప్టో కరెన్సీ ఎక్సే్ఛంజ్ ‘బినాన్స్’కు షాక్
న్యూఢిల్లీ: అక్రమ నగదు చలామణి నిరోధక (పీఎంఎల్ఏ) చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రముఖ అంతర్జాతీయ క్రిప్టో ఎక్సే్ఛంజ్ ‘బినాన్స్’పై జరిమానా పడింది. కేంద్ర ఆరి్థక శాఖ పరిధిలో పనిచేసే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐఈ) రూ.18.82 కోట్ల జరిమానా చెల్లించాలంటూ బినాన్స్‌ను ఆదేశించింది. వర్చువల్ డిజిటల్ అస్సెట్ (ఆన్లైన్లో డిజిటల్ ఆస్తులను అందించే) ప్రొవైడర్‌గా బినాన్స్, పీఎంఎల్ఏ కింద తగిన సమాచారాన్ని నివేదించడంలో వైఫల్యం చెందినట్టు ఎఫ్ఐయూ తన ఆదేశాల్లో పేర్కొంది. వర్చువల్ డిజిటల్ అసెట్స్ సరీ్వస్ ప్రొవైడర్లు ఎఫ్ఐయూ కింద రిపోరి్టంగ్ ఎంటిటీగా నమోదు చేసుకోవడం తప్పనిసరి. అన్ని లావాదేవీలను రికార్డు చేయడంతోపాటు, ఆయా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎఫ్ఐయూకి వెల్లడించాల్సి ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగా ఆరి్థక నేరాలను నియంత్రించేందుకు ఎఫ్ఐయూ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. నిజానికి పీఎంఎల్ఏ కింద బినాన్స్ నమోదు చేసుకోకుండానే భారత్‌లో తన సేవలు అందించింది. దీంతో బినాన్స్ యూఆర్ఎల్లపై కేంద్ర సర్కారు నిషేధం విధించడంతోపాటు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది మే నెలలో రిపోరి్టంగ్ ఎంటిటీగా ఎఫ్ఐయూ కింద బినాన్స్ నమోదు చేసుకుంది. బినాన్స్తోపాటు మరో ఎనిమిది క్రిప్టో సంస్థలకూ కేంద్రం నుంచి షోకాజ్ నోటీసులు వెళ్లాయి. -
సుకన్య సమృద్ధి పథకంలో మరింత రాబడి
న్యూఢిల్లీ: కుమార్తెల భవిష్యత్ అవసరాలకు పొదుపు చేసుకునే ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇప్పటి వరకు ఈ పథకంలోని పొదుపు సొమ్ముపై 8 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంటే, దీన్ని 8.2 శాతానికి పెంచింది. అలాగే, మూడేళ్ల టైమ్ డిపాజిట్‌పై 0.10 శాతం వడ్డీ రేటును పెంచింది. దీంతో ఈ పథకంలో రేటు 7 శాతం నుంచి 7.1 శాతానికి చేరింది. 2024 జనవరి 1 నుంచి మార్చి 31 కాలానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. మిగిలిన అన్ని పథకాలకు సంబంధించి ప్రస్తుతమున్న రేట్లనే కొనసాగించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) రేటు 7.1 శాతంగా, సేవింగ్స్ డిపాజిట్ రేటు 4 శాతంగా కొనసాగుతాయి. కిసాన్ వికాస్ పత్ర పథకం రేటు 7.5 శాతంగా ఉంటుంది. ఇందులో డిపాజిట్ 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. నేషనల్ సేవింగ్స్ సరి్టఫికెట్ (ఎన్ఎస్సీ) రేటు 7.7 శాతంలో ఎలాంటి మార్పు లేదు. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ రేటు 7.4 శాతంగా కొనసాగనుంది. ప్రతి మూడు నెలలకోమారు చిన్న మొత్తాల పొదుపు పథకాలను సమీక్షించి, కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటిస్తుంటుంది. ఆర్బీఐ కీలక రెపో రేటును ఏడాది కాలంలో 2.5% మేర పెంచి 6.5 శాతానికి చేర్చడం తెలిసిందే. కొన్ని విడతలుగా రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగిస్తోంది. దీంతో చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లలోనూ పెద్దగా మార్పులు ఉండడం లేదు. -
సూచన ఇవ్వండి.. బహుమతి పట్టండి
సాక్షి, ముంబై : ప్రభుత్వ ఖజానా ఆదాయాన్ని పెంచేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రజలను ఆర్థిక శాఖ కోరింది. అత్యుత్తమ సలహాలు, సూచనలు ఇచ్చిన వారిక మొదటి బహుమతిగా రూ. 10 లక్షలు, రెండో బహుమతిగా రూ.6.50 లక్షలు నగదు పారితోషకం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ఒక్కో మంచి సలహాకు రూ.లక్ష చొప్పున 25 మందికి పారితోషికాలు అందజేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన రూపొందించిన ఆర్థిక శాఖ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు పంపించింది. ఆయన నుంచి ఆమోదం లభించగానే దీనిపై అధికారకంగా ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కరవు తాండవించడం, మరికొన్ని చోట్ల భారీ వర్షాల వల్ల వరదలు రావడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం, రూ.3 లక్షల కోట్ల వరకు ఉన్న రైతుల రుణాలు, వాటి వడ్డీ మాఫీ వంటివి రూ. లక్షల కోట్లలో చెల్లించాలంటే ప్రభుత్వ ఖజానాపై భారీ స్థాయిలో అదనపు భారం పడుతోంది. వివిధ శాఖల నుంచి పన్ను రూపంలో సమకూరుతున్న ఆదాయం కూడా అంతంతమాత్రంగానే ఉంది. అది ఏ మూలకూ సరిపోవడం లేదు. అలాగే పెరుగుతున్న పరిపాలన విభాగం ఖర్చుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతింటోంది. దీంతో ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఉన్నతస్థాయి సమితిని నియమించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. అయతే అంతకు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల నుంచి సలహాలు, సూచనలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ.3,85,000 కోట్లకు ైపైగా అప్పు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే ఆదాయం తగ్గిపోతుండటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. ఫలితంగా చాలా వరకు అభివృద్ధి పనులకు కత్తెరేయాల్సిన దుస్థితి నెలకొంది. -
చమురు పీఎస్‌యూల్లో వాటాలు.. ప్రత్యేక సంస్థకు
న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్ చేయబోయే ప్రభుత్వ రంగ చమురు సంస్థల్లో(పీఎస్‌యూ) కొంత మేర వాటాలను ప్రత్యేక కంపెనీకి బదలాయించాలని కేంద్రం యోచిస్తోంది. తద్వారా చమురు ధరల్లో హెచ్చుతగ్గులతో మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైనా.. తమ వాటాల విలువను కాపాడుకోవచ్చని ఆర్థిక శాఖ భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్(ఐవోసీ), ఆయిల్ ఇండియా (ఆయిల్), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) తదితర పీఎస్‌యూల్లో మైనారిటీ వాటాల విక్రయంతో కనీసం రూ. 27,000 కోట్లు సమీకరించాలని కేంద్రం యోచిస్తోంది. షేర్ల ప్రస్తుత ధరల ప్రకారం ఓఎన్జీసీలో 5% వాటాల విక్రయంతో రూ.12,000 కోట్లు, ఐవోసీలో 10% డిజిన్వెస్ట్‌మెంట్‌తో రూ. 10,000 కోట్లు, ఆయిల్లోనూ 10% వాటాల విక్రయంతో రూ.2,600 కోట్లు రావొచ్చని అంచనా. అలాగే, బీపీసీఎల్‌లో 3% డిజిన్వెస్ట్‌మెంట్‌తో రూ. 2,000 కోట్లు వస్తాయని కేంద్రం భావిస్తోంది. -
ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరో రూ. 11,500 కోట్లు!
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) కేంద్రం మరో రూ. 11,500 కోట్ల మూలధనం సమకూర్చే అవకాశముందని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి తెలిపారు. ఇప్పటికే బడ్జెట్లో కేటాయించిన దాదాపు రూ. 7,940 కోట్లకు ఇది అదనమని ఆయన వివరించారు. ప్రపంచ స్థాయి మూలధన ప్రమాణాలను అందుకునేందుకు, వృద్ధి సాధించేందుకు పీఎస్బీలకు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం దాదాపు రూ. 57,000 కోట్ల నిధులు సమకూర్చాలని భావిస్తున్నట్లు మహర్షి ఇటీవలే వెల్లడించారు. -
గ్యాస్ ప్రీమియం ధర ప్రతిపాదన వెనక్కి
న్యూఢిల్లీ: ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌లో కొంత భాగానికి మార్కెట్ ధర (ప్రీమియం రేటు) ఇవ్వడంపై చమురు శాఖ ప్రతిపాదనను ఆర్థిక శాఖ వెనక్కి పంపించింది. ప్రతిపాదనపై ఆర్థిక శాఖ నిర్దిష్ట అభిప్రాయాలు వ్యక్తపర్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అధిక ఉష్ణోగ్రతలు మొదలైన గుణాలు కలిగి ఉండే క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌కి సాధారణ రేటుతో పోలిస్తే మరికాస్త ఎక్కువ లభించేలా తగు ఫార్ములాను రూపొందించాలంటూ చమురు శాఖకు కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం దేశీయంగా మిలియన్ బ్రిటీష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ)కి రేటు 4.66 డాలర్లుగా ఉండగా.. మార్కెట్ రేటు 7-8 డాలర్లుగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయా క్షేత్రాలను బట్టి గ్యాస్ ఉత్పత్తిలో కొంత శాతానికి మార్కెట్ రేటును వర్తింపచేయాలంటూ చమురు శాఖ ప్రతిపాదించింది. -
‘సాఫ్ట్’గా దోచేశారు..!
ఆర్థిక శాఖలో కంప్యూటరీకరణ పేరిట రూ.175 కోట్ల దుర్వినియోగం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పెద్దలు, ఓ ఉన్నతాధికారి కుమ్మక్కై రూ.175 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అడ్డగోలు నిర్ణయానికి ప్రతిఫలంగా భారీ ఎత్తున ముడుపులు దండుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 14, 2008న ఆర్థికశాఖను కంప్యూటరీకరించి.. లావాదేవీలను ఆన్లైన్లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు.. వాణిజ్య పన్నుల వసూళ్లు.. విద్యార్థులకు ఉపకారవేతనాలు.. ఉద్యోగులకు వేతనాల చెల్లింపు తదితర అన్ని లావాదేవీలను ఆన్లైన్ ద్వారా నిర్వహించడం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నది ప్రభుత్వ భావన. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖజానా శాఖలో అప్పటి డెరైక్టర్ ఎన్సీ నాగార్జునరెడ్డి తన శాఖలో కొందరు మెరికల్లాంటి అధికారుల సహకారంతో అన్ని లావాదేవీలను ఆన్లైన్లో నిర్వహించేలా సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్-సీఎఫ్ఎంఎస్)ను రూపొందించారు. భద్రత లేదనే సాకు చూపి.. ప్రభుత్వ సిబ్బంది రూపొందించిన సీఎఫ్ఎంఎస్, హెచ్ఆర్ఎంఎస్ల సాఫ్ట్‌వేర్‌లో రికార్డులకు భద్రత లేదని, సరికొత్త వ్యవస్థను రూపొందించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారుచేయడానికి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థను కన్సల్టెన్సీగా నియమిద్దామని ప్రభుత్వ పెద్దలకు ఓ ఉన్నతాధికారి ప్రతిపాదించారు. నాగార్జునరెడ్డి నేతృత్వంలోని బృందం రూపొందించిన తరహాలోనే కన్సల్టెన్సీ సంస్థ కూడా డీపీఆర్‌ను తయారుచేసింది. ఇందుకు ఆ సంస్థకు రూ.5 కోట్లను కన్సల్టెన్సీ ఫీజు కింద ప్రభుత్వం సమర్పించుకుంది. అందులో సగానికిపైగా ఓ ఉన్నతాధికారికి పర్సంటేజీ కింద కన్సల్టెన్సీ సంస్థ ముట్టజెప్పినట్లు ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. రూ.2 కోట్లకు.. రూ.175 కోట్లు! సదరు సంస్థ రూపొందించిన డీపీఆర్‌ను అధ్యయనం చేసిన నాగార్జునరెడ్డి.. ప్రస్తుతం అమల్లో ఉన్న సీఎఫ్ఎంఎస్, హెచ్ఆర్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌కు అది భిన్నంగా లేకపోవడాన్ని పసిగట్టారు. భద్రత చర్యలు తీసుకోడానికి రూ.2 కోట్లు సరిపోయేదానికి రూ.350 కోట్లు ప్రతి పాదించటాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి లేఖలు రాశారు. దీంతో భయపడిన ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఈ మొత్తాన్ని రూ. 175 కోట్లకు తగ్గించేశారు. అంతేగాక నాగార్జున రెడ్డిని పదవి నుంచి తప్పించారు. తాము లోపాయికారీగా ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలకే ఆ పనులు దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించారు. అక్టోబర్ 1, 2012న ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయగా రెండు సంస్థలే టెండర్లో పాల్గొనగా అందులో ఓ సంస్థకు పనులను అప్పగించేసి భారీ ఎత్తున ముడుపులు దండుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనులు చేజిక్కించుకుని రెండున్నరేళ్లు కావస్తోన్నప్పటికీ కాంట్రాక్టు సంస్థలో చలనం కనిపించడం లేదు. కంప్యూటరీకరణను చేయడానికి వీలుగా రెండేళ్ల క్రితం జిల్లాలకు(ఏపీ, తెలంగాణ) కాంట్రాక్టు సంస్థ చేరవేసిన మానిటర్లు, సీపీయూలు, సర్వుర్లు తుప్పుపట్టిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. కొత్త పద్ధతి అందుబాటులోకి రాకపోవడంతో పాత పద్ధతిలోనే ఆర్థికశాఖలు(ఏపీ, తెలంగాణ) లావాదేవీలు సాగిస్తున్నాయి. -
తెలంగాణ ఇంక్రిమెంట్‌కు రూ. 200 కోట్లు
- బడ్జెట్ తయారీకి కసరత్తు - ఈ నెలాఖరులోపు వివరాలు పంపండి - అన్నిశాఖలకు ఆర్థికశాఖ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ఎన్నికలవేళ కాకుండా ఉద్యమం సందర్భంగా పలుసార్లు తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చిన ఇంక్రిమెంట్ హామీని నిలబట్టుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర సాధన సందర్భంగా తెలంగాణ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ మంజూరుచేస్తామని కేసీఆర్ మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్థికశాఖ ఇప్పటికే ఈ ఇంక్రిమెంట్‌పై కసరత్తు పూర్తి చేసింది. తెలంగాణ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇవ్వడానికి రూ.200 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తుదినిర్ణయం తీసుకుంటారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీని వల్ల తెలంగాణకు చెందిన నాలుగు లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. తొలిబడ్జెట్ తయారీ... తెలంగాణ తొలిబడ్జెట్ తయారీకి ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణకు చెందిన అన్ని శాఖలు తమ బడ్జెట్‌కు అవసరమైన వివరాలను ఈ నెలాఖరుకల్లా పంపించాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రధానంగా ఎన్నికలప్రణాళికలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా వ్యవహరించాలని, మేనిఫెస్టోలోని అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతిపాదనలు పంపాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. తెలంగాణ తొలిబడ్జెట్ అయినందున లోపాలకు తావులేకుండా జాగ్రత్తగా రూపొందించాలని ఆర్థికశాఖ నిర్ణయించింది.