క్రిప్టో కరెన్సీ ఎక్సే్ఛంజ్‌ ‘బినాన్స్‌’కు షాక్‌ | Financial Intelligence Unit imposes Rs 18. 82 crore penalty on crypto exchange Binance | Sakshi
Sakshi News home page

క్రిప్టో కరెన్సీ ఎక్సే్ఛంజ్‌ ‘బినాన్స్‌’కు షాక్‌

Published Fri, Jun 21 2024 6:22 AM | Last Updated on Fri, Jun 21 2024 6:22 AM

Financial Intelligence Unit imposes Rs 18. 82 crore penalty on crypto exchange Binance

రూ.18.82 కోట్ల జరిమానా విధించిన ఎఫ్‌ఐయూ 

న్యూఢిల్లీ: అక్రమ నగదు చలామణి నిరోధక (పీఎంఎల్‌ఏ) చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రముఖ అంతర్జాతీయ క్రిప్టో ఎక్సే్ఛంజ్‌ ‘బినాన్స్‌’పై జరిమానా పడింది. కేంద్ర ఆరి్థక శాఖ పరిధిలో పనిచేసే ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌ఐఈ) రూ.18.82 కోట్ల జరిమానా చెల్లించాలంటూ బినాన్స్‌ను ఆదేశించింది. 

వర్చువల్‌ డిజిటల్‌ అస్సెట్‌ (ఆన్‌లైన్‌లో డిజిటల్‌ ఆస్తులను అందించే) ప్రొవైడర్‌గా బినాన్స్, పీఎంఎల్‌ఏ కింద తగిన సమాచారాన్ని నివేదించడంలో వైఫల్యం చెందినట్టు ఎఫ్‌ఐయూ తన ఆదేశాల్లో పేర్కొంది. వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌ సరీ్వస్‌ ప్రొవైడర్లు ఎఫ్‌ఐయూ కింద రిపోరి్టంగ్‌ ఎంటిటీగా నమోదు చేసుకోవడం తప్పనిసరి. అన్ని లావాదేవీలను రికార్డు చేయడంతోపాటు, ఆయా  సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎఫ్‌ఐయూకి వెల్లడించాల్సి ఉంటుంది.

 ఈ సమాచారం ఆధారంగా ఆరి్థక నేరాలను నియంత్రించేందుకు ఎఫ్‌ఐయూ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. నిజానికి పీఎంఎల్‌ఏ కింద బినాన్స్‌ నమోదు చేసుకోకుండానే భారత్‌లో తన సేవలు అందించింది. దీంతో బినాన్స్‌ యూఆర్‌ఎల్‌లపై కేంద్ర సర్కారు నిషేధం విధించడంతోపాటు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది మే నెలలో రిపోరి్టంగ్‌ ఎంటిటీగా ఎఫ్‌ఐయూ కింద బినాన్స్‌ నమోదు చేసుకుంది. బినాన్స్‌తోపాటు మరో ఎనిమిది క్రిప్టో సంస్థలకూ కేంద్రం నుంచి షోకాజ్‌ నోటీసులు వెళ్లాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement