న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) కేంద్రం మరో రూ. 11,500 కోట్ల మూలధనం సమకూర్చే అవకాశముందని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి తెలిపారు. ఇప్పటికే బడ్జెట్‌లో కేటాయించిన దాదాపు రూ. 7,940 కోట్లకు ఇది అదనమని ఆయన వివరించారు. ప్రపంచ స్థాయి మూలధన ప్రమాణాలను అందుకునేందుకు, వృద్ధి సాధించేందుకు పీఎస్‌బీలకు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం దాదాపు రూ. 57,000 కోట్ల నిధులు సమకూర్చాలని భావిస్తున్నట్లు మహర్షి ఇటీవలే వెల్లడించారు.