న్యూఢిల్లీ : ఈసారి అంతర్జాతీయ ‘స్టాటిస్టిక్ ఆఫ్ ది ఇయర్’గా 332 సంఖ్యను ప్రకటించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. చైనా శాస్త్రవేత్తలు గత జనవరి పదవ తేదీన ‘సార్స్–కోవిడ్–2’ జన్యు క్రమాన్ని వెల్లడించారు. ఈ నెల, డిసెంబర్ 8వ తేదీన లండన్ వైద్యాధికారులు సమర్థంగా పనిచేసే కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇవ్వడం ప్రారంభించారు. ఈ రెండు కీలక పరిణామాల మధ్యనున్న కాలమే 332 రోజులు. అందుకే 332 సంఖ్యను ‘స్టాటిస్టిక్ ఆఫ్ ది ఇయర్’గా బ్రిటన్‌లోని అన్ని రంగాలకు సంబంధించి అతి పెద్ద అంతర్జాతీయ డేటా కలిగిన ‘రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ (ఆర్‌ఎస్‌ఎస్)’ పరిగణించే అవకాశం ఉందని అందులోని జడ్జింగ్ ప్యానెల్ సభ్యుడయిన శాస్త్రవేత్త లిబర్టీ విటర్ట్ వెల్లడించారు.
ఈ రాయల్ సొసైటీ 2017 సంవత్సరం నుంచి స్టాటిస్టిక్ ఆఫ్ ది ఇయర్ సంఖ్యను ప్రకటించడమే కాకుండా ఏడాది ఉత్తమ అవార్డు, ఉత్తమ పుస్తకం అంటూ ఇతర అవార్డులను కూడా ప్రకటిస్తూ వస్తోంది. ఆ సంవత్సరానికి అమెరికా ‘లాన్‌మూవర్ ఆక్సిడెంట్స్ (లాన్‌ను కత్తిరించే యాంత్రిక వాహనం ప్రమాదాల్లో) 62 మంది చనిపోవడంతో ఆ సంఖ్యను స్టాటిస్టిక్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించారు. ‘తోటి పౌరుల తుపాకుల్లో ఇంకా ఎంత మంది అమెరికా పౌరులు మరణించాలి’ అంటూ ట్వీట్ చేసిన అమెరికా సెలబ్రిటీ కిమ్ కర్దాషియన్‌ను 2018 సంవత్సరం ‘స్టాటిస్టిక్ ఆఫ్ ది ఇయర్’ విజేతగా రాయల్ సొసైటీ ప్రకటించింది. ఈసారి కరోనా వైరస్ జన్యు క్రమాన్ని వివరించిన గత జనవరి 10వ తేదీ నుంచి ఆ వైరస్‌ను నిర్వీర్యం చేసే వ్యాక్సిన్‌ను లండన్ ఇచ్చిన డిసెంబర్ 8వ తేదీ మధ్యకాలాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ కాలానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉండడమే అందుకు కారణం. వైరస్‌లకు ఇంత త్వరగా వ్యాక్సిన్ కనుగొనడం ఇదే మొదటి సారి. (చదవండి: వందేళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్..!)
క్యాన్సర్‌కు వైరస్‌కు కూడా సంబంధం
సర్వికల్ క్యాన్సర్‌కు పపిల్లోమా వైరస్‌కు నేరుగా సంబంధం ఉందని 1981లో పరిశోధకులు కనుగొన్నారు. ఆ వైరస్‌ను నిర్వీర్యం చేసే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను 25 ఏళ్ల తర్వాత 2006లో అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. ఆ తర్వాత చాలా వ్యాక్సిన్లను కనుగొనేందుకు సరాసరి సగటున పదేళ్ల కాలం పట్టింది. ఆ తర్వాత గవద బిళ్ళల వ్యాక్సిన్ కనుగొనేందుకు నాలుగేళ్లు పట్టింది. కరోనా వైరస్‌కు 332 రోజుల్లో వ్యాక్సిన్‌ను కనుగొని అమల్లోకి తీసుకురావడం శాస్త్ర విజ్ఞాన రంగంలో ఓ గొప్ప ముందడుగు. శాస్త్రవేత్త లిబర్టీ విట్టర్టి వాషింగ్టన్ యూనివర్శిటీలో ప్రాక్టీస్ ఆఫ్ ది డేటాలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment