దేశ సగటు కన్నా మన రాష్ట్రంలోనే వేతన పురుషులు, మహిళల శాతం ఎక్కువగా ఉంది. ఈ విషయం కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘లేబర్ ఫోర్స్ సర్వే–2023–24’లో వెల్లడైంది. దేశంలో సగటు వేతన పురుషులు 24.9 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 25.4 శాతం ఉన్నారు. దేశంలో సగటు వేతన మహిళలు 15.9 శాతం కాగా, రాష్ట్రంలో 17.3 శాతం ఉన్నారు.
ఢిల్లీలో అత్యధికంగా వేతన మహిళలు 70.2 శాతం ఉండగా, పురుషులు 53.0 శాతమే ఉండటం విశేషం. గోవాలో వేతన మహిళలు 61.3 శాతం ఉండగా, పురుషులు 51.7 శాతం ఉన్నారు. కేరళలో వేతన మహిళలు 41.2 శాతం ఉండగా, పురుషులు 31.3 శాతమే ఉన్నారు. దేశంలో అత్యల్పంగా బిహార్‌లో వేతన మహిళలు 4.8 శాతమే ఉన్నారు.
ఛత్తీగఢ్‌లో 9.7 శాతం, జార్ఖండ్‌లో 7.3 శాతం, మధ్యప్రదేశ్‌లో 6.6 శాతం, ఒడిశాలో 8.8 శాతం, రాజస్థాన్‌లో 8.5 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 6.6 శాతమే వేతన మహిళలు ఉన్నట్లు సర్వే వెల్లడించింది. – సాక్షి, అమరావతి
ఆధారం: లేబర్ ఫోర్స్ సర్వే–2023–24
Comments
Please login to add a commentAdd a comment