ప్రాతిపదిక ఏడాది మార్పు..? | GDP computation to 2022-23 from the current 2011-12; Here's reason? | Sakshi
Sakshi News home page

GDP: ప్రాతిపదిక ఏడాది మార్పు..?

Published Fri, Sep 20 2024 10:54 AM | Last Updated on Fri, Sep 20 2024 11:42 AM

GDP computation to 2022-23 from the current 2011-12; Here's reason?

స్థూల దేశీయోత్పత్తిని కచ్చితంగా లెక్కించేందుకు ప్రాతిపదికగా ఉన్న 2011-12 ఏడాదిని 2022-23కు మార్చాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై అడ్వైజరీ కమిటీ ఆన్‌ నేషనల్‌ అకౌంట్స్‌ స్టాటిస్టిక్స్‌(ఏసీఎన్‌ఏఎస్‌)కు స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ శాఖ(మోస్పి) త్వరలో సూచనలు జారీ చేసే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.

దేశ ఆర్థిక వ్యవస్థను కచ్చితంగా లెక్కించేందుకు ప్రస్తుతం 2011-12 ఏడాదిని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. భారత్‌ వేగంగా వృద్ధి చెందుతోంది. 12-13 ఏళ్ల కిందటి ఏడాదిని ప్రామాణికంగా తీసుకుని వృద్ధిరేటును లెక్కించడం సరికాదని కొందరు భావిస్తున్నారు. దాంతోపాటు కొత్తగణనలో కొన్ని వస్తువులను తొలగించాలని సూచిస్తున్నారు. కొత్త బేస్ ఇయర్‌ ఆధారంగా లెక్కించే గణాంకాలు ఫిబ్రవరి 2026లో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: అన్నదానం కాదు.. ఐఫోన్‌ కోసం పరుగులు

ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ శాఖ జారీ చేసే సూచనల ఆధారంగా 2022-23 బేస్‌ ఇయర్‌లో యూనికార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ వార్షిక సర్వే, గృహ వినియోగ వ్యయ సర్వే(హెచ్‌సీఈఎస్‌) వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు. కొత్త గణనలో లాంతర్లు, వీసీఆర్‌లు, రికార్డర్లు వంటి వస్తువులను తొలగిస్తారు. స్మార్ట్ వాచ్‌లు, ఫోన్లు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు వంటి ఉత్పత్తులను తీసుకురానున్నారు. జీడీపీ లెక్కింపులో జీఎస్టీ కౌన్సిల్‌ డేటాను పరిగణనలోకి తీసుకోనున్నారు. అనధికారిక రంగాలకు సంబంధించిన కచ్చితమైన వివరాలు తెలియజేసేలా అత్యాధునిక క్యాలిక్యులేషన్స్‌ వాడబోతున్నట్లు తెలిపారు. జీఎస్‌టీఎన్‌ నమూనా ఫ్రేమ్ వర్క్‌ ఆధారంగా యాన్యువల్‌ సర్వే ఆఫ్ సర్వీస్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (ఏఎస్‌ఎస్‌ఎస్‌ఈ) నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి సర్వే జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement