నేడు ప్రపంచ గణాంకాల దినోత్సవం | World Statistics Day | Sakshi
Sakshi News home page

World Statistics Day: అక్టోబర్‌ 20 ప్రపంచ గణాంకాల దినోత్సవం

Published Wed, Oct 20 2021 8:14 AM | Last Updated on Wed, Oct 20 2021 9:05 AM

World Statistics Day  - Sakshi

అధికారిక గణాంకాల ప్రాథమిక సూత్రాల ప్రాముఖ్యతను వివరించడం కోసమే ప్రతి ఏడాది అక్టోబర్ 20న గణాంకాల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అయితే ఈ గణాంకాల దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ రూపొందించింది. ఈ మేరకు ఈ దినోత్సవాన్ని 2010 నుంచి గుర్తించడం మొదలైంది.

(చదవండి: బాహుబలి గోల్డ్‌ మోమోస్‌.. ధర తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే)

అంతేకాదు 2010 నుండి 103 మంది భాగస్వామ్యం సహకారంతో 51 ఆఫ్రికన్‌ దేశాలు ఏటా నవంబర్‌ 18న ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేవి. అయితే భారత్‌లో మాత్రం జూన్‌ 29న బెంగాల్‌కు చెందిన గణాంక శాస్రవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్‌ జన్మదినం పురస్కరించుకుని జాతీయ గణాంకాల దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంది. ఈ మేరకుమహాలనోబిస్ దూరం, గణాంక కొలత తదితర గణాంక పరిశోధనలు ఎంతలా ప్రఖ్యాతిగాంచాయో అందరి తెలిసిందే.

జాతీయ గణాంక కార్యాలయాలు జాతీయ సమన్వయ కర్తలుగా పనిచేయడమే కాక ఆయా సమాచారాన్ని జాతీయ భాషల్లోకి అనువదించి జాతీయ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహిస్తాయి. అంతేకాదు ఈ గణాంకాల దినోత్సవం కోసం యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ స్టాటిస్టిక్స్ డివిజన్ దేశవ్యాప్తంగా సమన్వయ ప్రచారాలు నిర్వహించడమే కాక కీలక సందేశాలను ఇవ్వడం, ఇతర భాగస్వామ్య దేశాలకు కావల్సినంత వనరులను అందుబాటులోకి తీసుకువస్తుంది. 

గణాంకాల ప్రాముఖ్యత

  • ప్రపంచంలోని దాదాపు ప్రతి పరిశ్రమ,సంస్థలు ఈ గణాంక డేటా, పరిశోధనల నుండి ప్రయోజనం పొందుతుంది. వ్యాపారం, కెరియర్‌లపై సరియైన విధంగా దృష్టి సారంచాలంటే ఈ గణాంకాలు అ‍త్యంత కీలకమైనవి.
  • పెద్ద కంపెనీల ప్రచారాలకు, సరైన వ్యూహంతోప ముందంజలో దూసుకుపోవాలన్న కచ్చితమే ఈ గణాంక డేటా, పరిశోధనల ఆధారంగానే సాధ్యమవుతుంది.
  •  ఈ గణంక డేటా అదనంగా సమాచార దృకృథాలను జోడించడమే కాకుండా సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా వాస్తవాలను నిరూపించేలా ఉపకరిస్తుంది.
  • నేటి ప్రపంచంలో మానవ కార్యకలాపాలన్ని ఈ గణాంకాల ఆధారంగా నిర్వహించగలుగుతున్నాం అనటంలో అతిశయోక్తి లేదు.
  • అంతేందుకు వ్యక్తుల పోకడలు, ఇష్టాలు, అయిష్టాలను అర్థం చేసుకోవడానికి అనేక వ్యాపారాలు, సంస్థలకు గణాంకాల డేటాగా సోషల్ మీడియానే అతిపెద్ద డేటా వనరుగా మారింది.

ఎలా జరుపుకుంటారు:

  • స్టాటిస్టిక్స్ డే అనేది పరిశ్రమలు, సంస్థల గణాంకాల డేట పరిశోధనలు సమాచార ప్రాముఖ్యతను తెలియజేయడం
  • పర్యావరణం, క్రీడలు, రాజకీయాలు, సమాజం, నేరం, కళ గురించి ఆసక్తికరమైన డేటాను పరిశోధించడం లేదా వ్యక్తులతో  పంచుకోవడం ద్వారా ఈ దినోత్సవాన్ని  జరుపుకుంటారు.

(చదవండి: ఒకే వ్యక్తి ఏకంగా తన ఇంటినే క్యాసెట్ల స్టోర్‌గా మార్చేశాడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement