స్మార్ట్‌ఫోన్‌తో గడిపే (స్క్రీనింగ్) సమయం క్రమంగా పెరుగుతోంది. ప్రపంచంలో వ్యక్తుల రోజు వారీ ఫోన్ సగటు వీక్షణ సమయం 3.50 గంటల నుంచి 4.37 గంటలకు పెరిగింది. భారత్‌లో 4.30 గంటలుగా నమోదైంది. అంటే ఒక వ్యక్తి ఏడాది పొడవునా దాదాపు 70 రోజులు ఫోన్లలోనే ఉంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ యూజర్లు రోజుకు 58 సార్లు ఫోన్లను ప్రతిసారీ తనిఖీ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ఫిలిప్పీన్స్ వాసులు అత్యధికంగా సమయం ఫోన్లతో గడుపుతుంటే.. జపాన్ పౌరులు మాత్రం గ్లోబల్ సగటు కంటే తక్కువగా ఫోన్లపై గడుపుతున్నారు. 12–27 ఏళ్లలోపు వయస్కులే స్మార్ట్‌ఫోన్లలో మునిగిపోతున్నట్టు అంతర్జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ
సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఒకప్పుడు వారాంతాల్లో ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుని ఎక్కువ సేపు ఫోన్ చూసేవారు. తాజా పరిణామాలతో సాధారణ రోజుల్లోనే స్మార్ట్‌ఫోన్ల స్క్రీనింగ్ సమయం పెరిగిపోయింది. ఇక్కడ ప్రతి నిముషానికి ఒకసారి ఫోన్ చూసుకోవడం అలవాటుగా మారిపోయింది. ఫిలిప్పీన్స్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్, ఘనా దేశాల్లో రోజు వారీ స్క్రీనింగ్ సమయం 5 గంటలు దాటిపోతోంది. నాలుగు దక్షిణ అమెరికా, 4 సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలు టాప్–10 అత్యధిక స్క్రీనింగ్ జాబితాలో నిలిచాయి. అగ్రరాజ్యంగా పిలిచే అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లో గడుపుతున్నారని.. వీరిలో దాదాపు 40 శాతం మంది అధిక స్క్రీనింగ్ అలవాటును తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ సమయం ఫోన్‌లో గడుపుతున్నట్టు తెలుస్తోంది. వారి రోజువారీ సగటు స్క్రీనింగ్ సమయం 2.47 గంటలుగా ఉంటే.. పురుషులకు 2.34 గంటలుగా గుర్తించారు. ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్ వినియోగంలో ఎక్కువ సమయం ఇంటర్నెట్‌కు కేటాయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment