screen time
-
స్క్రీన్ టైం పెరగడం వల్లా గుండెపోటు!
అమెరికా లాంటి దేశాల్లో సగటున 45 ఏళ్లకు గుండెపోటు వస్తుంటే.. భారతదేశంలో మాత్రం అంతకంటే పదేళ్ల ముందే, అంటే 35 ఏళ్ల వయసులోనే వచ్చేస్తోంది. ఇంతకుముందు రక్తపోటు, మధుమేహం, కొలెస్టరాల్ లాంటివి ప్రధాన ముప్పు కారకాలుగా ఉంటే, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎక్కువ స్క్రీన్ టైం ఉండడం కూడా గుండెపోటుకు కారణం అవుతోంది! దీనికితోడు ఆన్లైన్లో ఫుడ్ ఎగ్రిగేటర్ల వద్ద రోజూ ఫుడ్ ఆర్డర్లు పెట్టుకోవడం కూడా ఇందుకు దారితీస్తోంది. ఈ సరికొత్త పరిణామాలను నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ ఎ. సాయి రవిశంకర్ వివరించారు.మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ.. ఇలా ఏవైనా గానీ రోజుకు సగటున 8 నుంచి 10 గంటల వరకు చూస్తున్నారు. వీటన్నింటినీ స్క్రీన్ టైం అనే అంటారు. ఇలా ఎక్కువసేపు తెరకు అతుక్కుపోయి ఉండడం వల్ల గుండెపోటు వస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి.వివిధ ఫుడ్ ఎగ్రిగేటర్ల వద్ద నుంచి పీజాలు, బర్గర్లు, ఇతర మాంసాహార వంటకాలు దాదాపు రోజూ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. ఎంత పెద్ద హోటల్ నుంచి తెప్పించుకున్నా, అక్కడ వాడిన వంటనూనెలు మళ్లీ మళ్లీ వాడడం వల్ల కొలెస్టరాల్ పెరిగిపోయి గుండెపోటుకు కారణమవుతోంది. ప్రపంచంలోనే ఫుడ్ ఆర్డర్లలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది.వ్యాయామం అస్సలు ఉండడం లేదు. పని ఉన్నంతసేపు పని చేసుకోవడం, తర్వాత మొబైల్ లేదా టీవీ చూసుకోవడం, పడుకోవడంతోనే సరిపెట్టేస్తున్నారు. సగటున రోజుకు 45 నిమిషాల చొప్పున వారానికి కనీసం ఐదారు రోజుల పాటు నడక, ఇతర వ్యాయామాలు చేస్తేనే గుండె ఆరోగ్యం బాగుంటుంది. నిశ్చల జీవనశైలి వల్ల కూడా చిన్నవయసులోనే గుండెపోటు కేసులు వస్తున్నాయి.మానసిక ఒత్తిడి, నిద్ర లేకపోవడం కూడా గుండెపోటుకు దారితీస్తోంది. ఉద్యోగాల పరంగా అయినా, లేదా వ్యక్తిగత జీవితంలో సమస్యల వల్ల అయినా మానసిక ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటోంది. దానికి తోడు రోజుకు కనీసం 7-8 గంటల మంచి నిద్ర ఉండాలి. అది లేకపోవడం వల్ల కూడా గుండెపోటు వస్తోంది. వీటికి సిగరెట్లు కాల్చడం, వాతావరణ కాలుష్యం లాంటివి మరింత ఎక్కువగా కారణాలు అవుతున్నాయి.-డాక్టర్ ఎ. సాయి రవిశంకర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు, ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి (చదవండి: టేస్టీ టేస్టీగానే తింటూ..గుండెను ఆరోగ్యంగా ఉంచుకుందాం ఇలా..!) -
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ స్క్రీనింగ్ టైమ్
స్మార్ట్‌ఫోన్‌తో గడిపే (స్క్రీనింగ్) సమయం క్రమంగా పెరుగుతోంది. ప్రపంచంలో వ్యక్తుల రోజు వారీ ఫోన్ సగటు వీక్షణ సమయం 3.50 గంటల నుంచి 4.37 గంటలకు పెరిగింది. భారత్‌లో 4.30 గంటలుగా నమోదైంది. అంటే ఒక వ్యక్తి ఏడాది పొడవునా దాదాపు 70 రోజులు ఫోన్లలోనే ఉంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ యూజర్లు రోజుకు 58 సార్లు ఫోన్లను ప్రతిసారీ తనిఖీ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ఫిలిప్పీన్స్ వాసులు అత్యధికంగా సమయం ఫోన్లతో గడుపుతుంటే.. జపాన్ పౌరులు మాత్రం గ్లోబల్ సగటు కంటే తక్కువగా ఫోన్లపై గడుపుతున్నారు. 12–27 ఏళ్లలోపు వయస్కులే స్మార్ట్ఫోన్లలో మునిగిపోతున్నట్టు అంతర్జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఒకప్పుడు వారాంతాల్లో ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుని ఎక్కువ సేపు ఫోన్ చూసేవారు. తాజా పరిణామాలతో సాధారణ రోజుల్లోనే స్మార్ట్ఫోన్ల స్క్రీనింగ్ సమయం పెరిగిపోయింది. ఇక్కడ ప్రతి నిముషానికి ఒకసారి ఫోన్ చూసుకోవడం అలవాటుగా మారిపోయింది. ఫిలిప్పీన్స్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్, ఘనా దేశాల్లో రోజు వారీ స్క్రీనింగ్ సమయం 5 గంటలు దాటిపోతోంది. నాలుగు దక్షిణ అమెరికా, 4 సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలు టాప్–10 అత్యధిక స్క్రీనింగ్ జాబితాలో నిలిచాయి. అగ్రరాజ్యంగా పిలిచే అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లో గడుపుతున్నారని.. వీరిలో దాదాపు 40 శాతం మంది అధిక స్క్రీనింగ్ అలవాటును తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ సమయం ఫోన్లో గడుపుతున్నట్టు తెలుస్తోంది. వారి రోజువారీ సగటు స్క్రీనింగ్ సమయం 2.47 గంటలుగా ఉంటే.. పురుషులకు 2.34 గంటలుగా గుర్తించారు. ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్ వినియోగంలో ఎక్కువ సమయం ఇంటర్నెట్కు కేటాయిస్తున్నారు. -
మార్క్ జుకర్‌బర్గ్‌పై తీవ్ర విమర్శలు.. ఇన్స్టాగ్రామ్.. టేక్ ఏ బ్రేక్ !
Instagram Take A Break Option : యూజర్లకు మరింత చక్కని ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు ఇన్స్టాగ్రామ్ సరికొత్త ఆప్షన్ని అందుబాటులోకి తెచ్చింది. టేక్ ఏ బ్రేక్ పేరుతో ఇప్పటికే దీని బీటా వెర్షన్‌ని యూజర్లకు అందిస్తోంది. ఇక్కడ వచ్చిన ఫలితాలను పరిశీలించి డిసెంబరు నాటికి యూజర్లందరికీ అందుబాటులోకి తెస్తామంటూ ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ ముస్సోరీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. టేక్ ఏ బ్రేక్ ఇన్స్టాగ్రామ్ యాప్‌ను ఉపయోగించే యూజర్ల స్క్రీన్ టైమ్‌ని కంట్రోల్ చేయడం, సలహాలు ఇవ్వడం ఈ టేక్ ఏ బ్రేక్ ఆప్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇన్‌స్టాని యూజ్ చేస్తున్నప్పుడు పది , ఇరవై, ముప్పై నిమిషాలు గడిచిన తర్వాత టేక్ ఏ బ్రేక్ అంటూ పాప్ అప్ మేసేజ్ వస్తుంది. అప్పుడు యూజర్లు కాసేపు ఇన్స్టాకి విరామం ఇచ్చి ఇతర పనులు చూసుకోవచ్చు. Testing “Take a Break” 🧑🔬 We started testing a new feature called “Take a Break” this week. This opt-in control enables you to receive break reminders in-app after a duration of your choosing. I’m excited to dig into the results & hopefully launch this sometime in December. ✌🏼 pic.twitter.com/WdSTjL6ZdH — Adam Mosseri 😷 (@mosseri) November 10, 2021 కుదిపేసిన ఆరోపణలు ఇన్‌స్టాగ్రామ్‌ని మేటా సంస్థ అందిస్తోంది. ఇటీవల మేటా మాజీ ఉద్యోగి విజిల్ బ్లోయర్ ఫ్రాన్సెస్ మేటాపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మేటా యజమాని మార్క్ జుకర్‌బర్గ్ లాభాలే లక్ష్యంగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ నడిపిస్తున్నారంటూ ఆరోపించి సంచనలం సృష్టించారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ కారణంగా టీనేజర్లు పెడదోవ పడుతున్నారంటూ ఆమె బల్లగుద్ది మరీ వాదించారు. అమెరికా సెనెట్‌ను ఈ ఆరోపణలు పట్టి కుదిపేశాయి. విమర్శల వల్లేనా? మేటా ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌పై నలువైపుల నుంచి వస్తున్న విమర్శల తాకిడి విరుగుడుగా ఈ టేక్ ఏ బ్రేక్ ఆప్షన్ని మేటా అందుబాటులోకి తెచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. యూజర్ల సంక్షేమాన్ని, సమయాన్ని దృష్టిలో ఉంచుకునే టేక్ ఏ బ్రేక్ ఆప్షన్ తెచ్చారని చెబుతున్నారు. ముఖ్యంగా టీనేజర్లకు ఇన్‌స్టాలో ఎంత సమయం గడిపామనే విషయం ఇట్టే తెలిసిపోతుందని, దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు. ఈ టేక్ ఏ బ్రేక్ ఆప్షన్‌తో యూజర్ల సంక్షేమం కోసం మేటాకి ప్రాధాన్యం అనే సందేశం ఇచ్చినట్టు అవుతుందంటున్నారు. చదవండి: ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ డేటా లీక్.. కిమ్ కర్దాషియన్ తో పాటు -
స్క్రీన్‌టైమ్‌తో నిద్ర ఎందుకు చెడుతుందంటే?
నిద్రకు ఉపక్రమించేంత వరకూ స్మార్ట్‌ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్‌లతో కుస్తీపడుతున్నారా? అయితే మీకు జాగరణ తప్పదు. ఈ విషయం తెలియనిది ఎవరికి అంటున్నారా? నిజమేగానీ.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? సాల్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల తాజా పరిశోధన ప్రకారం స్క్రీన్ ముందు ఉన్నప్పుడు మన కళ్లల్లోని కొన్ని కణాలు ఈ కాంతికి స్పందించి మన జీవగడియారాన్ని రీసెట్ చేస్తాయి! రాత్రిపూట స్క్రీన్ల నుంచి వచ్చే కృత్రిమ కాంతి మన జీవగడియారాన్ని కొంత గందరగోళానికి గురి చేస్తుందని ఈ మధ్యలో ఈ ప్రత్యేక కణాలు గడియారాన్ని రీసెట్ చేయడం వల్ల నిద్ర దెబ్బతినడం మాత్రమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సచిన్ పాండా తెలిపారు. కృత్రిమ కాంతి ముందు ఉన్నప్పుడు రెటినా లోపలిభాగాల్లో ఉండే కణాలు మెలనోస్పిన్ అనే ప్రొటీన్ ఉత్పత్తి అవుతూ ఉంటుందని.. ఇది కాస్తా మెలకువగా ఉండాలన్న సంకేతాలను మెదడుకు పంపుతాయని పాండా చెప్పారు. పదినిమిషాల కంటే ఎక్కువ సమయం ప్రకాశవంతమైన కాంతిలో ఉన్నప్పుడు మెలనోస్పిన్ విడుదలై నిద్రకు కారణమైన రసాయనం వె -
ఆ పనికే రోజుకు పదిన్నర గంటలు పోతోంది
న్యూయార్క్: స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్స్, పర్సనల్ కంప్యూటర్స్, మల్టీ మీడియా డివైసెస్, వీడియో గేమ్‌లు, రేడియోలు, డీవీడీలు, డీవీఆర్లు, టీవీల స్క్రీన్లపై మనం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాం. ఎవరైనా అధ్యయనం జరిపి, వాటి వివరాలను క్రోడీకరిస్తే చెప్పవచ్చు. వీటిపై అమెరికా పౌరులు మాత్రం రోజుకు సరాసరి సగటున పది గంటల 39 నిమిషాల సమయాన్ని వెచ్చిస్తున్నారని నీల్సన్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలాన్ని పరిగణలోకి తీసుకొని సర్వే చేయగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. గతేడాది ఇదే కాలానికి అమెరికా పౌరులు ఈ స్క్రీన్లపై వెచ్చించిన సమయం 9 గంటల, 39 నిమిషాలు. అంటే గతేడాదికి ఈ ఏడాదికి వీటిపై వెచ్చిస్తున్న సమయం గంట పెరిగింది. ఫొటోలు తీయడానికి, టెక్స్ట్ టైప్ చేయడానికి పడుతున్న సమయాన్ని ఈ పదిన్నర గంటలలోకి తీసుకోలేదు. ఎక్కువ వరకు స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడం వల్ల ఈ గంట సమయం పెరిగింది. నెట్ఫిక్స్, హులు లాంటి ఆన్లైన్ డిమాండ్ ద్వారా సినిమాలు చూడడం వల్ల కూడా ఇందులో కొంత సమయం పెరిగినట్లు గుర్తించారు. ఈ వివరాలేవీ తనకు ఆశ్చర్యానికి గురి చేయడం లేదని, ఎలక్ట్రానిక్ డివైసెస్ పెరుగుతుండడం వల్ల స్క్రీన్లపై మనం వెచ్చిస్తున్న సమయం పెరుగుతోందని, వచ్చే ఏడాది ఇది మరింత పెరిగే ప్రమాదం ఉందని హార్వర్డ్ యూనివర్శిటీలోని హెల్త్ సోషియాలోజి విభాగానికి చెందిన ప్రొఫెసర్ స్టీవ్ గోర్ట్మేకర్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి సర్వేకు, ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఇలా వెచ్చిస్తున్న సమయంపోను మిగతా సమయాన్ని మనిషి ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారన్నదే తన ముఖ్యమని ఆయన అన్నారు. అమెరికాలోని పెద్దవాళ్లలో 81 శాతం మందికి స్మార్ట్ఫోన్లు ఉన్నాయని, వారు తమ స్మార్ట్ఫోన్లను వారు రోజులో సరాసరి సగటున గంటా 39 నిమిషాలు ఉపయోగిస్తున్నారని సర్వే వెల్లడించింది. అమెరికాలో ఇప్పటికీ రేడియోలు, టెలివిజన్లను ఉపయోగించడం విశేషం. 94 శాతం పెద్దవారికి అక్కడ హెచ్డీ టెలివిజన్లు అందుబాటులో ఉన్నాయి. వారు సినిమాలు, ఇతర కార్యక్రమాలను రోజుకు నాలుగున్నర గంటలపాటు టెలివిజన్‌లో వీక్షిస్తున్నారు. వారానికి 168 గంటలు. వాటిలో నిద్రకుపోయే సమయాన్ని రోజుకు ఆరు గంటల చొప్పున తీసేస్తే మిగిలే సమయం 126 గంటలు. అందులో ఆఫీసులో పనిచేసే కాలాన్ని వారానికి 40 గంటలు తీసేస్తే మిగిలే సమయం 86 గంటలు. కాలకృత్యాల నుంచి మొదలుకొని స్నానం చేసేవరకు, వంట వండుకొని తిని ఆఫీసుకు బయల్దేరే వరకు వ్యక్తిగత పనులకు రోజుకు మూడు గంటల చొప్పున వారానికి 21 గంటలను తీసేస్తే మిగిలే సమయం 65 గంటలు. రోజుకు పదిన్నర గంట బదులు పది గంటలనే స్క్రీన్లపై వెచ్చిస్తున్నామనుకొని లెక్కిస్తే దానికే వారానికి 70 గంటలు కావాలి. అంటే మిగిలే సమయమే అమెరికా పౌరులకు లేదన్నమాట. నిద్రనో, వ్యక్తిగత పనులకు వెచ్చిస్తున్న సమయాన్నో వారు ఇందుకు ఉపయోగించుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. ఇక వ్యక్తిగల అలవాట్ల విషయానికి వస్తే వాకింగ్, జాగింగ్, స్నేహితులతో ముచ్చట్లు, వీకెండ్ పార్టీలు, పిల్లలతో గడిపేందుకు ఒక్క నిమిషం కూడా మిగలడం లేదన్న మాట. ఇలాంటి పరిస్థితుల కారణంగానే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఆటలు, పాటలు లేకుండా పిల్లలు స్క్రీన్లకే అతుక్కు పోతుండడం వల్ల అమెరికాలో ఊబకాయం సమస్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు తరుణోపాయం కనుక్కోవాల్సిందే!