
నిద్రకు ఉపక్రమించేంత వరకూ స్మార్ట్‌ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్‌లతో కుస్తీపడుతున్నారా? అయితే మీకు జాగరణ తప్పదు. ఈ విషయం తెలియనిది ఎవరికి అంటున్నారా? నిజమేగానీ.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? సాల్క్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తల తాజా పరిశోధన ప్రకారం స్క్రీన్ ముందు ఉన్నప్పుడు మన కళ్లల్లోని కొన్ని కణాలు ఈ కాంతికి స్పందించి మన జీవగడియారాన్ని రీసెట్ చేస్తాయి! రాత్రిపూట స్క్రీన్‌ల నుంచి వచ్చే కృత్రిమ కాంతి మన జీవగడియారాన్ని కొంత గందరగోళానికి గురి చేస్తుందని ఈ మధ్యలో ఈ ప్రత్యేక కణాలు గడియారాన్ని రీసెట్ చేయడం వల్ల నిద్ర దెబ్బతినడం మాత్రమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సచిన్ పాండా తెలిపారు.
కృత్రిమ కాంతి ముందు ఉన్నప్పుడు రెటినా లోపలిభాగాల్లో ఉండే కణాలు మెలనోస్పిన్ అనే ప్రొటీన్ ఉత్పత్తి అవుతూ ఉంటుందని.. ఇది కాస్తా మెలకువగా ఉండాలన్న సంకేతాలను మెదడుకు పంపుతాయని పాండా చెప్పారు. పదినిమిషాల కంటే ఎక్కువ సమయం ప్రకాశవంతమైన కాంతిలో ఉన్నప్పుడు మెలనోస్పిన్ విడుదలై నిద్రకు కారణమైన రసాయనం వె