బాబోయ్ బుధవారమే! | Most road accidents Wednesday in Bangalore | Sakshi
Sakshi News home page

బాబోయ్ బుధవారమే!

Published Fri, Jan 9 2015 12:15 PM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

బాబోయ్ బుధవారమే!

బాబోయ్ బుధవారమే!

*ఆ ఒక్కరోజే బెంగళూరులో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు
*మధ్యాహ్నం 12 నుంచి 3గంటల మధ్యలో

 
బెంగళూరు: బుధవారం అంటే బెంగళూ రు వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుం టున్నారు. ఆ ఒక్కరోజే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2014 ఏడాదిలో మొత్తం 5004 రోడ్డు ప్రమాదాలు జరగగా అందులో ఒక్క బుధవారమే 803 ప్రమాదాలు జరిగాయి. అంతకు ముందు ఏడాది (2013)తో పోలిస్తే ఈ సంఖ్య 31 ఎక్కువగా ఉండడం గమనా ర్హం. అటుపై రెండోస్థానంలో శనివారం ఉం టోంది.  ఆ రోజు 773 రోడ్డు ప్రమాదాలు జరి గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది బెంగళూరు పరిధిలో జరిగిన రోడ్డు ప్ర మాదాలను అనుసరించి నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం రూపొందించిన గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి.

ప్రమాద మృతులు, క్షతగాత్రుల విషయం లో మహిళలతో పోలిస్తే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది. మృతుల్లో 599 పురుషు లు, 130 మహిళలు ఉండగా క్షతగాత్రుల్లో ఆ సంఖ్య 3,165,933గా ఉంది. వయస్సును ప్రతిపాదికన తీసుకుంటే   మృతుల్లో 31 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నవారు ఎక్కువగా ఉండగా క్షతగాత్రుల విషయంలో 19 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు.


* మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది ఆ సమయంలో మొత్తం 898 ప్రమాదాలు జరిగాయి. తర్వాత ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య 897 ప్రమాదాలు జరిగాయి.

*   రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహనాల్లో లైట్ మోటార్ వెహికల్స్ (1,424), ద్విచక్రవాహనాలు (1,420) వరుసగా మొదటి, రెండో స్థానంలో ఉన్నాయి.
 *    రోడ్డు ప్రమాదాల మృతుల్లో ఎక్కువగా ద్విచక్రవాహనదాలు (332), అటుపై పాదచారులు (331) ఉన్నారు.
*   మొత్తంగా 2004 ఏడాదిలో 5,004 రోడ్డు ప్రమాదాలు జరుగగా అందులో 729 మంది చనిపోయారు.
*   2005లో బెంగళూరులో 24,67,270 వాహనాలు ఉండగా 2014 నవంబర్‌కు ఆ సంఖ్య 53,92,847కు పెరిగింది.
 
 రూ.65 కోట్ల అపరాధ రుసుం వసూలు
 ‘2014 ఏడాదిలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిన వారికి సంబంధించి మొత్తం 74,36,336 కేసులు నమోదు చేశాం. వీరి నుంచి రూ.65,92,21,449ను అపరాధ రుసుం వసూలు చేశాం. నగర ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న కఠిన నిబంధనలతో పాటు ప్రజల ఆలోచన విధానంలో వస్తున్న మార్పుల వల్ల 2013 ఏడాది కంటే 2014 ఏడాదిలో రోడ్డు ప్రమాదాల సంఖ్యతో పాటు మృతులు, క్షతగాత్రుల సంఖ్య తగ్గింది.’  - దయానంద, అదనపు కమిషనర్ (ట్రాఫిక్), బెంగళూరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement