Hyderabad: Statistical Officer Molested Computer Operator - Sakshi
Sakshi News home page

కంప్యూటర్‌ ఆపరేటర్‌కు వేధింపులు.. మాతృ సంస్థకు ఉన్నతాధికారి

Published Thu, Dec 9 2021 11:02 AM | Last Updated on Thu, Dec 9 2021 1:55 PM

Statistical Officer Molested Computer Operator In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంప్యూటర్‌ ఆపరేటర్‌ను లైంగికంగా వేధించాడనే ఫిర్యాదుతో జీహెచ్‌ఎంసీ ఆరోగ్య విభాగంలో స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (ఎస్‌ఓ)గా పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్‌ను ఆయన మాతృశాఖ అయిన వైద్యారోగ్య శాఖకు పంపించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

శ్రీనివాస్‌ తనను కొంతకాలంగా వేధిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు నేరుగా మేయర్‌ను కలిసి ఫిర్యాదు చేయడం,  సీరియస్‌ అయిన మేయర్‌ ఎస్‌ఓను మాతృశాఖకు పంపించాల్సిందిగా ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ను మా తృశాఖకు పంపించడంతో పాటు ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి, తదుపరి చ ర్యల నిమిత్తం  నివేదికను ఆయన మాతృశాఖకు పంపిస్తామని ఉత్తర్వులో పేర్కొన్నారు.   

చదవండి: సినీ పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement