గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దళాలు జరిపిన మారణకాండకు ప్రతికారంగా ఆ దేశం.. గాజాపై దాడులు చేస్తోంది. కాల్పుల విరమణ చేసి.. పాలస్తీనా ప్రజలకు మానవతా సాయం అందిచాలని ఆమెరికాతో పాటు పలు దేశాలు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. కొన్ని దేశాలు ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తున్నాయి.
అయితే తాజాగా ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్ కలిగిన ప్రజలను ఈ జాబితాలోని దేశాలు.. తమ దేశంలోకి అనుమతించవని వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేసింది. ఆ జాబితాలో అల్జేరియా, బంగ్లాదేశ్, బ్రూనై, ఇరాన్, ఇరాక్, కువైట్, లెబనాన్, లిబియా, పాకిస్తాన్ దేశాలు ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ చట్టాల ప్రకారం.. లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్, ఇరాన్ దేశాలు శత్రు దేశాలు జాబితాలో ఉన్నాయి. ఈ అయితే ఈ దేశాలకు ఇజ్రాయెల్ పౌరులు.. వెళ్లాలంటే ఇజ్రాయెల్ మంత్రిత్వ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందే. అయితే మధ్యప్రాచ్య దేశాల్లో ఇజ్రాయెల్‌కు వీసా ఫ్రీ దేశంగా కేవలం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఉండటం గమనార్హం.
We’re good pic.twitter.com/GmiwEzZGck
— Israel ישראל 🇮🇱 (@Israel) March 14, 2024
అయితే దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ పౌరులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశంలో ఓ రాష్ట్ర అధికారిక ట్విటర్ హ్యాండిల్ కౌంటర్ ఇచ్చింది. ‘మేం బాగున్నాం’ అని ‘ఎక్స్’లో రీట్వీట్ చేసింది.
ఇక..2024 నాటికి ప్ఇజ్రాయెల్ దేశం రపంచంలో 171 దేశాల్లో వీసా రహిత లేదా వీసా ఆన్ అరైవల్ యాక్సెస్‌ను కలిగి ఉంది. అదేవిధంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఇజ్రాయెల్ పాస్‌పోర్టు 20వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్ కలిగిన పౌరులు చాలా యురోపీయన్ దేశాలుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా వెళ్తారు. అదేవిధంగా లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు కూడా ఇజ్రాయెల్ ప్రజలు తమ పాస్‌పోర్టు ద్వారా సందర్శిస్తారు.
ఇదీ చదవండి: స్వలింగ వివాహం చేసుకున్న విదేశాంగ మంత్రి!
Comments
Please login to add a commentAdd a comment