pass port
-
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌కు ఇజ్రాయెల్ కౌంటర్
గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దళాలు జరిపిన మారణకాండకు ప్రతికారంగా ఆ దేశం.. గాజాపై దాడులు చేస్తోంది. కాల్పుల విరమణ చేసి.. పాలస్తీనా ప్రజలకు మానవతా సాయం అందిచాలని ఆమెరికాతో పాటు పలు దేశాలు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. కొన్ని దేశాలు ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తున్నాయి. అయితే తాజాగా ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్ కలిగిన ప్రజలను ఈ జాబితాలోని దేశాలు.. తమ దేశంలోకి అనుమతించవని వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేసింది. ఆ జాబితాలో అల్జేరియా, బంగ్లాదేశ్, బ్రూనై, ఇరాన్, ఇరాక్, కువైట్, లెబనాన్, లిబియా, పాకిస్తాన్ దేశాలు ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ చట్టాల ప్రకారం.. లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్, ఇరాన్ దేశాలు శత్రు దేశాలు జాబితాలో ఉన్నాయి. ఈ అయితే ఈ దేశాలకు ఇజ్రాయెల్ పౌరులు.. వెళ్లాలంటే ఇజ్రాయెల్ మంత్రిత్వ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందే. అయితే మధ్యప్రాచ్య దేశాల్లో ఇజ్రాయెల్‌కు వీసా ఫ్రీ దేశంగా కేవలం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఉండటం గమనార్హం. We’re good pic.twitter.com/GmiwEzZGck — Israel ישראל 🇮🇱 (@Israel) March 14, 2024 అయితే దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ పౌరులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశంలో ఓ రాష్ట్ర అధికారిక ట్విటర్ హ్యాండిల్ కౌంటర్ ఇచ్చింది. ‘మేం బాగున్నాం’ అని ‘ఎక్స్’లో రీట్వీట్ చేసింది. ఇక..2024 నాటికి ప్ఇజ్రాయెల్ దేశం రపంచంలో 171 దేశాల్లో వీసా రహిత లేదా వీసా ఆన్ అరైవల్ యాక్సెస్‌ను కలిగి ఉంది. అదేవిధంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఇజ్రాయెల్ పాస్‌పోర్టు 20వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్ కలిగిన పౌరులు చాలా యురోపీయన్ దేశాలుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా వెళ్తారు. అదేవిధంగా లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు కూడా ఇజ్రాయెల్ ప్రజలు తమ పాస్‌పోర్టు ద్వారా సందర్శిస్తారు. ఇదీ చదవండి: స్వలింగ వివాహం చేసుకున్న విదేశాంగ మంత్రి! -
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఇదే.. భారత్‌కు ఎన్నో స్థానం అంటే
న్యూఢిల్లీ: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు చోటు దక్కించుకున్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్ ఉంటే చాలు వీసా లేకుండా 194 ప్రపంచ దేశాల్లో ప్రయాణించొచ్చు. ➦ఈ దేశాల తర్వాత ఫిన్లాండ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌లతో 193 దేశాల్ని చుట్టి రావొచ్చు. ➦భారత్ పాస్‌పోర్ట్ ఉంటే వీసా లేకపోయినా 62 దేశాలకు ప్రయాణించే సౌకర్యం ఉండడంతో హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ జాబితాలో 85వ స్థానాన్ని దక్కించుకుంది. ఇండోనేషియా, మలేషియా,థాయిలాండ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు భారతీయులకు వీసా అవసరలేదు. అయితే హెన్లీ ఇండెక్స్‌లో భారత్ గతేడాది 84వ స్థానంతో పోలిస్తే భారత్ ఒక ర్యాంక్ దిగజారడం గమనార్హం. ➦దక్షిణాఫ్రికా (55), మాల్దీవులు (58), సౌదీ అరేబియా (63), చైనా (64), థాయిలాండ్ (66), ఇండోనేషియా (69), ఉజ్బెకిస్థాన్ (84) వంటి దేశాల కంటే భారత్ వెనుకబడి పోయింది. ➦భారత్‌కు పొరుగు దేశాలైన పాకిస్తాన్ సూచీలో 106వ స్థానంలో ఉండగా, శ్రీలంక 101వ స్థానంలో, బంగ్లాదేశ్ 102వ స్థానంలో, నేపాల్ 103వ స్థానంలో నిలిచాయి. ➦వీసా లేకుండా 192 దేశాలకు ప్రయాణించే అర్హత ఉన్న పాస్‌పోర్ట్‌ల జాబితాలో యూకే, ఐర్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రియాలు ఇండెక్స్‌లో మూడవ స్థానంలో ఉంది. ఆ దేశాల తర్వాత మూడు యూరోపియన్ దేశాలు బెల్జియం, నార్వే, పోర్చుగల్, 191 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌తో నాల్గవ స్థానాన్ని ఆక్రమించాయి. ➦ఆస్ట్రేలియా, గ్రీస్, మాల్టా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్‌లు 190 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ను కలిగి ఉన్న తర్వాత ఇండెక్స్‌లోని మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. ➦ప్రపంచంలోని అత్యంత వలసలు ఎక్కువగా ఉన్న దేశాలలో ఒకటి కెనడా కాగా, దాని పొరుగున ఉన్న అమెరికా, రెండు యూరోపియన్ దేశాలైన పోలాండ్, చెకియాతో పాటు ఆరవ స్థానంలో ఉంది. ➦అమెరికా, కెనడా, పోలాండ్, చెకియా 189 దేశాలకు వీసా రహిత ప్రాప్యతను కలిగి ఉన్న తర్వాత సూచికలో ఆరవ స్థానంలో ఉన్నాయి. ➦ఈ సూచీ ఆఫ్ఘనిస్తాన్ 109వ స్థానంలో ఉండగా.. ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన పాస్‌పోర్ట్‌తో ఆఫ్ఘనిస్తాన్ 28 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ➦సిరియా (108వ స్థానం), ఇరాక్ (107వ స్థానం), యెమెన్ (105వ స్థానం), పాలస్తీనా టెరిటరీ (103వ స్థానం) వంటి దేశాలు ఆఫ్ఘనిస్తాన్ కంటే ముందు ఉన్నాయి. పాస్‌పోర్ట్‌ల ర్యాంకింగ్ ఎలా నిర్ణయిస్తారు? 2006 నుంచి హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల ర్యాంకింగ్‌ను నిరంతరం విడుదల చేస్తోంది. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్ అథారిటీ డేటా ఆధారంగా. ఒక దేశంలోని ప్రజలు అనేక దేశాలకు ప్రయాణించడం ఎంత సులభమో తెలియజేస్తుంది. -
Rahul Gandhi: పాస్‌పోర్టు కోసం.. లైన్ క్లియర్
సాక్షి, ఢిల్లీ: పాస్‌పోర్టు వ్యవహారంలో.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఢిల్లీ కోర్టు ఊరట ఇచ్చింది. మూడు సంవత్సరాలపాటు సాధారణ(రెగ్యులర్) పాస్‌పోర్ట్ పొందేందుకు అనుమతిస్తూ శుక్రవారం ఎన్వోసీ ఆదేశాలు జారీ చేసింది. ఎంపీగా పార్లమెంట్ అనర్హత వేటు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ.. తన డిప్టోమేటిక్ పాస్‌పోర్ట్‌ను తిరిగి అప్పగించారు. పాస్పోర్టుతో పాటు అన్ని రకాల ప్రయాణ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. అనంతరం కొత్త పాస్‌పోర్టు(సాధారణ) దరఖాస్తు చేసుకునేందుకు నో అబ్జక్షన్ సర్టిఫికేట్(NOC) కోసం రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారాయన. అందుకు కారణం.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన నిందితుడిగా ఉండడమే. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన మనీలాండరింగ్, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసు ఇది. దీంతో రెగ్యులర్ పాస్‌పోర్టు కోసం ఆయన ఎన్వోసీ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో ఇవాళ కోర్టు ఆదేశాలిస్తూ అయితే రాహుల్ కోరినట్లు పదేళ్లకు కాకుండా మూడేళ్లకు మాత్రమే సాధారణ పాస్‌పోర్ట్ కోసం ఎన్వోసీ ఇస్తున్నట్లు తెలిపింది. Delhi's Rouse Avenue Court partly allows Congress leader Rahul Gandhi's plea seeking NOC for issuance of a fresh ordinary passport. The court has granted NOC for 3 years. pic.twitter.com/laElsJqELR — ANI (@ANI) May 26, 2023 అంతకు ముందు బుధవారం విచారణ సందర్భంగా.. పాస్‌పోర్టు నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోరుతూ గాంధీ చేసిన అభ్యర్థనపై శుక్రవారంలోగా సమాధానం ఇవ్వాలని బీజేపీ మాజీ ఎంపి స్వామిని కోర్టు కోరింది. ఇక ఇవాళ్టి తీర్పు సందర్భంగా.. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వైభవ్ మెహతా ప్రయాణించే హక్కు ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయాణాలపై కోర్టు ఆంక్షలు విధించలేదని తెలిపింది. అలాగే.. 2015 డిసెంబరులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేస్తున్నప్పుడు, కోర్టు అతని ప్రయాణంపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని, ఆంక్షలు విధించాలంటూ స్వామి చేసిన విజ్ఞప్తిని ఆ సమయంలోనూ తిరస్కరించారని మేజిస్ట్రేట్ ఈ సందర్భంగా గుర్తు చేశారు కూడా. -
వయసు 84.. చలో యూరప్
మహిళ తన కలలను సాకారం చేసుకోగలిగేది కుటుంబ అవసరాలన్నీ పూర్తయిన తర్వాతే. అంటే అన్ని బాధ్యతలు తీరాక అప్పటికీ పరిస్థితులు అనుకూలిస్తే అది ఆమె అదృష్టంగా మారుతుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కోయంబత్తూర్ వాసి 84 ఏళ్ల లలితాంబాల్ భారతదేశం బయటి ప్రపంచాన్ని చూస్తూ ఆరు దశాబ్దాల తన కలను నెరవేర్చుకుంటోంది. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లను ఈ రిటైర్డ్ టీచర్ అధిగమిస్తున్న విధానం చాలా ఆసక్తిదాయకంగానూ, ఎంతోమంది అనుసరించదగినదిగానూ ఉంటుంది. 60వ దశకంలో లలితాంబాల్ జాగ్రఫీ, హిస్టరీ టీచర్‌గా పనిచేసేవారు. ఆ సమయంలో ఆమె ప్రపంచాన్ని పర్యటించాలని కలలు కనేవారట. కానీ ఆమెకు పరిస్థితులు అనుకూలించలేదు. ఆరు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఒక విదేశీ గడ్డపై అడుగుపెట్టింది. పాస్‌పోర్ట్ వచ్చిన వేళ ‘‘చిన్నవయసులోనే పెళ్లి అవడం, ఆ తర్వాత కుటుంబ బాధ్యతలకేప్రా ధాన్యం ఇస్తూ వచ్చాను. అదే నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఆర్థిక కష్టాలు, ఇతరప్రా ధాన్యాలతో కుటుంబ భవి ష్యత్తు వైపే ఉండటానికి నిర్ణయించు కున్నాను. నా సమయమంతా అందుకే కేటాయించాను. అయితే, నా కలలు మాత్రం ఎప్పుడూ నన్ను వీడిపోలేదు. పుస్తకాల్లో చదివిన విషయాలు, విద్యార్థులకు బోధించే సమయంలోనూ ‘ఎప్పుడైనా బయట ప్రపంచం వైపుగా ప్రయాణం చేయగలనా..’ అని అనుకునేదాన్ని. కానీ, ప్రయాణం మాట అటుంచితే కనీసం పాస్‌పోర్ట్ కూడా తీసుకోలేకపోయాను. రెండేళ్ల క్రితం నా కూతురు మేఖల పాస్‌పోర్ట్‌కు అప్లై చేయమని చెప్పింది. ప్రయత్నించాను. 83 ఏళ్ల వయసులో నా చేతుల్లోకి పాస్‌పోర్ట్ వచ్చింది. నాలుగేళ్ల క్రితం.. నెదర్లాండ్స్‌లో నా మనవరాలు స్థిరపడింది. తన పొదుపు మొత్తంతో నా కలను నిజం చేయడానికి తను బాధ్యత తీసుకుంది. నా దగ్గర కూడా కొంత పొదుపు మొత్తాలున్నాయి. అయితే, మూడేళ్ల క్రితం వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా నా భర్త మరణించడంతో అన్నీ ఆగిపోయాయి. యూరప్ అంతా... ప్రస్తుతం ఉన్న వయసు, ఆరోగ్యస్థితి కారణంగా విదేశాలకు వెళ్లగలనా, కుటుంబంలో మిగతా అందరికీ ఆందోళనగా మారుతుందా అని మొదట్లో సంకోచించాను. కానీ, పిల్లలు ఇచ్చిన ధైర్యంతో ఎట్టకేలకు ఆమ్‌స్టర్‌డామ్‌లో దిగాను. మా అమ్మాయితో కలిసి మూడు నెలల పాటు యూరప్ అంతా ప్రయాణించాను. భౌగోళికం, చరిత్రలో విద్యార్థులకు బోధించిన విషయాలు కళ్లారా చూడటం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అందులో ఒక ఉదాహరణ.. రిజ్క్ మ్యూజియంలోని అతి పెద్ద వాటర్లూ యుద్ధం పెయింటింగ్ చూసి ఊపిరి పీల్చుకున్నాను. ఊహల్లోకంటే వాస్తవికంగా చూసినప్పుడు ఆ పెయింటింగ్ మరింత అద్భుతంగా అనిపించింది. ఈతరాణిగా.. విమానాల్లో తిరగడం, నీటిపై లాంచీలో విహారం ఎన్నో దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రకృతితో కలిసి ప్రజలు సాగిస్తున్న జీవితాలను చూశాను. ఒక ట్రిప్ నుండి మరొక ట్రిప్‌కు వెళ్లడంలో ఎన్నో భయాలు దూరమయ్యాయి. నా చిన్నతనం కేరళలో గడిచింది. మేమున్నప్రా ంతంలో ‘ఈతరాణి’ అనే పేరుండేది నాకు. కానీ, ఆ తర్వాత జీవనంలో అదీ మర్చిపోయాను. 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈత కొడుతున్నాను. ఒకప్పుడు స్వేచ్ఛగా ఈదుతూ భవిష్యత్తు గురించి కొంచెం ఎక్కువ కలలు కనే అదే చిన్న అమ్మాయిగా ఇప్పుడు మారిపోయాను. లొంగిపోవద్దు.. నాకు స్వతంత్రంగా ఉండే మహిళలంటే చాలా గౌరవం. వారి శక్తి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అయితే, ఈ సమయంలోనే ఎన్నో పోరాటాలు, గందరగోళాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరిస్థితులు లేదా వ్యక్తులకు ఎప్పుడూ వంగి, ఆధిపత్యానికి లొంగిపోవద్దు. మీ మూలాలను అస్సలు మరచిపోవద్దు. ఆర్థిక స్వాతంత్య్రం ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో సొంత నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది. ఇదే విషయం చెబుతూ నా ఇద్దరు పిల్లలను, ముగ్గురు మనవళ్లను పెంచాను. ఇప్పుడు వారి సాయంతో నా దశాబ్దాల కలను నెర వేర్చుకుంటున్నాను’’ అని చెబుతుంది లలితాంబాల్. 84 ఏళ్ల వయసులో మహిళలు విస్తృతంగా ప్రయాణించడం చాలా అరుదు. కానీ, లలితాంబాల్ జీవన ప్రయా ణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. -
సినిమా కథను తలపించే లవ్‌స్టోరీ.. ప్రియుడి కోసం భారత్‌కు.. అతడి మరణంతో...
సాక్షి, హైదరాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ దళారీ హితేష్ జోషితో బంగ్లాదేశ్‌కు చెందిన సిరిన అక్తర్ హుస్సేన్‌కు ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. ఇది ప్రేమగా మారడంతో ఇతడి కోసం ఆమె అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చింది. హైదరాబాద్ నుంచి బోగస్ గుర్తింపు పత్రాలు పొందింది. ఇటీవల ఆ విషయం వెలుగులోకి రావడంతో గుజరాత్ పోలీసులు సిరినను అరెస్టు చేశారు. ఈమెకు ఫోర్జరీ పత్రాలు అందించిన నగరవాసి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనికోసం ఓ ప్రత్యేక బృందం ఆదివారం సిటీకి చేరుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. చదవండి: ఇక బస్సులపై ప్రకటనలు ఉండవు హితేష్– సిరిన మధ్య 2016లో ఫేస్బుక్ స్నేహం ఏర్పడటంతో ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత వాట్సాప్ చాటింగ్స్‌లో ప్రేమించుకున్నారు. తొలుత హితేష్‌ను కలుసుకోవాలని భావించిన సిరిన 2017 మార్చిలో 90 రోజుల విజిట్ వీసాపై భారత్‌కు వచ్చి వెళ్లింది. ఆపై అతడితోనే కలిసి జీవించాలని నిర్ణయించుకుని అక్రమ మార్గంలో సరిహద్దులు దాటి భారత్‌కు వచ్చేసింది. చదవండి: నైపుణ్యానిదే భవిష్యత్తు.. సాధారణ చదువులతో ఉపాధి అంతంత మాత్రమే బంగ్లాదేశ్‌లో ఉన్న దళారుల ద్వారా కోల్‌కతా చేరుకున్న సిరిన అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంది. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన సభ్యుల ద్వారా గుత్తా సోను బిశ్వాస్ పేరుతో నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డులు సంపాదించింది. వీటిని తీసుకుని అహ్మదాబాద్ వెళ్లి హితేష్‌ను కలిసింది. 2017 అక్టోబర్ నుంచి అక్కడి సనాతన్ ప్రాంతంలో వీళ్లిద్దరూ సహ జీవనం చేయసాగారు. 2018లో వీరికి ఓ కుమార్తె జన్మించింది. 2020లో సిరిన.. సోను పేరుతో అహ్మదాబాద్ రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం నుంచి పాస్‌పోర్టు కూడా పొందింది. దీన్ని వినియోగించి భారతీయురాలిగా బంగ్లాదేశ్ వెళ్లి తన కుటుంబీకులను కలిసి వచ్చింది. ఇన్నాళ్లూ గుట్టుగా ఉన్న ఈమె వ్యవహారం హితేష్ మరణంతో బయటకు పడింది. గత నెల ఆఖరి వారంలో హితేష్ అనారోగ్య కారణాలతో కన్నుమూశాడు. ఆపై సిరిన అలియాస్ సోను అతడి తల్లిదండ్రుల ఇంటికి చేరింది. ఆస్తుల పంపకం విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తి వాగ్వాదానికి కారణమైంది. దీంతో ఆవేశానికి గురైన హితేష్ తల్లిదండ్రులు సిరినను ఉద్దేశించి అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీ అంటూ దూషించారు. ఈ సమాచారం సనాతల్ పోలీసులకు అందింది. దీంతో పోలీసులు గత వారం సిరినను అరెస్టు చేశారు. సిరినకు సోను పేరుతో ఆధార్, పాన్ కార్డులు తయారు చేసిన ఇచ్చిన నిందితుల కోసం అహ్మదాబాద్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనికోసం ఓ ప్రత్యేక బృందాన్ని ఆదివారం హైదరాబాద్ పంపారు. సిరిన కేవలం హితేష్‌పై ఉన్న ప్రేమతోనే ఇలా అక్రమంగా వచ్చిందని, ఈ కేసులో మరే ఇతర కోణం లేదని అహ్మదాబాద్ పోలీసులు చెబుతున్నారు. చట్ట ప్రకారం ఆమె చేసింది నేరం కావడంతో అరెస్టు చేశామని వివరిస్తున్నారు. -
కొత్త వీసాల జారీకి కువైట్ గ్రీన్ సిగ్నల్
మోర్తాడ్ (బాల్కొండ): కొత్తగా వచ్చే వలస కార్మి కులకు వీసాలు జారీ చేయాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ కారణంగా 2020 మార్చి నుంచి కువైట్, కార్మికులకు కొత్త వీసాల జారీని నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కువైట్‌లో కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గిపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే వ్యాపార, వాణిజ్య రంగాలలో కార్యకలాపాలు ఊపందుకోవడంతో కువైట్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా సమయంలో విదేశీ వలస కార్మికులు పెద్ద ఎత్తున స్వస్థలాలకు తరలిపోవడంతో ప్రస్తుతం కువైట్‌లో కార్మికుల కొరత ఏర్పడింది. గతంలో వీసా గడువు ఉన్నా కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులను ఇంటికి పంపించిన కంపెనీలు పాత కార్మికులను మళ్లీ రావాల్సిందిగా కోరుతున్నాయి. కొత్త వీసాల జారీకి కువైట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అవసరం ఉన్న రంగాల్లో వలస కార్మికులను రప్పించుకోవడానికి ఆయా కంపెనీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కువైట్ ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు రాష్ట్రాలలోని వలస కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
టూర్ వెళ్లాలంటే పుట్టిన తేదీ ఉండాల్సిందే!
న్యూఢిల్లీ: కోవిడ్-19 మొదటి, రెండు డోసులు తీసుకోవడమే కాక కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లో కూడా పుట్టిన తేదీ నమోదు చేసుకుంటేనే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుందని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) చీఫ్ డీఆర్ శర్మ స్పష్టం చేశారు. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పుట్టిన తేదీకి ఒక ఫార్మాట్ (సంవత్సరం\ నెల\ తేదీ) విధానాన్ని కూడా సూచించింది. ఇప్పుడిప్పుడే వ్యాపారాలు, దుకాణలు, కార్యాలయాలు నెమ్మదిగా తెరుచుకుని యథావిధిగా కొనసాగుతున్నాయని పేర్కొంది. (చదండి: సైకిల్‌పై దుస్తులమ్ముకునే వ్యక్తి కొడుకు.) ఈ కమంలో ప్రయాణికులు సురక్షితంగా ఏమాత్రం ఒత్తిడికి గురవ్వకుండా ప్రయాణించాలంటే ఈ విధమైన నిబంధనలే సురక్షితమని చెప్పారు. ఒకవేళ రెండు డోసులు వేయించుకున్నప్పటికీ పుట్టిన తేదీ నమోదు చేయించుకోకపోతే వెంటనే మీ పాస్‌పోర్ట్‌లో పుట్టిన తేదీలో ఎలా ఉందో అలా కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లో మార్పులు చేయించుకోవాలని డీఆర్ శర్మ సూచించారు. పుట్టిన సంవత్సరం ఆధారంగా సదరు వ్యక్తుల వయసు కూడా స్పష్టమవుతోందని తెలిపారు. ఎన్నో అభ్యంతర పరిణామాల మధ్య యూకే తయారు చేసిన కోవిషీల్డ్‌కి గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. (చదవండి: వర్క్‌ఫ్రమ్ హోమ్: కంపెనీల కొత్త వ్యూహం) -
ముఫ్తీకి మరో ఎదురుదెబ్బ
సాక్షి, కశ్మీర్ : పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి , జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి ఎదరు దెబ్బ తగిలింది. దేశ భద్రతకుముప్పు అంటూ ముప్తీ పాస్‌పోర్టును రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం ఉదయం ముఫ్తీ ట్విట్ చేశారు. 2019 ఆగస్టు (స్పెషల్ స్టేటస్ రద్దు)తరువాత రాష్ట్రంలో నెలకొన్న సాధారణ పరిస్థితికి ఇది నిదర్శనమంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పాస్‌పోర్ట్ ఇవ్వడం ఇంత పెద్ద దేశ సార్వభౌమత్వానికి ముప్పు ఎలా అవుతుందంటూ కేంద్రంపై ఆమె మండిపడ్డారు. (మెహబూబా ముఫ్తీకి సమన్లు జారీ చేసిన ఈడీ) క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పాస్‌పోర్టు కార్యాలయం తనకు పాస్‌పోర్ట్ ఇవ్వడానికి నిరాకరించిందని మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. కేంద్రం విధానాలనువ్యతిరేకిస్తున్నాన్న కారణంతో ఉద్దేశపూర్వంగాగానే తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందదని విమర్శించారు. తన పాస్‌పోర్ట్ గతేడాది మే 31 తో ముగిసిందని, తదనుగుణంగా 2020 డిసెంబర్ 11 న తాజా పాస్‌పోర్ట్ జారీ కోసం దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. అయితే దేశ భద్రతకు ముప్పు అంటూ తన పాస్‌పోర్ట్ తనకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని సీఈడీ నివేదిక ఆధారంగా పాస్‌పోర్టు జారీకి నిరాకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనీలాండరింగ్ కేసు ఆరోపణల నేపథ్యంలో ముఫ్తీని ఈడీ విచారిస్తోంది. జమ్మూకాశ్మీర్ మరో మాజీ ముఖ్యమంత్రి,ఎన్సీ అధినేత ఫరూఖ్ అబ్దుల్లాకు చెందిన రూ.12 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ గత ఏడాది జప్తు చేసింది.జమ్మూ-కశ్మీరు క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై కేస నమోదు చేసింది. కాగా జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనతరం, మెహబూబాతోపాటు ఇతర నేతలను కేంద్రం దాదాపు సంవత్సరంపాటు నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. Passport Office refused to issue my passport based on CID’s report citing it as ‘detrimental to the security of India. This is the level of normalcy achieved in Kashmir since Aug 2019 that an ex Chief Minister holding a passport is a threat to the sovereignty of a mighty nation. pic.twitter.com/3Z2CfDgmJy — Mehbooba Mufti (@MehboobaMufti) March 29, 2021 -
దుబాయ్‌లో నిజామాబాద్ వాసి అరెస్ట్
సాక్షి, నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన తాళ్ల ప్రభాకర్ అనే వలస కూలీని షార్జా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. కరోనా ప్రభావంతో ప్రభాకర్ పని చేస్తున్న కంపెనీలో వేతనాలు లేక కనీసం భోజనం సైతం లేక బయట మరో చోట పనులు చేసుకుంటున్నాడు. అయితే పాస్ పోర్టు, కంపెనీ వీసాలో సరైన వివరాలు చెప్పకుండా బయట తిరుగుతున్నాడనే అభియోగాలపై షార్జా పోలీసలు అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడు కుటుంబ సభ్యులు గల్ఫ్ వెల్ఫేర్ కల్చరల్ అధ్యక్షుడు పాట్కూరి బసంత్ రెడ్డిని కలిసి ప్రభాకర్‌ను విడిపించాలని కోరారు. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి ప్రభాకర్‌ను విడిపించి తమ స్వగ్రామానికి చేరేలా చూడాలని బసంత్‌రెడ్డిని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణే ముందు..
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువు, ఉద్యోగం కోసం ఎందాకైనా వెళ్లేందుకు ఈ తరం వడివడిగా అడుగులేస్తోంది. పుట్టిన ప్రాంతం, పెరిగిన రాష్ట్రమే కాదు ఏకంగా దేశ సరిహద్దులు దాటి విదేశీ గడ్డపై కాలుమోపేందుకు ఏమాత్రం సంశయించటం లేదు. డిగ్రీ పట్టా చేతికొచ్చే కంటే ముందుగానే ఈ తరం యువత పాస్‌పోర్ట్‌ను పొందేస్తుంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో పాస్‌పోర్ట్‌లు తీసుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉందని తాజాగా భారత విదేశీ వ్యవహారాల శాఖ విడుదల చేసిన లెక్కలు తేల్చేశాయి. మరాఠా, మలయాళీలే టాప్.. పాస్‌పోర్ట్‌ల స్వీకరణలో దేశంలో జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలను కాదని మహారాష్ట్ర, కేరళ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. 2014–19 మధ్యలో మహారాష్ట్రలో 71,22,849 పాస్‌పోర్ట్‌లు జారీ అయితే అందులో 11,89,846 మంది తమ పాస్‌పోర్ట్‌లను కేవలం 2019లోనే అందుకున్నారు. జనాభా పరంగా చాలా చిన్న రాష్ట్రమైన కేరళ విద్య, ఉపాధి విషయంలో వేగిరపడే దిశగా గడిచిన ఐదేళ్లలో 67,44,557 మందికి పాస్‌పోర్ట్‌లను జారీ చేసింది. అందులోనూ 2019 ఒక్క ఏడాదిలోనే 10,89,859 మంది పాస్‌పోర్ట్‌లు పొందారు. తమిళ, కన్నడనాడుల్లోనూ జోరు.. ప్రపంచంలో ఎక్కడ ఉపాధి లభించినా వెళ్లేందుకు ఆసక్తి చూపే తమిళవాసులు తమ ఆనవాయితీని కొనసాగిస్తూనే ఉన్నారు. గడిచిన ఏడాదిలో తమిళనాడులో 9,58,073, కర్ణాటకలో 7,01,990 పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయి. దేశంలోనే జనాభా పరంగా అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 9,00,462 పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయి. అతిచిన్న ప్రాంతాలైన లక్షదీ్వప్‌లో కేవలం 1,903, అండమాన్‌లో 2,263 పాస్‌పోర్ట్‌లను ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణే ముందు.. విద్య, ఉపాధి వేటలో తెలుగోడి స్పీడ్ కొనసాగుతూనే ఉంది. గడిచిన ఏడాదిలో తెలంగాణలో 4,79,408, ఆంధ్రప్రదేశ్‌లో 3,73,492 మందికి పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయి. గడిచిన ఐదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 53,85,964 మందికి పాస్‌పోర్ట్‌లు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐటీ జాబ్లతోపాటు గల్ఫ్ కంట్రీలకు వివిధ రంగాల్లో కారి్మకులుగా(బ్లూకాలర్) వెళ్లేందుకు పాస్‌పోర్ట్‌లు పొందుతున్న వారి సంఖ్య భారీగానే ఉంటోంది. దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ సమయం పదిన్నర రోజులు ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 3 నుంచి 5 పనిదినాలే ఉండటం మరో విశేషం. పాస్‌పోర్ట్.. మస్ట్ అయింది ఐటీ జాబ్లకు వెళ్లిన సమయాల్లో పాస్‌పోర్ట్ ఉండటం అనేది అదనపు అడ్వాంటేజ్. దీనికి తోడు ప్రముఖ కంపెనీలు పాస్‌పోర్ట్‌లోని వివరాలనే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. దీంతో పాస్‌పోర్ట్ తప్పనిసరైంది.– పి.జశ్వంత్‌రెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కడికైనా.. రెడీ పాస్‌పోర్ట్ అనేది కీలక ఐడెంటిటీ. పాస్‌పోర్ట్‌తో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుంది. అందుకే తొలుత పాస్‌పోర్ట్ పొంది ఆపై అవకాశాల కోసం ఈ తరం ఎదురు చూస్తోంది.– నీలిమ, మేనేజర్, ఐటీ -
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు డిప్లమాటిక్ పాస్‌పోర్టు
సాక్షి, అమరావతి బ్యూరో: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విదేశాంగ కార్యాలయం డిప్లమాటిక్ పాస్‌పోర్టును జారీ చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఈ ప్రత్యేక పాస్‌పోర్టును ఇచ్చింది. ఇప్పటివరకు సాధారణ పాస్‌పోర్టు కలిగిన ఆయనకు తదుపరి విదేశీ పర్యటనల్లో ప్రొటోకాల్‌ను వర్తింప చేసేందుకు డిప్లమాటిక్ పాస్‌పోర్టు ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకునేందుకు సీఎం వైఎస్ జగన్ తన సతీమణి వైఎస్ భారతితో కలిసి విజయవాడలోని పాస్‌పోర్టు కార్యాలయానికి శనివారం వెళ్లారు. పాస్‌పోర్టు జారీకి అవసరమైన వేలిముద్రలు, ఇతర వివరాలను అక్కడి అధికారులకు ఇచ్చారు. -
‘నా పాస్‌పోర్ట్ పోయింది.. సాయం చేయరూ’
ఆమ్స్టర్డామ్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తన పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో ఉన్న కశ్యప్.. తన పాస్‌పోర్ట్ పోయిన విషయాన్ని ట్వీటర్ ద్వారా తెలియజేశాడు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పునరుద్దరించేందుకు ఏర్పాటు చేయాలని విన్నవించాడు. ‘నా పాస్ట్‌పోర్ట్ పోయింది. గత రాత్రి ఆమెస్టర్‌డామ్‌లో నా పాస్‌పోర్ట్‌ను పోగుట్టుకున్నాను. నేను ఇప్పుడు డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ జర్మనీ ఓపెన్, సార్లౌక్స్ ఓపెన్‌లో పాల్గొనడానికి పయనం కావాల్సి ఉంది. డెన్మార్క్‌కు వెళ్లడానికి ఆదివారం నాటికి టికెట్ తీసుకున్నాను. అదే సమయంలో నా పాస్‌పోర్ట్ పోయింది. ఈ విషయంలో సుష్మా జీ సాయం చేయండి. ఈ వ్యవహారంలో త్వరతగతిన సాయం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను’అని కశ్యప్ ట్వీట్లో పేర్కొన్నాడు. తన ట్వీట్‌ను క్రీడాశాఖా మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌కు, ప్రధాని నరేంద్ర మోదీలకు సైతం ట్యాగ్ చేశాడు. Good Morning Ma’am, I’ve lost my passport at Amsterdam last night . I have to travel to Denmark Open, French Open and Saarloux Open,Germany . My ticket for Denmark is on Sunday, 14th October .I request help in this matter . @SushmaSwaraj @Ra_THORe @himantabiswa @narendramodi — Parupalli Kashyap (@parupallik) 13 October 2018 -
నా తండ్రి చితికి ఆమే నిప్పంటించారు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు భర్త స్వరాజ్ కౌశల్ అండగా నిలిచారు. ఓ జంటకు పాస్‌పోర్ట్ జారీ చేసిన వ్యవహారంలో ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఆమెను దుర్భషలాడుతూ కొందరు విపరీతంగా ట్రోల్ చేస్తుండటంతో భర్త కౌశల్ స్పందించారు. అయితే దురుసుగా కాకుండా.. భావోద్వేగంతో, చాలా ప్రశాంతంగా ఆయన బదులు ఇవ్వటం విశేషం. ఆ జంట తప్పు చేసిందా? ‘మీ మాటలు ఎంతో బాధించాయి. అందుకే మీతో కొన్ని విషయాలను పంచుకోవాలనుకుంటున్నా. 1993లో నా తల్లి కేన్సర్‌తో కన్నుమూశారు. ఆమె ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఏడాదిపాటు సుష్మా ఆమె పక్కనే ఉన్నారు. వైద్యసహాయకురాలిని వద్దని చెప్పి మరీ స్వయంగా నా తల్లికి సేవలు చేశారు. కుటుంబం పట్ల ఆమెకున్న అంకితభావం అలాంటిది. అంతెందుకు నా తండ్రి చివరి కోరికి మేరకు ఆయన చితికి సుష్మానే నిప్పంటించారు. ఆమెకు ఎంతో రుణపడి ఉంటాం. దయచేసి ఇంకోసారి అలాంటి వ్యాఖ్యలు చేయకండి. రాజకీయాల్లో మాది మొదటి తరం. సుష్మా ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలనే మేం కోరుకుంటున్నాం. మీ భార్యను అడినట్లు చెప్పండి’ అంటూ ఓ వ్యక్తికి కౌశల్ బదులిచ్చారు. లక్నోలో మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్‌పోర్టులు జారీ అయ్యేందుకు సహకరించటం, వారిని ఇబ్బందిపెట్టిన అధికారిని బదిలీ చేయటంతో సుష్మా స్వరాజ్‌పై పలువురు మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె చేసిన సాయాన్ని ప్రశంసిస్తూ భర్త కౌశల్ ఓ ట్వీట్ చేయగా.. దానికి ఓ వ్యక్తి బదులిస్తూ ‘భౌతికంగా సుష్మాను హింసించండంటూ’ రీట్వీట్ చేశాడు. ఆపై పలువురు అసభ్యంగా దూషించటంతో చివరకు భర్త కౌశల్ ఇలా ఎమోషనల్‌గా ట్వీట్లు చేశారు. మరోవైపు సాయం చేసే చిన్నమ్మగా పేరున్న సుష్మాకు పలువురు మద్ధతుగా నిలుస్తున్నారు. ప్రజాభిప్రాయన్ని కోరిన సుష్మా -
త్వరలో పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టులు
ఆమదాలవలస : పోస్టాఫీసుల ద్వారా పాస్‌పోర్టులు అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విజయవాడ జోనల్ పోçస్టుమాస్టర్ జనరల్(పీఎంజీ) ఎలీషా అన్నారు. ఆమదాలవలసలో నూతనంగా నిర్మిస్తున్న ప్రధాన తపాలా కార్యాలయాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యత పాటిస్తూ భవన నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని పోస్ట్‌మాస్టర్ వాన శ్రీనివాసరావును సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 564 ప్రధాన తపాలా కార్యాలయాలు ఉన్నాయని, ప్రతి గ్రామంలో బ్రాంచ్ పోస్టాఫీస్ కార్యాలయాలు ఉన్నాయని చెప్పారు. స్థానికంగా పోస్టల్ ఏటీఎం ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లబ్ధి పొందే పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి పోస్టల్ శాఖ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఇప్పటికే గ్రామాల్లో జీడీఎస్ ఉద్యోగుల ద్వారా సేవలు అందిస్తున్నామని, త్వరలోనే మరో 2000 మంది జీడీఎస్ సిబ్బందిని నియమించనున్నామని చెప్పారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డబ్ల్యూ నాగచైతన్య, ఎ.ఎస్ఆర్.ఆర్.నవీన్‌కుమార్ పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇక నుంచి పాకిస్థానీ కాదు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ నియంతాధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్‌కు భారీ షాక్ తగిలింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ పాక్ ఆపద్ధర్మ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి రానున్నట్లు ప్రధాని నసీర్ ఉల్ ముల్క్ ప్రకటించారు. ఈ మేరకు నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ, ఇమ్మిగ్రేషన్ అండ్ పాస్‌పోర్టు డైరెక్టోరేట్ కార్యాలయాల నుంచి ప్రకటన వెలువడింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన జాతీయత గుర్తింపును రద్దు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాస్‌పోర్టు కూడా ఆటోమేటిక్‌గా రద్దైపోతుంది. ముషర్రఫ్ ఇతర దేశాలకు వెళ్లకుండా, ఆర్థిక లావాదేవీల నిలుపుదల ఉద్దేశంతోనే కోర్టు ఇది వరకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ముషర్రఫ్‌కు.. తాజా ఆదేశాలు ఇబ్బందికరంగా మారొచ్చు. పాస్‌పోర్టు రద్దుతో దుబాయ్‌లో ఆయన చిక్కులు ఎదుర్కునే అవకాశం ఉంది. అయితే కేసుల విచారణ ఎదుర్కుంటున్న ఆయన్ని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పాక్‌కు రప్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రత్యేక డాక్యుమెంట్ల ద్వారా ఆయన్ని పాక్‌కు రప్పించనున్నారు. ముషర్రఫ్ కోరితే రాజకీయ ఆశ్రయం కల్పిస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది కూడా. 2007లో అత్యవసర పరిస్థితి విధించటం, సుప్రీం కోర్టు జడ్జిల గృహనిర్భందం, రాజ్యాంగాన్ని కూలదోసే విధంగా వ్యవహరించటం, తదితర ఆరోపణలపై ముషర్రఫ్ ‘దేశ ద్రోహం’ కేసును ఎదుర్కుంటున్నారు. 2016లో చికిత్స కోసం దుబాయ్ వెళ్లిన ముషర్రఫ్.. త్వరలో జరగబోయే పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. -
అంగట్లో ఐడెంటిటీ..
ఓటరు గుర్తింపు కార్డు కావాలా? ఎవరైనా పర్లేదు.. ఆధారాలతో పనే లేదు.. ఏ దేశమైనా పట్టింపులేదు.. జస్ట్ ఓ రూ.500 ఇస్తే చాలు.. రెండ్రోజుల్లో రెడీ! ఇంకాస్త ఎక్కువిస్తే గంటల్లో ఓటరు కార్డు మీ ముందు ప్రత్యక్షం! ఇక దాన్ని చూపి ఆధార్ కార్డే తీసుకోండి.. డ్రైవింగ్ లైసెన్స్‌కు అప్లై చేసుకోండి.. అడ్రస్ ప్రూఫ్‌గా వాడుకోండి.. ఎంచక్కా పాస్‌పోర్టు కూడా పొందండి!! నిజమేనా.. అని ఆశ్చర్యపోకండి. సాక్షాత్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరుగుతున్న అతి ప్రమాదకర దందా ఇదీ. నగరంలో విచ్చలవిడిగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసేందుకు ‘సాక్షి’ బృందం రంగంలోకి దిగింది. కరుడుగట్టిన ఉగ్రవాది యాసిన్ భత్కల్, ముంబై వరుస పేలుళ్ల నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ అబూసలేం, అతని ప్రియురాలు, సినీనటి మోనికా బేడీ, ప్రధాని సతీమణి జశోదాబెన్ ఫొటోలతో (పై చిత్రాలు) ఓటరు గుర్తింపు కార్డులను కేవలం 48 గంటల్లోనే సంపాదించింది. ఎలాంటి సంఘ విద్రోహశక్తులకైనా ఇట్టే గుర్తింపు కార్డులు ఇచ్చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది. శ్రీగిరి విజయ్ కుమార్‌రెడ్డి హైదరాబాద్ భారీ అక్రమ రాకెట్‌కు అడ్డగా మారుతోంది. ఊరు, పేరు, వయసు, చిరునామా ఇలా ఏ ధ్రువీకరణ కావాలన్నా.. ఎలాంటి క్రాస్ చెక్ లేకుండా కేవలం రూ.500 నుంచి రూ.1,200 తీసుకుని గంటల్లో ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చేస్తున్నారు. ఈ కార్డును ఆధారంగా చూపుతూ.. ఆధార్ కార్డు నుంచి పాస్‌పోర్టు దాకా యథేచ్ఛగా పొందుతున్నారు. భాగ్యనగరంలో తలదాచుకుంటున్న విదేశీయులు సైతం సులువుగా ఇలా ఓటరు కార్డులు తీసుకుంటున్నారు. ఆపై ఆధార్, ఇతర పత్రాలతో ‘ఇండియన్ సిటిజన్’గా గుర్తింపు పొందుతున్న వ్యవహారం అంతర్గత భద్రతకు సవాల్‌గా మారుతోంది. మీ–సేవా కేంద్రాలు, వాటి చుట్టూ అల్లుకున్న బ్రోకర్ల సాయంతో ఈ దందా విచ్చలవిడిగా సాగుతోంది. ఎలాంటి ప్రూఫ్‌లు లేకుండా ఓటరు కార్డులు పొందేందుకు ‘సాక్షి’ చేపట్టిన ఆపరేషన్ ఎలా సాగిందో మీరే చదవండి.. ఎంత ఈజీగా ఇచ్చేశారో.. ఇంటర్నెట్లో ఫొటోలు డౌన్లోడ్ చేసుకుని చార్మినార్ సమీప పరిసరాల్లో తిరిగి ఇష్టం వచ్చిన ఇంటి నంబర్లను రాసుకుని ఛత్తాబజార్, గౌలిపురా, నూర్ఖాన్ బజార్లలోని మీ–సేవ కేంద్రాల్లోకి ‘సాక్షి’బృందం వెళ్లింది. అర్జంట్‌గా ఓటరు గుర్తింపు కార్డులు కావాలని కోరగా, ఒకొక్కరు తొలుత వేలల్లో రేటు చెప్పారు. కాసేపు బేరమాడగా.. రూ.1,200కు ఒక కార్డు జారీ చేసేందుకు ఒప్పుకున్నారు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్‌లో భాగంగా ఫాం–6 నింపే క్రమంలో వ్యక్తిగత గుర్తింపు, నివాస ధ్రువీకకరణ పత్రాలతోపాటు సంబంధిత వ్యక్తి తప్పనిసరిగా ఉండాలి. కానీ అవేవీ పట్టించుకోకుండానే.. మీ–సేవా నిర్వాహకులు వాటన్నింటిని మేనేజ్ చేశారు. 48 గంటల్లోనే ఉగ్రవాది యాసిన్ భత్కల్, అండర్ వరల్డ్ డాన్ అబూసలేం, ఆయన ప్రియురాలు మోనికాబేడీలతోపాటు ప్రధాని మోదీ సతీమణి జశోదాబెన్‌ల ఫొటోలతో కూడిన ఓటరు కార్డులు ‘సాక్షి’బృందం చేతికి వచ్చాయి. ఈ కార్డుల ఆధారంగా అన్ని రకాల కార్డులు సంపాదించే అవకాశాలను సైతం ‘మీ–సేవ’లోనే వివరించటం విశేషం. నగరానికి వివిధ రూపాల్లో వస్తున్న విదేశీయులు కూడా తొలుత ఇలా ఓటరు గుర్తింపు కార్డులు పొంది, దాని ఆధారంగా ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్‌లు ఈజీగా తీసేసుకుంటున్నారు. భత్కల్ కార్డు వచ్చిందిలా.. యాసిన్ భత్కల్ ఫొటోతో ఓటరు గుర్తింపు కార్డు కోసం జీహెచ్ఎంసీ దక్షిణ మండలం కార్యాలయంలోకి వెళ్లి బ్రోకర్‌గా వ్యవహరించే ఓ ఆశా వర్కర్ సిఫారసుతో ‘సాక్షి’ప్రతినిధి దరఖాస్తు చేశారు. అక్కడ కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసే ఓ ఉద్యోగి కొంత మొత్తాన్ని తీసుకుని వివరాలను అప్లోడ్ చేసింది. మూడ్రోజుల్లో యాసిన్ భత్కల్ ఫొటో, బహుదూర్‌పురా చిరునామాతో మహ్మద్ యాసిన్ పేరుతో ఓటరు గుర్తింపు కార్డును అందజేసింది. యాసిన్ భత్కల్ ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్‌లోని లుంబినీ, గోకుల్‌చాట్, దిల్సుఖ్నగర్ సహా సూరత్, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీలలో పేలుళ్ల కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఎన్ఐఏ నిర్ధారించిన సంగతి తెలిసిందే. 1,200తో ‘అబూసలేం’కార్డు.. దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడిగా ఉంటూ 1993లో ముంబై వరుస పేలుళ్లు, ఆపై పలు హత్య కేసులతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చిరునామాలతో నకిలీ పాస్‌పోర్ట్ పొందిన అబూసలేం, ఆయన ప్రియురాలు మోనికాబేడీల ఫొటోలతో ‘సాక్షి’ప్రతినిధులు ఓటరు కార్డు సంపాదించారు. ఇందుకు ముందుగా వారి ఫొటోలతో ఛత్తాబజార్‌లోని ఓ మీ–సేవ కేంద్రంలోకి వెళ్లి కార్డుకు రూ.1,200 చొప్పున రేటు కుదుర్చుకున్నాం. ఏ ఆధారాలు లేవని చెప్పి ఫాం–6 కోసం వివరాలిచ్చాం. రెండ్రోజుల్లో మహ్మద్ అబ్దుల్ సలీం, మౌనికాదేవి పేర్లతో రెండు ఓటరు కార్డులు ఇచ్చారు. జశోదాబెన్‌కు సైతం.. నగరంలోని నూర్ఖాన్ బజార్‌లోని ఓ మీ–సేవ కేంద్రానికి వెళ్లి ఫాం–6 నింపి, వివరాలేవీ లేవని, ఎలాగైనా మేనేజ్ చేయాలంటూ కొంత మొత్తాన్ని చేతుల్లో పెట్టాం. తొలుత సాధ్యం కాదంటూనే ఆ తర్వాత మీ–సేవ నిర్వాహకుడు బేరమాడి రేటు పెంచాడు. ఆ మొత్తం ఇవ్వగానే మూడ్రోజుల్లో జశోదాబెన్ ఫొటో, నూర్ఖాన్ బజార్ చిరునామాతో జశోదాబాయి పేరిట ఓటరు కార్డును చేతుల్లో పెట్టాడు. ఆ ఒక్క కార్డు ఉంటే చాలు.. ఓటరు గుర్తింపు కార్డు ఆధారంగా ఎన్నో కార్డులు పొందే వీలుంది. అందులోని అడ్రస్ ప్రూఫ్ చూపి.. ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, వెపన్ లైసెన్స్ ఇలా ఏది కావాలన్నా సులువుగా పొందొచ్చు. దీన్నే వ్యక్తిగత గుర్తింపు పత్రంగా చూపి ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించవచ్చు. విమాన ప్రయాణాలు చేయటంతోపాటు పోలీసులు నగరంలో చేస్తున్న కార్డన్ సెర్చ్‌ల్లో ఈ కార్డు చూపి బయటపడొచ్చు. దీన్నే కార్డునే వయసు ధ్రువీకరణ పత్రంగా చూపి వివాహాలు రిజిస్టర్ చేసుకోవచ్చు. నగరంలో మైనర్లను మేజర్లుగా చూపుతూ పెద్దఎత్తున ఓటరు గుర్తింపు కార్డులు జారీ అవుతున్నాయి. ఆ కార్డు ఆమె జీవితాన్నే ముంచింది ఈ చిత్రంలో కనిపిస్తున్న మైనర్ అమ్మాయి పేరు రుక్సార్. ప్రస్తుతం ఒమన్ దేశంలో నిత్యం నరకం అనుభవిస్తోంది. పాతబíస్తీలోని వట్టిపల్లిలో నివాసముండే పదహారేళ్ల రుక్సార్‌ను మేజర్‌గా చూపింది పాతబస్తీ కేంద్రంగా పొందిన ఓటరు గుర్తింపు కార్డే. ఆ కార్డు ఆధారంగా 72 ఏళ్ల వృద్ధ షేక్‌తో ఆమె పెళ్లి, పాస్‌పోర్టు జారీ చకచకా జరిగిపోయాయి. తల్లిదండ్రులు నిరుపేదలు కావటంతో మేనత్త గౌసియా వద్ద ఈమె చదువుకునేది. ఓ బ్రోకర్ చెప్పిన మాటలు నమ్మి గౌసియా.. ఒమన్ దేశానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడితో ఆమె తల్లిదండ్రులకు తెలియకుండానే పెళ్లి చేసేసింది. తర్వాత ఒమన్ వెళ్లింది. అక్కడకు వెళ్లాక వృద్ధ షేక్ ఆచూకీ లేదు. అతడి కొడుకులు, మనవళ్లు రుక్సార్పై లైంగిక దాడులకు దిగారు. తిండి, నిద్ర కరువయ్యాయి. ఫోన్ చేసినా అత్త స్పందించలేదు. దీంతో తల్లికి ఫోన్ చేసి తనను నరకం నుంచి విడిపించాలని, లేదంటే విషం తాగి చస్తానని విలపించింది. తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తమ బిడ్డను అప్పగించాలని తల్లిదండ్రులు విదేశాంగ శాఖను వేడుకుంటున్నారు. అఫ్గాన్ మహిళకు కార్డులు.. బిత్తరపోయిన భర్త విజిట్ వీసాపై భర్త, పిల్లలతో కలసి తొలుత ఢిల్లీకి వచ్చింది అఫ్గాన్‌కు చెందిన నిలోఫర్. 2015 సెప్టెంబర్ 8న భర్తకు చెప్పకుండానే ముగ్గురు పిల్లలు, మరో వ్యక్తితో హైదరాదాబాద్కు వచ్చింది. ఇక్కడ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు సంపాదించింది. ఆమెకు ముందుగా టోలిచౌకీ, తర్వాత రాజేంద్రనగర్ చిరునామాలతో కార్డులు జారీ అయ్యాయి. భార్య, పిల్లల్ని వెతుక్కుంటూ వచ్చిన భర్త మసూద్ అహ్మద్.. తన భార్య అఫ్గాన్ జాతీయురాలని, ఇక్కడ కార్డులు ఎలా ఇచ్చారంటూ ఆశ్చర్యపోయాడు. ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
రుణం పొందాలంటే పాస్‌పోర్ట్ వివరాలు తప్పనిసరి
-
‘తత్కాల్’ పాస్‌పోర్టులకు అటెస్టేషన్ అవసరం లేదు
-
ముంబైలో ప్రేమికుల ఆచూకీ లభ్యం
మంగళూరు(సాక్షి,బెంగళూరు): వివాహానికి రెండు రోజుల ముందు ఇంట్లో ఉంచిన ఆభరణాలు, డబ్బు, పాస్పో ర్ట్, ఆధార్‌కార్డుతో సహా యువతి ప్రేమికుడితో కలసి పా రిపోయిన కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీ సులు శుక్రవారం యువతిని ఆమె ప్రియుడిని ముం బ యిలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మంగళూ రు నగరంలోని మూడబిదిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధరగుడ్డె ప్రాంతానికి చెందిన ప్రియాంక ఇదే నెల 9న ప్రియుడితో కలసి పారిపోయింది. దీనిపై ప్రియాంక తల్లి తండ్రులు, హిందూ సంఘాలు ఇది ముమ్మాటికీ లవ్జిహాదేనని, గత కొద్ది కాలంగా ప్రియాంక ఇనోళి ప్రాం తానికి చెందిన హైదర్ అనే యువకుడితో ప్రేమలో ఉంద ని ప్రియాంకను హైదర్ మాయమాటలతో నమ్మించి తనతో పాటు తీసుకెళ్లి ఉంటాడని మూడబిదిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అనేక కొత్త విషయాలు తెలిసాయి. కొద్ది సంవత్సరాల క్రితం ప్రియాంక కుటుంబం కోణాజీ సమీపంలోని ఇనోళిలో నివసించేవా రు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన హైదర్ అనే వ్యక్తితో ప్రియాంకకు పరిచయమైంది. అనతికాలంలో వీరి పరిచయం ప్రేమకు దారి తీయడంతో విషయం తెలుసుకున్న ప్రియాంక తల్లితండ్రులు అక్కడి నుంచి మూడబిదిరికి మకాం మార్చారు. అప్పటికీ ప్రియాంక తల్లితండ్రులకు తెలియకుండా హైదర్‌తో ప్రేమను కొనసాగిస్తుండేది. అంతేకాకుండా ప్రియాంక ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కొద్ది రోజుల ముందు నుంచి ప్రియాంక బ్యాంకు ఖాతాలో లక్షల కొద్ది డబ్బు జమవుతున్నట్లు తెలిసింది. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారనే విషయం తెలుసుకున్న ప్రియాంక ఈనెల 9న ప్రియాంక ఇంట్లోనున్న ఆభరణాలు, పాస్‌పోర్ట్, ఆధార్‌కార్డు తీసుకొని పారిపోయింది. ప్రియాంకను తీసుకొని ముంబయికి చేరుకున్న ఆమె ప్రియుడు హైదర్ తన స్నేహితుడు ఝమీర్ సహాయంతో అద్దె ఇంట్లో ఉంటున్నట్లు పోలీసులు కనిపెట్టారు. శుక్రవారం ప్రేమికులతో పాటు వారికి సహకరించిన ఝమీర్ను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు ముగ్గురిని విచారణ చేస్తున్నారు. -
సుష్మాజీ! నాకూ పాస్‌పోర్టు ఇప్పించండి ప్లీజ్!
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణంలో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోదీకి బ్రిటన్ ప్రభుత్వం నుంచి ట్రావెల్ డాక్యుమెంట్లను ఇప్పించడంలో మానవతా హృదయంతో సహాయం చేసిన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, తన పాస్‌పోర్టును పునరుద్ధరించడంలో కూడా అదే మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కూడంకుళం అణు విద్యుత్ వ్యతిరేక ఆందోళనకారుడు ఎస్పీ విజయ్‌కుమార్ వేడుకుంటున్నారు. ఈ మేరకు సుష్మను ఉద్దేశించిన ఆయన రాసిన లేఖను ఆయన తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ‘సుష్మాజీ! అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో పని చేస్తూ జీవిస్తున్న నేను 2011లో తమిళనాడుకు వచ్చి కూడంకుళం వచ్చి అణు విద్యుత్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాను. నాతోపాటు 500 మందిపై తమిళనాడు ప్రభుత్వం కేసులు పెట్టింది. నాతోపాటు వారందరిని పాస్‌పోర్టులను భారత ప్రభుత్వం రద్దు చేసింది. కూడంకుళం పనులను జయలలిత నిలిపివేయడంతో మా ఉద్యమం కూడా నిలిచిపోయింది. అప్పటి నుంచి మాపై కేసులు ఎత్తివేయలేదు. అలాగని విచారణ జరపడం లేదు. మా పాస్‌పోర్టులూ పునరుద్ధరించలేదు. నేను ఇప్పుడు అమెరికా వెళ్లి నా ఆకాడమిక్ కెరీర్‌ను మళ్లీ ప్రారంభించాలనుకుంటున్నాను. నేను వృద్ధాప్యంతో బాధ పడుతున్న తల్లిదండ్రులను, భార్య, ఇద్దరు పిల్లలను పోషించాల్సిన బాధ్యత నామీద ఉంది. మోదీపై చూపినంత మానవతా దృక్పథమంతా కాకపోయినా, కాస్త కరుణతోనైనా నా పాస్‌పోర్టును పునరుద్ధరించండి. ప్లీజ్!’ అని ఆ లేఖలో విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అమెరికాలోని హవాయ్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్‌లో పీహెచ్డీ చేసిన ఆయన అమెరికాలో టీచింగ్ కెరీర్‌ను వదిలేసుకొని ఉద్యమం కోసమే భారత్ వచ్చారు. 2011 నుంచి ఆయనే తమిళనాడులో అణు వ్యతిరేక ఉద్యమానికి కోఆర్డినేటర్‌గా పనిచేస్తూ వచ్చారు. ఆ ఉద్యమం కారణంగానే అదే ఏడాది కూడంకుళం ప్లాంట్ నిర్మాణం ఆగిపోయింది. ఉద్యమం కూడా చల్లబడింది. 2012లో మళ్లీ ఆ ప్లాంట్‌లోని ఓ యూనిట్ నిర్మాణం ప్రారంభమైంది. ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించిన అది ముందున్నంత ఉధృతంగా సాగలేదు. ఫలితంగా కూడంకుళంలోని తొలి విద్యుత్ యూనిట్ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. ఈలోగా బ్రిటన్‌లో తలదాచుకున్న లలిత్ మోదీకి పోర్చుగల్ వెళ్లేందుకు మానవతా హృదయంతో సుష్మా స్వరాజ్ సహాయం చేశారని తెలిసి ఆయన సుష్మ పేరిట ఫేస్బుక్ పేజీలో లేఖ రాశారు. నిజంగా ఆయన అమెరికా పోవాలని కోరుకుంటున్నారా లేక కేంద్ర రాజకీయలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా ఈ లేఖ రాశారా ? అన్నది స్పష్టం కావడం లేదు. -
పాస్‌పోర్టు సేవాకేంద్రం ఏర్పాటుకు కృషి
నెల్లూరు (సెంట్రల్): నెల్లూరులో పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటుకు కృషిచేస్తానని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో శనివారం నగరంలో ఏర్పాటుచేసిన పాస్‌పోర్టు సేవాక్యాంపు కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో పాస్‌పోర్టు సేవాకేంద్రం ఏర్పాటు చేసేంతవరకు రెగ్యులర్‌గా పాస్‌పోర్టు సేవా క్యాంపులను నిర్వహిస్తామన్నారు. నెల్లూరు ప్రజలకు పాస్‌పోర్టు సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి సుష్కాస్వరాజ్‌ను అడిగిన వెంటనే స్పందించి ఈ పాస్‌పోర్టు సేవా క్యాంపును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎంతో మంచివారని, ఆయన కేంద్రంలో మంచి పదవిలో ఉన్నారని ఎంపీ పేర్కొన్నారు. అలాగే జిల్లాను అభివృద్ధి చేయడంలో ముందున్నారన్నారు. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ కూడా జిల్లాకు అడిగిన వెంటనే పనులు చేశారన్నారు. వెంకయ్యనాయుడుతో కలసి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు. ఏదిఏమైనా జిల్లాపై ఆయన చూపిస్తున్న ప్రేమకు తప్పకుండా కృతజ్ఞతలు తెలపాలన్నారు. జిల్లాలోని బిట్రగుంట ప్రాంతంలో రైల్వే శాఖకు సంబంధించి 1,500 ఎకరాలు ఉందని, అందులో రైల్వే కర్మాగారం ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తానని తెలిపారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే పనులు త్వరితగతిన పూర్తిచేసే విధంగా కృషిచేస్తానన్నారు. కృష్ణపట్నంను ఇండస్ట్రియల్ స్మార్ట్సిటీపై బడ్జెట్లో ప్రకటించారని, దీని పనులు కూడా త్వరగా పూర్తయ్యేలా కేంద్రంతో మాట్లాడతానని ఎంపీ పేర్కొన్నారు. సమావేశంలో పాస్‌పోర్టు సేవాక్యాంపు అధికారులు మదన్‌మోహన్‌రెడ్డి, రాజశేఖర్, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
నేడు పాస్‌పోర్టు మేళా
నెల్లూరు (సెంట్రల్) : జిల్లా వాసులు పాస్‌పోర్టు సేవలు సులభంగా పొందేందుకు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించింది. పాస్‌పోర్టు సేవలను నెల్లూరులోనే పొందేందుకు వీలుగా మేళా నిర్వహించాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మస్వరాజ్‌ను ఎంపీ మేకపాటి కోరారు. దీనికి స్పందించిన ఆమె నెల్లూరులో ఈ సదుపాయాన్ని కల్పించేందుకు అంగీకరించారు. శనివారం నగరంలోని జెడ్పీ హాలులో ఉదయం నుంచి ఈ పాస్‌పోర్టు మేళా జరగనుంది. ఆన్లైన్లో స్పాట్ బుకింగ్ చేసుకున్న వాళ్లకు ఈ అవకాశం ఉంటుంది. ఈ పాస్‌పోర్టు మేళాలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పాల్గొనున్నారు. -
ఇక పాస్‌పోర్టు మరింత సులువు
-
15 రోజుల్లో.. పాస్‌పోర్టు
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజుల్లో పాస్‌పోర్టు అందేట్లు చర్యలు తీసుకోనున్నట్ల్లు జాతీయ పాస్‌పోర్టు అధికారి ముక్తేశ్‌కుమార్ పర్దేశి తెలిపారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మినీ పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. దరఖాస్తుల పరిశీలనకు పోలీసు యంత్రాంగం పదిహేను రోజుల సమయం తీసుకొనేదని, పాస్‌పోర్టు అందుకొనేసరికి నెల రోజుల సమయం పట్టేదన్నారు. దరఖాస్తుల పరిశీలన ఏడు రోజుల్లోనే ముగిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారని, అలా అయితే పదిహేను రోజుల్లోనే దరఖాస్తుదారుడి ఇంటికి పాస్‌పోర్టు చేరవేస్తామన్నారు. మరో రెండు నెలల్లో కరీంనగర్ పాస్‌పోర్టు కేంద్రం ద్వారా పూర్తిస్థాయిలో సేవలందిస్తామన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే పదిహేను రోజులకోసారి స్లాట్ (దరఖాస్తుదారుడికి టైం) ఇస్తామన్నారు. స్లాట్‌కు అనుగుణంగా కార్యాలయానికి వ స్తే సర్టిఫికెట్ల పరిశీలన, ఫొటోలు, థంబ్ఇంప్రెషన్ తదితర ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరిక మేరకు ఏడు రోజులకోసారి క్యాంప్ నిర్వహించే అవకాశాన్ని రాష్ట్ర అధికారులు పరిశీలిస్తారన్నారు. పాస్‌పోర్టు సేవలు ఇటీవల కాలంలో పురోగతి చెందాయన్నారు. తెలుగు భాషలో వెబ్సైట్, టోల్‌ఫ్రీనెంబర్ రూపొందిస్తున్నామని, దరఖాస్తుదారులు తెలుగులోనే సమాచారం తెలుసుకోవచ్చన్నారు. దేశంలో 77 కేంద్రాలు, 10కి పైగా మినీ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్రం నుంచి పాస్‌పోర్టు కోసం ఎనిమిది లక్షల దరఖాస్తులు వస్తున్నాయని, ఈ సంవత్సరం అది తొమ్మిది లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్‌లో 3, నిజామాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలలో ఒక్కో పాస్‌పోర్టు కేంద్రాలున్నాయన్నారు. రెండు నెలల్లో పూర్తిస్థాయిలో సేవలు : పొన్నం రెండు నెలల్లో జిల్లాలో పూర్తిస్థాయిలో పాస్‌పోర్టు కేంద్రం సేవలందిస్తుందని ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2011లో అప్పటి మంత్రి ఎస్ఎం.కృష్ణ హామీ ఇస్తే, అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నో అనుమానాల నడుమ పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. కంప్యూటీకరణకు మరో రెండు నెలల సమయం పడుతుందని, అప్పటివరకు క్యాంప్‌లు నిర్వహిస్తారన్నారు. పదిహేనురోజులకోసారి కాకుండా ప్రతి శనివారం క్యాంప్‌లు నిర్వహించాలని అధికారులను కోరారు. దేశంలో మినీపాస్పోర్టు కేంద్రాలకు ఎన్నో ప్రతిపాదనలు వ చ్చినా రెండు మాత్రమే ఆచరణకు నోచుకున్నాయని, అందులో మిజోరాంలో ఒకటి కాగా, మరొకటి కరీంనగర్లో ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. కరీంనగర్ తిరుపతి రైలు, కరీంనగర్‌కు బస్‌డిపో, పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటు తన రాజకీయ జీవితానికి తృప్తినిచ్చిన ప్రత్యేక అంశాలన్నారు. వీటితో పాటు కేంద్రీయ విద్యాలయం, బీడీ కార్మికులకు ఆసుపత్రి, నర్సింగ్‌కళాశాల ఏర్పాటు కూడా అందులో భాగమేనన్నారు. ఓ వైపు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తూనే, ప్రజల చిరకాలవాంఛ అయిన తెలంగాణ సాధన కోసం పోరాటం చేస్తున్నానన్నారు. కేంద్ర మంత్రివర్గ ఆమోదంతో మరో మైలురాయి దాటామని, పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని తమకు ప్రధాని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ ఇంటి పేరులో అక్షరాలు తారుమారైనా సర్దుబాటు చేయాలని అధికారులను కోరారు. ఆరెపల్లి అనే ఇంటిపేరులో చివరన ఇంగ్లిష్ అక్షరాలు ఒకసారి వై అని మరోసారి ఐ అని రాస్తుంటారని, ఇలాంటి వాటికి మినహాయింపునివ్వాలన్నారు. పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన పొన్నం ప్రభాకర్‌కు జిల్లా ప్రజల పక్షాన అభినందనలు తెలిపారు. రీజినల్ పాస్‌పోర్టు అధికారి శ్రీకర్‌రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్లో ఏర్పాటు చేసిన కేంద్రం హైదరాబాద్ కార్యాలయ నియంత్రణలో కొనసాగుతుందన్నారు. ప్రతి సంవత్సరం 15 శాతం పాస్‌పోర్టు డిమాండ్ పెరుగుతుందన్నారు. కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ జిల్లా నుంచి ఏటా 30 వేల మంది విదేశాలకు వెళుతున్నారన్నారు. ఇలాంటి వారికి కరీంనగర్లో పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం మంచి సంప్రదాయమన్నారు. ఉపాధి వేటలో గల్ఫ్‌కు వెళ్లడం జిల్లాలో అలవాటేనన్నారు. విదేశాలకు వెళ్లడానికి దళారులను ఆశ్రయించొద్దన్నారు. ఎస్పీ శివకుమార్ మాట్లాడుతూ ఆన్లైన్ ప్రక్రియ చేయడానికి రూ.10 లక్షలు తమకు మంజూరు చేస్తే, ఏడు రోజుల్లోనే దరఖాస్తు పరిశీలనను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 14 రోజుల్లో పరిశీలన పూర్తి చేస్తున్న జిల్లా మనదేనన్నారు. పాస్‌పోర్టు తీసుకున్నాక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వేములవాడ దేవస్థానం చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్, డీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు, డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి, రాష్ట్ర మత్స పారిశ్రామిక సంస్థచైర్మన్ చేతి ధర్మయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పనకంటి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణగౌడ్, రేగులపాటి పాపారావు, నగరపాలకసంస్థ కమిషనర్ రమేశ్, జిల్లా పాస్‌పోర్టు అధికారులు అశ్విని, జైన్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డెరైక్టర్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్లు ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఏనుగు మనోహర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జుబేర్, మాజీ మేయర్ డి.శంకర్ పాల్గొన్నారు. -
కంపెనీ మోసంతో కటకటాలకు..
బూర్గుపల్లి(గంగాధర), న్యూస్‌లైన్: మలేసియాలో మంచి ఉద్యోగమని నమ్మి వెళ్తే కంపెనీ చేసిన మోసంతో ఏడుగురు వలసజీవులు కటకటాలపాలయ్యారు. తమవారు ఎంతోకొంత సంపాదించుకొని వస్తారని ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు పిడుగులాంటి వార్తవిని కుమిలిపోయారు. సంపాదన దేవుడెరుగు.. తమ వారిని విడిపించుకోవడానికి మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చింది. మలేసియా జైల్లో శిక్ష అనుభవించిన ఆరుగురు వ్యక్తులు ఇటీవల స్వగ్రామాలకు చేరుకోగా.. వారితో వెళ్లిన దూస రవి మాత్రం జైల్లోనే ఉండిపోయాడు. తన భర్తను విడిపించుకునే స్తోమత లేక .. సర్కారు సాయం అందక అతడి భార్య శ్రీదీప గొల్లుమంటోంది. ‘సారూ.. నా భర్తను విడిపించండి’ అంటూ కన్నీటితో వేడుకుంటోంది. మలేసియాలో ఉద్యోగం.. నెలకు పాతిక వేల జీతం.. మూడేళ్లు పనిచేస్తే ఆరు లక్షలు వెనుకేసుకోవచ్చు.. ఇక్కడ రెక్కలు ముక్కలు చేసుకుంటే పైసా మిగిలింది లేదు.. అంటూ ఓ కంపెనీ చెప్పిన తియ్యటి మాటలకు ఆకర్షితులై గంగాధర మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన.. ఆరుగురు వ్యక్తులతోపాటు దూస రాజేశ్వర్ ఏడాదిన్నర క్రితం మలేసియా వెళ్లారు. ఆరు నెలలకోసారి రెండుసార్లు వీసా స్టాంపింగ్ చేసిన కంపెనీ ఆ తర్వాత చేతులెత్తేసింది. అక్కడి పోలీసుల తనిఖీలో వీరు ఏడుగురు పట్టుబడ్డారు. వీసా లేనందున డెబ్బై రోజుల జైలు శిక్ష విధించారు. శిక్ష ముగిసిన తర్వాత సంపత్ మినహా మిగతావారికి కుటుంబసభ్యులు విమాన టిక్కెట్లు పంపించడంతో ఆరుగురు వారం క్రితం స్వగ్రామానికి చేరుకున్నారు. సంపత్ పాస్‌పోర్టు రెన్యూవల్ కాకపోవడం, ఔట్‌పాస్ లేకపోవడంతో శిక్షముగిసినా జైల్లోనే ఉన్నాడు. భర్తను రప్పించడం కోసం సంపత్ భార్య శ్రీదీప పడరాని పాట్లు పడుతోంది. సంపత్ పరిస్థితి తెలుసుకోవడానికి వెళ్లిన ‘న్యూస్‌లైన్’ ముందు తన బాధ చెప్పుకుని కన్నీటి పర్యంతమైంది. నాలుగు నెలల నుంచి ఫోన్ కూడా లేదని, జైలు నుంచి వచ్చిన వారితో కొడుకును మంచిగ చూసుకోమని చిన్న చిట్టి రాసి పంపాడని ఆమె కన్నీరు పెట్టుకుంది. తన భర్తను జైలు నుంచి ఇంటికి రప్పించడానికి కంపెనీ మేనేజరు గానీ, ఏజెంట్ గానీ పట్టించుకోవడం లేదని పేర్కొంది. అధికారులెవరైనా ఔట్‌పాస్ ఇప్పించి తన భర్తను జైలు నుంచి విడిపించాలని శ్రీదీప వేడుకుంటోంది. -
విదేశాలకు వెళ్లేందుకు విడాకులు ఇప్పించండి
న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లేందుకు వీలుగా ఓ మహిళ భర్తతో విడాకులు కోరింది. పాస్‌పోర్టులో వైవాహిక స్థితిలో ఒంటరి అని పేర్కొనేందుకే ఈ భర్త నుంచి విడాకులు ఇప్పించమని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతకుముందుగా భర్త క్రూరుడని, తనను వదిలేసి ఉంటున్నాడన్న కారణంగా విడాకులు కోరిన ఈ అతివ ఆ తరువాత అసలు విషయం కోర్టుకు తెలిపింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన అదనపు జిల్లా జడ్జి సుజాత కోహ్లీ ‘‘హిందూ వైవాహిక చట్టం ప్రకారం ఇలాంటి స్వల్ప కారణాలతో విడాకులు మంజూరు చేయడం వీలు కాదు. మొదట భర్త తనతో ఎనిమిది సంవత్సరాలుగా విడిచి వెళ్లిపోయాడని పేర్కొన్న పిటిషనర్ తరువాత కేవలం పాస్‌పోర్టులో ఒంటరి అని పేర్కొనడానికే విడాకులు కోరుతున్నట్లు కోర్టుకు తెలిపింది. విడాకులు కోరిన పిటిషన్ మీద భర్త చిరునామాను పేర్కొంది. కుమారుడితో కలిసి ఉండడానికి తాను విదేశాలకు వెళ్లదల్చుకున్నట్లు పేర్కొంది. ఇలాంటి అహేతుక కారణాలను కోర్టు పరిగణనలోకి తీసుకోజాలదు’’ అని కోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.