న్యూఢిల్లీ: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు చోటు దక్కించుకున్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్ ఉంటే చాలు వీసా లేకుండా 194 ప్రపంచ దేశాల్లో ప్రయాణించొచ్చు.
➦ఈ దేశాల తర్వాత ఫిన్‌లాండ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌లతో 193 దేశాల్ని చుట్టి రావొచ్చు.
➦భారత్ పాస్‌పోర్ట్ ఉంటే వీసా లేకపోయినా 62 దేశాలకు ప్రయాణించే సౌకర్యం ఉండడంతో హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ జాబితాలో 85వ స్థానాన్ని దక్కించుకుంది. ఇండోనేషియా, మలేషియా,థాయిలాండ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు భారతీయులకు వీసా అవసరలేదు. అయితే హెన్లీ ఇండెక్స్‌లో భారత్ గతేడాది 84వ స్థానంతో పోలిస్తే భారత్ ఒక ర్యాంక్ దిగజారడం గమనార్హం.
➦దక్షిణాఫ్రికా (55), మాల్దీవులు (58), సౌదీ అరేబియా (63), చైనా (64), థాయిలాండ్ (66), ఇండోనేషియా (69), ఉజ్బెకిస్థాన్ (84) వంటి దేశాల కంటే భారత్ వెనుకబడి పోయింది.
➦భారత్‌కు పొరుగు దేశాలైన పాకిస్తాన్ సూచీలో 106వ స్థానంలో ఉండగా, శ్రీలంక 101వ స్థానంలో, బంగ్లాదేశ్ 102వ స్థానంలో, నేపాల్ 103వ స్థానంలో నిలిచాయి.
➦వీసా లేకుండా 192 దేశాలకు ప్రయాణించే అర్హత ఉన్న పాస్‌పోర్ట్‌ల జాబితాలో యూకే, ఐర్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రియాలు ఇండెక్స్‌లో మూడవ స్థానంలో ఉంది. ఆ దేశాల తర్వాత మూడు యూరోపియన్ దేశాలు బెల్జియం, నార్వే, పోర్చుగల్, 191 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌తో నాల్గవ స్థానాన్ని ఆక్రమించాయి.
➦ఆస్ట్రేలియా, గ్రీస్, మాల్టా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్‌లు 190 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ను కలిగి ఉన్న తర్వాత ఇండెక్స్‌లోని మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి.
➦ప్రపంచంలోని అత్యంత వలసలు ఎక్కువగా ఉన్న దేశాలలో ఒకటి కెనడా కాగా, దాని పొరుగున ఉన్న అమెరికా, రెండు యూరోపియన్ దేశాలైన పోలాండ్, చెకియాతో పాటు ఆరవ స్థానంలో ఉంది.
➦అమెరికా, కెనడా, పోలాండ్, చెకియా 189 దేశాలకు వీసా రహిత ప్రాప్యతను కలిగి ఉన్న తర్వాత సూచికలో ఆరవ స్థానంలో ఉన్నాయి.
➦ఈ సూచీ ఆఫ్ఘనిస్తాన్ 109వ స్థానంలో ఉండగా.. ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన పాస్‌పోర్ట్‌తో ఆఫ్ఘనిస్తాన్ 28 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు.
➦సిరియా (108వ స్థానం), ఇరాక్ (107వ స్థానం), యెమెన్ (105వ స్థానం), పాలస్తీనా టెరిటరీ (103వ స్థానం) వంటి దేశాలు ఆఫ్ఘనిస్తాన్ కంటే ముందు ఉన్నాయి.
పాస్‌పోర్ట్‌ల ర్యాంకింగ్ ఎలా నిర్ణయిస్తారు?
2006 నుంచి హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల ర్యాంకింగ్‌ను నిరంతరం విడుదల చేస్తోంది. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్ అథారిటీ డేటా ఆధారంగా. ఒక దేశంలోని ప్రజలు అనేక దేశాలకు ప్రయాణించడం ఎంత సులభమో తెలియజేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment