భారతీయులతో పాటు, ఇతర విదేశీయులకు యూకే ప్రధాని రిషి సునాక్ వీసా మంజూరులో షాకుల మీద షాకులిస్తున్నారు. ఇప్పటికే నాన్ రీసెర్చ్ పీజీ విద్యార్థులు తమ వెంట కుటుంబ సభ్యులను (dependent visa) తీసుకుని వచ్చేందుకు అవసరమయ్యే డిపెండెంట్ వీసాను రద్దు చేశారు. తాజాగా యూకేలో ఇపై జాబ్ చేయాలంటే ఉద్యోగుల (skilled worker visa) జీతం ఎక్కువగా ఉండాలనే కొత్త నిబంధనను తెచ్చింది. దీంతో విద్యార్ధులతో పాటు ఉద్యోగం చేసే వారు సైతం ఇకపై యూకేకి వెళ్లడం మరింత కఠినంగా మారనుంది.
వచ్చే ఏడాది యూకేలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని రిషి సునాక్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా దేశంలోకి వలసల్ని నిరోధించేలా వీసా మంజూరులో కఠిన ఆంక్షల్ని అమలు చేస్తున్నారు.
యూకేలో ఫ్యామిలీ వీసా రూల్స్?
తాజాగా, స్కిల్డ్ వర్క్ వీసా పొందాలంటే ఉద్యోగుల కనీస వేతనాన్ని 47 శాతం అంటే 29,000 యూరోల నుంచి 38,700 యూరోలకు పెంచింది. అయితే ఈ కనీస వేతనం హెల్త్ కేర్, సోషల్ కేర్ విభాగాలకు వర్తించదు. కేర్ వర్క్‌ర్లు వాళ్ల కుటుంబ సభ్యుల్ని యూకేకి తెచ్చుకునేందుకు అనుమతి లేదు.
యూకేకి పెరిగిపోతున్న విదేశీయుల తాకిడి
ఈ ఏడాది జూన్‌లో 70,000 మంది విదేశీయులు యూకేలో నివసించేందుకు వచ్చారు. అయితే, రోజురోజుకు విదేశీయుల తాకిడి పెరుగుతుండటంతో వసతుల కల్పన బ్రిటన్ సర్కార్‌కు ఇబ్బందికరంగా మారింది. కాబట్టే ఈ ఆంక్షల్ని విధించింది. అదే సమయంలో ఇప్పటికే వీసా ఉండి దానిని రెన్యూవల్ చేసుకునే వీసా దారులకు కొత్త నిబంధనలు వర్తించవని యూకే ఇమ్మిగ్రేషన్ విభాగం హోం ఆఫీస్ తెలిపింది.
స్కిల్డ్ వర్క్ వీసా పొందాలంటే?
యూకే విధించిన కొత్త నిబంధనల ఆధారంగా స్కిల్డ్ వర్క్ వీసా పొందాలంటే వీసా దారులు కనీసం 70 పాయింట్స్ ఉండాలి. అందులో 50 పాయింట్లు మీరు కనీస నైపుణ్య స్థాయి కంటే ఎక్కువ జాబ్ ఆఫర్‌ను కలిగి ఉండటం, ఇంగ్లీష్ మాట్లాడటం ద్వారా పొందవచ్చు. మిగిలిన 20 పాయింట్లు ఎక్కువ జీతం, చేస్తున్న విభాగంలో ఉద్యోగుల కొరత ఉండాలి. లేదంటే చేసే జాబ్‌కు అనుగుణంగా పీహెచ్‌డీ చేసి ఉండాలి.
యూకేలో ఉద్యోగుల కొరత ఎక్కువగా ఉన్న విభాగాలు
తక్కువ వేతనం ఉండి ఉద్యోగుల డిమాండ్ ఎక్కువగా ఉన్న విభాగాలకు చెంది ఉండి ఉంటే పైన పేర్కొన్న విధంగా 70 పాయింట్లు లభిస్తాయి. వీసా ఈజీగా దొరుకుతుంది. ఇక యూకేలో ఉద్యోగులు తక్కువగా ఉన్న విభాగాల్ని పరిశీలిస్తే
ఆరోగ్యం, విద్యా
కేర్ టేకర్లు
గ్రాఫిక్స్ డిజైనర్లు
కన్‌స్ట్రక్టన్ వర్కర్లు
పశువైద్యులు
నాన్ రీసెర్చి కోర్సుల్లోని పీజీ విద్యార్ధులకు నో ఛాన్స్
భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన విద్యార్ధులకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాలకు తరలివెళుతుంటారు. వారితో పాటు వారి కుటుంబసభ్యులు డిపెండెంట్ వీసాను అందిస్తుంటాయి. జనవరి 1 నుంచి యూకే ప్రభుత్వం నాన్ రీసెర్చి కోర్సుల్లోని పీజీ విద్యార్ధులకు డిపెండెంట్ వీసాను రద్దు చేసింది. బ్రిటన్ విధానం ప్రకారం వీసా హోల్డర్‌పై ఆర్థికంగా ఆధారపడిన వారిని మాత్రమే డిపెండెంట్‌గా పరిగణిస్తారు. ఆ జాబితాలోకి జీవిత భాగస్వామి అంటే భార్య లేదా భర్త, 18 ఏండ్ల లోపు పిల్లలు వస్తారు. కొన్ని సందర్భాల్లో 18 ఏండ్లు దాటిన పిల్లలు, తల్లిదండ్రులు, బామ్మలు, తాతయ్యలు వస్తారు.
Comments
Please login to add a commentAdd a comment