Work permit visa
-
భారతీయులకు షాకుల మీద షాకులిస్తున్న యూకే ప్రధాని రిషి సునాక్!
భారతీయులతో పాటు, ఇతర విదేశీయులకు యూకే ప్రధాని రిషి సునాక్ వీసా మంజూరులో షాకుల మీద షాకులిస్తున్నారు. ఇప్పటికే నాన్ రీసెర్చ్ పీజీ విద్యార్థులు తమ వెంట కుటుంబ సభ్యులను (dependent visa) తీసుకుని వచ్చేందుకు అవసరమయ్యే డిపెండెంట్ వీసాను రద్దు చేశారు. తాజాగా యూకేలో ఇపై జాబ్ చేయాలంటే ఉద్యోగుల (skilled worker visa) జీతం ఎక్కువగా ఉండాలనే కొత్త నిబంధనను తెచ్చింది. దీంతో విద్యార్ధులతో పాటు ఉద్యోగం చేసే వారు సైతం ఇకపై యూకేకి వెళ్లడం మరింత కఠినంగా మారనుంది. వచ్చే ఏడాది యూకేలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని రిషి సునాక్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా దేశంలోకి వలసల్ని నిరోధించేలా వీసా మంజూరులో కఠిన ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. యూకేలో ఫ్యామిలీ వీసా రూల్స్? తాజాగా, స్కిల్డ్ వర్క్ వీసా పొందాలంటే ఉద్యోగుల కనీస వేతనాన్ని 47 శాతం అంటే 29,000 యూరోల నుంచి 38,700 యూరోలకు పెంచింది. అయితే ఈ కనీస వేతనం హెల్త్ కేర్, సోషల్ కేర్ విభాగాలకు వర్తించదు. కేర్ వర్క్‌ర్లు వాళ్ల కుటుంబ సభ్యుల్ని యూకేకి తెచ్చుకునేందుకు అనుమతి లేదు. యూకేకి పెరిగిపోతున్న విదేశీయుల తాకిడి ఈ ఏడాది జూన్‌లో 70,000 మంది విదేశీయులు యూకేలో నివసించేందుకు వచ్చారు. అయితే, రోజురోజుకు విదేశీయుల తాకిడి పెరుగుతుండటంతో వసతుల కల్పన బ్రిటన్ సర్కార్‌కు ఇబ్బందికరంగా మారింది. కాబట్టే ఈ ఆంక్షల్ని విధించింది. అదే సమయంలో ఇప్పటికే వీసా ఉండి దానిని రెన్యూవల్ చేసుకునే వీసా దారులకు కొత్త నిబంధనలు వర్తించవని యూకే ఇమ్మిగ్రేషన్ విభాగం హోం ఆఫీస్ తెలిపింది. స్కిల్డ్ వర్క్ వీసా పొందాలంటే? యూకే విధించిన కొత్త నిబంధనల ఆధారంగా స్కిల్డ్ వర్క్ వీసా పొందాలంటే వీసా దారులు కనీసం 70 పాయింట్స్ ఉండాలి. అందులో 50 పాయింట్లు మీరు కనీస నైపుణ్య స్థాయి కంటే ఎక్కువ జాబ్ ఆఫర్‌ను కలిగి ఉండటం, ఇంగ్లీష్ మాట్లాడటం ద్వారా పొందవచ్చు. మిగిలిన 20 పాయింట్లు ఎక్కువ జీతం, చేస్తున్న విభాగంలో ఉద్యోగుల కొరత ఉండాలి. లేదంటే చేసే జాబ్‌కు అనుగుణంగా పీహెచ్డీ చేసి ఉండాలి. యూకేలో ఉద్యోగుల కొరత ఎక్కువగా ఉన్న విభాగాలు తక్కువ వేతనం ఉండి ఉద్యోగుల డిమాండ్ ఎక్కువగా ఉన్న విభాగాలకు చెంది ఉండి ఉంటే పైన పేర్కొన్న విధంగా 70 పాయింట్లు లభిస్తాయి. వీసా ఈజీగా దొరుకుతుంది. ఇక యూకేలో ఉద్యోగులు తక్కువగా ఉన్న విభాగాల్ని పరిశీలిస్తే ఆరోగ్యం, విద్యా కేర్ టేకర్లు గ్రాఫిక్స్ డిజైనర్లు కన్‌స్ట్రక్టన్ వర్కర్లు పశువైద్యులు నాన్ రీసెర్చి కోర్సుల్లోని పీజీ విద్యార్ధులకు నో ఛాన్స్ భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన విద్యార్ధులకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాలకు తరలివెళుతుంటారు. వారితో పాటు వారి కుటుంబసభ్యులు డిపెండెంట్ వీసాను అందిస్తుంటాయి. జనవరి 1 నుంచి యూకే ప్రభుత్వం నాన్ రీసెర్చి కోర్సుల్లోని పీజీ విద్యార్ధులకు డిపెండెంట్ వీసాను రద్దు చేసింది. బ్రిటన్ విధానం ప్రకారం వీసా హోల్డర్‌పై ఆర్థికంగా ఆధారపడిన వారిని మాత్రమే డిపెండెంట్‌గా పరిగణిస్తారు. ఆ జాబితాలోకి జీవిత భాగస్వామి అంటే భార్య లేదా భర్త, 18 ఏండ్ల లోపు పిల్లలు వస్తారు. కొన్ని సందర్భాల్లో 18 ఏండ్లు దాటిన పిల్లలు, తల్లిదండ్రులు, బామ్మలు, తాతయ్యలు వస్తారు. -
అమెరికా హెచ్1బీ వీసాతో కెనడాలో ఉద్యోగం
టొరొంటొ: అమెరికాలో హెచ్1బీ వీసా వినియోగదారులు ఇక కెనడాలో కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఈ మేరకు కెనడా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొత్తం 10 వేల మంది ఉద్యోగాలు చేయడం కోసం ఓపెన్ వర్క్ పరి్మట్కు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో అమెరికాలో భారతీయ టెక్కీలకు కూడా లబ్ధి చేకూరుతుంది. అమెరికాలో దిగ్గజ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తూ ఉండడంతో దానిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో కెనడా ఉంది. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన నిపుణులైన టెక్కీలను ఆకర్షించి సాంకేతిక రంగంలో ప్రపంచంలో అగ్రగామిగా ఎదగాలని చూస్తోంది. ‘‘అమెరికాలో హెచ్1బీ వీసా కలిగి ఉన్న వారు 10 వేల మంది వరకు జూలై 16లోగా కెనడాకు రావడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడే ఉద్యోగాలు చేయొచ్చు. వారి కుటుంబ సభ్యులు చదువుకోవడం, పని చేయడానికి కూడా అనుమతులిస్తాం’’ అని కెనడా వలసలు, పౌరసత్వ సేవల మంత్రి సియాన్ ఫ్రాజర్ చెప్పారు. తాము ఎన్నో లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నామని, దానికి తగ్గట్టుగానే ఇమ్మిగ్రేషన్ టెక్ టాలెంట్ స్ట్రాటజీని అనుసరిస్తున్నట్టుగా చెప్పారు. సాంకేతికంగా వైవిధ్యభరితమైన పురోగతి సాధించి టెక్ జెయింట్గా ఎదగాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం కింద హెచ్1బీ వీసా వినియోగదారులకు మూడేళ్ల పాటు ఓపెన్ వర్క్ పరి్మట్ లభిస్తుంది. వారి జీవిత భాగస్వామి ఉద్యోగం లేదా చదువుకోవడం వంటివి చేయొచ్చు. అమెరికాలో భారత్, చైనాకు చెందిన వేలాది మంది టెక్కీలను టెక్ కంపెనీలు ప్రతీ ఏటా ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. ప్రస్తుతం అమెరికా మార్కెట్ సరిగా లేకపోవడంతో లేఆఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాది నవంబర్ నుంచి దాదాపుగా 2 లక్షల మంది టెక్కీలు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు అలాంటి వారందరికీ కెనడాలో మంచి అవకాశాలు దొరికే చాన్స్ వచి్చంది. ఇది కూడా చదవండి: బార్లో ఉన్న అన్ని కాక్ టెయిల్స్ తాగేశాడు.. చివరికి.. -
రెసిడెంట్, వర్క్‌వీసా గడువు పొడిగించిన న్యూజిలాండ్
న్యూజిలాండ్‌లో వర్క్ పర్మిట్ వీసా, రెసిడెంట్ వీసా మీద ఉన్న వారికి అక్కడి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2022 మే 9 నుంచి డిసెంబరు 31 వరకు వర్క్ పర్మిట్ / రెసిడెంట్ వీసా ఉన్న వారికి ఎటువంటి రుసుము లేకుండానే ఆటోమేటిక్‌గా మరో ఆరు నెలల పాడు పొడిగింపు ఇచ్చింది. ఎవరికి ఎంత కాలం పొడిగింపు వచ్చిందనే అంశం మే 25న వీసా రికార్డుల్లోకి ఎంటరవుతుందని తెలిపింది. తాజా వీసా గడువు తెలుసుకోవాలంటే మే 25 తర్వాత చెక్ చేసుకోవచ్చని చెప్పింది. -
వర్క్‌పర్మిట్లపై యూఎస్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు, హెచ్1బీ వీసా హోల్డర్ల జీవితభాగస్వాములు సహా కొన్ని ఇమ్మిగ్రెంట్ కేటగిరీలకు చెందినవారి వర్క్ పర్మిట్ కాలపరిమితిని 18నెలలు పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో యూఎస్‌లో పనిచేస్తున్న పలువురు భారతీయ ఐటీ ఉద్యోగులకు ఊరట లభించనుంది. కాలపరిమితి ముగిసిన వర్క్‌పర్మిట్లకు 18నెలల పొడిగింపు ఇచ్చే వెసులుబాటు ఈనెల 4నుంచి అమలవుతుంది. ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉన్న వీరి వర్క్‌పర్మిట్ కాలపరిమితి ఆటోమేటిగ్గా 180 నుంచి 540 రోజులకు పెరుగుతుందని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. పెండింగ్‌లో ఉన్న ఈఏడీ దరఖాస్తులతో పనిభారం పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత కాలపరిమితిని పొడిగించాలని నిర్ణయించినట్లు యూఎస్సీఐఎస్ (అమెరికా ఇమ్మిగ్రేషన్ సేవల శాఖ) డైరెక్టర్ జడోయ్ చెప్పారు. ఇప్పటివరకు ఉన్న నియమాల ప్రకారం యూఎస్ పౌరులు కానివారు వర్క్‌పర్మిట్ కాలపరిమితి ముగిశాక మరో 180 రోజుల పొడిగింపు ఆటోమేటిగ్గా వస్తుంది. ఈ గడువులో వాళ్లు పర్మిట్ రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. తాజా నిర్ణయం దాదాపు 87వేల మంది ఇమ్మిగ్రెంట్లకు ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు తెలిపారు. తాజా నిర్ణయాన్ని ఇండో అమెరికన్ సంఘాలు స్వాగతించాయి. -
సీనియర్ వలస కార్మికులకు శుభవార్త! వీసాల విషయంలో వెనక్కి తగ్గిన కువైట్
ఎన్నాళ్ల నుంచో రెక్కలు ముక్కలు చేసుకుని దేశ అభివృద్ధికి పాటుపడిన సీనియర్ ప్రవాస కార్మికులకు చేటు తెచ్చే నిబంధనల విషయంలో కువైట్ సర్కార్ వెనక్కి తగ్గింది. వయసుపై బడిన కార్మికుల ఇబ్బందులు, వారి సేవలను దృష్టిలో ఉంచుకుని వర్క్ పర్మిట్ వీసా నిబంధనల్లో పలు సవరణలు చేసింది. కువైట్ ప్రభుత్వం ఇటీవల వర్క్ పర్మిట్ వీసా నిబంధనల్లో మార్పులు చేసింది. డిగ్రీ విద్యార్హత లేని 60 ఏళ్లుపై బడిన వలస కార్మికులకు వర్క్ పర్మిట్ వీసాలను రెన్యువల్ చేయడానికి నిరాకరించింది. పనుల్లో వీరి స్కిల్ సరిపోవడం లేదని, శ్రమ కూడా తగ్గిపోతుందనే నెపంతో కువైత్ ఈ తరహా ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 4,000ల మంది వలస కార్మికులు ఒక్కసారిగా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. దీంతో కువైత్ ప్రభుత్వ నిర్ణయం పట్ల విమర్శలు ఎక్కువగా వచ్చాయి. దీంతో వర్క్ పర్మిట్ వీసా నిబంధనలకు సంబంధించి తాజాగా జారీ చేసిన గెజిట్‌ను ప్రస్తుతానికి వెనక్కి తీసుకుంది. మరో ఏడాది తర్వాత ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. దీంతో డిగ్రీ లేని, 60 ఏళ్లు పైబడిన సీనియర్ వలస కార్మికులకు ఊరట లభించింది. ఎప్పటిలాగే వారు 250 కువైట్ దినార్లు (రూ.61,000) చెల్లించి తమ వర్క్ పర్మిట్‌ను రెన్యూవల్ చేయించుకోవచ్చు. చదవండి: దేశం కాని దేశంలో భారత మహిళ ఒంటరి పోరాటం -
హెచ్4 వీసాలపై పిడుగు!
వాషింగ్టన్: హెచ్–4 వీసాదారులకు అమెరికాలో ఉద్యోగం చేసుకునే అనుమతులను రద్దుచేయాలన్న డీహెచ్ఎస్ (డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ) ప్రతిపాదనను అమలుచేసే దిశగా మరో అడుగు ముందుకు పడింది. హెచ్–1బీ వీసా కలిగిన వ్యక్తుల జీవిత భాగస్వాములకు, వారి 21 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు ఇచ్చేదే ఈ హెచ్–4 వీసా. హెచ్–4 వీసా కలిగిన వారు కూడా ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులిస్తూ 2015లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ అనుమతులను రద్దు చేయాలని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా, డీహెచ్ఎస్ ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణను ప్రారంభించాల్సిందిగా మే 22న అమెరికా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. హెచ్–4 వీసాకు ఉద్యోగానుమతులు రద్దయితే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న లక్ష మందికి పైగా భారతీయులు, తమ కొలువులను కోల్పోయే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఈ లక్ష మంది భారతీయుల్లో స్త్రీలే అత్యధికంగా ఉన్నారు. కనీసం సంవత్సరం తర్వాతే.. ఒక వేళ హెచ్–4 వీసాకు ఉద్యోగానుమతులు రద్దయినా, అది అమలు కావడానికి కనీసం ఒక సంవత్సరం పడుతుందని అమెరికాలో వలస చట్టాల న్యాయనిపుణుడు రాజీవ్ ఖన్నా చెప్పారు. ‘హెచ్–4 వీసాదారులకు ఉద్యోగాలు చేసుకునే అనుమతిని రద్దుచేసే ప్రక్రియ ప్రస్తుతం చివరి నుంచి రెండో దశలో ఉంది. ప్రజాభిప్రాయ సేకరణలో ఈ ప్రతిపాదనకు మద్దతు లభిస్తే, ఫెడరల్ రిజిస్టర్లో దీనిని పోస్ట్ చేస్తారు. 30 లేదా 60 రోజుల్లోపు మళ్లీ ప్రజలు తమ అభిప్రాయాలు తెలపవచ్చు. అనంతరం నిబంధనకు తుదిరూపు వస్తుంది’ అని ఆయన వివరించారు. వలస విధానాల్లో పూర్తి సంస్కరణలు తీసుకొచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం తొలి నుంచీ మొగ్గుచూపుతుండటం తెలిసిందే. అందులో భాగంగానే, గతేడాది ఫిబ్రవరిలో తొలిసారిగా హెచ్–4 వీసాలకు ఉద్యోగానుమతులు రద్దు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం చేసింది. అనంతరం గతేడాది అక్టోబర్‌లో డీహెచ్ఎస్ ఈ ప్రతిపాదనకు అనుకూలంగా మాట్లాడింది. అయితే హెచ్–4 వీసాకు ఉద్యోగానుమతులు రద్దు చేస్తే అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలకు ప్రతిభావంతులైన ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. -
3 నెలల్లో ‘హెచ్4’ను తేలుస్తాం
వాషింగ్టన్: హెచ్–4 వీసాదారులకు వర్క్ పర్మిట్లను రద్దు చేసే విషయమై వచ్చే మూడు నెలల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ ప్రభుత్వం ఫెడరల్ కోర్టుకు తెలిపింది.‘హెచ్–1బీ వీసాదారుల భాగస్వాములకు ఉపాధి కల్పనకు అవకాశం కల్పించే హెచ్–4 వీసాకు సంబంధించిన నిబంధనను తొలగించాలని ప్రతిపాదించడంలో మేము కచ్చితమైన పురోగతి సాధిస్తున్నాం’అని కొలంబియా జిల్లాలోని అమెరికా జిల్లా కోర్టుకు సమర్పించిన నివేదికలో హోంల్యాండ్ భ్రదత విభాగం(డిహెచ్ఎస్) పేర్కొంది. కొత్త నిబంధనను మూడు నెలల్లో అధ్యక్ష భవనంలోని ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ బడ్జెట్(ఓఎంబీ)కు సమర్పిస్తామని,అంత వరకు ఈ కేసులో నిర్ణయాన్ని ప్రకటించవద్దని కోర్టును కోరింది. హెచ్1బీ వీసాపై అమెరికా వచ్చే విదేశీయుల భాగస్వాములకు అక్కడ ఉద్యోగ అవకాశం కల్పిస్తూ గతంలో ఒబామా ప్రభుత్వం హెచ్–4 వీసా నిబంధనను తీసుకొచ్చింది. ఈ నిబంధన కింద యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యుఎస్సిఐఎస్)హెచ్–1బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు(భాగస్వామి,21 ఏళ్లలోపు పిల్లలకు)హెచ్–4 వీసాలు మంజూరు చేస్తోంది.దీనివల్ల లక్షల మంది భారతీయ మహిళలు లబ్ది పొందుతున్నారు.ఒబామా హయాంలో ఇచ్చిన ఈ అవకాశం దుర్వినియోగమవుతోందని, ఈ నిబంధన సాకుతో కంపెనీలు అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని భావిస్తున్న ట్రంప్ ప్రభుత్వం ఒబామా ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఒమాబా హయాంలో అమల్లోకి వచ్చిన ఈ విధానం వల్ల తమ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతోందంటూ కొందరు అమెరికన్లు(ఉద్యోగులు) కోర్టులో కేసు వేశారు.ఆ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం గత ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. హెచ్4వీసాదారుల వర్క్ పర్మిట్లను రద్దు చేయనున్నట్టు ట్రంప్ ప్రభుత్వం బహిరంగంగాను, కోర్టులోనూ కూడా చెబుతూ వస్తోంది. హెచ్4 వీసా వర్క్ పర్మిట్ రద్దుకు త్వరలో నిర్ణయం తీసుకుంటామంటూ ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు కోర్టుకు తెలిపింది. నిర్ణయం ఆలస్యం అవుతోందంటూ గత ఫిబ్రవరి 28, మే 22, ఆగస్టు 20లలో కోర్టుకు తెలిపింది. తరువాయి స్టేటస్ రిపోర్టును(స్థాయి నివేదిక) వచ్చే నవంబర్ 19న కోర్టుకు సమర్పించనుంది. సాధారణ ప్రక్రియే హెచ్4 వీసా వర్క్ పర్మిట్ల రద్దుపై నిర్ణయంలో జాప్యం జరగడం సాధారణమేనని అమెరికా అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు.‘డిహెచ్‌ఎస్‌కు చెందిన సీనియర్ నాయకులు ప్రతిపాదనను సమీక్షించడం, సవరణలు సూచించడం సాధారణంగా జరిగేదే.అవసరమైన సవరణలు పొందుపరిచిన తర్వాత తుది ఆమోదం కోనం యుఎస్సిఐఎస్ ఆ ప్రతిపాదనను డిహెచ్‌ఎస్‌కు పంపుతుంది. తర్వాత ఓఎంబీకి సమర్పించడం జరుగుతుంది’అని అటార్నీ తాజా అఫిడవిట్లో కోర్టుకు వివరించారు.అయితే, కోర్టు తీర్పు ఆలస్యం అవుతున్న కొద్దీ తమకు మరింత ఎక్కువ హాని జరుగుతుందని పిటిషనర్లు(సేవ్ జాబ్స్ యుఎస్ఏ) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా తీర్పు ఇవ్వాలని కోర్టును కోరుతున్నారు. 1.26 లక్షల మందికి ఆనుమతి 2015, మే నుంచి ఒబామా విధానం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి 2017 డిసెంబర్ 25 వరకు యుఎస్సిఐఎస్ 1,26,853 మందికి వర్క్ పర్మిట్లు మంజూరు చేసింది. వీటిలో 90,846 దరఖాస్తులు కొత్తగా అనుమతి కోరుతూ పెట్టుకున్నవి కాగా,35,219 రెన్యువల్ దరఖాస్తులు.వర్క్ పర్మిట్ కార్డులు పోవడంతో కొత్త కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తులు 688.‘ యుఎస్సిఐఎస్ మంజూరు చేసిన దరఖాస్తుల్లో 93శాతం భారతదేశంలో పుట్టి ఇక్కడికి వచ్చిన వారివే.5శాతం చైనాలో పుట్టిన వారివి. మిగతా రెండు శాతం ఇతర దేశాల్లో పుట్టిన వారివి.’అని కాంగ్రెçసనల్ రీసెర్చ్ సర్వీస్ ఒక నివేదికలో తెలిపింది.యుఎస్సిఐఎస్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. -
‘హెచ్–4 రద్దు’తో అమెరికాకే నష్టం
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–4 వీసాదారులకు ఉద్యోగ అనుమతులు (వర్క్ పర్మిట్స్) రద్దు చేయాలన్న ప్రతిపాదనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటువంటి చర్యలు ఆయా ఉద్యోగుల కుటుంబాలకేగాక అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టదాయకం అవుతాయని ఫేస్బుక్ వంటి దిగ్గజ కంపెనీలతోపాటు కాంగ్రెస్ సభ్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీయులను నియమించుకునేందుకు అమెరికాలోని కంపెనీలకు వీలు కల్పించేవి హెచ్–1బీ వీసాలు కాగా, ఆ హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు (భర్త లేదా భార్య) హెచ్–4 వీసాలను మంజూరు చేస్తారు. హెచ్–4 వీసా కలిగిన వారు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు 2015లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా అనుమతులిచ్చారు. ప్రస్తుతం 65 వేల మందికి పైగా భారతీయులు హెచ్–4 వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే విదేశీయులు అమెరికా ప్రజల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారనీ, విదేశీయులకు ఉద్యోగ అనుమతులపై కఠిన నిబంధనలు తెస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2016లో ఎన్నికల ప్రచారం నాటి నుంచే చెప్తున్నారు. అమెరికాకే నష్టం ‘హెచ్–4 వీసాలకు ఉద్యోగ అనుమతులు రద్దు చేస్తే వేలాది మంది కొలువులు మాని ఇళ్లలో కూర్చోవాలి. దీని వల్ల నష్టం జరిగేది ఆయా ఉద్యోగుల కుటుం బాలకే కాదు, మన ఆర్థిక వ్యవస్థకు కూడా’ అని సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేసే ఎఫ్‌డబ్ల్యూడీ.యూఎస్ అనే సంస్థ పేర్కొంది. ఈ సంస్థను ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక ప్రధాన ఐటీ కంపెనీలు కలసి స్థాపించాయి. ‘ఇప్పుడు హెచ్–4 వీసాపై ఉద్యోగాలు చేస్తున్న వారిలో కనీసం 80 శాతం మంది మహిళలే. వారంతా వారివారి స్వదేశాల్లో ఉన్నత చదువులు చదివి, ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు కూడా చేసి పెళ్లి అయ్యాక వారి జీవిత భాగస్వామితో కలసి ఉండేందుకు అమెరికా వచ్చారు. వారు ఇక్కడ పనిచేసి, వేతనాలు తీసుకొని మన ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారు. మరికొంత మంది డబ్బు సంపాదించాక వ్యాపారాలు పెట్టి అమెరికా ప్రజలకు కూడా ఉద్యోగాలిస్తున్నారు. ఇప్పుడు హెచ్–4 వీసాలకు ఉద్యోగ అనుమతులు రద్దుచేస్తే కొంతమంది అమెరికన్ల ఉపాధికీ ప్రమాదమే’ అని ఎఫ్‌డబ్ల్యూడీ.యూఎస్ పేర్కొంది. భారతీయ కంపెనీలకు భారీగా తగ్గిన ‘హెచ్–1బీ’ అమెరికాలోని భారతీయ కంపెనీలకు జారీ అయిన హెచ్–1బీ వీసాల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో భారీగా తగ్గింది. 2015తో పోలిస్తే 2017లో ఏడు ప్రధాన భారతీయ ఐటీ కంపెనీలకు కలిపి లభించిన హెచ్–1బీ వీసాల సంఖ్య ఏకంగా 43%తగ్గింది. 7 ప్రధాన భారతీయ కంపెనీలకు కలిపి 2017లో 8,468 హెచ్–1బీ వీసాలు లభించాయనీ, 2015లో ఈ సంఖ్య 14,792 అని ఓ అధ్యయన నివేదిక తెలిపింది. 2017లో అత్యధికంగా టీసీఎస్‌కు 2,312, ఇన్ఫోసిస్‌కు 1,218, విప్రోకు 1,210 వీసాలు లభించాయి. 2015తో పోలిస్తే ఈ కంపెనీలు కొత్తగా పొందిన వీసాల సంఖ్య సగానికిపైగా పడిపోయింది. -
కిచిడీ: ఇక ఉల్లి కోస్తే కన్నీళ్లు రావు!
ఉల్లిపాయలు లేకుంటే ఇంట్లో వంటే ఉండదు. అంటే... అది ఒక అత్యావశ్యక నిత్యావసర వస్తువు. కానీ, దాన్ని కోస్తే కన్నీళ్లొస్తాయి. రోజూ ఈ కళ్ల మంట భరించాల్సిందేనా? ఆ బాధ నుంచి తప్పించుకునే ఓ మంచి అవకాశం వచ్చింది. ఉల్లిగడ్డలు కోసేటపుడు వాటి ఘాటు కళ్లకు తగలకుండా ప్రత్యేక కళ్లద్దాలు వచ్చాయి. వీటిని పెట్టుకుని ఎంత ఘాటున్న ఉల్లిగడ్డలయినా కోసేయొచ్చు. కంటిని చుట్టూ కవర్ చేసి ఏ విధంగానూ వాటి ఘాటు కంటికి చేరకుండా చేయడంలో ఇవి సహాయపడతాయి. అమెజాన్.కామ్, ఇబే.కామ్‌లోకి వెళ్తే మీరు సులువుగా వీటిని కొనేసుకోవచ్చు. ధర వెయ్యి రూపాయల లోపే ఉంది. వీసా అడగని దేశాలు! మీకో విషయం తెలుసా? ప్రపంచంలో 52 దేశాలకు భారతీయులు వీసా లేకుండానే కేవలం పాస్‌పోర్ట్ చేతిలో పెట్టుకుని ఫ్లైట్ ఎక్కొచ్చు. ఈ జాబితాలో మళ్లీ 28 దేశాలకు వీసా అవసరమే రాదు. మిగతా దేశాల్లో మాత్రం అక్కడ దిగాక వాళ్లే వీసా సులువుగా ఇచ్చేస్తారు. కానీ అక్కడే ఉండి ఉద్యోగం చేయాలంటే మాత్రం వర్క్ పర్మిట్ వీసా ఉండాలి. ఇక నేపాల్, భూటాన్ దేశాల్లో అయితే అది కూడా మనకు అవసరం ఉండదు. మన సంగతి అలా ఉంచితే, బ్రిటనీయులు ప్రపంచంలో సుమారు 173 దేశాలకు వీసా లేకుండానే వెళ్లే అవకాశం ఉంది.