ఎన్నాళ్ల నుంచో రెక్కలు ముక్కలు చేసుకుని దేశ అభివృద్ధికి పాటుపడిన సీనియర్ ప్రవాస కార్మికులకు చేటు తెచ్చే నిబంధనల విషయంలో కువైట్ సర్కార్ వెనక్కి తగ్గింది. వయసుపై బడిన కార్మికుల ఇబ్బందులు, వారి సేవలను దృష్టిలో ఉంచుకుని వర్క్ పర్మిట్ వీసా నిబంధనల్లో పలు సవరణలు చేసింది.
కువైట్ ప్రభుత్వం ఇటీవల వర్క్ పర్మిట్ వీసా నిబంధనల్లో మార్పులు చేసింది. డిగ్రీ విద్యార్హత లేని 60 ఏళ్లుపై బడిన వలస కార్మికులకు వర్క్ పర్మిట్ వీసాలను రెన్యువల్ చేయడానికి నిరాకరించింది. పనుల్లో వీరి స్కిల్ సరిపోవడం లేదని, శ్రమ కూడా తగ్గిపోతుందనే నెపంతో కువైత్ ఈ తరహా ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 4,000ల మంది వలస కార్మికులు ఒక్కసారిగా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. దీంతో కువైత్ ప్రభుత్వ నిర్ణయం పట్ల విమర్శలు ఎక్కువగా వచ్చాయి.
దీంతో వర్క్ పర్మిట్ వీసా నిబంధనలకు సంబంధించి తాజాగా జారీ చేసిన గెజిట్‌ను ప్రస్తుతానికి వెనక్కి తీసుకుంది. మరో ఏడాది తర్వాత ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. దీంతో డిగ్రీ లేని, 60 ఏళ్లు పైబడిన సీనియర్ వలస కార్మికులకు ఊరట లభించింది. ఎప్పటిలాగే వారు 250 కువైట్ దినార్లు (రూ.61,000) చెల్లించి తమ వర్క్ పర్మిట్ను రెన్యూవల్ చేయించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment