![Help Desk Started For Migrant Workers In GMR Hyderabad Airport - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/11/22.jpg.webp?itok=nCCFO3bL)
ఉపాధి కోసం వలస వెళ్లే కార్మికుల కోసం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టు నిర్వహిస్తోన్న జీఎంఆర్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్)లు సంయుక్తంగా ఈ హెల్ప్‌డెస్క్‌ని ఏర్పాటు చేశాయి. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నిత్యం కార్మికులు వలస కార్మికులు ప్రయాణం చేస్తున్న దృష్ట్యా వారికి సహాయకారిగా ఉండేందుకు ఈ హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులోకి తెచ్చారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి కుముదిని ఈ హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం కువైల్, అబుదాబి, యూఏఈ, ఖతార్, దుబాయ్ వంటి గల్ఫ్ దేశాలకు కార్మికులు వెళ్తుంటారు. అయితే సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల విదేశాలకు వెళ్లిన తర్వాత అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు వలస కార్మికులకు ఉండే హక్కులపై అవగాహన లేక అనేక అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపేందుకు, తగు సూచనలు ఇచ్చేందుకు ఈ డెస్క్ ఎంతో తోడ్పాటు అందివ్వనుంది.
చదవండి: లైఫ్ అండ్ డెత్ ఇన్ ద గల్ఫ్
Comments
Please login to add a commentAdd a comment