Helpdesk
-
తెలుగు రాష్ట్రాల పాలసీదార్లకు ఐసీఐసీఐ లాంబార్డ్ హెల్ప్‌డెస్క్
తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సంతో నష్టపోయిన పాలసీదారులకు సత్వరం సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వారి కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్‌్కను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇది ప్రతి రోజూ, ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉంటుందని వివరించింది. పాలసీదారులు టోల్ ఫ్రీ నంబరు 1800–2666 ద్వారా లేదా customersupport@icicilombard. com ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. -
గురుకుల దరఖాస్తుకూ ‘పరీక్షే’! హెల్ప్‌డెస్క్ ఉంది.. కానీ, సాయం అందదు
సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉద్యోగాల దరఖా స్తు ప్రక్రియ ప్రహసనంగా మారింది. నోటిఫికేషన్లు జారీచేసి నెలైనా సాంకేతిక సమస్యలు తీరకపోవ డంతో ఆభ్యర్థులు సతమతమవుతున్నారు. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)లో తలెత్తుతున్న సమస్యలతో దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగట్లేదు. ఒకే అభ్యర్థి పలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతిసారీ వివరాలు నమోదు కష్టమని భా వించి తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఈ విధానాన్ని తెచ్చింది. ఈ క్రమంలోనే బోర్డు గత నెల 5న 9 ఉద్యోగ ప్రకటనలు జారీచేయగా.. ఏప్రిల్ 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. కానీ ఓటీఆర్, దరఖాస్తు ప్రక్రియలోని సాంకేతిక సమస్యలు అభ్యర్థులను చికాకుపెడుతున్నాయి. ‘దరఖాస్తు’కే చుక్కెదురు.. సంక్షేమ గురుకులాల్లో 9 కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి తొమ్మిది నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో జేఎల్, డీఎల్ తదితర పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈనెల 17తో ముగిసింది. గురుకుల పాఠశాలల్లో టీజీటీ, పీజీటీ తదితర పోస్టులకు దరఖాస్తు గడువు వచ్చే వారంలో ముగియనుంది. అయితే, ఆయా పోస్టులకు తొలి వారం రోజులు సర్వర్ సమస్యలతో దరఖాస్తు ప్రక్రియ నెమ్మదించింది. పెద్దసంఖ్యలో యూజర్లు వెబ్‌సైట్‌ను తెరవడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. కానీ, దరఖాస్తు గడువు ముగిసే వరకు కూడా సాంకేతిక సమస్యలు అలాగే ఉండడంతో చాలామంది దరఖాస్తు చేయలేకపోయారు. కనీసం గురుకుల పాఠశాలల్లో కొలువులకు దరఖాస్తు ప్రక్రియలోనైనా సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇక, దరఖాస్తు, ఇతర సాంకేతిక సమస్యలపై క్షేత్రస్థాయిలో ఫిర్యాదుల పరిష్కారానికి గురుకుల బోర్డు ఫోన్‌నంబర్, ఈ–మెయిల్‌తో హెల్ప్‌డెస్క్ ఏర్పాటుచేసింది. అయితే ఇది వినతుల స్వీకరణకే పరిమితమైందని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఎన్నిసార్లు ఫోన్లుచేసినా స్పందించట్లేదని బోర్డుకు ఫిర్యాదులు అందుతున్నాయి. వారం పట్టింది గురుకులాల్లో జూనియర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తుకు వారం పట్టింది. ఓటీఆర్ కోసం వరుసగా ఐదురోజుల పాటు ప్రయత్నించాను. ఏడాదిన్నరగా జేఎల్, డీఎల్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతుండగా.. కేవలం దరఖాస్తు ప్రక్రియే కష్టమైపోయింది. – డి.నర్సింగ్‌రావు, కొడంగల్, వికారాబాద్ జిల్లా ఓటీఆర్ నమోదు కాక దరఖాస్తుకు దూరమయ్యాను ఓటీఆర్ కోసం పదిరోజులు ప్రయత్నించాను. మాసాబ్‌ట్యాంక్‌లోని బోర్డు కార్యాలయానికి వెళ్లి చెప్పాను. ప్రయోజనం లేకపోగా, చివరకు దరఖాస్తు చేయకుండానే జేఎల్, డీఎల్ గడువు ముగిసిపోయింది. గడువును వారమైనా పొడిగించాలి. – చీపురు ప్రవీణ్‌కుమార్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా -
హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రవాసి సహాయతా కేంద్రం
ఉపాధి కోసం వలస వెళ్లే కార్మికుల కోసం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టు నిర్వహిస్తోన్న జీఎంఆర్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్)లు సంయుక్తంగా ఈ హెల్ప్‌డెస్క్‌ని ఏర్పాటు చేశాయి. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నిత్యం కార్మికులు వలస కార్మికులు ప్రయాణం చేస్తున్న దృష్ట్యా వారికి సహాయకారిగా ఉండేందుకు ఈ హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులోకి తెచ్చారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి కుముదిని ఈ హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం కువైల్, అబుదాబి, యూఏఈ, ఖతార్, దుబాయ్ వంటి గల్ఫ్ దేశాలకు కార్మికులు వెళ్తుంటారు. అయితే సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల విదేశాలకు వెళ్లిన తర్వాత అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు వలస కార్మికులకు ఉండే హక్కులపై అవగాహన లేక అనేక అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపేందుకు, తగు సూచనలు ఇచ్చేందుకు ఈ డెస్క్ ఎంతో తోడ్పాటు అందివ్వనుంది. చదవండి: లైఫ్ అండ్ డెత్ ఇన్ ద గల్ఫ్ -
కరోనా : ఈ వాట్సాప్ నంబరు సేవ్ చేసుకోండి!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తున్న తరుణంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రజలకు ఈ వైరస్‌పై అవగాహన కల్పించే చర్యల్లో భాగంగా ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో అధికారిక వాట్సాప్ చాట్‌బాట్‌ను ప్రారంభించింది. వాట్సాప్‌లో తప్పుడు సమాచారం, నకిలీ వార్తలకు చెక్ పెట్టే లక్ష్యంతో మై గోవ్ కరోనా హెల్ప్‌డెస్క్ (MyGov Corona Helpdesk) పేరుతో దీన్ని లాంచ్ చేసింది. ఇది వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. ఫేస్బుక్, ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఫేక్ న్యూస్‌ను గుర్తించేందుకు, కోవిడ్-19 పై సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుతోంది. ఇందుకోసం వాట్సాప్ నెంబర్ 9013151515ను లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలోనే నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్పీపీఏ) ట్విటర్లో దీన్ని ప్రకటించింది. కరోనా వైరస్‌కు సంబంధించి అందోళన చెందవద్దనీ, వాట్సాప్ నెంబర్లో ప్రజల సందేహాలకు, ప్రశ్నలకు ఆటోమెటిక్ గా సమాధానం లభిస్తుందని ఎన్పీపీఏ ట్వీట్ చేసింది. ఈ వాట్సాప్ చాట్‌బాట్ కాకుండా కోవిడ్-19 (కరోనా వైరస్ జాతీయ హెల్ప్‌లైన్ నంబర్‌ను (+ 91-11-23978046, టోల్ ఫ్రీ నెంబర్ 1075 ను కూడా ప్రభుత్వం అందుబాటులో వుంచింది. అలాగే పౌరుల సౌలభ్యంకోసం అధికారిక ఇమెయిల్ ఐడి (ncov2019@gov.in) ను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రజలు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అసత్య, అసంబద్ద వ్యార్తలనుంచి దూరంగా వుండవచ్చు. Prepare and help others to prepare#COVID2019 pic.twitter.com/U9O4H1iTQz — NPPA~India🇮🇳 (@nppa_india) March 20, 2020 -
అయ్యా కాల్మొక్త.. కనికరిచండి
సాక్షి, మహబూబ్‌నగర్ న్యూటౌన్ : అయ్యా.. నీ కాల్మొక్త.. నా భూమిని ఖబ్జా చేసిండ్రు.. అడిగితే కొడుతుండ్రు.. 30 ఏళ్ల కిందట ఎకరాకు రూ.16 వేల చొప్పున 5 ఎకరాలు భూమి కొన్నా.. నా భూమి పక్కనే ఉన్న తిమ్మారెడ్డి అనే దొర ఈ మధ్య పొలంలో ఖడీలు పాతిండు. ఇదేంటంటే కొట్టిండు.. ఊరి పెద్దమనుషులు కూడా ఆయనకే మద్దతు చెప్తున్నరు.. జర నాకు నాయం చెప్పండి.. అంటూ మహబూబ్‌నగర్ మండలం బొక్కలోనిపల్లికి చెందిన చిన్నబాలప్ప అధికారులకు తన గోడును వెళ్లబోసుకున్నాడు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ ఫిర్యాదులు, వినతులను అధికారులకు అందజేసి వేడుకున్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకట్రావు, డీఆర్వో వెంకటేశ్వర్లు, సర్వే ల్యాండ్ ఏడీ శ్యాంసుదర్‌రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డిడి ఉదయ్‌కుమార్ వినతులు స్వీకరించారు. ఎక్కువగా భూ కబ్జాలు, రైతుబంధు చెక్కు, పాస్‌బుక్కులు, హాస్టళ్లలో పిల్లలకు సీట్లు ఇప్పించాలని, పెన్షన్లు, ట్రైసైకిళ్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 66 దరఖాస్తులు అందించగా హెల్ప్‌డెస్క్ ద్వారా ఉచితంగా సేవలందించారు. ఉన్నతాధికారులు వచ్చిన వినతులను శాఖల వారీగా విభజించి పరిష్కరించాలని ఆయా శాఖల మండల అధికా రులను ఆదేశించారు. పాస్‌బుక్కులు, చెక్కులు రాలె భూప్రక్షాళన సర్వే చేసి ఆర్వోఆర్ 1బి ఇచ్చారు. రైతుబంధు పథకంలో అందరికిలాగే మాకు కూడా పాస్‌పుస్తకాలు, చెక్కులు వస్తాయని అనుకున్నాం. కానీ ఇంతవరకు రాలేదు. ఎందుకని అడిగితే సరిగ్గా సమాధానం చెప్తలేరు. సర్వే నెం.67లో మొత్తం 14.10 ఎకరాల భూమికి సంబంధించి రైతుబంధు పథకం పట్టాదారు పాస్‌పుస్తకాలు, చెక్కులు ఇప్పించాలని కోరుతూ మహబూబ్‌నగర్ మండలం వెంకటాపూర్ గ్రామ పరిధిలోని అవతలిగడ్డతాండకు చెందిన కె.చంద్రు నాయక్ తన కుటుంబ సభ్యులతో వచ్చి గోడును చెప్పుకున్నాడు. -
జీఎస్టీ హెల్ప్ డెస్క్ ప్రారంభం
సందేహాల నివృత్తికి డయల్ 08518–247772 కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): జీఎస్టీపై ప్రజలకున్న సందేహాలను నివృత్తి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశామని వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ తాతారావు స్పష్టం చేశారు. ఈ మేరకు స్థానిక స్కందా కాంప్లెక్స్‌లో జీఎస్టీ హెల్ప్ డెస్క్ కార్యాలయాన్ని చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షులు విజయ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రజలు, పన్ను దారుల సందేహాలను నివృత్తి చేసేందుకు 08518–247772 ఫోన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ ద్వారా మొదటి కాల్‌ను స్వీకరించిన తాతారావు ప్రజల సందేహాన్ని నివృత్తి చేసి జీఎస్టీ ప్రాధాన్యతను వివరించారు. -
చేయి తడిపితే నేపని....!
ఆర్టీఓ కార్యాలయంలో ఆగని దందా అనంతపురం సెంట్రల్ : ఇతని పేరు నాగరాజు. పెద్దవడుగూరు మండలం తెలికి గ్రామం. ఇటీవల ఐచర్ వాహనం(ఏపీ02 టీఏ 6789) కొనుగోలు చేశాడు. తనపేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆల్ ఇండియా పర్మిట్ అనుమతి కోసం ఈనెల 8న ఆర్టీఓ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. రూ. 2150 కట్టి అదే రోజు చలానా( నెంబర్ 5133396) తీశాడు. రెండ్రోజుల్లో అనుమతి వస్తుందని భావించి కర్ణాటక మార్కెట్‌కు పత్తి తీసుకుపోయేందుకు లోడ్ చేశాడు. ఇప్పటికి 20 రోజులు గడిచింది. అనుమతి ఇవ్వరాలేదు. విసిగి వేసారిన ఆయన బుధవారం ఆర్టీఓ కార్యాలయంలో సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. వారు అది మా పని కాదు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ తేల్చిచెప్పారు. దీంతో నిరాశతో వెనుతిరిగాడు. 20 రోజుల నుంచి తిరుగుతున్నా పని కాలేదు. లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనం నిలబడిపోయింది అని నాగరాజు వాపోయాడు. జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో నేరుగా ఎవరైనా పనులు చేసుకోవాలంటే నాగరాజుకు ఎదురైన పరిస్థితి తప్పదు. దళారీ వ్యవస్థను నిర్మూలించేశామని పైపైకి చెబుతున్నా... చాపకింద నీరులా దళారీ వ్యవస్థ కొనసాగుతోంది. ఏజెంట్లు- అధికారులు కుమ్మక్కు రవాణాశాఖలో ఏజెంట్ల వ్యవస్థ ఎప్పటి నుంచో వేళ్లూనుకొని పోయింది. ఒకప్పుడు 15 మందితో ప్రారంభమైన ఏజెంట్లు ప్రస్తుతం దాదాపు 75 మందికి పైగా ఉన్నారు. ఎలాంటి సాయం కావాలన్నా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో సంప్రదించవచ్చు. కానీ హెల్ప్‌డెస్క్ అలంకార ప్రాయంగా మారింది. ఏజెంట్లలో సీనియర్లుగా చొప్పుకునే ముగ్గురు వ్యక్తులు నేటికీ ఆర్టీఓ కార్యాలయం వద్ద తిష్ట వేస్తున్నారు. ఓ జిరాక్స్ సెంటర్ కేంద్రంగా మంత్రాంగం నడుపుతున్నారు. అక్కడ ప్రత్యేకంగా కోడ్ భాషను ఏర్పాటు చేసుకున్నారు. కొందరు ఎంవీఐలతో ఒప్పందం కుదుర్చుకొని తమ దందాను కొనసాగిస్తున్నారు. డెరైక్ట్ వెళితే 20 రోజులైనా కాని పని... వీరిని కలిస్తే మాత్రం గంటలోనే అవుతుండటం విశేషం. మొత్తం లావాదేవీలన్నీ ఇక్కడి నుంచే నడిపిస్తున్నారు. -
ఆధార్, ఓటర్ కార్డు అనుసంధానానికి విశేష స్పందన
హైదరాబాద్ సిటీ: సాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆధార్, ఓటర్ కార్డు అనుసంధానానికి విశేష స్పందన లభిస్తోంది. ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకొని, బోగస్ ఓట్లకు చరమగీతం పాడాలని పభుత్వంపిలుపునివ్వడంతో ప్రజలు ఈ కార్యక్రమానికి క్యూ కట్టారు. ఇప్పటికే సాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటైన లింకేజీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సాక్షి ఆధ్వర్యంలో ఆదివారం సనత్‌నగర్, గచ్చిబౌలి, జగద్గిరిగుట్ట, ఉప్పల్‌తో పాటు నగరంలోని పలుప్రాంతాల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. -
నమస్తే.. మీకు ఏవిధంగా సాయపడగలం..!
సాక్షి,హైదరాబాద్ : రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన సదుపాయాల కల్పనకు దక్షిణ మధ్య రైల్వే మరో అడుగు ముందుకేసింది. వివిధ రకాల సమస్యల పరిష్కారానికి, సదుపాయాలపై ప్రయాణికుల నుంచి అందే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు మొట్టమొదటిసారి ప్ర యోత్మాకంగా హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. లక్షలాది మంది ప్రయాణికులు, వందల కొద్దీ రైళ్ల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ ైరె ల్వేస్టేషన్‌లో మంగళవారం నుంచి ఈ హెల్ప్డె స్క్‌లు అందుబాటులోకి రానున్నా యి. వీటిని ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ లాంఛనంగా ప్రారంభించనున్నారు. సంచార సహాయ కేంద్రాలు.. ప్రయాణికులకు రెండురకాల సహా య కేంద్రాలు అందుబాటులో ఉం టాయి. ప్లాట్‌ఫామ్ 10 పైన ఒక స్థిరమైన హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికుల భద్రత, రైళ్లరాకపోకలు, స్టేషన్లో పరిశుభ్రత, లైట్లు, మంచినీటి సదుపాయం, రిజర్వేషన్ కేంద్రాల నిర్వహణ, టిక్కెట్ బుకింగ్‌లో ఎదురయ్యే ఇబ్బందులు, వసతి కేంద్రాల నిర్వహణ వంటి అన్ని సమస్యలపైన ప్రయాణికులు ఈ కేంద్రం వద్ద ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా వివిధ రకాల సమస్యల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నెంబర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. నేరుగా సహాయ కేం ద్రాలకు రాలేనివారు ఈ నెంబర్లలో ఫిర్యాదు చేయవచ్చు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి త గిన పరిష్కారాన్ని అందజేస్తారు. అంతేకాకుండా అన్ని ప్లాట్ఫారాలపైన సంచరిస్తూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు సేకరించే విధంగా సంచార సహాయ కేంద్రాలను కూడా ప్రారంభించనున్నారు. వివిధ విభాగాలకు చెందిన అధికారుల సమూహం బ్యాటరీ కార్లలో అన్ని ప్లాట్‌ఫారాలపై తిరుగుతూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటారు. ఈ సహాయ కేంద్రాలు 24 గంటల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రతి రోజు సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తొలి సారి ప్రవేశపెట్టనున్న హెల్ప్‌డెస్క్‌ల వినియోగం, పనితీరు, ఫలితాలను బట్టి రాష్ట్రంలోని మిగతా స్టేషన్లకు కూడా విస్తరిస్తామని రైల్వే అధికారవర్గాలు తెలిపాయి. -
ప్రజల సాక్షిగా ప్రజాదర్బార్
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించే ప్రజాదర్బార్ ప్రజలకు మరింత ఉపయోగపడే విధంగా కలెక్టర్ విజయకుమార్ పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. అర్జీలు రాసేందుకు ప్రభుత్వ సిబ్బందిని నియమించడమేగాకుండా వాటిని అక్కడికక్కడ విచారించేందుకు వీలుగా అధికారుల బృందాలను ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారుల స్థాయిలో పరిష్కారం కాని వాటిని నేరుగా తన వద్దకు తీసుకొచ్చే విధంగా రూపకల్పన చేశారు. అందరి సమక్షంలో సంబంధిత సమస్య గురించి కింది వరుసలో కూర్చున్న అధికారులను మైక్ ద్వారా మాట్లాడిస్తూ బహిరంగంగా చెప్పించడంతో ప్రజలు కూడా వాటి స్థితిగతులను తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఈ విధానంతో ప్రజలు కూడా సమస్య స్థితిగతిని సావధానంగా తెలుసుకుని ముందుకు కదులుతున్నారు. గతంలో గుంపులు గుంపులుగా ప్రజలు అర్జీలు చేతపట్టుకొని వచ్చేవారు. కొన్నిసార్లు గందరగోళంగా ఉండేది. ఈ సారి మాత్రం అలాంటి వాతావరణం కనిపించలేదు. ఒకరి తర్వాత ఒకరి అర్జీని కలెక్టర్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్‌లు స్వీకరించారు. హెల్ప్ డెస్క్‌తో తీరిన రాత కష్టాలు ప్రజాదర్బార్ కోసం ప్రకాశం భవనంలోకి ప్రజలు అడుగు పెట్టగానే కుడివైపు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. సమస్యలతో బాధపడుతున్నవారు ఆ సమస్యను అధికారులకు ఎలా తెలియజేయాలో తెలియక అక్కడే ఉన్న ప్రైవేట్ రైటర్లను ఆశ్రయించేవారు. వారు ఒక్కో అర్జీదారుడి నుంచి 10 నుంచి 30 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అంతేగాకుండా సంబంధిత అధికారి తనకు బాగా పరిచయమని, తాను చెబితే మీ సమస్య పరిష్కారం అవుతుందని నమ్మబలికి 200 నుంచి 500 రూపాయల వరకు వసూలు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. తాజాగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌తో ప్రైవేట్ రైటర్లు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హెల్డ్ డెస్క్‌లో సిబ్బంది ప్రజలకు అర్జీలు రాసే పనిలోనే నిమగ్నమయ్యారు. టెన్ టేబుల్స్ హెల్ప్ డెస్క్‌లో అర్జీలు రాయించుకున్న ప్రజలు సమీపంలోని కౌంటర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆ అర్జీపై నంబర్ వేస్తారు. ప్రత్యేకంగా శాఖల వారీగా ఏర్పాటు చేసిన టేబుల్స్ వద్దకు నంబర్ వేసి పంపించే ప్రక్రియ చేపట్టారు. టేబుల్-1లో పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాలు, కార్మిక, ఎక్సైజ్, దేవాదాయ, రిజిస్ట్రార్, ట్రెజరీ, అటవీ, డీపీఆర్ఓ, భూసేకరణ స్పెషల్ కలెక్టర్, సర్వే అండ్ ల్యాండ్స్, జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారులను ఉంచారు. టేబుల్-2లో వ్యవసాయశాఖ, పశుసంవర్థకశాఖ, మత్స్యశాఖ, ఉద్యానశాఖ, జిల్లా సహకార సంస్థ, ఏపీఎస్ఐడీసీ, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులను ఉంచారు. టేబుల్-3లో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గిరిజన సంక్షేమశాఖ, వికలాంగుల సంక్షేమశాఖ, ఐటీడీఏ, మహిళా శిశు సంక్షేమశాఖ, ఎల్డీఎం, భూగర్భ జలవనరుల శాఖ, నాబార్డు, పీడీసీసీ బ్యాంకులకు చెందిన అధికారులను ఉంచారు. టేబుల్-4లో డీఆర్డీఏ, డ్వామా, హౌసింగ్, జిల్లా ఉపాధి కల్పనాధికారి, సీపీఓ శాఖల అధికారులను ఉంచారు. టేబుల్-5లో విద్యాశాఖ, గురుకుల పాఠశాలలు, రాజీవ్ విద్యామిషన్, వయోజన విద్యాశాఖ, ఆర్ఐఓ, జిల్లా గ్రంథాలయం, జిల్లా క్రీడాభివృద్ధి అధికారులను ఉంచారు. టేబుల్-6లో ఆర్అండ్బీ, ట్రాన్స్‌కో, ప్రాజెక్ట్స్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఉంచారు. టేబుల్-7లో జిల్లా పరిశ్రమల కేంద్రం, చేనేత జౌళిశాఖ, మార్కెటింగ్, మైన్స్, స్టెప్, ఖాదీ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను ఉంచారు. టేబుల్-8లో డీఎంహెచ్ఓ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, వైద్య విధాన పరిషత్, రిమ్స్, రెడ్‌క్రాస్‌లకు చెందిన వారిని ఉంచారు. టేబుల్-9లో మెప్మా, మునిసిపల్ కమిషనర్లను ఉంచారు. టేబుల్-10లో జిల్లాపరిషత్, జిల్లా పంచాయతీ అధికారి, ఆర్టీఓ, ఆర్టీసీ అధికారులను ఉంచారు. -
'పించనుదారుల కోసం హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలి'
హైదరాబాద్: పింఛన్ దారుల సమస్యల నివృత్తికి వెంటనే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని పెన్షనర్ల చర్చా వేదిక అధ్యక్షుడు ఈదర వీరయ్య ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సాంబశివరావుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 10 లక్షల మంది పించనుదారులు ఉన్నట్లు ఆయన తెలిపారు. టోల్‌ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. పింఛన్ దారులకు వయసు రీత్యా ఇచ్చే అదనపు పింఛన్ భాగాన్ని 75 ఏళ్ల నుంచి కాక 65 సంవత్సరాల నుంచి ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.