జీఎస్టీ హెల్ప్ డెస్క్ ప్రారంభం
Published Sat, Jul 1 2017 12:35 AM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM
సందేహాల నివృత్తికి డయల్ 08518–247772
కర్నూలు (వైఎస్‌ఆర్ సర్కిల్): జీఎస్టీపై ప్రజలకున్న సందేహాలను నివృత్తి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశామని వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ తాతారావు స్పష్టం చేశారు. ఈ మేరకు స్థానిక స్కందా కాంప్లెక్స్‌లో జీఎస్టీ హెల్ప్ డెస్క్ కార్యాలయాన్ని చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షులు విజయ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రజలు, పన్ను దారుల సందేహాలను నివృత్తి చేసేందుకు 08518–247772 ఫోన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ ద్వారా మొదటి కాల్‌ను స్వీకరించిన తాతారావు ప్రజల సందేహాన్ని నివృత్తి చేసి జీఎస్టీ ప్రాధాన్యతను వివరించారు.
Advertisement
Advertisement