సాక్షి,హైదరాబాద్ : రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన సదుపాయాల కల్పనకు దక్షిణ మధ్య రైల్వే మరో అడుగు ముందుకేసింది. వివిధ రకాల సమస్యల పరిష్కారానికి, సదుపాయాలపై ప్రయాణికుల నుంచి అందే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు మొట్టమొదటిసారి ప్ర యోత్మాకంగా హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. లక్షలాది మంది ప్రయాణికులు, వందల కొద్దీ రైళ్ల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ ైరె ల్వేస్టేషన్‌లో మంగళవారం నుంచి ఈ హెల్ప్‌డె స్క్‌లు అందుబాటులోకి రానున్నా యి. వీటిని ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
సంచార సహాయ కేంద్రాలు..
ప్రయాణికులకు రెండురకాల సహా య కేంద్రాలు అందుబాటులో ఉం టాయి. ప్లాట్‌ఫామ్ 10 పైన ఒక స్థిరమైన హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికుల భద్రత, రైళ్లరాకపోకలు, స్టేషన్‌లో పరిశుభ్రత, లైట్లు, మంచినీటి సదుపాయం, రిజర్వేషన్ కేంద్రాల నిర్వహణ, టిక్కెట్ బుకింగ్‌లో ఎదురయ్యే ఇబ్బందులు, వసతి కేంద్రాల నిర్వహణ వంటి అన్ని సమస్యలపైన ప్రయాణికులు ఈ కేంద్రం వద్ద ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా వివిధ రకాల సమస్యల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నెంబర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. నేరుగా సహాయ కేం ద్రాలకు రాలేనివారు ఈ నెంబర్లలో ఫిర్యాదు చేయవచ్చు.
సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి త గిన పరిష్కారాన్ని అందజేస్తారు. అంతేకాకుండా అన్ని ప్లాట్‌ఫారాలపైన సంచరిస్తూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు సేకరించే విధంగా సంచార సహాయ కేంద్రాలను కూడా ప్రారంభించనున్నారు. వివిధ విభాగాలకు చెందిన అధికారుల సమూహం బ్యాటరీ కార్లలో అన్ని ప్లాట్‌ఫారాలపై తిరుగుతూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటారు. ఈ సహాయ కేంద్రాలు 24 గంటల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రతి రోజు సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో తొలి సారి ప్రవేశపెట్టనున్న హెల్ప్‌డెస్క్‌ల వినియోగం, పనితీరు, ఫలితాలను బట్టి రాష్ట్రంలోని మిగతా స్టేషన్లకు కూడా విస్తరిస్తామని రైల్వే అధికారవర్గాలు తెలిపాయి.
నమస్తే.. మీకు ఏవిధంగా సాయపడగలం..!
Published Tue, May 20 2014 12:07 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement