PK Srivastava
-
హిందీ భాష అమలులో ద.మ.రైల్వే ముందంజ
సాక్షి, హైదరాబాద్: అధికార భాష అమలులో ఉన్నతాధికారులు, ఉద్యోగులు, వివిధ విభాగాలు ప్రదర్శిస్తున్న చొరవ అభినందనీయమని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ అన్నారు. బుధవారం రైల్‌నిలయంలో జరిగిన 147వ అధికార భాష అమలు కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జోన్‌లోని అన్ని డివిజన్లు, వర్క్‌షాపులు, ఇతర అన్ని కేంద్రాల్లో అధికార భాష అమలును మరింత విస్తృతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రైల్వేబోర్డు స్థాయి నగదు అవార్డులు సాధించిన పలువురు ఉద్యోగులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. హిందీ అమలుపై రూపొందించిన ఒక బుక్‌లెట్‌ను ఆయన విడుదల చేశారు. -
రైల్వే ప్రాజెక్టుల్లో జాప్యంవద్దు: కేసీఆర్
-
రైల్వే ప్రాజెక్టుల్లో జాప్యంవద్దు: కేసీఆర్
* ద.మధ్య రైల్వే జీఎంకు కేసీఆర్ సూచన * కొత్త లైన్లు, వసతుల కల్పనపై దృష్టి పెట్టండి * కాజీపేట్ వ్యాగన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయండి * కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రైల్వే బడ్జెట్ మరో మూడు రోజుల్లో పార్లమెంట్ ముందుకు రానున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. రాష్ర్ట అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల చిట్టాను రూపొందించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఆది నుంచీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. అందుకే ఆయన రైల్వే శాఖపై వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచుతున్నారు. బడ్జెట్లో తెలంగాణకు ఈసారి మెరుగైన ప్రాధాన్యం దక్కేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా టీఆర్ఎస్ ఎంపీలను రైల్వే మంత్రి సదానందగౌడ దగ్గరికి పంపి తెలంగాణ ప్రాథమ్యాలపై పలు ప్రతిపాదనలు అందజేశారు. ఇటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులపైనా ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తనను కలవడానికి వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జీఎం పి.కె.శ్రీవాస్తవతో పలు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ర్ట ప్రభుత్వపరంగా అందాల్సిన చేయూత విషయంలో తక్షణమే స్పందిస్తామని, రైల్వేపరంగా పనుల్లో జాప్యం లేకుండా చూడాలంటూ కేసీఆర్ గట్టిగా కోరారు. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో మంత్రి పద్మారావు, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. కాజీపేట్‌లో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత బడ్జెట్లో, రాష్ర్ట విభజన చట్టంలోనూ పేర్కొన్న ఈ ప్రాజెక్టు అమలులో జరుగుతున్న జాప్యాన్ని రైల్వే జీఎం ముందుంచారు. పనుల ప్రారంభం విషయంలో ఎలాంటి కదలిక లేకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. దీనికి అవసరమైన భూమి సిద్ధంగా ఉందని, వెంటనే ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. అప్పటికప్పుడు వరంగల్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్.. ఫ్యాక్టరీ నిర్మాణానికి తగినంత భూమి అందుబాటులో ఉందని నిర్ధారించారు. కాజీపేట్ డివిజన్ కోసం ఒత్తిడి కాజీపేట్‌ను రైల్వే డివిజన్‌గా మార్చే అంశంపై ఇప్పటికే కేంద్రాన్ని సంప్రదించామని, రైల్వే అధికారులు కూడా చొరవ చూపాలని ముఖ్యమంత్రి కోరారు. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణం, పెద్దపల్లి( కరీంనగర్)-నిజామాబాద్ రైల్వే లైన్ ఏర్పాటుకు అధికారులు వేగంగా స్పందించాలన్నారు. అదనపు టెర్మినళ్లు కావాలి రాజధాని హైదరాబాద్‌లో రైల్వే రవాణా వ్యవస్థను బాగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నిత్యం వందలాది రైళ్లు, లక్షలాది ప్రయాణికులతో కిటకిటలాడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపైనా ఒత్తిడి పెరిగిన దృష్ట్యా అదనపు టర్మినళ్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని... మౌలాలి, నాగులపల్లి టర్మినళ్ల అభివృద్ధికి కృషి చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన ఎంఎంటీఎస్ గురించి ప్రస్తావించారు. రెండో దశ పనులు ఎంత వరకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండవ దశను మెదక్ జిల్లా తూప్రాన్ వరకు, ఫలక్‌నుమా నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించాలన్నారు. -
దక్షిణ మధ్య రైల్వేలోనూ విభజన: జీఎం
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్)లో ఇకపై రెండు జోన్లు ఏర్పడనున్నాయని ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ పీకే శ్రీవాత్సవ తెలిపారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో మంగళవారం హెల్ప్‌లైన్ డెస్క్‌ను ప్రారంభించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. జోన్ల విభజన కోసం రైల్వే యాజమాన్యం ఐదుగురు ఉన్నతాధికారులతో కమిటీ వేసిందన్నారు. దీనిలో ఎస్సీఆర్కు చెందిన ఇరువురు అధికారులు ఉన్నట్టు చెప్పారు. అయితే, జోన్ల విభజన వల్ల ఇబ్బందులు, లాభాలు రెండూ ఉన్నాయన్నారు. త్వరలో ఈ విషయమై రైల్వే యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం రైల్వే శాఖ ఏటా రూ.12 వేల కోట్ల నష్టంతో నడుస్తోందని, ప్రయాణికుల చార్జీలు పెంచక తప్పని పరిస్థితి ఉందని అన్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి గుంటూరు, తిరుపతిల వరకు ఇటీవల ప్రారంభించిన డబుల్ డెక్కర్(డీడీ) రైలును విజయవాడ వరకు నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. -
నమస్తే.. మీకు ఏవిధంగా సాయపడగలం..!
సాక్షి,హైదరాబాద్ : రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన సదుపాయాల కల్పనకు దక్షిణ మధ్య రైల్వే మరో అడుగు ముందుకేసింది. వివిధ రకాల సమస్యల పరిష్కారానికి, సదుపాయాలపై ప్రయాణికుల నుంచి అందే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు మొట్టమొదటిసారి ప్ర యోత్మాకంగా హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. లక్షలాది మంది ప్రయాణికులు, వందల కొద్దీ రైళ్ల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ ైరె ల్వేస్టేషన్‌లో మంగళవారం నుంచి ఈ హెల్ప్డె స్క్‌లు అందుబాటులోకి రానున్నా యి. వీటిని ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ లాంఛనంగా ప్రారంభించనున్నారు. సంచార సహాయ కేంద్రాలు.. ప్రయాణికులకు రెండురకాల సహా య కేంద్రాలు అందుబాటులో ఉం టాయి. ప్లాట్‌ఫామ్ 10 పైన ఒక స్థిరమైన హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికుల భద్రత, రైళ్లరాకపోకలు, స్టేషన్లో పరిశుభ్రత, లైట్లు, మంచినీటి సదుపాయం, రిజర్వేషన్ కేంద్రాల నిర్వహణ, టిక్కెట్ బుకింగ్‌లో ఎదురయ్యే ఇబ్బందులు, వసతి కేంద్రాల నిర్వహణ వంటి అన్ని సమస్యలపైన ప్రయాణికులు ఈ కేంద్రం వద్ద ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా వివిధ రకాల సమస్యల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నెంబర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. నేరుగా సహాయ కేం ద్రాలకు రాలేనివారు ఈ నెంబర్లలో ఫిర్యాదు చేయవచ్చు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి త గిన పరిష్కారాన్ని అందజేస్తారు. అంతేకాకుండా అన్ని ప్లాట్ఫారాలపైన సంచరిస్తూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు సేకరించే విధంగా సంచార సహాయ కేంద్రాలను కూడా ప్రారంభించనున్నారు. వివిధ విభాగాలకు చెందిన అధికారుల సమూహం బ్యాటరీ కార్లలో అన్ని ప్లాట్‌ఫారాలపై తిరుగుతూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటారు. ఈ సహాయ కేంద్రాలు 24 గంటల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రతి రోజు సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తొలి సారి ప్రవేశపెట్టనున్న హెల్ప్‌డెస్క్‌ల వినియోగం, పనితీరు, ఫలితాలను బట్టి రాష్ట్రంలోని మిగతా స్టేషన్లకు కూడా విస్తరిస్తామని రైల్వే అధికారవర్గాలు తెలిపాయి. -
ఎంఎంటీఎస్ రెండో దశ జీఎమ్మార్‌కు అప్పగింత?
తప్పుకొన్న బాల్‌ఫోర్‌బెట్టి టాటా పవర్, జీఎమ్మార్లతో రైల్వేశాఖ చర్చలు త్వరలో పనులు ప్రారంభం ‘హైలైట్స్’ పథకావిష్కరణలో జీఎం వెల్లడి సాక్షి, సిటీబ్యూరో : ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు పనులను టాటా పవర్, జీఎమ్మార్ సంస్థలకు అప్పగించేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు చేపట్టినట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒప్పందం కుదిరిన వెంటనే ఎలాంటి జాప్యానికి తావు లేకుండా రెండో దశ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ‘హైదరాబాద్ లైవ్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్’ (హైలైట్స్) ప్రారంభోత్సవం సందర్భంగా రైల్‌నిలయం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండో దశ ప్రాజెక్టు నుంచి బ్రిటన్ సంస్థ బాల్‌ఫోర్‌బెట్టి, ఇండియాలో దాని భాగస్వామ్య సంస్థ కాళింది నిర్మాణ్లు తప్పుకోవడంతో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే టాటాపవర్, జీఎమ్మార్ సంస్థలతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం చోటుచేసుకున్నందువల్ల తిరిగి మరోసారి టెండర్లకు వెళ్లకుండా నేరుగా పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. నగరంలో ఎంఎంటీఎస్‌కు ప్రత్యేక లైన్లు వేయడం ఇప్పట్లో సాధ్యం కాదని, రెండో దశ నిర్మాణంలో భాగంగానే ప్రత్యేక లైన్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. రూ.110 కోట్లతో దేశవ్యాప్తంగా ‘హైలైట్స్’ తరహా సేవలు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లకు వచ్చే, పోయే ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల వాస్తవ వేళలతో పాటు, 26 ఎంఎంటీఎస్ స్టేషన్ల మీదుగా నడిచే అన్ని ఎంఎంటీఎస్ రైళ్ల రన్నింగ్ సమాచారాన్ని మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకొనేందుకు ప్రవేశపెట్టిన ‘హైలైట్స్’ తరహా సేవలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం రైల్వేశాఖ రూ.110 కోట్లతో ప్రణాళికలను రూపొందించిందన్నారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారి దక్షిణమధ్య రైల్వే ఈ తరహా సేవలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. భవిష్యత్తులో దేశంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించే లోకల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల వేళలను, ఇతర సమాచారాన్ని రైల్వేశాఖ ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తుందన్నారు. దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు మాట్లాడుతూ, ‘హైలైట్స్ ’ వల్ల ప్రతి రోజు 3 లక్షల మంది ఎంఎంటీఎస్ ప్రయాణికులకు, మరో రెండు లక్షల మంది దూరప్రాంత ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. మొబైల్ ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనా రైళ్ల వాస్తవ సమాచారం తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వేమేనేజర్ సుశాంత్‌కుమార్ మిశ్రా, అల్లాం తదితరులు పాల్గొన్నారు. ‘హైలైట్స్’ ప్రయోజనాలివీ... ఆండ్రాయిడ్ మొబైల్ టచ్ ఫోన్ ఆధారంగా ప్రయాణికులు ఎంఎంటీఎస్ వచ్చే, పోయే వేళల వివరాలు తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఆ ట్రైన్ ఎక్కడ వరకు వచ్చింది, తాము ఎక్కవలసిన స్టేషన్‌కు ఎంతసేపట్లో రాగలదనే వాస్తవ సమాచారమూ తెలుస్తుంది. ఎంఎంటీఎస్ రైళ్ల టైమ్‌టేబుల్, రూట్‌మ్యాప్, చార్జీలు, ఏటీవీఎం కేంద్రాలు, ఆర్పీఎఫ్, జీఆర్పీ హెల్ప్లైన్లు, హాస్పిటళ్లు, క్యాబ్‌లు, అంబులెన్స్‌లు తదితర అత్యవసర సేవల వివరాలు తెలుసుకోవచ్చు. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లకు వచ్చే, వెళ్లే రైళ్ల వాస్తవ వేళలు, రైలు ఏ ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చేది, ఏ ప్లాట్‌ఫామ్ నుంచి బయలుదేరేది తెలుస్తాయి. -
ప్రయాణికులకు అవగాహన ముఖ్యం : రైల్వే జీఎం
గుడివాడ టౌన్, న్యూస్‌లైన్ : రైల్వే ప్రయాణికులు భద్రత, వసతులపై అవగాహన కలిగి ఉండాలని రైల్వే జీఎం పి.కె.శ్రీవాత్సవ్ సూచించారు. శుక్రవారం సాధారణ తనిఖీల్లో భాగంగా గుడివాడ రైల్వేస్టేషన్‌ను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయవాడ డివిజన్ పరిధిలో కొన్ని ప్రాంతాలు సమస్యాత్మకమైనవని అన్నారు. ఆర్థిక పరమైన అంశాలతో ముడిపడి ఉన్న సమస్యల పరిష్కారానికి కేంద్రప్రభుత్వం ఆమోదం పొందాల్సి ఉందన్నారు. రైల్వేస్టేషన్‌కు ఇంకో అదనపు ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారని ‘న్యూస్‌లైన్’ ప్రశ్నించగా ప్రయాణికుల రద్దీని బట్టి ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రయాణికుల రద్దీకి ఈ మూడు ప్లాట్‌ఫాంలు సరిపోతాయని చెప్పారు. ఫ్లైఓవర్ నిర్మాణం గురించి అడగ్గా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ అందాల్సి ఉందని, అది అందగానే పనులు పూర్తి చేస్తామన్నారు. రైల్వే డీఆర్ఎం ప్రదీప్‌కుమార్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్కె శర్మ, ఏజీఎం సునీల్ అగర్వాల్, సీసీ ఎం.భరత్‌భూషణ్, చీఫ్ ఇంజనీర్ శ్రీహరి, రైల్వే ఎస్పీ శ్యామ్‌ప్రసాద్, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉషా ఎ.కుమార్, చీఫ్ మెడికల్ డెరైక్టర్ డాక్టర్ ఎస్.కె.గుప్తా, చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అగర్వాల్, స్టేషన్ మేనేజర్ ఎ.శేషగిరిరావు, పలువురు సీనియర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎంఎంటీఎస్ సర్వీసుల పెంపు
=త్వరలో రెండోదశ పనులు ప్రారంభం =ప్రయాణికుల భద్రతపై దృష్టి =విలేకరుల సమావేశంలో ద.మ.రైల్వే జీఎం సాక్షి,సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ రెండో దశ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ తెలిపారు. ఉందానగర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు రెండో దశపై నెలకొన్న ప్రతిష్టం భన సైతం తొలగిపోయిందని, తాజాగా ఎయిర్‌పోర్టులో రైల్వేస్టేషన్ నిర్మాణం కోసం స్థల సేకరణపై సర్వే చేశామని సోమవారం విలేకరులకు చెప్పారు. ముంబయి ఎయిర్‌పోర్టుకు కూడా సబర్బన్ ట్రైన్ సదుపాయం లేదని, ఆ సౌకర్యం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ టెండర్లను బ్రిటన్‌కు చెందిన బాల్ఫోర్ బెట్టి సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇండియాలోని కాళింది అనే సంస్థతో కలిసి అది ఈ ప్రాజెక్టును చేపడుతుంది. ప్రతిపాదిత రెండో దశలోని ఆరు మార్గాల్లో రైల్వేలైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ, కొత్త లైన్లు, స్టేషన్ల నిర్మాణం వంటి పనులను త్వరలో ప్రారంభిస్తారని జీఎం వెల్లడించారు. రెండో దశ లైన్ల నిర్మాణం కోసం రూ.380 కోట్లు కేటాయించారు. మరో రూ.300 కోట్లతో ఇంజన్లు, కోచ్‌లు సమకూర్చుకుంటారు. మొత్తం 84 కిలోమీటర్లలో రెండో దశ చేపట్టనున్నారు. రద్దీకి అనుగుణంగా సర్వీసుల పెంపు.. ప్రస్తుతం నాలుగు మార్గాల్లో అందుబాటులో ఉన్న ఎంఎంటీఎస్ సర్వీసుల సంఖ్యను పెంచనున్నట్లు జీఎం శ్రీవాస్తవ తెలిపారు. ఉదయం, సాయంత్రం ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లను పెంచనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జంట నగరాల్లో 121 సర్వీసులు ఉన్నాయి. సుమారు 2 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఎంఎంటీఎస్ సర్వీసులన్నీ 9 బోగీలతో రూపొందించినవే. వీటిని 11 బోగీలకు పెంచడం ద్వారా ప్రయాణికుల డిమాండ్‌ను భర్తీ చేసే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ముంబయి సబర్బన్ రైళ్ల తరహాలో ఎంఎంటీఎస్ రైళ్ల సమయపాలన పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇక నుంచి అన్ని ఎంఎంటీఎస్ సర్వీసులు నిర్ణీత వేళల ప్రకారం నడుస్తాయని ఆయన వివరించారు. సికింద్రాబాద్ స్టేషన్లో జీఎం తనిఖీ విలేకరుల సమావేశం అనంతరం జీఎం శ్రీవాస్తవ సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఎస్.కె.మిశ్రా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తనిఖీలు చేశారు. ప్రయాణికుల సదుపాయాలు, స్టేషన్లో విక్రయించే ఆహార పదార్థాల పరిశుభ్రత, నాణ్యత, ప్లాట్‌ఫాంల వినియోగం తదితర అంశాలను పరిశీలించారు. రిజర్వేషన్ చార్టులు, రైళ్ల అనౌన్స్మెంట్ పద్ధతి, రైళ్ల రాకపోకల సమాచారం డిజిటల్ ప్రదర్శన, రిజర్వేషన్ బుకింగ్ కార్యాలయాలు, టాయిలెట్లను కూడా ఆయన పరిశీలించారు. సీసీటీవీ సర్వెలెన్స్ వ్యవస్థ, స్టేషన్లో భద్రతా సిబ్బంది ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఎంఎంటీఎస్ బోగీల్లో హోంగార్డుల సంఖ్యను పెంచుతామన్నారు. అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లలో ఆర్పీఎఫ్ సిబ్బందిని కూడా మరింత పెంచుతామని చెప్పారు. ఎంఎంటీఎస్ రైళ్ల వేళలపై నిర్ధిష్టమైన సమాచారం అందజేసేందుకు జీపీఎస్, జీపీఆర్ఎస్ వ్యవస్థను ఇటీవల ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.