
ప్రయాణికులకు అవగాహన ముఖ్యం : రైల్వే జీఎం
గుడివాడ టౌన్, న్యూస్‌లైన్ : రైల్వే ప్రయాణికులు భద్రత, వసతులపై అవగాహన కలిగి ఉండాలని రైల్వే జీఎం పి.కె.శ్రీవాత్సవ్ సూచించారు. శుక్రవారం సాధారణ తనిఖీల్లో భాగంగా గుడివాడ రైల్వేస్టేషన్‌ను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయవాడ డివిజన్ పరిధిలో కొన్ని ప్రాంతాలు సమస్యాత్మకమైనవని అన్నారు. ఆర్థిక పరమైన అంశాలతో ముడిపడి ఉన్న సమస్యల పరిష్కారానికి కేంద్రప్రభుత్వం ఆమోదం పొందాల్సి ఉందన్నారు.
రైల్వేస్టేషన్‌కు ఇంకో అదనపు ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారని ‘న్యూస్‌లైన్’ ప్రశ్నించగా ప్రయాణికుల రద్దీని బట్టి ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రయాణికుల రద్దీకి ఈ మూడు ప్లాట్‌ఫాంలు సరిపోతాయని చెప్పారు. ఫ్లైఓవర్ నిర్మాణం గురించి అడగ్గా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ అందాల్సి ఉందని, అది అందగానే పనులు పూర్తి చేస్తామన్నారు.
రైల్వే డీఆర్‌ఎం ప్రదీప్‌కుమార్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్‌కె శర్మ, ఏజీఎం సునీల్ అగర్వాల్, సీసీ ఎం.భరత్‌భూషణ్, చీఫ్ ఇంజనీర్ శ్రీహరి, రైల్వే ఎస్పీ శ్యామ్‌ప్రసాద్, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉషా ఎ.కుమార్, చీఫ్ మెడికల్ డెరైక్టర్ డాక్టర్ ఎస్.కె.గుప్తా, చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అగర్వాల్, స్టేషన్ మేనేజర్ ఎ.శేషగిరిరావు, పలువురు సీనియర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.