న్యూఢిల్లీ: రానున్న నాలుగయిదేళ్లలో మూడు వేల కొత్త రైళ్లను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.వీటివల్ల రైల్వేల ప్రయాణికుల సామర్థ్యం ప్రస్తుతమున్న 800 కోట్ల నుంచి వెయ్యి కోట్లకు పెరుగుతుందని వెల్లడించారు.
రైళ్ల వేగాన్ని పెంచడం, నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా ప్రయాణ సమయాన్ని బాగా తగ్గించడం కూడా తమ శాఖ ప్రథమ లక్ష్యమని గురువారం ఆయన రైల్వే భవన్‌లో మీడియాకు తెలిపారు.ప్రస్తుతం 69 వేల కొత్త కోచ్‌లు అందుబాటులో ఉండగా, ఏటా 5 వేల కోచ్‌లు కొత్తగా తయారవుతున్నాయని రైల్వే వర్గాలు తెలిపాయి. వీటితో ఏడాదికి 200 నుంచి 250 వరకు కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తాయని, వీటికి తోడు రానున్న సంవత్సరాల్లో మరో 400 నుంచి 450 వరకు వందేభారత్ రైళ్లు కూడా ఉంటాయని పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment